Monday, 30 March 2015

విప్లవమార్గాన్ని చూపించినవాడు

విప్లవమార్గాన్ని చూపించినవాడు 

ఉషా యస్ డానీ 


పాత్రికేయుడు తిరుమాని సత్యనారాయణ రాజు (టీఎస్ ఎన్ రాజు) రాత్రి కాకినాడలో బ్రెయిన్ హెమరేజ్ తో చనిపోయాడు. తను నా బాల్యమిత్రుడు; నరసాపురంవాడు. సముద్రతీరాన వేములదీవి వాళ్ల స్వగ్రామం.


టీఎస్ ఎన్ రాజుకు చాలా ప్రత్యేకతలున్నాయి. మాఊరి లైబ్రరీలో చాలా పుస్తకాలు చదివాడు. శ్రీశ్రీ మహాప్రస్తానం కవితల్ని అద్భుతంగా ఆలపించేవాడు. నాటికల్లో భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వంటి విప్లవపాత్రలు వేసేవాడు. హఠాత్తుగా ఇల్లువదిలి, ఊరు వదిలి అదృశ్యమైపోయేవాడు. ఎక్కడెక్కడో కష్టజీవులతో కొన్నాళ్ళు గడిపి అంతే హఠాత్తుగా మళ్ళీ ప్రత్యక్షమయ్యేవాడు. మేమంతా అతన్ని 'కారుడు' అనేవాళ్ళం. విప్లకారుడికి అది సంక్షిప్త రూపం. నేను చూసిన తొలి విప్లవకారుడు కూడా తనే.

1970వ దశకం అంటే యువతరం నిలువెల్లా రగిలిపోయిన కాలం. జాతియోద్యమ స్వప్నాలు చితికిపోయి చేదు జీవన వాస్తవం కళ్లముందు సాక్షాత్కరిస్తున్న రోజులవి.  ఏ పట్టణంలో అయినాసరే అప్పటి యూత్ సహజంగానే ఉదయం వుమెన్స్ కాలేజీల దగ్గర, సాయంత్రం సినిమాహాళ్ల దగ్గర చేరేది. డీనికి నరసాపురం యూత్  మినహాయింపేమీకాదు. అయితే,  ఉదయానికీ సాయంత్రానికీ మధ్య సమయంలో  కోర్టువీధిలోని లైబ్రరీ దగ్గర చేరేది. ఏతరంవాళ్లయినా, ఏ పట్టణంలో అయినా   లైబ్రరీని అడ్డాగా చేసుకోవడం మహత్తర విషయం.  అంచేతే కావచ్చు  నరసాపురంలో పాఠకులేకాదు రచయితలూ పెద్ద సంఖ్యలో వుండేవారు. నరసాపురం నాటకాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళిన  యంజీ రామారావు, ధవళ సత్యం మాకు సీనియర్లు.

నరసాపురం నీటిలోనే ఏదో కళాసాహిత్య లవణాలు వున్నాయని నమ్మే వాళ్ళలో నేనూ ఒకణ్ణి.  పట్టణంలో పేటకో నాటక బృందం వుండేదంటే అతిశయోక్తికాదు.  ఊర్లో యువకళాకారులకు కొదవేలేదు. ఇప్పటి మెగాస్టార్ చిరంజీవి కూడా అప్పటి బృందంలో సభ్యులే. పేర్లు రాసుకుంటూ పోతే పెద్ద జాబితాయే అవుతుంది.  కొందరి పేర్లు మరిచిపోతే వాళ్ళకు మనస్తాపం కలుగుతుంది కనుక జాబితాను రాయదలచలేదు. ఏమైతేనేం ఒక్కొక్కరు అగ్నికణం.

రాజు మాకు అతిథి మిత్రుడు.  అతను కొన్నాళ్ళు నరసాపురంలో వుండేవాడు. కొన్నాళ్ళు కాకినాడలో వుండేవాడు. కొన్నాళ్ళు ఎక్కడున్నాడో కూడా తెలిసేది కాదు. వచ్చినపుడు మాత్రం బోలెడు వార్తలతో వచ్చేవాడు. తను చూసిన  "చైనాలో రిక్షావాలా, చెక్ దేశపు గని పనిమనిషి,  ఐర్లండున ఓడకళాసి, అణగారిన ఆర్తులందరి" జీవిత విశేషాలు  ఓ వారం రోజులు ఎడతెరపిలేకుండా చెప్పేవాడు. మేమంతా కళ్ళు పెద్దవి చేసుకుని, చెవులు రిక్కించి వినేవాళ్లం.

మా తరంలో నిక్షిప్తమైవున్న కళాసాహిత్య నైపుణ్యాల్ని 1972-73 నాటి జైఆంధ్రా ఉద్యమం  సానపెట్టింది. అప్పుట్లో వేసిన నాటకాల్లో  పరిటాల సత్యనారాయణ గాంధీజీ, పొట్టి శ్రీరాములు వంటి సాత్విక పాత్రలు వేస్తే రాజు విప్లవపాత్రలు వేసేవాడు.  పెట్టుడు గడ్డం-మీసాలు లేకుండానే తను విప్లకారుడిగా కనిపించేవాడు.  నిజజీవితంలోనే విప్లవకారుడైనవాడికి  నాటకంలో మేకప్పుదేనికీ?

రాజు గుర్తుకు వచ్చినప్పుడెల్లా తను భోజనం చేసే విధానం కళ్లముందు కనిపిస్తుంది.  భోజనం చేస్తే కంచంలో ఒక్క మెతుకు కూడా మిగిల్చేవాడుకాదు. పచ్చిమిరపకాయలు, ఎండి మిరపకాయలు, కరివేపాకు, చివరకు చేప ముళ్ళు కూడా నమిలి మింగేసేవాడు.  తినడానికీ తిండి లేక అలమటిస్తున్న ప్రజలు ఎందరో  నివశిస్తున్న దేశంలో అన్నాన్ని వృధా చేసే హక్కు ఎవరికీ లేదని నిర్మొహమాటంగా చెప్పేవాడు.  తరచూ కళ్ళు పెద్దవి చేసి, ఆవేశంగా ఇలాంటి హెచ్చరికలు  చేస్తుండేవాడు.

1977లో  మా మిత్రబృందం  అభ్యుదయ యువజన సంఘాన్ని మొదలెట్టింది. రాజు కూడా అందులో సభ్యుడు.  ఆ ఏడాది చివర్లో దివి సీమను  ఉప్పెన ముంచెత్తినపుడు  వేలాదిమంది చనిపోయారు. బాధిత కుటుంబాల సహాయం కోసం  అభ్యుదయ యువజన సంఘం నరసాపురంలో పాతబట్టలు, దుప్పట్లు వసూలు చేసింది. వాటిని తీసుకెళ్ళి బాధితులకు అప్పచెప్పినవాడు రాజు అని గుర్తు.

1978లో నా స్నేహితురాలు చొప్పరపు ఉషారాణి చనిపోయినపుడు నేను కొన్ని రోజులు దిగాలుగా వున్నాను. అప్పట్లో నన్ను పరామర్శించడానికి   రాజు విజయవాడ  వచ్చాడు. ప్రోగ్రెసివ్ ఉమెన్స్ ఆర్గనైజేషన్ అనే ఒక విప్లవ సంస్థలో ఉష  పనిచేసేది అని చెప్పాడు.  విశాఖపట్నంలో ఆ సంస్థ ప్రముఖులతో తనకు కూడా సన్నిహిత సంబంధాలు వున్నాయన్నాడు. ఉష ఏదో మహిళా సంఘంలో పనిచేసేదని తెలుసుగానీ అది విప్లవ సంఘమని అప్పటి వరకు నాకు తెలీదు. నేను కూడా విప్లవమార్గాన్ని అవలంబిస్తే జీవితానికి ఒక విలువను సాధించుకోవచ్చని ఆరోజు రాజు సూచించాడు. నాకు కూడా అతని సూచన నచ్చింది.

ఆ తరువాత ఇన్నేళ్లలో మేము కలుసుకున్న సందర్భాలు చాలా అరుదు. రెండేళ్ల క్రితం ఓ రాత్రి హఠాత్తుగా ఫోన్ చేశాడు. మా ఉమ్మడి మిత్రుడొకరు నా గురించి ఏదో నెగటివ్ గా మాట్లాడితే  గట్టిగా మందలించానని అదే పాత ఆవేశంతో చెప్పాడు.

మన వెనుక మనకు వ్యతిరేకంగా మాట్లాడుకునేవాళ్ళు చాలామంది ఉంటారు.   మన పరోక్షంలో మన గురించి మంచిగా మాట్లాడేవాళ్ళు ఒకరిద్దరున్నా అది గొప్ప విషయమే. అలాంటి గొప్ప స్నేహితుడు రాజుని నేను కోల్పోయాను.

