ముస్లిం
అస్తిత్వవాదానికి అంతర్గత చేటు
ఇంటాబయటా స్కైబాబా అసందర్భ గందరగోళం
- డానీ
ప్రవేశిక
ప్రపంచ పరిణామాల్ని గమనించేవారెవరికయినా సులువుగా అర్ధం అయ్యే విషయం ఏమంటే ఇప్పుడు అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్న ప్రజాసమూహాలు ముస్లింలు, ఆదివాసులు అని. ఒకరికాళ్ల కింద చమురువుంది, మరొకరి పరిసరాల్లో ఖనిజాలున్నాయి. ప్రపంచ మార్కెట్ అధిపతులకు ఇవి రెండూ కావాలి. వాటిని దక్కించుకోవాలంటే ముస్లింలు, ఆదివాసుల్ని వాళ్ల స్థానాల నుండి తొలగించాలి. వాళ్ళను నిర్వాశితుల్ని చేయాలి. అలా చేయాలంటే చంపదలిచిన కుక్కను పిచ్చిదని ప్రచారం చేయాలి. ఇప్పుడు ముస్లింలు, ఆదివాసుల గురించి ప్రపంచ మార్కెట్ అధిపతులు జరుపుతున్న ప్రచారం ఇదే. ఈ పరిణామాలన్నింటినీ ఇప్పుడు మనం నిత్యం డిజిటల్ డిస్ ప్లేలో చూస్తూనేవున్నాం. ఇంకా అనుమానం వున్నవాళ్ళు అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో రిపబ్లికన్ పార్టి అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ రెచ్చిపోయి చేస్తున్న ఉపన్యాసాలు విని నిర్ధారణ చేసుకోవచ్చు.
ముస్లింసమాజానికి బాహ్యాత్మక ముప్పు ముంచుకు వస్తున్నదని ప్రపంచం గుర్తించినప్పుడెల్లా రచయిత స్కైబాబా ఒక కొత్త ఆరోపణతో ముందుకు వస్తుంటారు. ముస్లిం సమాజానికి వచ్చిన ముప్పు అంతర్గతమైనది అనేది వారి ఆరోపణల సారాంశం. వర్తమాన భారత ముస్లిం సమాజపు దుస్థితి వాళ్ళ స్వయంకృతాపరాధమనేది వారి అభిప్రాయం.
భారత ముస్లిం సమాజపు వెనుకబాటుతనానికి కారణాలు వాళ్ళు అనుసరిస్తున్న ఆచారాల్లోనే అంతర్గతంగా వున్నాయని తాము రాసినప్పుడు ముస్లిమేతర మిత్రులు కొందరు తమను సంఘసంస్కర్తలుగా పేర్కొని పొగిడేవారు అనే అర్ధం వచ్చేలా కొన్నేళ్ళ క్రితం ఆయనే స్వయంగా ఒక వ్యాసంలో రాసుకున్నారు. బహుశ బయటివాళ్ళ పొగడ్తలు కోరుకున్నప్పుడెల్లా స్కైబాబా ఇలా ‘అంతర్గత ముప్పు’ సిధ్ధాంతాన్ని బయటికి తెస్తుంటారని మనం అర్ధం చేసుకోవచ్చు. ఇటీవల సోషల్ మీడియాలో ఆరు మరోసారి అంతర్గత ముప్పు ఆరోపణలు చేశారు. వాటికి కొనసాగింపుగా ‘చేటు చేసే ముస్లింవాదుల మౌనం’ వ్యాసం రాశారు. (సాక్షి దినపత్రిక, 18 జులై 2016)
అస్థిత్వవాద ఉద్యమాలకు ప్రాణప్రదమైనవి రాజకీయార్ధిక అంశాలు. స్కైబాబా వ్యాసంలో వీటి ప్రస్తావనేలేదు. భారత ముస్లిం సమాజానికి బయటి నుండి ముంచుకు వస్తున్న ఉపద్రవాన్ని వారు తెలివిగా కప్పిపుచ్చేశారు. అంతేకాక, మొత్తం వ్యాసంలో ‘బయటి నుండి’ ‘బాహ్యాత్మక’, వంటి పదాలు సహితం ఎక్కడా కనిపించకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. స్కైబాబా వాదానికీ ముస్లిం అస్థిత్వవాదానికీ సంబంధమేలేదు.
ముస్లిం సామాజిక సముదాయంలో అందరూ ఒకే స్థాయిలో మతాచారాల్ని ఆచరించరు. వాళ్ళల్లో మతాన్ని నిష్టగా పట్టించుకునేవారు, అతిగా పట్టించుకునేవారు, అప్పుడప్పుడు మాత్రమే పట్టించుకునేవారు, అస్సలు పట్టించుకోనివారు మతాతీతంగా వ్యవహరించేవాళ్ళు వుంటారు. అయితే, బయటి నుండి ముప్పు పెరిగినపుడు సహజంగానే మొత్తం భారత ముస్లిం సమాజం అప్రత్తమై ప్రత్యర్ధివర్గాన్ని నిలవరించే పనిలో నిమగ్నమై పోతుంది. నిజానికి అంతా సవ్యంగావున్న కాలంలోకంటే ఆపద ముంచుకొచ్చిన కాలంలోనే ముస్లిం సామాజిక సముదాయంలో సంఘీభావం స్థాయి చాలా ఎక్కువగా వుంటుంది. మతాచారాల్ని ఆచరించనివారు, పట్టించుకోనివారు, మతాతీతంగా వ్యవహరించేవాళు సహితం కష్టకాలంలో దగ్గరయిపోతారు. ఇతర మతసమూహాల్లోని ఉదారవాదులు సహితం కష్టాల్లోవున్న ముస్లిం సామాజిక సముదాయం మీద సానుభూతిని ప్రకటిస్తుంటారు. మతవ్యతిరేకులు కూడా కొందరు వుంటారుగానీ వాళ్ళకూ మత సముదాయపు అస్థిత్వ ఉద్యమానికీ సంబంధం వుండదు.
