Monday, 2 March 2015

The Signals of Neo-Crusades

The Signals of Neo-Crusades

మతయుధ్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి!
ఉషా యస్ డానీ

పారిస్ లోని ఛార్లీ హెబ్డో పత్రిక కార్యాలయంపై  దాడి తరువాత పత్రికా స్వేఛ్ఛ మీద మరోసారి విస్తృత చర్చ మొదలయిందిదాడిలో పత్రిక సంపాదకులు సహా అరడజను సిబ్బంది కూడా చనిపోవడంవల్ల చర్చల తీవ్రత కూడా  స్థాయిలోనే కొనసాగుతోందిసామాజిక కోణంలో చూస్తే భావప్రకటనా స్వేఛ్ఛ పేరిట సాగుతున్న  చర్చలోఇరువర్గాలు వర్ణ ప్రాతిపదిక మీద విడిపోయారని సులువుగానే అర్ధం అవుతోందిశ్వేతవర్ణ జాతీయులువాళ్ళ మేధోబృందాలు పత్రిక కార్యాలయంపై  దాడినీసిబ్బంది హత్యనూ తీవ్రంగా ఖండిస్తుంటేఇతర వర్ణాలకు చెందిన ప్రజలువాళ్ళ మేధోవర్గాలు  ఛార్లీ హెబ్డో పత్రిక దుందుడుకు స్వభావాన్నే తప్పుపడుతున్నారు.  

చార్లీ హేబ్డో పత్రిక సామాజిక దృక్పథాన్ని అర్ధం చేసుకోవడానికి ముందు ఫ్రాన్స్ రాజకీయార్ధిక నేపథ్యాన్ని ఒకసారి పరిశీలించాలిఫ్రాన్స్ నిన్నమొనటి వరకు వలస పాలక దేశంగా వుండేదిబ్రిటీష్ వలస పాలకులకన్నా ఫ్రెంచ్ వలస పాలకులు మరింత అహంభావులువలసలు అంతరించి దశాబ్దాలు గడుస్తున్నాఅలనాటి వలసదేశాల ప్రజలంటే ఫ్రెంఛ్ ఉన్నత వర్గాలకూవాళ్ళ మనోభావాల్ని ప్రచారంచేసే పత్రికలకూ ఇప్పటికీ చిన్న చూపేఅక్కడి పత్రికల్లో వచ్చే కార్టూన్లల్లో వర్ణ వివక్ష ప్రస్పుటంగా కనిపిస్తుందివీళ్ళలో మరీ బరితెగించిన పత్రిక ఛార్లీ హేబ్డోమినహాయింపు లేకుండా అందరి మీదా వ్యంగ్య బాణాలు సంధిస్తూ వుంటుందని ఉదారవాద ఫ్రెంచ్మేధావులు  పత్రికని మెచ్చుకుంటూ వుంటారుఇది పాక్షిక సత్యం మాత్రమేకాస్త పరికించి చూస్తే పత్రిక తెల్లవాళ్లను సుతారంగా గోళ్లతో గిల్లి వదిలేస్తుందనీనల్లవాళ్ళు తదితర ఒకనాటి వలస ప్రజల్ని కర్కశంగా గొడ్డళ్ళతో పొడుస్తుందనీ సులువుగానే అర్ధం అవుతుంది.