చనిపోవడానికి ముందు రాత్రి హాస్పిటల్ లో మిత్రులతో మాట్లాడుతూ తనను మోల్డ్ చేసినవారిగా నన్నూ,  సతీష్ చందర్ నూ, నరసాపురం వాతావరణాన్నీ తలచుకున్నాడట. నేను తనని ఏ మేరకు మోల్డ్ చేశానో తెలీదుగానీ, నాకు  విప్లవమార్గాన్ని చూపించినవాడు మాత్రం తనే.

 హైదరాబాద్
30  March 2015

మొబైల్ నెం : 9010757776

Wednesday, 25 March 2015

Hashimpura - Justice Delayed Means Justice Denied

హషీంపురా - ఆలస్యం అయినా న్యాయం దక్కలేదు.
-        డానీ

1987లో మీరట్ మతకల్లోలాల సందర్భంగా 22 మే నాడు నగరంలోని హషీంపుర మొహల్లాలో 42 మంది ముస్లిం యువకులు దారుణ హత్యకు గురయ్యారు. 19 మంది ప్రొవెన్షియల్ ఆర్మ్ డ్ కానిస్టేబులరీ (పిఏసి) జవాన్లు వీళ్లను చుట్టుముట్టు కాల్చి చంపేశారు అనేది ఆరోపణ.  

ఈ కేసు విచారణ 28 ఏళ్ళుగా న్యాయస్థానాల్లో సాగుతూనేవుంది. ఈ మధ్య కాలంలో ముగ్గురు నిందితులు వచిపోయారు. మూడు రోజుల క్రితం మార్చి 21న ఢిల్లీలోని ట్రయల్ కోర్టు సరైనా సాక్ష్యాధారాలు లేవనే నెపంతో నిందితుల్ని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ సందర్భంగా  10 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఈ రోజు (మార్చి 24) రాత్రి 8.30 గంటలకు  ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది.  దాని కోసం నేను ఇచ్చిన సౌండ్ బైట్స్ ఇవి.

“వంద మందిని క్రూరంగా చంపేసి  తప్పించుకోవడానికి భారత న్యాయవ్యవస్థ అవకాశం కల్పిస్తున్నదని హషింపుర ఊచకోత మీద ఢిల్లీ కోర్టు తీర్పు మరోమారు నిరూపించింది”

“42 మంది ముస్లిం యువకుల్ని దారుణంగా చంపేసిన సంచలన కేసు ఇది. ఈ సంఘటనలో తగిన సాక్ష్యంలేదంటూ నిందితులైన స్పెషల్ పోలీసుల్ని కోర్టు నిర్దోషులుగా వదిలివేసింది.  పోలీసుల మీద పోలీసులు జరిపే నేర పరిశోధన ఒక బూటకమని కేసు తీర్పు చాటిచెప్పింది”

“Justice Delayed Means Justice Denied; న్యాయాన్ని ఆలస్యం చేయడం అంటే న్యాయాన్ని తిరస్కరించడమే అంటారు. ఈ కేసులో ఆలస్యం జరిగినా న్యాయం దక్కలేదు. 42 మందిని క్రూరంగా హత్యచేసి దోషులు తప్పించుకున్నారు”. 

“విచారణను ఏళ్ల తరబడి సాగదీయడంతో సాక్షులు చనిపోతారు, సాక్ష్యాధారాలు శిధిలమైపోతాయి. అంతిమంగా న్యాయం చనిపోతుంది”.  

“ఏ కేసులో అయినా సరే న్యాయప్రక్రియను సాగదీసేది బాధితులు కాదు. నిందితులు, పరిశోధనా అధికారులు  న్యాయమూర్తులు న్యాయప్రక్రియను సాగదీస్తారు”.  


“ఈ కేసు విచారణ తంతు న్యాయవ్యవస్థ మీద, పోలీసు వ్యవస్థ మీద ప్రజల నమ్మకాన్ని తుడిచివేసింది.  దేశంలో తీవ్రవాదం, ఉగ్రవాదం  ఆవిర్భవించడానికీ, పెరగడానికీ న్యాయస్థానాలూ  దోహదం చేస్తున్నాయి అనిపిస్తోంది”

“నిజానికి న్యాయస్థానాలకు, పోలీసులకు మత విలువలున్నాయి. ఆ విలువలు కూడా ఆధిపత్య మతాలకు చెందినవి. మనకు సామాజిక న్యాయస్థాలు కావాలి.

హైదరాబాద్
24 మార్చి 2015


Friday, 20 March 2015

UGAADI - 2015 - March 21

UGAADI - 2015  - March 21

రాజకీయ పంచాంగం - 2015

(పంచాంగకర్త ముందు రాజకీయ నాయకులు అందరూ కూర్చొని ఉంటారు.)

పంచాంగకర్త  :

ఓం శ్రీ గురుభ్యోన్నమః !
లోకస్సమస్తా సుఖినోభవంతూ !!

రండి నాయనల్లారా! ఉగాది వచ్చిందంటే ఎవరికయినా తప్పదు ఒక టెన్షనూ. ఏడాది అసలే మన్మధ నామ సంవత్సరంమన్మధుడు అందగాడు నాయనాజనాన్ని సమ్మోహితుల్ని చేసి   మైమరపించడం అతగాడికి తెలిసిన విద్యచెరుకు గడ అతని విల్లు. పేరుకు తగ్గట్టే చక్కెర పూత పూసిన అనేక స్కీముల్ని మన నేతలు ఏడాది గుక్కతిప్పుకోకుండా ప్రకటిస్తారు. జనం వాటికేసి నోరు చప్పరిస్తూ చూస్తారు. అవి జనానికి చేరవు. ఈలోగా  సంవత్సరం మారిపోతుంది నాయనల్లారా!.

చంద్రబాబు :
ఏం మాస్టారూ ! మీరు కూడా రాజకీయ వేత్తలా మాట్లాడడం  కరెక్టు కాదండినా పాలన మూడు వర్షాలు ఆరు పంటలుగా సాగిపోతున్నదని మీకు నేను మనవి చేసుకుంటావున్నానూమీరు కనుక ఒకసారి ఇటుపక్క చూసినట్టయితే చాలా క్లియర్ గా కనిపిస్తా వుంది

పంచాంగకర్త  :
నాయనా చంద్రబాబూ! నేను ఎటుపక్కా చూడను నాయనా. ఈరోజు కేవలం పంచాంగమే చూస్తానూఇందులో నాకు నీ జాతకం ఇంకా క్లియర్ గా కనిపిస్తా వుంది నాయనా.

చంద్రబాబుఫేస్ ఎక్స్ ప్రెషన్

కేసిఆర్  :
అరే పంతులూఆంధ్రా పంతుళ్ళు మస్తు వాస్తు చూస్తరని అంటరు. నువ్వేందీ గిట్ల మా తెలంగాణ కలెక్టర్లు లెక్క మాట్లాడుతున్నవు. నా పథకాలు గిట్ల జనానికి చేరత లేదంటావా? పంతులూ! గిది పధ్ధతి కాదీ.

పంచాంగకర్త  :
నాయనా కల్వకుంట చంద్రశేఖరరావూనేను  చంద్రబాబు జాతకమూ చెపుతా. నీ జాతకమూ చెపుతా. నువ్వు కాస్త ఓపిక పట్టాలినాయనా!. ఎవ్వర్నీ వదిలి పెట్టను. అందరి జాతకమూ చెపుతా నాయనా.

కేసిఆర్  :  ఫేస్ ఎక్స్ ప్రెషన్

పంచాంగకర్త  :
నాయనల్లారాఇంకోసారి చెపుతున్నానూ. మీరు గోల చేయడానికి  ఇది గవర్నర్ ప్రసంగం కాదు పంచాంగ శ్రవణం నాయనల్లారాఅక్కడ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి, ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఎంత అసెంబ్లీ సమావేశాల మధ్య ఉగాది వచ్చినా. పంచాంగ  శ్రవణాన్ని ప్రశాంతంగా వినాలి నాయనల్లారాఅవిశ్వాసమో మరొకటో మోషను మూవ్ చేయడానికి నేను అసెంబ్లీ  స్పీకరు కాదు నాయనల్లారా. పంచాంగకర్తని. యూ ప్లీజ్ నోట్దిస్ పాయింటు.