గత ఏడాది చివర్లో దేశమంతటా చెలరేగిన అసహన వాతావరణాన్ని మనం ఇంకా మరచిపోలేదు. ఆ వాతావరణాన్ని ఎవరు ఏ ప్రయోజనాల్ని ఆశించి సృష్టించారో కూడా మనకు తెలుసు. ఈరోజు సాక్షాత్తు భారత ప్రధాని పది మెట్లు దిగివచ్చి “భారత సమాజాన్ని అన్ని రకాలుగా చీల్చాలనుకుంటున్న కొందరు గోసేవకుల పేరుతో ఘర్షణ వాతావరణాన్ని సృష్టించే దుకాణాలు తెరిచారు” అనాల్సివచ్చిందంటే భారత ముస్లిం సమాజం, దానికి సంఘీభావాన్ని ప్రకటిస్తున్న అనేక ఇతర ప్రజాసమూహాలూ- మరీ ముఖ్యంగా దళితులు- సమిష్టిగా ఏ స్థాయిలో పాలకవర్గాల్ని నిలువరించాయో అర్ధం చేసుకోవచ్చు.
భారత ముస్లిం సమాజం రాజకీయార్ధిక లక్ష్యాల సాధన కోసం బాహ్యాత్మక పోరాటం సాగిస్తున్న సమయంలో స్కైబాబా ధార్మిక, సాంస్కృతిక అంశాలను చర్చకు తెచ్చారు. పైగా అవి అంతర్గత ముప్పు అంటూ ఇంటాబయటా గందరగోళాన్ని సృష్టించారు. బయటి ముప్పును ఎదుర్కోవడానికి స్వీయసమాజం చేస్తున్న ప్రయత్నాలని వారి రచనలు నిస్సందేహంగా దెబ్బ తీస్తాయి.
ఇలాంటి గందరగోళాన్ని తెలియక చేస్తే అజ్ఞానం అవుతుంది. తెలిసిచేస్తే కుట్ర అవుతుంది. ఈ పనుల్ని తెలిసి చేసినా తెలియకచేసినా నష్టపోయేది మాత్రం భారత ముస్లిం సమాజమే. ఇది ముస్లింవాదానికి అంతర్గత చేటు.
(రచయిత సమాజ విశ్లేషకులు )
మొబైల్ : 9010757776
ముస్లిం అస్థిత్వవాదానికి అంతర్గత చేటు -2
ఇంటాబయటా స్కైబాబా అసందర్భ గందరగోళం
ఒక వివరణ
‘చేటు చేసే ముస్లింవాదుల మౌనం’ వ్యాసంలో స్కైబాబా ప్రగతిశీల, స్త్రీ, దళిత, తెలంగాణవాద ఉద్యమాలను ప్రస్తావించి వాటిల్లో వేటిలోనూ లేని వైపరీత్యం ఒక్క ముస్లిం సమాజంలోనే దాపురించిందన్నారు. వారి అభిప్రాయాలతో విభేదించేవారు ఎవరయినా రెండు పనులు చేయాల్సివుంటుంది. మొదటిది, ప్రగతిశీల, అభ్యుదయ వాదాల్ని అధిగమించి ఆధునికానంతర వాదాలు పుట్టుకొచ్చాయని నిరూపించాలి. రెండోది, దళితవాద తెలంగాణవాద తదితర ఉద్యమాల్లో జరిగినవే ముస్లింవాద ఉద్యమాల్లోనూ జరుగుతున్నాయని వివరించాలి. ఆ ప్రకారం ఒక విస్తార వ్యాసం రాసి ప్రతిపాదన వ్యాసాన్ని ప్రచురించిన సాక్షి పత్రిక్కే పంపించాను. దాని మీద వాళ్ళు నిడివి విషయంలోనూ, ఉద్యమాల ప్రస్తావనలు ఉటంకింపుల విషయంలోనూ కొన్ని అభ్యంతరాలు చెప్పారు. ప్రతిపాదనలో అనుమతించిన అంశాల్ని సమాధానంలో అనుమతించకపోవడంలోవున్న విచక్షణని మనం ప్రశ్నించలేం గనుక వాళ్ళ సూచనల మేరకు ‘ముస్లిం అస్థిత్వవాదానికి అంతర్గత చేటు’ పేరుతో ఒక ప్రవేశికను రాసి పంపించాను. అది ఈరోజు సాక్షిలో వస్తుందనుకున్నాను. స్వాతంత్ర దినోత్సవ సంచిక కారణంగా కావచ్చు ఈవారం సాహిత్యపేజీయే లేదు. వచ్చేవారం నా వ్యాసాన్ని ప్రచురిస్తారని అశిస్తాను.
సాక్షికి పంపిన వ్యాసం కాకుండా స్కైబాబా వంటివారు చేస్తున్న వాదనల మీద మరికొన్ని వ్యాసాలు రాయాల్సి వచ్చింది. సాక్షి వ్యాసం అచ్చయ్యాక వాటిని విడుదల చేద్దామనుకున్నాను. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది గనుక మిగిలిన వ్యాసాలను ఈరోజు నుండి సోషల్ మీడియాలో చర్చకు పెడుతున్నాను. సాక్షికి రాసిన వ్యాసానికి ఇవి కొనసాగింపు. ఆ వ్యాసం వీటికీ ఫ్రంట్ రన్నర్ గా, ప్రియాంబుల్ గా వుంటుంది.