నిజానికి ఈపాటి జ్ఞానాన్ని సంపాదించడానికి ఆలోచనాపరులెవ్వరూ ప్యారిస్ పర్యటనకు వెళ్ళాల్సిన పనిలేదుతెలుగు వార్తా పత్రికల్ని అధ్యయనం చేసినా సరిపోతుందితెలుగు మీడియా సంస్థలన్నీ ఏదో ఒక రాజకీయపార్టీకి మద్దతు దారులుగా మారిపోయాయన్న సంగతి తెలియనివాళ్ళు ఇప్పుడు ఎవరూలేరుప్రతీ పత్రిక రాజకీయకార్టూన్లు ప్రచురిస్తుంది.  తాము సమర్ధించే పార్టీల ప్రత్యర్ధుల మీదే కాకుండా కొన్ని సందర్భాలలో  తాము సమర్ధించే పార్టీల నాయకుల మీద కూడా కార్టూన్లు వేయాల్సి వుంటుందిఅంత మాత్రాన  వాళ్ళు  సమర్ధించే పార్టీల మీద వేసే కార్టూన్ల తీవ్రతాతాము సమర్ధించే పార్టీల ప్రత్యర్ధుల మీదే వేసే కార్టూన్ల తీవ్రతా ఒకే స్థాయిలో వుంటాయని పుర్రెలో కాస్తంత బుర్ర వున్నవాడు ఎవరయినా నమ్ముతారా?  సీనియర్ పాత్రికేయులు కొందరు నమ్ముతూ వుండవచ్చువాళ్లను చూసి జాలిపడడంతప్ప మనం చేయగలిగింది ఏమీలేదుపత్రికా స్వేఛ్ఛ అంటే యధేఛ్ఛకాదు!

అప్పట్లో ఆఫ్రో-అమెరికన్ నల్లజాతీయుల్ని కోతులుగా చిత్రించిన అమెరికా శ్వేతవర్ణీయుల పత్రికల్నిహిట్లర్ కాలంలో యూదుల్ని కించపరుస్తూ కార్టూన్లు వేసిన జర్మన్ పత్రికల్ని ఛార్లీ హెబ్డో పత్రిక  అనుసరిస్తూ వుంటుంది.  ఇటీవలి కాలంలో ఆర్ధికసంక్షోభంలో పడిపోయిన చార్లీ హెబ్డో పత్రిక  'సమవర్తిముద్ర నుండి బయటపడి ఇస్లామోఫోబియాను ప్రచారం చేయడం ద్వార శ్వేతవర్ణీయుల మద్దతు కూడగట్టి లాభాలబాట పట్టే ప్రయత్నాలు మొదలెట్టిందనే వాదనలున్నాయిదాడి తరువాత  పత్రిక్కి సంఘీభావంగా తరలివస్తున్న శ్వేతవ్వర్ణ నిధులు  వాదనను బలపరుస్తున్నాయిలాభాలు సంపాదించడానికి  ఏకంగా ఒక సంపాదకుని ప్రాణాలను బలిపెడతారాఅనే సందేహం ఎవరికయినా రావచ్చుఅయితే"పది శాతం లాభం కోసం ఉరికభం ఎక్కడానికి కూడా పెట్టుబడిదారులు  వెనుకాడరు." అనేది అందరికీ తెలిసిన సూత్రమే!

ఇంగ్లండ్ ముస్లింలలో అత్యధికులు ఒకనాటి బ్రిటీష్ వలస దేశాలకు చెందినవాళ్ళే అయినట్టుఫ్రాన్సుదేశపు ముస్లింలలో అత్యధికులు సహజంగానే ఒకనాటి ఫ్రెంచ్ కాలనీలకు చెందినవారు వుంటారుఛార్లీ హేబ్డే పత్రిక  సామాజికవర్గాన్ని లక్ష్యంగా చేసుకుని వ్యంగ్యం చాటున ముస్లింలను భూతాలుగా (ఇస్లామో ఫోబియానుప్రచారంచేస్తూ వుంటుంది.