జగన్  :  ఫేస్ ఎక్స్ ప్రెషన్

పంచాంగకర్త  :
నాయనా నారా చంద్రబాబూ! నీది చూషావూ ... వృషభరాశికృతిక నక్షత్రం నాయనా. సప్తమీలో శని వున్నాడు. అయితేం  ప్రస్తుతం నీ జాతకం బ్రహ్మండంగా వెలిగిపోతుంది నాయనా. పోలవరాన్ని పక్కన పెట్టినా, పట్టిసీమను ముందుకు తెచ్చినా, రైతుల్ని త్రిశంకు స్వర్గంలో వుంచినా   డిసెంబరు వరకు నిన్ను నిలదీసేవాడు ఎవ్వడూ లేడు నాయనా. అప్పటి వరకు నువ్వు మూడంటే మూడు. ఆరంటే ఆరే నాయనా.

చంద్రబాబు
మాస్టారూ! మీరు చెపుతున్నవన్నీ నాకు ముందే తెలుసని మీకు నేను మనవి చేసుకుంటావున్నాను. మాదిరి చూసుకుంటే నా కంప్యూటరు కూడా మాటే చెప్పిందని మీకు నేను తెలియ జేసుకుంటా వున్నాను. ఏపీలో నేను మూడంటే మూడు. ఆరంటే ఆరే అని మనవి చేసుకుంటావున్నాను. నేను మాదిరి ముందుకు పోతావున్నాను

కేసిఆర్
అరే చంద్రబాబుగీ కానూను నేను గిట్ల తెలంగాణల పెట్టిన. నేను చెప్పిందే వేదం. నాను చెప్పిందే కానూను. గదీ గిప్పుడు ముచ్చటి.

పంచాంగకర్త  :
నాయనా కేసిఆర్ ! నీ వంతు వచ్చే వరకు కాస్త ఓపికపట్టలి నాయనా. మధ్యలో ఇలాంటి ఇంటర్ ఫియరెన్సులు వద్దు నాయన.

కేసిఆర్ :   ఫేస్ ఎక్స్ప్రెషన్

పంచాంగకర్త  :
నాయనా చంద్రబాబూ! నువ్వు కూడా మరి కాస్త ఓపిక పట్టాలి. నీ కంప్యూటరు చెప్పినవీ చెపుతానూ. నీ కంప్యూటరు  చెప్పనివీ చెపుతాను.

చంద్రబాబుఫేస్ ఎక్స్ ప్రెషన్

పంచాంగకర్త  :
నీ జాతకం డిసెంబరులో మారుతుంది నాయనాశనిలో కుజుడు వస్తాడూ. అప్పుడు మొదలవుతుంది నాయనా అసలు సిసలు పోలిటికల్ డ్యాన్సింగూనీ వాళ్ళు ముందు చూపు కలవారు నాయనా. ఈలోపులో నాలుగు రాళ్ళు భద్రంగా వెనకేసుకుంటారు  నాయనా. తరువాత వాళ్ళే నీకు మేకులవుతారూ. ముందు ముందు నీకు ముప్పు  వచ్చేది నీ వాళ్లతోనే నాయనా.

చంద్రబాబుఫేస్ ఎక్స్ ప్రెషన్

పంచాంగకర్త  :
ఇక జనం అంటావా? మన జనానికి సహనం ఎక్కువ  నాయనానువ్వు ఏమైనా చేస్తావని ఏడాదిన్నర వరకు ఓపిక పడతారు. అంటే వచ్చే డిసెంబరుకు గడువు తీరుతుంది నాయనాతరువాత వాళ్ల ఓపిక చచ్చిపోతుంది నాయనావాళ్ళు రోడ్ల మీదకు వచ్చి డ్యాన్సులు చేస్తే నీకు డామేజీ తప్పదు నాయనా. నువ్వు అంత పరిస్థితి తెచ్చుకోవద్దు నాయనా.

చంద్రబాబు :
మాస్టారూ! దీనికి విరుగుడు మాదిరి  శాంతి మార్గం చూపించాలని మిమ్మల్ని నేను కోరుకుంటావున్నాను. మేము విధంగా ముందుకుపోతామని మీకు నేను మనవి చేసుకుంటావున్నాను.

పంచాంగకర్త  :
నాయనా చంద్రబాబూ! లోకంలో దేనికయినా విరుగుడు వుంటుంది నాయనా. ముప్పు వచ్చిన తరువాత శాంతి పూజలు చేయడంకన్నా ముందే అశాంతి రాకుండా చూసుకోవడం ఉత్తమం నాయనా. నువ్వు ఇరవై నాలుగు గంటలూ జగన్ గురించి ఆలోచించకుండా కాస్త నీ ఆరోగ్యం గురించి కూడా పట్టించుకో  బాబూ. అయ్యా! రాశి వారికి ఏడాది రాజపూజ్యం 8, అవమానం 6 నాయనా. ఆదీ విషయం మరి.

చంద్రబాబు   :  ఫేస్ ఎక్స్ ప్రెషన్

పంచాంగకర్త  :
తెలుగువాళ్ళ రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు  చేయించిన అఫీషియల్ ఉగాది పచ్చడిలో  బెల్లం పాలు తగ్గి, పులుపువేప చేదు పాళ్ళు  కొంచెం పెరుగుతాయి. వెరసి  ఏడాది ఉగాది పచ్చడి ప్రజలకు చేదుగానే వుంటుంది నాయనల్లారా! .

చంద్రబాబు   :  ఫేస్ ఎక్స్ ప్రెషన్

కేసిఆర్   : 
అరే వైపంతులూ. నువ్వు భలేగున్నవ్. గా చంద్రబాబు జాతకం అందరికీ ఎరికనే రా బై. గిప్పుడు నా జాతకం చెప్పుజర జల్దీ

పంచాంగకర్త  :
నాయనా కేసిఆర్యూ డోంట్ వర్రీ . పంచాంగం మొదలెట్టాక నీకూ వారికి అని ఏమీలేదు నాయనా. అందులో అందరి జాతకాలూ వుంటాయి. నేను అందరి జాతకాలు చెపుతాను. నీ జాతకం కూడా చెపుతాను నాయనా.

కేసిఆర్   :  ఫేస్ ఎక్స్ ప్రెషన్ 

పంచాంగకర్త  :
నాయనా కేసిఆర్ ! నీది సింహరాశి మఖ నక్షత్రం  నాయనా.  

కేసిఆర్   :
గట్ల చెప్పు. లయన్ ఆఫ్ తెలంగాణ. గీ ముచ్చటి బాగుంది.

పంచాంగకర్త  :
అవున్నాయనా. సింహం అంటే మృగరాజు. అడవికి చక్రవర్తి. నీ రాజ్యంలో ఎవరయినా నువ్వు ఆదరిస్తే ఆనందించాలి. నువ్వు తిడితే పడాలి. ఎవ్వరికీ ఇంకో ఆప్షన్ లేదు బాబు. రాజ సభలో నిన్ను అడిగేవాడు లేడు. అత్తలేనికోడలు గుణవంతురాలు అయినట్టు అప్పోజిషనులేని సియం జెంటల్ మన్ నాయనా!

కేసిఆర్   :
పంతులూ! గిదేం కిరికిరి బై. సీయం అయినంక నేను గిట్ల జెంటిల్ మేన్ అయినరేవంత్ రెడ్డి, ఎర్రబెల్లీ సభలో వున్నా లేకున్న నేను గిట్ల మస్తు జెంటిల్ మన్ రా బై.

పంచాంగకర్త  :
నాయనా కేసిఆర్నీ గురించి నువ్వే  సర్టిఫికెట్టు ఇచ్చుకుంటే కుదరదు నాయనా. నేను చెప్పాలి. నేను అనే వాణ్ణి ఒకడు వున్నానుగానీకు రాహు మహాదశ నడుస్తోంది నాయనాఅయితే నడిచే టప్పుడు కాస్త వెనుకా ముందూ చూసుకుని నడవాలి నాయనా.

కేసిఆర్   :
పంతులూగీ కేసిఆర్ వెనుకా ముందూ చూడడురా బై. దిమాగ్ కు తోచింది చేస్తడు. నోటికి వచ్చింది చెపుతడు. బస్. కిస్సా ఖతమ్.

పంచాంగకర్త  :
నువ్వు ముందూ వెనుకే కాదు నాయనా ... పక్కన కూడా చూసుకుని నడవాలి. రాజకీయాలు అన్నాక వెనుకపోట్లు, పక్క పోట్లు కుడా వుండవచ్చు.

కేసిఆర్   :  ఫేస్ ఎక్స్ ప్రెషన్

పంచాంగకర్త  :
నాలుగు నెలల్లో అమెరికా  విమానం ఎక్కుతావు నాయనా. క్షేమంగా వెళ్ళి లాభంగా రా నాయన.

కేసిఆర్   :
గీ ముచ్చటి బాగున్నది రా బై!