ముస్లిం అస్థిత్వవాదానికి అంతర్గత చేటు - 3
ఇంటాబయటా స్కైబాబా అసందర్భ గందరగోళం
సాంకేతిక విశ్లేషణ
స్కైబాబా వ్యాసం ‘చేటు చేసే ముస్లింవాదుల మౌనం’ (సాక్షి దినపత్రిక, 18 జులై 2016) లోని పదమూడు వాక్యాల్లో ధార్మిక, సాహిత్య-సాంస్కృతిక, సామాజిక రంగాలకు చెందిన అంశాలు వరుసగా 7, 4, 2 చొప్పున వున్నాయి. వారి ప్రాధాన్యతా రంగాలను అర్ధం చేసుకోవడానికి ఈ వర్గీకరణ తోడ్పడుతుంది.
భారత ముస్లీం సమాజపు అభ్యున్నతికి సంబంధించి నేను ఎంచుకున్న కార్యక్షేత్రాలు రాజకీయార్ధిక రంగాలు. ముస్లింల ధార్మిక వ్యవహారాలకు సంబంధించి నాకున్న పరిజ్ఞానం చాలా పరిమితమైనది. ప్రధాన స్రవంతి మాధ్యమాల్లో ముస్లిం సమాజం మీద సాగుతున్నదాడుల వల్ల దానివారి రాజకీయార్ధిక ప్రయోజనాలకు భంగం కలుగుతున్నదని భావించినపుడు మాత్రమే అయిష్టంగా అనివార్యంగా ఆ పరిమితి మేరకే అయినా ధార్మిక అంశాల్ని కూడా పట్టించుకోవాల్సి వస్తున్నది.
ముస్లిం అస్థిత్వవాదానికి అంతర్గత చేటు - 4
ఇంటాబయటా స్కైబాబా అసందర్భ గందరగోళం
ఆరోపణలు - ముస్లిం సమాజం మీద
1. అస్తిత్వవాదాలలో ఇతర వాదాలకు ఉన్న వెసులుబాటు ముస్లింవాదానికి లేదు.
2. స్త్రీ, దళిత, తెలంగాణవాదులను వారి మాతృ సమూహాలు ఓన్ చేసుకున్నాయి. కాని ముస్లింవాదులకు ఆ పరిస్థితి లేదు.
3. తెలుగులో రాయడంవల్ల వారి మాతృ సమూహం నుంచి చిన్నచూపుకు గురవుతోంది.
4. అంతర్గత వెనుకబాటుతనాలపై రాయడం వారి మాతృ సమూహం నుంచి చిన్నచూపుకు గురవుతోంది.
5. ముస్లింల జీవితాలను కథలుగా మలచాలంటే, నవలీకరించాలంటే అందులోని అన్ని పార్శ్వాలూ రికార్డు అయ్యే వాతావరణం, వెసులుబాటు ఉండాలి.
6. తమ సమాజంలోని మంచీ చెడూ, విశ్వాసమూ అవిశ్వాసమూ, పాజిటివ్ అంశాలూ నెగెటివ్ అంశాలూ, అన్నీ రాయగలిగే, చర్చించగలిగే వాతావరణం ఉండాలి.
7. నిజానికి ముస్లిం సమాజం ప్రపంచవ్యాప్తంగానే కాదు, ఇండియాలోనే కాదు, అంతర్గతంగానూ పెను ప్రమాదంలో ఉంది.
8. కొన్ని జమాత్ (మత సంస్థలు) ముస్లింలను మరింత మౌఢ్యంలోకి నెడుతున్నాయి.
9. మొత్తంగా ఇండియన్ ఇస్లాం (లోకల్ ఇస్లాం)ను రద్దు చేస్తూ అరబిక్ ఇస్లాంను రుద్దుతున్నారు.
10. ఉదాహరణకు దర్గాల దగ్గరకు వెళ్లడం, పీర్ల పండుగ చేయడం, ఖబ్రస్తాన్లకు వెళ్లడం, ఫాతెహాలివ్వడం చేయకూడదని విశ్వాసుల్లో గందరగోళం సృష్టిస్తున్నారు.
11. చస్తే ఆ శవంపై కాఫిర్ల నీడ పడకూడదనే తీవ్ర వాదనలు మరింత ఇబ్బంది పెడుతున్నాయి.
12. పరలోక జ్ఞానం తప్ప లోకజ్ఞానం లేకుండా చేస్తూ ముస్లిం సామాజిక జీవనానికి గుదిబండ కడుతున్నారు.
13. వీటన్నింటివల్ల నాన్ ముస్లింలకూ, ముస్లింలకూ మధ్య దూరం పెరుగుతోంది.
14. ఈ నిజాలు విప్పి చెబుతూ, సామాజిక విషయాలు పట్టించుకునేలా ఒక ముస్లిం సామాజిక ఉద్యమం రావలసిన అవసరముంది.
ముస్లిం అస్థిత్వవాదానికి అంతర్గత చేటు - 5
ఇంటాబయటా స్కైబాబా అసందర్భ గందరగోళం
ఆరోపణలు - డానీలాంటి వాళ్ళ మీద
15. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ముస్లింవాద పెద్దలు పూనుకొని కొంత సరళం చేసే అవకాశముండింది. కానీ వారెవరూ దీనికి సుముఖంగా లేకపోవడం వైచిత్రి.
16. విశ్వాసులు కానివారు ముస్లింవాదులు ఎలా అవుతారని వాదించడం కొందరికి ఫ్యాషన్గా మారింది.
17. ప్రగతిశీలురుగా మొదలైన సాహిత్యకారులు కొత్తగా మత ఆచారాలను పాటించడం, విశ్వాసులుగా ప్రవర్తిస్తున్నారు.
18. ఇలాంటి వైపరీత్యం ఒక్క ముస్లిం చైతన్యవంతులు, సాహిత్యకారుల్లోనే దాపురించింది.
19. అలాకాకుండా తాము కదలకుండా, తర్వాతి తరాన్ని కదలనివ్వకుండా చెయ్యడం.
డానీ ప్రతిస్పందన
ఆరోపణలు
ఆరోపణలు – ముస్లిం సమాజం మీద
20. అస్తిత్వవాదాలలో ఇతర వాదాలకు ఉన్న వెసులుబాటు ముస్లింవాదానికి లేదు.