ఫ్రెంచ్ సామ్రాజ్యానికీఇస్లాంకు ఒక విచిత్ర  అనుబంధం వుందిఉత్తర ఆఫ్రికా ఖండంలో  ఫ్రెంచ్ సామ్రాజ్యం శిఖరాగ్ర దశలో వున్నప్పుడుఅక్కడ ఇస్లాం చాలా వేగంగా విస్తరించింది.  ఒక దశలో అయితే ముస్లింల జనాభా అత్యధికంగా వున్న సామ్రాజ్యం తనదేనంటూ  ఫ్రాన్సు గొప్పగా చెప్పుకునేదిముస్లిం దేశాల్లోని చమురుపైఆధిపత్యాన్ని సాధించడానికి  జనాభా అంశాన్ని పెద్దగా ప్రచారం చేసుకునేది

ప్రపంచవ్యాప్తంగా శ్వేత జాతీయులు ఇప్పుడు కార్టూన్లు ప్రచురించినందుకు ఒక పత్రికా సంపాదకుడ్ని ముస్లింలు క్రూరంగా చంపేశారని గగ్గోలు పెడుతున్నారుముహమ్మద్ ప్రవక్తను నగ్నంగా చిత్రించడం వ్యంగ్యమేనాముస్లింల ప్రవక్త వికృత మైధూనాని (సుడోమికి పాల్పడినట్టు  ఒక మతిచెడినవాడు తీసిన ఒక బూతు సినిమాకువత్తాసు పలకడం హాస్యమేనాశాసనసభ్యులుగా ఎన్నికైన ’పల్లెటూరి బైతులు ప్రభుత్వం ఇచ్చిన  ల్యాప్ టాపుల్ని మడిచి ఎక్కడ పెట్టుకుంటారోఅని ఒక వెకిలి వ్యాఖ్య చేసినందుకుఅగ్రస్థానంలోవున్న ఒక న్యూస్ ఛానల్ ఆర్ధిక పునాది కదిలిపోవడాన్ని తెలంగాణలో   మనం కళ్ల ముందు చూశాంతమ మతప్రవక్త మీద అదేపనిగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తుంటే విశ్వాసులు ఎలా స్పందిస్తారో ఊహించడం కష్టమేమీకాదు.

ఛార్లీ హెబ్డో పత్రిక మీద దాడి చేసింది ముస్లింలు అనేది కూడా పాక్షిక సత్యమే కేసులో అరెస్టు అవుతున్న వారందరూ ఒకనాటి ఫ్రెంచ్  వలసలైన అల్జీరియామాలియన్ దేశాల నుండి వచ్చినవారే నన్నది మరో కోణంపత్రిక మీద దాడికి మతంకన్నా జాతివివక్ష అంశమే బలంగా పనిచేసిందని దీనినిబట్టి అర్ధం అవుతున్నది.అంతర్జాతీయ పత్రికల్లో శ్వేతవర్ణ మేధావులు రాసే వ్యాసాలు చదివి రెచ్చిపోతున్న మన సమకాలిక ’నల్ల మేధావులకు వలసజాతుల ఆవేదన అర్ధం అయినట్టులేదు.

వలసజాతుల భావోద్వేగాలకు ఉధామ్ సింగ్ అద్భుత ప్రతీకజలియన్ వాలా బాగ్ దురంతాన్ని జరిపిన బ్రిగేడియర్-జనరల్  రెగినాల్డ్ డయర్ (Dyer) కన్నా   నరమేధానికి అనుమతి ఇచ్చిన పంజాబ్ గవర్నర్ మైఖేల్ ఓ’ డయ్యర్ (O’Dwyer) ప్రధాన దోషి అని ఉధామ్ సింగ్ భావించాడుఇరవై యేళ్ళు గడిచిపోయినా సరేడయ్యర్ పదవీ విరమణ చేసి డెభ్భయి ఆరేళ్ళ  వృధ్ధుడు అయిపోయినాసరే  కసి చల్లారక లండన్ వెళ్ళి మరీ చంపేశాడుఅదే ఒక లండన్ పత్రిక తరచూ భారతీయుల్ని కించపరుస్తూ వ్యాసాలోవ్యంగ్య చిత్రాలో ప్రచురిస్తుంటే ఉధామ్ సింగ్ లాంటి వాళ్ళు ఏమి చేసి వుండేవాళ్ళూ?  అప్పుడు  చర్యను వలసపాలకులు ఎలాగూ ఖండిస్తారువాళ్ళచట్టాల ప్రకారం ’దోషుల్ని ఎలాగూ శిక్షిస్తారువలస ప్రజల్ని సమర్ధించే మేధావులు ఏం చేయాలిఅన్నదే ఇప్పుడు మన ముందున్న ప్రశ్న.