పంచాంగకర్త  :
రాశి వారికి ఏడాది రాజపూజ్యం 8, అవమానం 2 మాత్రమే  నాయనా.

కేసిఆర్   : 
అరే పంతులు. నాకు అవమానం ఏంది బై. అందర్నీ అవమానించుడే కేసిఆర్ పని.

పంచాంగకర్త  :
అవన్నీ నీకు ఇప్పుడు చెప్పినా అర్ధం కావు నాయనా. జులై తరువాత నేను చెప్పకపోయినా అర్ధం అవుతాయి నాయనా.

కేసిఆర్   :  ఫేస్ ఎక్స్ ప్రెషన్

వెంకయ్య నాయుడు  :
అయ్యా  పంచాంగకర్తగారూ! మీరు అన్నీ తరుగు ఖాతాలే చెపుతున్నారు నాయనాచేదు మాతలే చెపుతున్నారూ. కొన్ని పెరిగే ఖాతాలూ చెప్పండి బాబూ. అసలే మా మోదీజీ ప్రతి నిత్యం పెరగాలి పెరగాలి అంటుంటారు. దిసీజ్ క్లియర్

పంచాంగకర్త  :
నాయనా వెంకయ్య నాయుడూనేను ఇప్పుడు అక్కడికే వస్తున్నా. పెరగడం గురించి చెప్పమన్నావుగా నాయనాఎండల్లో వేడి పెరుగుతుంది. దేశంలో నీటి ఎద్దడి పెరుగుతుంది. చలికాలం బ్రాందీ, వేసవి కాలం బీరు అమ్మకాలు పెరిగి వెరసి మద్యం అమ్మకాలు ఏడాదంతా మూడు పెగ్గులు ఆరు బాటిళ్ళులా వర్ధిల్లుతాయి. ఎటిలాగే ఏడాది కూడా జనం దుంప తెగడం మరింతగా పెరుగుతుంది. ఇది ఖాయం.

వెంకయ్య నాయుడు  :
అయ్యా  పంచాంగకర్తగారూ! పెరగడం అంటే ధరల పెరుగుదల కాదు స్వామీ. ... సరే ..  ప్రభుత్వాల  విషయాన్ని  పక్కన పెడదాం. ఇప్పుడు చెప్పండీ నా జాతకం ఎలా వుందీ?

పంచాంగకర్త  :
నీ జాతకానికి ఏం నాయనాబహు భేషుగ్గా వుంది. నీది కూడా సింహ రాశి నాయనా. పుబ్బ నక్షత్రం. వ్యాపార లావాదేవీలకు చాలా అనుకూలమైన కాలం. ఆర్ధికంగా భేషైన వాతావరణంఇప్పుడు వ్యాపారం మొదలెట్టినా  నీ బండి జెట్ వేగంతో పోతుంది నాయనా

వెంకయ్య నాయుడు  :
అయ్యా శాస్త్రులుగారూ! పక్కా పొలిటీషియన్ని పట్టుకుని వ్యాపారవేత్త అనేశారేమిటీ స్వామీ? నా రాజకీయ జాతకం కుడా చెప్పండి స్వామీ.

పంచాంగకర్త  :
నాయనా వెంకయ్య నాయుడూ! ప్రతి రాజకీయ వేత్తలో ఒక వ్యాపారి వుంటాడు నాయనా. అలాగే ప్రతి వ్యాపారిలో ఒక రాజకీయ వేత్త వుంటాడు బాబూ. విషయాన్ని పక్కన పెడితే అక్టోబరు తరువాత శని మహాదశ మొదలవుతుంది నాయనానీ బండి స్పీడు మరీ పెరుగుతుంది. కేంద్రంలో వటవృక్షం లా పాతుకుపోతావూ. నువ్వు  విశ్వారూపం చూపిస్తావు నాయనా. వెలుగులో నరేంద్ర మోదీ కూడా కనిపించడు నాయనా

వెంకయ్య నాయుడు  : ఫేస్ ఎక్స్ప్రెషన్.

నరేంద్ర మోదీ :
నమస్కార్ పండిట్జీ! మైనరేంద్ర మోదీ బోల్ రహా హూ. నేను వెంకయ్య నాయుడూజీకి నా విశ్వరూపం చూపిస్తున్నాను. మీరు రివర్స్ లో మాట్లడుతున్నారు.

పంచాంగకర్త  :
నాయనా మోదీప్లీజ్ డోన్ట్ ఇంటరప్ట్. నీకూ టైమ్ వస్తుంది. అంతవరకు  కీప్చ క్వయిట్టూ.

నరేంద్ర మోదీ : ఫేస్ ఎక్స్ ప్రెషన్.

పంచాంగకర్త  :
నాయనా వెంకయ్య నాయుడూ! నువ్వు పార్టీకి పూర్తిగా బ్యాక్ బోనుగా మారిపోతావు నాయనా. విధంగా నీకు బ్యాక్ బోను, లివరు సమస్యలు వచ్చే ప్రమాదం లేకపోలేదు నాయనా.

పంచాంగకర్త  :
అయ్యాసామాన్య ప్రజలారా! ప్రభువులు పాత హామీలు నెరవేర్చరు. కొత్త హామీలు పుష్కలంగా  గుప్పిస్తారు. ప్రజలు ఎప్పటిలాగే వాటిని  నమ్మి మోసపోతారు.

జగన్ :
అయ్యా పంతులుగారూ! రోజు మిమ్మల్ని ఒకటే అడుగుతావున్నా. మీరు చంద్రబాబుగారికే జాతకాలు చెపుతారా? నాకు జాతకాలు చెప్పరా? అని అడుగుతావున్నా. శాసనసభలో నేను ఏమి అడిగినా చంద్రబాబుగారు సమాధానం చెప్పరు. ఆయనా, అయన తమ్ముళ్ళూ నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. ఇది న్యాయమా? ధర్మమా? అని అడుగుతా వున్నా.

పంచాంగకర్త  :
నాయనా జగన్! కొన్ని జాతకాలు కొన్ని సందర్భాల్లో ఇలాగే వుంటాయి బాబూ. నీది మిధున రాశి. ఆరుద్ర నక్షత్రం నాయనా. అయిదారేళ్ళు నీ జాతకం వెయ్యి మెగా వాట్లతో వెలిగి పోయింది నాయనాఇప్పుడు వ్యవహారం కాస్త ఢీలాపడింది బాబూ. అప్పుడు వరసాగ్గా కొత్త కొత్త దుకాణాలు తెరుచుకుంటూ పోయావుగా నాయనాఇప్పుడు పాతదుకాణాలు వరుగ్గా  మూసుకుంటూపోవాల్సి రావచ్చు నాయనా.

చంద్రబాబు  :
చూదండీ పంతులుగారూ దుకాణాల్ని ఆయన మూసినా మూయకపోయినా నేను మూయిస్తానని మీకు నేను మనవి చేసుకుంటావున్నాను. నేను మాదిరి ముందుకు పోతావున్నాను.

పంచాంగకర్త  :
నాయనా చంద్రబాబూ. ఇప్పుడు నీ టైమ్ బాగుంది. జగన్ టైమ్ బ్యాడుగుంది నాయనా. నువ్వు ఇలాంటివి వంద చెప్పినా ఇప్పుడు చెల్లుతుంది

జగన్ : ఫేస్ ఎక్స్ ప్రెషన్

పంచాంగకర్త  :
నాయనా జగన్ నీకు మరి ఇంకో మాట చెప్పాలి. నీ జాతకంలో బుధ దశలో చంద్రుడున్నాడుఏపీలో ఒక చంద్రుడుతో వైరం మరింత పెరుగుతుంది.   పక్కన తెలంగాణలో ఇంకో చంద్రుడితో స్నేహం తగ్గుతుందినీకు ఏడాది రాజపూజ్యం మరీ తక్కువ, అవమానం మరీ ఎక్కువ. అదీ విషయం. అర్ధం అయింది గా నాయనాకలిసిరాని కాలంలో ఏమైనా  జరగవచ్చు నాయనానీ ఆరోగ్యం నీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం జాగ్రత్త నాయనా.

జగన్ : ఫేస్ ఎక్స్ ప్రెషన్

(ఇంకావుంది)



UGADI - 2015  - March 21 Part - 2

(పంచాంగకర్త ముందు రాజకీయ నాయకులు అందరూ కూర్చొని ఉంటారు.)

పంచాంగకర్త  :
నాయనా మెగాస్టార్ చిరంజీవీ! అలా బుధ్ధిమంతుడిలా కూర్చుండిపోయావేం నాయనా. పంచాంగ శ్రవణం వింటున్నావా?

