హషీంపురా
- ఆలస్యం అయినా న్యాయం దక్కలేదు.
-
డానీ
1987లో మీరట్ మతకల్లోలాల
సందర్భంగా 22 మే నాడు నగరంలోని హషీంపుర మొహల్లాలో 42 మంది ముస్లిం యువకులు దారుణ
హత్యకు గురయ్యారు. 19 మంది ప్రొవెన్షియల్ ఆర్మ్ డ్ కానిస్టేబులరీ (పిఏసి) జవాన్లు వీళ్లను
చుట్టుముట్టు కాల్చి చంపేశారు అనేది ఆరోపణ.
ఈ
కేసు విచారణ 28 ఏళ్ళుగా న్యాయస్థానాల్లో సాగుతూనేవుంది. ఈ మధ్య కాలంలో ముగ్గురు
నిందితులు వచిపోయారు. మూడు రోజుల క్రితం మార్చి 21న ఢిల్లీలోని ట్రయల్ కోర్టు సరైనా
సాక్ష్యాధారాలు లేవనే నెపంతో నిందితుల్ని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ సందర్భంగా 10 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఈ రోజు (మార్చి 24)
రాత్రి 8.30 గంటలకు ఒక ప్రత్యేక
కార్యక్రమాన్ని నిర్వహించింది. దాని కోసం
నేను ఇచ్చిన సౌండ్ బైట్స్ ఇవి.
“వంద మందిని క్రూరంగా చంపేసి తప్పించుకోవడానికి భారత న్యాయవ్యవస్థ అవకాశం కల్పిస్తున్నదని హషింపుర ఊచకోత మీద ఢిల్లీ కోర్టు తీర్పు మరోమారు నిరూపించింది”.
“42 మంది ముస్లిం యువకుల్ని దారుణంగా చంపేసిన
సంచలన కేసు ఇది. ఈ సంఘటనలో తగిన
సాక్ష్యంలేదంటూ నిందితులైన స్పెషల్ పోలీసుల్ని కోర్టు నిర్దోషులుగా వదిలివేసింది. పోలీసుల మీద పోలీసులు జరిపే నేర పరిశోధన ఒక బూటకమని ఈ కేసు తీర్పు చాటిచెప్పింది”.
“Justice Delayed
Means Justice Denied; న్యాయాన్ని ఆలస్యం చేయడం అంటే న్యాయాన్ని తిరస్కరించడమే అంటారు. ఈ
కేసులో ఆలస్యం జరిగినా న్యాయం దక్కలేదు. 42 మందిని క్రూరంగా హత్యచేసి దోషులు తప్పించుకున్నారు”.
“విచారణను
ఏళ్ల తరబడి సాగదీయడంతో సాక్షులు చనిపోతారు, సాక్ష్యాధారాలు శిధిలమైపోతాయి. అంతిమంగా న్యాయం చనిపోతుంది”.
“ఏ
కేసులో అయినా సరే న్యాయప్రక్రియను సాగదీసేది బాధితులు కాదు. నిందితులు, పరిశోధనా అధికారులు న్యాయమూర్తులు న్యాయప్రక్రియను సాగదీస్తారు”.
“ఈ
కేసు విచారణ తంతు న్యాయవ్యవస్థ మీద, పోలీసు వ్యవస్థ మీద ప్రజల నమ్మకాన్ని తుడిచివేసింది. దేశంలో తీవ్రవాదం, ఉగ్రవాదం ఆవిర్భవించడానికీ, పెరగడానికీ న్యాయస్థానాలూ దోహదం చేస్తున్నాయి అనిపిస్తోంది”.
“నిజానికి న్యాయస్థానాలకు, పోలీసులకు మత విలువలున్నాయి. ఆ విలువలు కూడా ఆధిపత్య మతాలకు
చెందినవి. మనకు సామాజిక న్యాయస్థాలు కావాలి.
హైదరాబాద్
24
మార్చి 2015
No comments:
Post a Comment