21. స్త్రీ, దళిత, తెలంగాణవాదులను వారి మాతృ సమూహాలు ఓన్ చేసుకున్నాయి. కాని ముస్లింవాదులకు ఆ పరిస్థితి లేదు.
22. తెలుగులో రాయడంవల్ల వారి మాతృ సమూహం నుంచి చిన్నచూపుకు గురవుతోంది.
23. అంతర్గత వెనుకబాటుతనాలపై రాయడం వారి మాతృ సమూహం నుంచి చిన్నచూపుకు గురవుతోంది.
24. ముస్లింల జీవితాలను కథలుగా మలచాలంటే, నవలీకరించాలంటే అందులోని అన్ని పార్శ్వాలూ రికార్డు అయ్యే వాతావరణం, వెసులుబాటు ఉండాలి.
25. తమ సమాజంలోని మంచీ చెడూ, విశ్వాసమూ అవిశ్వాసమూ, పాజిటివ్ అంశాలూ నెగెటివ్ అంశాలూ, అన్నీ రాయగలిగే, చర్చించగలిగే వాతావరణం ఉండాలి.
26. నిజానికి ముస్లిం సమాజం ప్రపంచవ్యాప్తంగానే కాదు, ఇండియాలోనే కాదు, అంతర్గతంగానూ పెను ప్రమాదంలో ఉంది.
27. కొన్ని జమాత్ (మత సంస్థలు) ముస్లింలను మరింత మౌఢ్యంలోకి నెడుతున్నాయి.
28. మొత్తంగా ఇండియన్ ఇస్లాం (లోకల్ ఇస్లాం)ను రద్దు చేస్తూ అరబిక్ ఇస్లాంను రుద్దుతున్నారు.
29. ఉదాహరణకు దర్గాల దగ్గరకు వెళ్లడం, పీర్ల పండుగ చేయడం, ఖబ్రస్తాన్లకు వెళ్లడం, ఫాతెహాలివ్వడం చేయకూడదని విశ్వాసుల్లో గందరగోళం సృష్టిస్తున్నారు.
30. చస్తే ఆ శవంపై కాఫిర్ల నీడ పడకూడదనే తీవ్ర వాదనలు మరింత ఇబ్బంది పెడుతున్నాయి.
31. పరలోక జ్ఞానం తప్ప లోకజ్ఞానం లేకుండా చేస్తూ ముస్లిం సామాజిక జీవనానికి గుదిబండ కడుతున్నారు.
32. వీటన్నింటివల్ల నాన్ ముస్లింలకూ, ముస్లింలకూ మధ్య దూరం పెరుగుతోంది.
33. ఈ నిజాలు విప్పి చెబుతూ, సామాజిక విషయాలు పట్టించుకునేలా ఒక ముస్లిం సామాజిక ఉద్యమం రావలసిన అవసరముంది.
ఆరోపణలు – డానీ వంటివారి మీద
34. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ముస్లింవాద పెద్దలు పూనుకొని కొంత సరళం చేసే అవకాశముండింది. కానీ వారెవరూ దీనికి సుముఖంగా లేకపోవడం వైచిత్రి.
35. విశ్వాసులు కానివారు ముస్లింవాదులు ఎలా అవుతారని వాదించడం కొందరికి ఫ్యాషన్గా మారింది.
36. ప్రగతిశీలురుగా మొదలైన సాహిత్యకారులు కొత్తగా మత ఆచారాలను పాటించడం, విశ్వాసులుగా ప్రవర్తిస్తున్నారు.
37. ఇలాంటి వైపరీత్యం ఒక్క ముస్లిం చైతన్యవంతులు, సాహిత్యకారుల్లోనే దాపురించింది.
38. అలాకాకుండా తాము కదలకుండా, తర్వాతి తరాన్ని కదలనివ్వకుండా చెయ్యడం.
డానీ ప్రతిస్పందన
1. ప్రవేశిక
2. ఒక వివరణ
3. సాంకేతిక విశ్లేషణ
4. ఆరోపణలు – ముస్లిం సమాజం మీద
5. ఆరోపణలు – డానీ వంటివారి మీద
6. లోకస్ స్టాండీ – సగం ముసల్మాన్
7. సందర్భం
8. సంవాదం ఆరంభం
9. ముస్లిం అస్థిత్వవాదం
10. ఇస్లాంవాద బాలారిష్టం
11. మేక-పులివాదాలు
12. పిర్యాదివాదం
13. ధార్మికసిధ్ధాంతం – కర్మకాండ
14. స్కైబాబా బ్రాండు హేతువాదం
15. సామ్యవాదం నుండి అస్థిత్వవాదానికి
16. గతించిన నాస్తిక-హేతువాదాలు
17. ముస్లిం సమాజంలో సంస్కరణలు
సంవాదం ఎలా సాగాలి? ఎలా ముగియాలీ? .
Legal Procedure
మిత్రులారా! ముస్లీంవాదంపై సాగుతున్న చర్చలో ఒక లీగల్ విధానాన్ని పాటిస్తునట్టు మీకు ఈపాటికే అర్ధం అయివుంటుంది.
ఈ కేసులో స్కైబాబా complainant / plaintiff నేను respondent / Defendant.
1. ముందు స్కైబాబా Complainant / Plaintiff గా కొన్ని నిర్ధిష్ట ఆరోపణలు చేశారు.
2. ఆ ఆరోపణలు నిరాధారం అని Respondent / Defendantగా నేను వాదిస్తున్నాను; ప్రవేశిక ఒక వ్యాసం సాక్షిలో, కొనసాగింపు సోషల్ మీడియాలో. ఈ క్రమం ఇంకో వారం సాగినా సాగవచ్చు.