చిరంజీవీ :
కొణిదల శివశంకర వరప్రసాద్ అనే చిరంజీవి అనే మెగాస్టార్ అయిన నేను కొంత కాలం మౌనంగా వుండాలని నిర్ణయించుకున్నట్టు సూటిగా చెపుతున్నానన్నమాటా.

బొత్స :
ఏటండిదీచెప్పేదానికి కాస్త పధ్ధతి వుండాలి. చిరంజీవిగారు ఏదో  మరి ప్రతిరోజూ మాట్లాడేస్తున్నట్టు చెప్పేస్తే ఎలా? మరి వారి నోరు తెరిచి ఆరు నెలలు అయింది. మరి ఏదైనా మాట్లడితే నేను మాట్లాడుతున్నాను.

పంచాంగకర్త  :
నాయనా సత్తిబాబూ! నువ్వు కాస్తంత ఓపిక పట్టాలి. నీ జాతంకం కూడా తెరుస్తాగా.

బొత్స : ఫేస్ ఎక్స్ ప్రెషన్

పంచాంగకర్త  :
నాయనా చిరంజీవీ. టాకీ సినిమా నుండి మూకీ సినిమాకు మారిపోవాలనే ఆలోచన నీది కాదు నాయనా. నీ గ్రహాలే నీ నోటెమ్మట మాటలు అనిపిస్తున్నాయి. నీది తుల రాశి నాయనా. చిత్త నక్షత్రంఏడున్నరేళ్ల శని నాయనా. నీకు  ప్రజారాజ్యంతో మొదలయింది. ఇంకా రెండేళ్ళు నీకు ఇలాంటి ఇబ్బందులు తప్పవు నాయనా. పొలిటికల్ గా పోవాలా? సినిమాల్లోకి పోవాలా? అనే సంధిగ్ధం నిన్ను పీడిస్తూ వుంటుంది చిరంజీవీ! . 

చిరంజీవీఫేస్ ఎక్స్ ప్రెషన్.

పంచాంగకర్త  :
నాయనాకాలసర్ప దోషం వుందీ. రాహుకేతు పూజలు శ్రధ్ధగా చేయించు నాయనాఅయినా నువ్వు కంగారు పడకూ . యూ డోన్ట్ వర్రీ చిరంజీవీనీకు బుధుడు బ్రహ్మాండంగా వున్నాడు. వ్యాపారంలో రాణిస్తావూ

జగన్  :
అయ్యా పంతులుగారూ! ఈరోజు మిమ్మల్ని ఒకటే అడుగుతావున్నా. చిరంజీవిగారు రాజకీయ వ్యాపారం చేసేకాదా అప్పుడు నేను సియం కాకుమ్డా అడ్డుకున్నదీ అని అడుగుతావున్నా.

పంచాంగకర్త  :
నాయనా జగన్ ! నీ టైమ్ అప్పుడు బాగోలేదు. ఇప్పుడు మి ఇద్దరి టైమ్ బాగోలేదు. అవన్నీ కాల మహిమలు నాయనా.

జగన్  :  ఫేస్ ఎక్స్ ప్రెషన్.

పంచాంగకర్త  :
చూడు చిరంజీవీ! అది వ్యాపార రాజకీయామా? రాజకీయ వ్యాపారమా? నువ్వు డిసైడ్ చేసుకో. సినిమాల్లో కి  వెళ్ళినా మళ్ళీ రాణిస్తావూనో డౌటూ. పాత వైభవం తిరిగివస్తుంది. మళ్ళీ మెగాస్టార్ లా వెలిగిపోతావు నాయనా. బీ హ్యాప్పీ.

చిరంజీవీఫేస్ ఎక్స్ ప్రెషన్.

పంచాంగకర్త  :
నాయనీ ! ఇప్పుడు నీ వంతు వచ్చీంది.

నాయనీ :
అన్న కేసిఆర్గీ పంతులు నా జాతకం చెప్పేడిది ఏంటో నాకైతే సమజ్ అయితా లే. తెలంగాణల అందరికీ ఎరికే కేసిఆర్ జాతకమే నా జాతకం. కేసిఆర్ బాగుంటే గీ నాయనీ బాగుంటడు. గా దినాల్లా  రాముడికి హన్మంతుడు. గీ దినాల్ల కేసిఆర్ కు నాయనీ. బస్. గిదీ ఖుల్లం ఖుల్లా బాత్.

పంచాంగకర్త  :
చూడు నాయనా నాయనీ! కేసిఆర్ మీద నీకున్న భక్తీ. నీ మీద కేసిఆర్ కున్న అభిమానం  అందరికీ తెలుసు నాయనా. అయినా భక్తి భక్తే . గౌరవం గౌరవమే నాయనీవైఫ్ అండ్ హజ్బెండుకు కూడా జాతకాలు వేరువేరుగా వుంటాయి నాయనా.

నాయనీ : ఫేస్ ఎక్స్ ప్రెషన్.

పంచాంగకర్త  :
నాయనీ నీది మిధున రాశి పునర్వాసు నక్షత్రం నాయనా. నువ్వు అన్నట్టు కేసిఆర్ కు బాగుందీ. నీకూ బాగుంది నాయనాఅసలే నీది పెద్ద పెర్సనాలిటీ. పైన పోలీసు మంత్రిఎండాకాలం ట్రాఫిక్ డ్యూటీ.- ఇది చాలా కష్టం నాయనాగాల్పుకొడుతుంది కాస్త జాగ్రత్త నాయనా.

నాయనీ : ఫేస్ ఎక్స్ ప్రెషన్.

కేసిఆర్ :
అరే పంతులుమా నాయనిని ఎండలో ఏలా నిలబెడతాం రా బైనేను గొట్ల మస్తు చత్రి కొని ఇత్తా. ఏంద తగిలే ముచ్చటే లేదీ. సన్ స్ట్రోక్ ముచ్చటే లేదీ.

పంచాంగకర్త  :
నాయనా కేసిఆర్! అది నాయనీ మీద నీకున్న అభిమానం నాయనా. నేను జాతకాలు ఒకతే చెపుతాను నాయనా.

కేసిఆర్ఫేస్ ఎక్స్ ప్రెషన్.

పంచాంగకర్త  :
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కడ నాయనల్లారా?

పవన్ కళ్యాణ్  :
ఏం శాస్త్రులుగారూమీకు నేను కనిపించడంలేదా? ఆరడుగుల బుల్లెట్టు కనిపించడంలేదా?

పంచాంగకర్త  :
కనిపించకేం నాయనా. బహు భేషుగ్గా కనిపిస్తున్నావు. నాయనా. సీన్లో అన్న చిరంజీవి వున్నాడని అలామౌనంగా కూర్చుంటేను అడిగాను నాయనా.

పవన్ కళ్యాణ్  :
మీకు తెలుసా? నాకు మా అన్నయ్య నా గుండెల్లో వుంటాడు.

పంచాంగకర్త  :
నీ గుండెల్లో ఎవరున్నారో కార్డియాలజిస్టులు చెప్పాలి నాయనా. నీ జాతకంలో ఏముందో మాత్రం నా బోటివాళ్లు చెప్పాలి నాయనా.

వెంకయ్య నాయుడు   :
అయ్యా శాస్త్రీజీ! ఇక్కడ ఒక విషయం చెప్పాలీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెత్తి మీద మా నరేంద్ర మోదీజీ వుంటారూ. దిసీజ్ క్లియర్.

పవన్ కళ్యాణ్  : ఫేస్ ఎక్స్ ప్రెషన్.

పంచాంగకర్త  :
నాయనా వెంకయ్య నాయుడూ! విషయాలు తరువాత చుద్దాం నాయనా. ముందు పవన్ కళ్యాణ్ జాతకంలో ఏముందో చూద్దాం నాయనా.

వెంకయ్య నాయుడు   : ఫేస్ ఎక్స్ ప్రెషన్.

పంచాంగకర్త  :
నాయనా పవనా! నీ రాశుల్లో కొంత గడబిడ వుందిగానీ  నీ జాతకంలో ఉత్తరాషాఢ నక్షత్రం మాత్రం వెలిగిపోతోంది నాయనా. నీకు ఆగస్టు 24 తరువాత గురు మహాదశ మొదలవుతుంది నాయనాగురువు కదా. నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడినా జనం ఎంజాయ్ చేస్తారుమరిన్ను ఆర్ధికంగా కూడా  పుంజుకుంటావు నాయనా . కుటుంబానికి ఇంకా దగ్గరవుతావు.

పవన్ కళ్యాణ్  : ఫేస్ ఎక్స్ ప్రెషన్.