ఇస్లామో ఫోబియా అనేది సంస్కృతిక దాడి అయితేదానికి మూలమయిన రాజకీయార్ధిక కారణాలను ఏకధృవ ప్రపంచాన్ని ఏలుతున్న అమెరికా సామ్రాజ్యవాదంలో చూడాలిదానికి వ్యూహాలు రచిస్తున్న అమెరికా-ఇజ్రాయిల్ అనుబంధంలో చూడాలిసామ్రాజ్యవాదిగావున్న అమెరికాను  రాజకీయార్ధిక కోణంలో బాహాటంగాసమర్ధించడానికి కొన్ని మతాలకు కొన్ని ఇబ్బందులు వున్నమాట నిజమేఅయితేసాంస్కృతికంగా ముస్లిం వ్యతిరేక శిబిరానికి నాయకత్వం వహిస్తున్న అమెరికా వెనుక నడవడానికి ఇప్పడు ముస్లిమేతర మతాలన్నీ ఉవ్విళ్ళూరుతున్నాయి.


ఏదో ఒక శత్రువు లేకుండా మనుగడ సాగించలేని  అమెరికా సామ్రాజ్యవాదం  సోవియట్ రష్యా పతనం తరువాత ముస్లింలనే తన ప్రధాన శత్రువుగా భావిస్తోందివర్తమాన ప్రపంచంలో అసంఖ్యాక పీడిత ప్రజలు అనేక యుధ్ధరంగాల నుండి అనేక రకాలుగా అమెరికా సామ్రాజ్యవాదంతో తలపడుతున్నారనేది ఎవరికైనా అర్ధం అయ్యేవిషయమే.   యుధ్ధాల్లో ముందుశ్రేణిలో నిలబడి అమెరికాతో తలపడుతున్నది ముస్లింలే అనేది కూడా  సులభంగానే తెలుస్తోంది జ్ఞాన సముపార్జన క్రమం ఇంకో అడుగు ముందుకు వేస్తే ఎవరికైనా అర్ధం అయ్యేది ఏమంటే వర్తమాన ప్రపంచంలో ప్రధాన పీడితులు ముస్లీంలు అనివిప్లవ రచయిత వరవరరావు వంటి వారుముస్లింలతోపాటూ ఆదివాసుల్ని కూడా ప్రధాన పీడితులుగా పేర్కొంటున్నారుఇది సంమంజసమైన ప్రతిపాదనముస్లిం దేశాల్లో చమురు నిల్వలున్నాయిఆదివాసుల నివాసాల్లో ఖనిజ నిక్షేపాలున్నాయిఇది సాంస్కృతిక రూపంలో సాగుతున్న పచ్చి ఆర్ధిక పోరాటం.