3. ఆ తరువాత పిర్యాదులో తాను చేసిన నిర్ధిష్ట ఆరోపణల్ని నిరూపించాల్సిన (Burden of Proof) బాధ్యత Complainant / Plaintiff అయిన స్కైబాబాదీ. వాటిని వారు సాక్షిలోనూ చేయవచ్చు; సోషల్ మీడియాలోనూ చేయవచ్చు.
4. మళ్ళీ అవి నిరాధారం అని వాదించే హక్కు Respondent / Defendant గా నాది. ఆ పనిని నేను వీలునుబట్టి సాక్షిలోగానీ, సోషల్ మీడియాలో గానీ చేస్తాను.
5. అంతటితో వాదిప్రతివాదులు చెరో రెండుసార్లు తమ వాదోపవాద అవకాశాల్ని వాడుకున్నట్టు అవుతుంది. అలా వాదోపవాదాల పర్వం ముగుస్తుంది.
6. ఇక న్యాయమూ ర్తులు తమ తీర్పు చెపుతారు.
7. మన కేసులో నియత న్యాయమూర్తులు లేరు. FB మిత్రులే న్యాయమూర్తులు. వాళ్ళు కూడా ఒక అవగాహనతో Legal Procedure ను అనుసరిస్తారని ఆశిస్తాను. అలా కాకుండా వచ్చే Comments ను మనం ఎలాగూ పట్టించుకోము.
8. స్కైబాబా వద్ద అనేక కొత్త ఆరోపణలు వుండవచ్చు. అవి ఈ కేసు పరిధిలోనికి రావు. వాటి కోసం వారు భవిష్యత్తులో వేరే కేసు పెట్టుకోవచ్చు.
ముస్లిం అస్థిత్వవాదానికి అంతర్గత చేటు - 6
ఇంటాబయటా స్కైబాబా అసందర్భ గందరగోళం
లోకస్ స్టాండీ - సగంముసల్మాన్
సంవాదాన్ని ఆరంభించే ముందు రచయిత లోకస్ స్టాండిని ప్రకటించడం ఒక మంచి సాంప్రదాయం. మహాకవి గాలిబ్ ఒక సందర్భంలో తన మతవిశ్వాసాన్ని వివరిస్తూ “ నేను సగం ముసల్మాన్ ను. మద్యం సేవిస్తాను; పందిమాంసం ముట్టను” అన్నాడు. ఈ వివరణ యధాతథంగా ఈ వ్యాసకర్తకు సరిపోతుంది.
ముస్లిం అస్థిత్వవాదానికి అంతర్గత చేటు - 7
ఇంటాబయటా స్కైబాబా అసందర్భ గందరగోళం
సందర్భం
2007 జూన్ నెలలో ‘ముస్లీం సాహిత్యంలో కోవర్టుల పుట్టుక’ వ్యాసాన్ని రాశాను. ఆ తరువాత గడిచిన తొమ్మిదేళ్ళలో వారితో సంవాదమేతప్ప సంఘర్షణలేదు. పైగా ముస్లీం సమాజపు వేదికల మీదనేగాక, తెలంగాణ ఉద్యమంలోనూ వారితో సత్సంబంధాలనే కొనసాగించాను.
ఆంధ్రజ్యోతి నుండి వారు బయటికి వచ్చినప్పుడు బతకనేర్చినవాళ్ళు యజమాన్యం పక్షం వహించారు. లౌక్యం తెలిసినవాళ్ళు మౌనంగా వుండిపోయారు. నేను ఆ రెండు పనులూ చేయలేదు. ఆంధ్రజ్యోతితో నా అనుబంధాన్ని పక్కన పెట్టి, ఒక విధంగా రిస్క్ కూడా తీసుకుని, కష్టాల్లోవున్న స్కైబాబాకు సంఘీభావాన్ని తెలుపుతూ నా బ్లాగ్ లో పెద్ద వ్యాసమే రాశాను. అది తనకు గొప్ప నైతిక బలాన్ని ఇచ్చిందని వారు స్వయంగా షుక్రియాలు కూడా తెలిపారు.
సాన్నిహిత్యం సాఫీగానే సాగుతున్నదనుకుంటున్న దశలో ఇలా హఠాత్తుగా సోషల్ మీడియాలో వారు నా మీద అసందర్భ అవాస్తవ వ్యాఖ్యలు చేయడంతో దిగ్భ్రాంతికి గురయ్యాను. ఇప్పుడు ఇలా రాయాల్సిన అవసరం ఏమిటో తనను రెచ్చగొట్టిన తక్షణ అంశం ఏమిటో వివరించమంటూ చాలా సంయమనంతో అడిగాను. దానికి వారు వివరాలు చెప్పకుండా వ్యాసం రాశారు. ఇమ్మీడియట్ ప్రోవకేషన్ ఏమిటో ఇప్పటికీ వారు చెప్పనప్పటికీ నాకు నెమ్మది మీద అర్ధం అయింది.
తెలంగాణ ఉద్యమ నాయక సమితిలో స్కైబాబా ముస్లిం సమాజానికి ప్రాతినిధ్యం వహించారు. భవిష్యత్తులో ఏర్పడే తెలంగాణ విషయంపై 2011-12 సంవత్సరాలలో మా మధ్య కొంతకాలం సంవాదం నడిచింది. దాని సారాంశం ఏమంటే :-
నాటి నిజాం వ్యతిరేక పోరాటంలో తొలి అమరుడు బందగీ, చివరి అమరుడు షోయబుల్లా ఖాన్. ఇద్దరూ ముస్లింలే. నాటి కమ్యూనిస్టు పోరాటానికి మేధోసరోవరంలా పనిచేసిన కామ్రేడ్స్ అసోసియేషన్ లోనూ దేవులపల్లి వేంకటేశ్వరరావు వంటి ఒకరిద్దరుతప్ప మిగిలినవాళ్ళందరూ ముస్లింలే. షోయబుల్లా ఖాన్ హత్యను సాకుగా తీసుకునే నిజాం సంస్థానం మీద ఇండియన్ యూనియన్ పోలీస్(సైనిక)చర్య జరిపింది. అయితే, ఆ పోరాటాల నికర ఫలితం ఏమిటీ? పోరాట ఫలాలు ముస్లింలకు దక్కకపోగా, ముస్లింల ఆస్తులు పరాధీనం అయిపోయాయి. పోలీస్ యాక్షన్ సందర్భంగా వేలాది (బహుశ లక్షలాది) మంది ముస్లింలు ధనమానప్రాణాలను కోల్పోయారు. నిజాం సంస్థానాన్ని ఇండియన్ యూనియన్ లో విలీనం చేశాక నిజాం వ్యతిరేక హిందూసామాజికవర్గం మాత్రమేగాక నిజాం అనుకూల హిందూసామాజికవర్గం సహితం లబ్ది పొందింది. మరోవైపు, నిజాం అనుకూల ముస్లింలు మాత్రమేగాక నిజాం వ్యతిరేక ముస్లీంలు సహితం నష్టపోయారు.