పంచాంగకర్త  :
ఇంకో విషయం పవనానీకు రాజకీయాలు చెప్పి రమణుల గురించి చెప్పకపోతే బాగుండదు నాయనానీ జాతకంలో ముందునుండి వున్నదేగా  స్త్రీలతో తరచూ విబేధాలు. అవి ఏడాది కూడా కంటిన్యూ అవుతాయి పవనూ.

పవన్ కళ్యాణ్  : ఫేస్ ఎక్స్ ప్రెషన్.

పంచాంగకర్త  :
ఇందులో విశేషం ఏమంటే ఏడాది నీకు భక్తి, జ్ఞానాలు వస్తాయి. లేత వయసులో భక్తి, లేటు వయసులో జ్ఞానం రావడం గొప్ప విషయం నాయనా.

పవన్ కళ్యాణ్  : ఫేస్ ఎక్స్ ప్రెషన్.

పంచాంగకర్త  :
గోపాల గోపాల సినిమాలో నువ్వు నటించావు చూడూ అలాంటి పాత్రలో  నిజజీవితంలోనూ జీవిస్తావన్నమాటా.

పవన్ కళ్యాణ్  : ఫేస్ ఎక్స్ ప్రెషన్.

పంచాంగకర్త  :
ఇక పాలిటీక్స్ అంటావా? ... ముందుగా రిహార్సలు వేసుకోకుండా మొన్న తుళ్ళూరు వెళ్ళి వచ్చావు చూడూ ... అలాంటి తప్పులు ఇంకోసారి చేయకు. తెలిసో తెలియకో మళ్ళీ తప్పటడుగులు వేశావే అనుకో రాజకీయం నీతో కటీఫ్ కోట్టేస్తుంది. డేంజరు నీ జాతకంలోవుందికాస్త జాగ్రత్త.

పవన్ కళ్యాణ్  : ఫేస్ ఎక్స్ ప్రెషన్.

పంచాంగకర్త  :
కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ ఎక్కడా?

రాహుల్ గాంధీ   :
నేను పొలిటికల్ హాలిడేలో వున్నాను. ఇక్కడికి నన్ను పిలిపించారు. ఇలా చేయడం మంచిదేనా? అని మిమ్మల్ని నేను అడగాలని అనుకుంటున్నాను.

పంచాంగకర్త  :
నువ్వు పొలిటికల్ హాలిడేలో వున్నా. గర్ల్ ఫ్రెండ్ తో డేటింగ్ లో వున్నా జాతకం మాత్రం మారిపోదు నాయనా.

రాహుల్ గాంధీ   :  ఫేస్ ఎక్స్ ప్రెషన్.

పంచాంగకర్త  :
చూడు రాగుల్ నీది ధనూరాశి. మూలా నక్షత్రం నాయనా. నీకు ఏడేళ్ళ శని నడుస్తున్నదని నేను కొత్తగా చెప్పాల్సిన పనిలేదు నాయనామీ అమ్మకూమీ పార్టీవాళ్లకూ మాత్రమేకాదు నాయనా దేశంలో ప్రతి ఒక్కరికీ విషయం తెలుసు నాయనా. ఈట్స్ ఓపెన్ సీక్రెట్.

బొత్స :
ఏటండిదీ? ముక్క నేను ఎప్పుడో చెప్పాను. నామాట ఎవదూ వినలేదు. ఇప్పుడు ఆయన మునిగాడు. మేమూ మునిగాము.

పంచాంగకర్త  :
నాయనా సత్తిబాబూ! ఎవరు పడితే వాళ్ళు చెపితే కుదరదు నాయనా. చెప్పేవాడి జాతంకం కూడా అప్పుడు బాగుండాలి.

బొత్స  : ఫేస్ ఎక్స్ ప్రెషన్.

పంచాంగకర్త  :
నాయనా రాహుల్! నీకు కుజు మహాదశలో శని వచ్చి పడ్డాడు నాయనానువ్వు ఎలాగూ పార్లమెంటుకు ముఖం చాటేసి లాగించేస్తున్నావు నాయనా. దాన్నే కంటిన్యూ చెయ్యి. జులై వరకూ ముఖం ఎవరికీ చూపకు రాహులూఅదే నీకు బెటరు.

రాహుల్ గాంధీ   : ఫేస్ ఎక్స్ ప్రెషన్.

పంచాంగకర్త  :
నిన్ను  ప్రధానిని చేయాలని మీ అమ్మ సోనియా గాంధీ చాలా కాలంగా కలలు కంటోంది. నీకు అలాంటి కలలు ఎలాగూ లేవు నాయనా. పాలసీనే కొనసాగించునీకు ఎలాగూ ప్రధాని పదవి అందని ద్రాక్ష రాహులూనీ చెల్లెలు ప్రియాంకా వఢేరాను ట్రయలు వేసుకోమను. లక్కు కలిసొస్తే  కొంతయినా ఫలితం రావచ్చు

రాహుల్ గాంధీ   :  ఫేస్ ఎక్స్ ప్రెషన్.

పంచాంగకర్త  :
నాయనా విజీనగరం సత్తిబాబు.

బొత్స  :
ఏటండిదీ. ఇప్పుడు నా జాతకం కూడా చెప్పాలానా జాతకం నాకు తెలీదేటీ?

పంచాంగకర్త  :
అందరికీ చెప్పాక నీకు కూడా చెప్పాలిగా సత్తిబాబూ. నీది మీన రాశి. రేవతీ నక్షత్రం నాయనానీకిప్పుడు బాగోలేదని నీకూ తెలుసు నాయనావచ్చే ఏడాది ఆగస్టు వరకు బాగోలేదని నేను ఇప్పుడు చెపుతున్నాను నాయనా.

చిరంజీవి :
మాస్టారూ! పరిస్థితి బాగోలేదని మీరు విడిగా చెప్పాలా. ఏడాదిగా లోపల వుండి చూస్తున్నాం. మాకు తెలుసుగా అని సూటిగా చెపుతున్నానన్నమాటా.

పంచాంగకర్త  :
నాయనా చిరంజీవీ! రోగం వచ్చినట్టు రోగికి  ముందుగానే తెలుస్తుంది నాయనా. కానీ దాన్నీ కన్ ఫర్మ్ చేయాల్సింది డాక్టరు కదా నాయనా. ఇదీ అంటే మీకు బ్యాడ్టైమ్ నడుస్తున్నదని మీకే ముందు తెలుస్తుంది నాయనాకానీ దాన్ని కన్ ఫర్మ్ చేయాల్సింది నేను కదా నాయనా.

చిరంజీవిఫేస్ ఎక్స్ ప్రెషన్.

పంచాంగకర్త 
నాయనా సత్తిబాబు! కమింగ్టు ది పాయింట్ . ఇప్పుడున్న పరిస్థితుల్లో నీకూ రాజకీయంకన్నా వ్యాపారమే మంచిది నాయనారాజకీయం మీద దృష్టిపెట్టి ఆరోగ్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకు నాయనా. అది అదే. ఇది ఇదే.

బొత్స  :  ఫేస్ ఎక్స్ ప్రెషన్.

పంచాంగకర్త  :
నాయనా తెలంగాణ యువరాజుకల్వకుంట తారకరామారావు. ఇప్పుడు నీ జాతకం తెరుస్తున్నాను.

కేటిఆర్   :
నా జాతకంతో ఏం పనీతెలంగాణ అంటే కేసిఆర్కేసిఆర్ అంటే కేటిఆర్, కవిత.

పంచాంగకర్త  :
ఎంత  ఫ్యామిలీ ప్యాక్ అయినా ఎవరి జాతకం వారిదే నాయన.

కేటిఆర్   :  ఫేస్ ఎక్స్ ప్రెషన్.

పంచాంగకర్త  :
నాయనా కేటిఆర్ ! నీది వుంది చూశావూ? మిధున రాశి. మృగశిర నక్షత్రం నాయనా. సంపూర్ణ కాలసర్ప దోషం వుంది కేటిఆర్శనిలో బుధుడు వున్నాడు. రాహుకేతువులు నీ జీవితంలో  క్షణమైనా ఎలాంటి మాయ అయినా చేయడానికి కాచుకు కూర్చున్నారు  నాయనానీది కూడా రాహుల్ గాంధీ జాతకం కేటిఆర్నీకన్నా నీ తోబుట్టువు జాతక బలం ఇప్పుడు  మరింత స్ట్రాంగ్ గా వుంది నాయనా.

కేటిఆర్   :  ఫేస్ ఎక్స్ ప్రెషన్.

నరేంద్ర మోదీ  :
నమస్కార్ పండిట్ జీ! మై నరేంద్ర మోదీ మోల్ రహా హూ. మీరు నా జాతకాన్ని చెపుతారాలేకపోతే నేనే నా జాతకాన్ని చెప్పాలా. నరేంద్ర మోదీ దేశంలో అందరి జాతకాలను మార్చేస్తాడూ.