మధ్య యుగాల్లో రాజకీయార్ధిక వ్యక్తీకరణలన్నీ  మత రూపంలోనే సాగేవిపధ్ధెనిమిదవ శతాబ్దం ఆరంభంలో వాల్టేర్రూసోలు రంగప్రవేశం చేశాక మాత్రమే రాజకీయార్ధిక వ్యక్తీకరణలకు ఆధునిక మాధ్యమం ఏర్పడిందిగడిచిన మూడు శతాబ్దాల కాలంలో జరిగిందేమంటే పెట్టుబడీదారీ రాజకీయార్ధిక విధానాలు సామ్రాజ్యవాద దశకుచేరుకుని ప్రపంచ పీడిత ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకను ఎదుర్కొంటున్నాయి సంక్షోభాన్ని దాటి మళ్ళీ ఆమోదాంశాన్ని పొందాలంటే సామ్రాజ్యవాద దేశాలు తమ రాజకీయార్ధిక వ్యక్తీకరణలకు ఒక కొత్త మాధ్యమాన్ని కనిపెట్టాలిఇప్పుడు వాటికా శక్తిలేదుఅంచేత గతంలో వదిలేసిన మత మాధ్యమాన్నే అవి పునరుధ్ధరిస్తున్నాయి.అమెరికా నాయకత్వంలో సాంస్కృతికంగా ప్రపంచం ఇప్పుడు నిజంగానే రెండు మత శిబిరాలుగా చీలిపోయింది.  గ్లోబ్ ను మతయుధ్ధ మేఘాలు దట్టంగా కమ్ముకుంటున్నాయి!

ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ప్రధాన వార్తల్ని చూస్తుంటే ఇస్లాంను ద్వేషించని వారు భూగోళం మీద ఎవరూ లేరేమో అనిపిస్తోందిఇంకొన్ని పేజీలు తిరగేస్తుంటే అందుకు విరుధ్ధమైన వార్తలు కూడా కనిపిస్తున్నాయిముస్లిం జనాభా మెజారిటీ అయిపోతోందని యూరప్ దేశాలు భయపడిపోతున్నాయటఇంగ్లండ్జర్మనీఅమెరికాలనూఇప్పుడు ఇస్లాం భూతం వెంటాడుతోంది!.  అంతమంది అంతలా తిట్టిపోస్తున్నాముస్లింలను భూతాల్లా చూపిస్తున్నాఇస్లాంను స్వీకరించేవాళ్ళు రోజురోజుకూ పెరిగిపోతుండడం నిజంగా ఆశ్చర్యమేఇలాంటి సందర్భాల్లో  ఖిలాఫత్ ఉద్యమ నాయకుడుభారత జాతీయ కాంగ్రెస్‍ కు అలనాటి అధ్యక్షుడుకవి మౌలాన ముహమ్మద్ ఆలీ(జౌహర్) కవితా పంక్తులు గుర్తుకు వస్తాయి.  "ఖతల్  హుస్సేన్ అసల్ మే మర్గ్  యజీద్ హై /  ఇస్లాం జిందా హోతాహై హర్ కర్బలా కే బాద్"  దీనికి ఒక్క ముక్కలో అర్ధం చెప్పుకోవాలంటే "అణిచివేత నుండే ఇస్లాం జీవాన్ని నింపుకుంటుంది".

కళాకారులుఆలోచనాపరులు చెయ్యాల్సిన పని ఆధిపత్యాన్ని సవాలుచేయడంవాళ్ళు ఎప్పటికీ చేయకూడని పని పీడితుల్ని వెటకరించడంఅమెరికా ప్రపంచ ప్రధాన పీడక దేశం అయ్యిముస్లింలుఆదివాసులు ప్రపంచ ప్రధాన పీడితులు అయినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వున్న సామ్రాజ్యవాద వ్యతిరేకులు ఏం చేయాలీఅనేదేఈరోజు మన ముందున్న ప్రధాన సమస్యదానికి ఎవరికివారు ఇచ్చుకునే సమాధానమే ప్రపంచ ప్రజల ముందున్న చారిత్రక కర్తవ్య నిర్వహణకు దారితీస్తుందిఇటో అటో తేల్చుకోవాల్సిన సమయమిది.

(రచయిత సీనియర్ పాత్రికేయులు సమాజ విశ్లేషకులు)
మొబైల్ : 90107 57776

హైదరాబాద్,  21  జనవరి 2015
ప్రచురణ :
 వీక్షణం మాసపత్రిక, ఫిబ్రవరి 2015 :

No comments:

Post a Comment