భావి తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి సామాజిక దారుణం పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్కైబాబాను హెచ్చరించాను. ముస్లింల సంక్షేమానికి హామీగా ఉద్యమ అగ్రనేతలతో ఒక పెద్దమనుషుల ఒప్పందం చేసుకోవాలని సూచించాను. భవిష్యత్తులో ప్రభుత్వాధినేతలకు గుర్తు చేయడానికి పెద్ద మనుషుల ఒప్పందాలు ఒక ఆధారంగా వుంటాయి. కోస్తా, రాయలసీమల మధ్య, ఆంధ్రా, తెలంగాణల మధ్య అలాంటి పెద్ద మనుషుల ఒప్పందాలు వున్నాయి. ఎన్నో అవకాశాలు వున్నప్పటికీ వారు అలాంటి ప్రయత్నం కొంచెమైనా చేయలేదు. పైగా అలాంటి సూచనలు చేసినందుకు నా ఆంధ్రా ప్రాంతీయతను శంకించారు. ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తానన్న టీఆర్ ఎస్ వాగ్దానంతో సంపూర్ణంగా సంతృప్తి చెందిపోయారు.
తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యి రెండేళ్ళు దాటింది. ముస్లిం సమాజపు ఆర్ధిక పురోగతికి కొత్త రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చేసిందేమీలేదు. మరో వైపు, టీఆర్ ఎస్ నేతలు గుజరాత్ నరమేధం కిరీటధారి నరేంద్ర మోదీతో పొలిటికల్ హనీమూన్ మొదలెట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్ వ్యవహారం అటక ఎక్కిందన్న సంకేతాలు వెలువడ్డాయి.
ఇలాంటి సందర్భంలో స్కైబాబా తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్ ఉద్యమాన్ని మొదలెట్టి వుండాల్సింది. అది వారి మీదున్న నైతిక బాధ్యత. దాని ఆధారంగా తెలంగాణ ముస్లింలకు ఎన్నో మేళ్ళు చేయుంచుకునే అవకాశం దక్కేది. వారు ఆ పనీ చేయలేదు.
వారు చేయాల్సిన పనులు చేయకున్నా ఫరవాలేదు. కానీ, వారు చేయరాని పనులు మూడు చేశారు. మొదటిది, విద్యా, ఉపాధిరంగాల్లో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించమని ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సమయంలో ముస్లిం పిల్లల్ని స్కూళ్ళకు పంపనివ్వడంలేదని ముస్లిం ధార్మిక సంస్థ (జమాత్ )ల మీద విరుచుకుపడ్డారు. రెండోది, తన నైతికబాధ్యతను గుర్తుచేసి నిలదీస్తానని భయపడి నామీద వ్యక్తిత్వహననానికి పాల్పడ్డారు. మూడోది, చర్చను రాజకీయార్ధికాంశాల నుండి ధార్మిక అంశాల మీదికి మళ్ళించారు. స్కైబాబా అతితెలివి ఏమంటే తన తప్పుల్ని ఇతరులు ఎత్తి చూపడానికి ముందే వాళ్ళ మీద నిందలువేసి ఆత్మరక్షణలో పడేయడం. ఇదీ వారి ప్రతిపాదన వ్యాసానికి సందర్భం!. ఇమ్మీడియట్ ప్రోవకేషన్!
ప్రతిపాదన వ్యాసంలో వారు ప్రతిపాదించిన సంస్కరణల జాబితా ఇది : దర్గాలకు వెళ్ళాలి. ఖబ్రస్తాన్లకు వెళ్ళాలి. ఫాతెహాలు చేయాలి. పీర్ల పండుగలు జరపాలి. ఈ నాలుగు హక్కుల మీద అవగాహన కల్పించడానికి సాహిత్యాన్ని సృష్టించాలి. వీటి కోసం ఒక కొత్త మతసంస్థ (జమాత్) ఏర్పాటు చేయాలి.
స్కైబాబా సంస్కరణల లక్ష్యాలు ఇవే అయితే వారు అసలు ఉద్యమం చేయాల్సిన అవసరమేలేదు. వీటిని ఆచరిస్తున్న జమాత్ లు ఇప్పటికే కొన్ని వున్నాయి. వారు వాటిల్లో చేరవచ్చు. కావాలంటే అలాంటి ఇంకో జమాత్ పెట్టుకోవచ్చు. నిజానికి నేను కూడా వీటిని పాటిస్తాను; కాకపోతే కొంచెం భిన్నంగా. ఇది వైవిధ్యమేగానీ వైరుధ్ధ్యం కాదు. భావోద్వేగమేగానీ భావోద్రేకంకాదు. భిన్నాభిప్రాయమేగానీ వ్యతిరేకాభిప్రాయం కాదు. అయితే టీకప్పులో తుఫానులా వారు ఇంత చిన్న అంశాన్ని పట్టుకుని మొత్తం ముస్లిం సమాజాన్ని సంస్కారహీనంగా చిత్రించి అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ బూటకాన్నీ, దాని వెనుక పొంచివున్న ప్రమాదాన్నీ పట్టించుకోవాల్సి వస్తున్నది.