పంచాంగకర్త  :
నాయనా నరేంద్ర మోదీ! నువ్వు అంతటి ఘనుడవని తెలుసు నాయనా. వృఛ్ఛికరాశి, అనురాధా నక్షత్రం నాయనా నీదీ. చంద్ర మహర్ధశ నడుస్తోంది నాయనాఅందుకే కాన్ఫిడెన్స్ లెవల్సు అలా పెరిగిపోతుంటాయి.

రాహుల్ గాంధీ :
పండిట్ జీనాకు ఒక సందేహం. మొన్న ఎన్నికల్లో మోదీజీ చంద్ర మహర్ధశ మూలంగా గెలిచారా? లేకపోతే  నాకు కుజు మహాదశలో శని వచ్చి పడిన కారణంగా గెలిచారా?

పంచాంగకర్త  :
నాయనా రాహుల్ఇది టూ ఇన్ వన్ను ప్రోగ్రాం నాయనా. రెండు కారణాలూ వుంటాయి. నీ బ్యాడ్ లక్కూకు మోదీ గుడ్ లక్కూ తోడైంది నాయనా

రాహుల్ గాంధీ    :  ఫేస్ ఎక్స్ ప్రెషన్.

పంచాంగకర్త  :
నాయనా మోదీ! నీకు ఇప్పట్లో తిరుగులేదు నాయనా. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటే, ఇంకో పదేళ్ళు నీకు తిరుగులేదు నాయనా.

నరేంద్ర మోదీ   :  ఫేస్ ఎక్స్ ప్రెషన్.

పంచాంగకర్త  :
లాస్టు బట్ నాట్ లీస్టుమన హరీష్ రావు ఎక్కడా?

హరీష్ రావు :
నాకు జాతకం దేనికీ గురూజీమా మావయ్యకు చెప్పారుగా అది సరిపొతుందిమా మావయ్యే మాకు ఊపిరిమాకు ప్రాణం. కేసిఆర్ లేకుంట హరీష రావు లేడు.

పంచాంగకర్త  :
మాట నిజమేగానీ నాయనా. నీ జాతకం నీదే గా తన్నీరు హరీష్ రావూ. నీది కుంభరాశి నాయనా. ధనిష్ట నక్షత్రం మూడవ పాదంనీ వాల్ క్లాకు, నీ టైమ్ పీసునీ రిస్టు వాచీ అన్నీ  మహా గొప్పగా నడుస్తున్నాయి నాయనా

కేటిఆర్   : 
మా ఇంట్లో  వాల్ క్లాకుటైమ్ పీసు కరెక్టుగా పనిచేస్తున్నాయి. నా రిస్టు వాచీ  గొప్పగా నడుస్తున్నది.

పంచాంగకర్త  :
నాయనా హరీషునేను చెప్పింది మీ ఇంట్లో క్లాకుల గురించీ, నీ చేతికున్న రిస్టువాచీ గురించి కాదు నాయనాగ్రహాల కదలిక గురించి.

కేటిఆర్   :  ఫేస్ ఎక్స్ ప్రెషన్.

పంచాంగకర్త  :
నాయనా హరీషూ! నీకు పదో ఇంట శని వున్నాడు. ఏడో ఇంట గురు వున్నాడు. శని మహర్ధశలో వున్నావు. జులై తరువాత ఒక వెలుగు వెలుగిపోతావు నాయనా. ఇక్కడున్నవాళ్లలో నీ అంత మహర్జాతకుడు లేడుగాక లేడు నాయనానీకు తిరుగే లేదనుకో. ఇక ప్రపంచం నీ చుట్టూ తిరుగుతుంది. దటీజ్ ఆల్.

హరీష్ రావు : ఫేస్ ఎక్స్ ప్రెషన్.

పంచాంగకర్త  :
అయ్యా ఇదీ విషయం. పంచాంగం శాస్త్రం నాయనల్లారా. నేను చెప్పాల్సింది చెప్పేశాను. మీరూ వినాల్సినవి వినేశారు. ఇక శెలవు.

సర్వేజనా  సుఖినోభవంతూ !!

END


పొలిటికల్ పన్ చాంగమ్


సెటైర్‌
పంచాంగకర్త: ఓం శ్రీ గురుభ్యోన్నమః!
లోకస్సమస్తా సుఖినోభవంతూ!!
ఈ ఏడాది పేరు మన్మథ. మన్మథుడు అందగాడు. జనాన్ని సమ్మోహితుల్ని చేసి మైమరిపించడం అతగాడికి తెలిసిన విద్య. చెరుకుగడ అతని విల్లు. పేరుకు తగ్గట్టే చక్కెర పూత పూసిన అనేక స్కీముల్ని మన నేతలు ఈ ఏడాది గుక్క తిప్పుకోకుండా ప్రకటిస్తారు. జనం వాటికేసి నోరు చప్పరిస్తూ చూస్తారు. అవి జనానికి చేరవు. ఈలోగా సంవత్సరం మారిపోతుంది.
చంద్రబాబు: ఏం మాస్టారు! మీరు కూడా రాజకీయ వేత్తలా మాట్లాడటం కరెక్టు కాదండి. నా పాలన మూడు వర్షాలు ఆరు పంటలుగా సాగిపోతున్నదని మీకు నేను మనవి చేసుకుంటావున్నానూ. మీరు కనుక ఒకసారి ఇటు పక్క చూసినట్టయితే...
పంచాంగకర్త: నాయనా చంద్రబాబూ! నేను ఎటుపక్కా చూడను నాయనా. ఈ రోజు కేవలం పంచాంగమే చూస్తానూ.
కేసిఆర్‌: అరే పంతులూ! ఆంధ్రా పంతుళ్లు మస్తు వాస్తు చూస్తరని అంటరు. నువ్వేందీ గిట్ల మా తెలంగాణ కలెక్టర్లు లెక్క మాట్లాడుతున్నావు. నా పథకాలు గిట్ల జనానికి చేరత లేదంటావా? పంతులూ! గిది పద్ధతి కాదే..
పంచాంగకర్త: నాయనల్లారా! ఇంకోసారి చెపుతున్నానూ. మీరు గోల చేయటానికి ఇది గవర్నర్‌ ప్రసంగం కాదు పంచాంగ శ్రవణం నాయనల్లారా! ఎంత అసెంబ్లీ సమావేశాల మధ్య ఉగాది వచ్చినా. పంచాగ శ్రవణాన్ని ప్రశాంతంగా వినాలి నాయనల్లారా.
నాయనా నారా చంద్రబాబూ! నీది చూశావూ.. వృషభరాశి. కృతిక నక్షత్రం. సప్తమిలో శని ఉన్నాడు. అయినా ప్రస్తుతం నీ జాతకం బ్రహ్మాండంగా వెలిగిపోతుంది నాయనా. పోలవరాన్ని పక్కన పెట్టినా, పట్టిసీమను ముందుకు తెచ్చినా డిసెంబరు వరకు నిన్ను నిలదీసేవాడు ఎవ్వడూ లేడు నాయనా. అప్పటివరకు నువ్వు మూడంటే మూడు. ఆరంటే ఆరే నాయనా.
చంద్రబాబు: మాస్టారూ! మీరు చెబుతున్నవన్నీ కరెక్టు అని మీకు నేను మనవి చేసుకుంటావున్నాను. ఆ మాదిరి చూసుకుంటే నా కంప్యూటరు కూడా ఈ మాటే చెప్పిందని మీకు నేను తెలియజేసుకుంటా ఉన్నాను.
పంచాంగకర్త: నాయనా చంద్రబాబూ! నువ్వు మరి కాస్త ఓపిక పట్టాలి. నీ కంప్యూటరు చెప్పినవీ చెపుతానూ. నీ కంప్యూటరు చెప్పనివీ చెపుతాను. నీ జాతకం డిసెంబరులో నాయనా. శనిలో కుజుడు వస్తాడూ. అప్పుడు మొదలవుతుంది నాయనా పొలిటికల్‌ డ్యాన్సింగూ. నీ వాళ్లు ముందు చూపు కలవారు నాయనా. ఈలోపులో నాలుగు రాళ్లు భద్రంగా వెనకేసుకుంటారు నాయనా. ఆ తరువాత వాళ్లే నీకు మేకులవుతారూ. నీకు ముందు ముప్పు వచ్చేది నీ వాళ్లతోనే నాయనా.
మన జనానికి సహనం ఎక్కువ నాయనా. నువ్వు ఏమైనా చేస్తావని ఏడాదిన్నర వరకు ఓపిక పడతారు. అంటే వచ్చే డిసెంబరుకు ఆ గడువు తీరుతుంది నాయనా. తరువాత వాళ్ళ ఓపిక చచ్చిపోతుంది నాయనా. వాళ్ళు రోడ్ల మీదకు వచ్చి డ్యాన్సులు చేస్తే నీకు డామేజీ తప్పదు నాయనా. నువ్వు అంత పరిస్థితి తెచ్చుకోవద్దు నాయనా.
చంద్రబాబు: మాస్టారూ! దీనికి విరుగుడు ఏమీ లేదా? శాంతి మార్గం చూపించాలని మిమ్మల్ని నేను కోరుకుంటావున్నాను. మేము ఆ విధంగా ముందుకుపోతామని మీకు నేను మనవి చేసుకుంటావున్నాను.
పంచాంగకర్త: నాయనా చంద్రబాబూ! లోకంలో దేనికయినా విరుగుడు ఉంటుంది నాయనా. తరువాత శాంతి పూజలు చేయడం కన్నా ముందే అశాంతి రాకుండా చూసుకోవడం ఉత్తమం నాయనా. నువ్వు ఇరవై నాలుగు గంటలూ ఆ జగన్‌ గురించి ఆలోచించకుండా కాస్త నీ ఆరోగ్యం గురించి కూడా పట్టించుకో బాబూ. అయ్యా! ఈ రాశి వారికి ఈ ఏడాది రాజ పూజ్యం 8, అవమానం 6 నాయనా. అదీ విషయం మరి.
పంచాంగకర్త: తెలుగువాళ్ల రెండు రాషా్ట్రల్లో ప్రభుత్వాలు చేయించిన అఫీషియల్‌ ఉగాది పచ్చడిలో బెల్లం పాలు తగ్గి, పులుపు, వేప చేదు పాళ్లు కొంచెం పెరుగుతాయి. వెరసి ఈ ఏడాది ఉగాది పచ్చడి ప్రజలకు చేదుగానే ఉంటుంది నాయనల్లారా!.
కేసిఆర్‌: నువ్వు భలేగున్నవ్‌. గా చంద్రబాబు జాతకమే చెపుతవా? నా జాతకం కూడా గిట్ల చూసేది ఉందా?
పంచాంగకర్త: నాయనా కేసీఆర్‌! యూ డోంట్‌ వర్రీ. పంచాంగం మొదలెట్టాక నీకూ వారికి అని ఏమిలేదు నాయనా. అందులో అందరి జాతకాలు ఉంటాయి. నేను అందరి జాతకాలూ చెపుతాను. నీ జాతకం కూడా చెపుతాను నాయనా. నీది సింహరాశి ముఖ నక్షత్రం నాయనా.
కేసిఆర్‌: గట్ల చెప్పు. లయన్‌ ఆఫ్‌ తెలంగాణ. గీ ముచ్చటి బాగుంది.
పంచాంగకర్త: అవున్నాయనా. సింహం అంటే మృగరాజు. అడవికి చక్రవర్తి. నీ రాజ్యంలో ఎవరయినా నువ్వు ఆదరిస్తే ఆనందించాలి. నువ్వు తిడితే పడాలి. ఎవ్వరికీ ఇంకో ఆప్షన్‌ లేదు బాబు. అత్తలేని కోడలు గుణవంతురాలు అయినట్టు అపోజిషను లేని సియం జెంటిల్‌మన్‌ నాయనా!
నాయనా కేసిఆర్‌! నీ గురించి నువ్వే చెప్పుకుంటే కుదరదు. నేను చెప్పాలి. నీకు రాహు మహాదశ నడుస్తోంది. కాస్త వెనుకా ముందూ చూసుకుని నడవాలి నాయనా.
కేసిఆర్‌: గీ కేసిఆర్‌ వెనుకా ముందూ చూడడు. దిమాగ్‌కు తోచింది చేస్తడు. నోటికి వచ్చింది చెపుతడు. బస్‌. కిస్సా ఖతమ్‌.
పంచాంగకర్త: నువ్వు ముందూ వెనుకే కాదు నాయనా.. పక్కన కూడా చూసుకుని నడవాలి. రాజకీయాలు అన్నాక వెనుకపోట్లు, పక్కపోట్లు కూడా ఉండవచ్చు. ఈ రాశి వారికి ఈ ఏడాది రాజపూజ్యం 8, అవమానం 2 మాత్రమే నాయనా. నాలుగు నెలల్లో అమెరికా విమానం ఎక్కుతావు నాయనా. క్షేమంగా వెళ్ళి లాభంగా రా నాయన.
కేసిఆర్‌: గీ ముచ్చట బాగున్నది...
జగన్‌: అయ్యా పంతులుగారూ! ఈ రోజు మిమ్మల్ని ఒకటే అడుగుతావున్నా. మీరు చంద్రబాబుగారికే జాతకాలు చెపుతారా? నాకు జాతకాలు చెప్పరా? అని అడుగుతావున్నా. శాసనసభలో నేను ఏమి అడిగినా చంద్రబాబుగారు సమాధానం చెప్పరు ఆయనా, ఆయన తమ్ముళ్లూ నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. ఇది న్యాయమా? ధర్మమా? అని అడుగుతా వున్నా.
పంచాంగకర్త: నాయనా జగన్‌! కొన్ని జాతకాలు కొన్ని సందర్భాల్లో ఇలాగే ఉంటాయి బాబూ. నీది మిధున రాశి. ఆరుద్ర నక్షత్రం నాయనా. అయిదారేళ్లు నీ జాతకం వెయ్యి మెగా వాట్లతో వెలిగిపోయింది. ఇపుడు వ్యవహారం కాస్త డీలా పడింది బాబూ. అప్పుడు వరసగా కొత్త కొత్త దుకాణాలు తెరుచుకుంటూ పోయావుగా నాయనా. ఇప్పుడు పాత దుకాణాలు మూసుకుంటూపోవాల్సి రావచ్చు. నాయనా జగన్‌ నీకు మరో విషయం చెప్పాలి. బుధ దశలో చంద్రుడున్నాడు. ఇక్కడ ఒక చంద్రుడితో వైరం పెరుగుతుంది. ఆ పక్కన ఇంకో చంద్రుడితో స్నేహం తగ్గుతుంది. కలిసిరాని కాలంలో ఏమైనా జరగవచ్చు నాయనా. ఈ ఏడాది రాజపూజ్యం తక్కువ, అవమానం ఎక్కువ. అదీ విషయం. అర్థం అయిందిగా నాయనా?
పంచాంగకర్త: పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఎక్కడ నాయనల్లారా?
పవన్‌కళ్యాణ్‌ : ఏం శాసు్త్రలుగారూ! మీకు నేను కనిపించడం లేదా?
పంచాంగకర్త: నీ రాశుల్లో కొంత గొడవుంది గానీ నీ జాతకంలో ఉత్తరాషాడ నక్షత్రం మాత్రం వెలిగిపోతోంది నాయనా. ఆగష్టు 24 తరువాత గురు మహాదశ మొదలవుతుంది నాయనా. గురువు కదా. నువ్వు నోటికొచ్చినట్లు మాట్లాడినా జనం ఎంజాయ్‌ చేస్తారు. ఆర్థికంగా పుంజుకుంటావు. కుటుంబానికి ఇంకా దగ్గరవుతావు. నీ జాతకంలో వున్నదేగా సీ్త్రలతో తరచూ విబేధాలు. అవి ఈ ఏడాది కూడా కంటిన్యూ అవుతాయి.
ఇంకో ముఖ్య విషయం ఏమంటే ఈ ఏడాది నీకు భక్తి, జ్ఞానాలు వస్తాయి. ఇక పాలిటిక్స్‌ అంటావా? ముందుగా రిహార్సల్‌ వేసుకోకుంగా మొన్న తుళ్ళూరు వెళ్లి వచ్చావు చూడూ. అలాంటి తప్పులు ఇంకోసారి చేయకు. తెలిసో తెలియకో మళ్ళీ తప్పటడుగులు వేశావే అనుకో రాజకీయం నీతో కటీఫ్‌ కొట్టేస్తుంది. ఆ డేంజరు వుంది. జాగ్రత్త.
పంచాంగకర్త: అయ్యా ఇదీ పంచాంగం శాస్త్రం నాయనల్లారా. నేను చెప్పాల్సింది చెప్పేశాను. మీరూ వినాల్సినవి వినేశారు. ఇక శెలవు.
సర్వేజనా సుఖినోభవంతూ!!

ఉషా ఎస్‌ డాని

http://www.andhrajyothy.com/Artical.aspx?SID=93806&SupID=25