కేవలం స్కైబాబా కోసమేకాక, వారు రాసిన ప్రతిపాదన వ్యాసం కోసమే కాక, ఒక దశాబ్ద కాలంగా వారు రాస్తున్న వ్యాసపరంపరల కోసమేగాక, ముస్లిం సమాజం మీద వారిలా అపవాదులేసే గతకాలపు ఆలోచనాపరులు, వర్తమాన ఆలోచనాపరుల కోసమేగాక భవిష్యత్తులోనూ ఇలాంటి ఆపవాదులేసే ఆలోచనాపరుల కోసమూ ఈ వ్యాస్యాన్ని రాయాల్సివస్తున్నది. నా వ్యాసాన్ని చదివి స్కైబాబాయో వారిలాంటి మరికొందరో రాత్రికి రాత్రి మారిపోతారని నేను అనుకోను.
సాహిత్యానికి సన్నివేశాల ద్వార సమాచారాన్ని చేరవేసే అవకాశం, భావోద్వేగాల ద్వార కొన్ని సూచనలు చేసే సౌలభ్యం మాత్రమే వుంటాయిగానీ వాటిని నిర్బంధంగా అమలు చేయించే ఎన్ ఫోర్సింగ్ అధికారం వుండదు.
అయితే, ముస్లిమేరత సమూహాల్లోనేగాక ముస్లిం సమూహాల్లోనూ తమ సంస్కృతీ సాంప్రదాయాల గురించి, వాటి ఆర్ధిక కోణాల గురించీ అవగాహన లేనివాళ్ళు అనేకులు వుంటారు. వాళ్లకు ఈ వ్యాసం సమాచారంగా అయినా పనికి వస్తుంది. నిజానికి ఈ పనిని ఎప్పుడో చేసి వుండాల్సింది. అయితే స్కైబాబా వంటివారు వర్తమాన తెలంగాణ / ఆంధ్రప్రదేశ్ ముస్లిం సమాజంలో చేపట్ట దలచిన సంస్కరణల జాబితా సేకరణ కోసం కొంతకాలం ఆగాల్సి వచ్చింది. వారిప్పుడు జాబితాను ఇచ్చారు కనుక ఇక స్పందించడం నా వంతు అయింది.
రేపు
స్కైబాబాతో సంవాదం ఆరంభం
ముస్లిం అస్థిత్వవాదానికి అంతర్గత చేటు - 8
ఇంటాబయటా స్కైబాబా అసందర్భ గందరగోళం
సంవాదం ఆరంభం
ఎదైనా ఒక విషయాన్ని సమర్ధంగా తిరస్కరించినా, సమర్ధించినా అవి వాదాలుగా అభివృధ్ధి అవుతాయి. ఒక విషయాన్ని సమర్ధిస్తూ మొదలెట్టి దాన్ని తిరస్కరిస్తూ ముగించినా, ఒక విషయాన్ని తిరస్కరిస్తూ మొదలెట్టి సమర్ధిస్తూ ముగించినా అది వాదంకాదు. వాదం అవ్వదు.
నాస్తిక-హేతువాద దృక్పధాలతో విశ్వాసుల్ని ఎద్దేవ చేస్తూ మొదలైన స్కైబాబా వ్యాసం దర్గాలు, ఖబ్రస్తాన్లకు వెళ్ళే, ఫాతెహాలు చేసే, పీర్ల పండుగలు జరిపే విశ్వాసుల కోసం ఒక కొత్త మతసంస్థ (జమాత్) రావలసిన అవసరాన్ని నొక్కి చెపుతూ ముగిసింది. గణితశాస్త్రంలో ఒకటి నుండి ఒకటి తీసేస్తే వచ్చే విలువే మేధోరంగంలో స్కైబాబా వ్యాసానికి వుంటుంది. ఒకటి నుండి ఒకటి తీసేస్తే వచ్చే విలువ సున్నా అని తెలియనివాళ్ళు కూడా వుంటారని అనుకోలేం. క్రీడారంగంలో దీన్ని సెల్ఫ్ గోల్ అంటారు.
ముస్లిం అస్థిత్వవాదానికి అంతర్గత చేటు - 9
ఇంటాబయటా స్కైబాబా అసందర్భ గందరగోళం
ముస్లిం అస్థిత్వవాదం
అస్థిత్వం అంటే ఆర్ధికం. ఉద్యమం అంటే రాజకీయం. ఆస్థి లేకుండా ఆత్మగౌరవం వుండదు. ఏ అస్థిత్వవాద ఉద్యమమైనాసరే స్వీయసమాజపు ఆర్ధిక స్థితిగతుల్ని మెరుగు పరచుకోవడానికి రాజకీయ చర్యను చేపడుతుంది. తెలంగాణ వుద్యమం ‘నీళ్ళు, నిధులు నియామకాలు’ అనే మూడు ఆర్ధిక లక్ష్యాలను ముందుకు తెచ్చింది. వాటిని సాధించడానికి చేపట్టిన ఉద్యమంలో స్వీయసామాజిక సముదాయాన్ని కదలించడానికి ఆత్మగౌరవ నినాదాన్ని ఇచ్చింది. ఆంధ్రా ప్రాంతపువారి వలసపాలన, ఆధిపత్యం, అణచివేతల కారణంగా తెలంగాణ ప్రజలు రాజకీయార్ధిక రంగాల్లో వెనుకబడిపోయారనే అవగాహన ఈ ఉద్యమానికి పునాది. అంతేతప్ప, తెలంగాణ ప్రజల వెనకబాటుతనానికి వాళ్ళు అంతర్గతంగా అనుసరిస్తున్న సాంస్కృతిక సాంప్రదాయాలే కారణం అని తెలంగాణ ఉద్యమ నాయకులు ఎవరూ అనలేదు. అనకూడదు కూడా. కానీ ముస్లిం సమాజపు వెనకబాటుతనానికి వాళ్ళు అంతర్గతంగా అనుసరిస్తున్న సాంస్కృతిక సాంప్రదాయాలు కారణం అని స్కైబాబా అనగలరు. అస్థిత్వవాద ఉద్యమ నియమాల గురించి వారికి కనీస అవగాహన కూడా లేదు.
భారత ముస్లిం సమాజ విముక్తి సిధ్ధాంతమే ముస్లింవాదం. ఇది ఎంతమాత్రం ధార్మికవాదంకాదు; నూటికి నూటొక్కపాళ్ళు రాజకీయార్ధికవాదం. సహజ వనరుల్లోనూ, సామాజిక వ్యవస్థల్లోనూ ముస్లింలకు న్యాయమైన ప్రాతినిధ్యాన్ని సాధించడమే దీని కర్తవ్యం. దాని కోసం అది పాలకవర్గాలతో తలపడుతుంది. ప్రాణాలొడ్డి పోరాడుతుంది. ముస్లిం సమాజానికి ముస్లింవాదం తాత్విక ఆయుధం అయితే ముస్లింవాదానికి ముస్లిం సమాజం భౌతిక ఆయుధం.
ఇంతకీ ముస్లింలు అంటే ఎవరూ? అనేది ఇక్కడ ప్రాణప్రదమైన అంశం. ఇస్లాం అనేది ఒక మతం. దాన్ని ఆచరించేవాళ్ళు ముస్లింలు. ఇస్లాం అనేది ధార్మిక ప్రత్యయం. ముస్లిం అనేది సామాజిక ప్రత్యయం. ఇవి రెండూ అవిభాజ్యాలు. ఇస్లాంమతరహిత ముస్లింలు,. క్రైస్తవమతరహిత క్రైస్తవులూ, హిందూమతరహిత హిందూమతస్తులు వుండరు. అయితే, సమాజంలో మతవ్యతిరేక సమూహాలు కూడా కొన్ని వుంటాయి. వాళ్ళు నాస్తికులు, హేతువాదులు తదితర పేర్లతో కొనసాగుతుంటారు. వాళ్ళు మత సమూహాలకు బయట వుంటారు లేదా ఇంకో కొత్త మతంగా ఏర్పడుతారు.
బాబ్రీ మసీద్ కూల్చివేత నేపథ్యంలో ముస్లిం పదాన్ని తద్వార ముస్లింవాదాన్నీ నిర్వచించాల్సిన అవసరం ముస్లిం ఆలోచనాపరుల ముందుకు వచ్చింది. అప్పట్లో అనేక సభల్లో నేను నా పధ్దతిలో ముస్లిం పదాన్నీ, ముస్లింవాదాన్నీ నిర్వచించాను. నా నిర్వచనం ప్రస్తావన 1994 (?) నాటి ‘అలావా’ కవితాసంకలనం ముందుమాటలో వుంది.
ముస్లింవాదం అనే పదప్రయోగాన్ని ముందుగా ఎవరు వాడారూ? అన్నది ఇప్పుడు చర్చకాదు. ముస్లింవాద నిర్వచనమే ఇక్కడ ప్రధాన అంశం. ఈ పదాన్ని నేనే ముందుగా వాడాను అనిగానీ, ఈ అవగాహనను నేనే ముందుగా నిర్వచించాననిగానీ నేను అనుకోవడంలేదు. ఆ రకమైన పోటీకి నేను దూరం. ఇలాంటి విషయాలని సాహిత్య పరిశోధకులో సమాజశాస్త్ర పరిశోధకులో తేలుస్తారు. ఆ బాధ్యతను నేను తీసుకోదలచలేదు.
“ముస్లిం సమూహాన్ని ముస్లింలు అని వ్యవహరిస్తున్నాం” అంటూ స్కైబాబా ఒక నిర్వచనం ఇచ్చారు. (పిడివాదాలు, ముడివాదాలు వద్దు, ముస్లిం సాహిత్యంపై చర్చ-2 వార్త దినపత్రిక, 18-11-2007). ఇంతటి అపహాస్యపు నిర్వచనాన్ని స్కైబాబా మాత్రమే చేయగలరు. ఒక పదాన్నో, ఒక కాన్సెప్ట్ నో నిర్వచిస్తున్నపుడు ఆ పదాన్ని వాడడం నిషిధ్ధమనే కనీసపు నియమం కూడా వారికి తెలీదు. ముస్లిం పదాన్నే నిర్వచించడం చేతకానివాళ్ళు ముస్లింవాదాన్ని ముందుకు తీసుకుపోతున్నామంటూ గొప్పలు చెప్పుకోవడంకన్నా హాస్యాస్పదమైనది మరొకటి వుండదు.
వారు అంతటితో ఆగలేదు. నా నిర్వచనాన్ని మతపరిభాషగా పేర్కొన్నారు. అప్పుడు ఆయన మతప్రస్తావన లేకుండానే ముస్లింలను నిర్వచించి వుండాల్సింది. వారు ఆపనిని గత రెండు దశాబ్దాల్లో చేయలేదు; ఇకముందూ చేయలేరు. మత అల్పసంఖ్యాక (మైనారిటీ) వాదం అనాలన్నా, ముస్లీంవాదం అనాలన్నా మతప్రస్తావన తప్పదు. దాన్ని వ్యతిరేకించాల్సిన పనీ లేదు.
“ముస్లింలు అంటే ఇస్లాంను అనుసరించేవాళ్ళు. అయితే, ముస్లింవాద కార్యక్షేత్రం ధార్మికరంగంకాదు. సామాజిక, రాజకీయార్ధిక రంగాల్లో మాత్రమే అది పనిచేస్తుంది” అని ప్రకటించి ఎవరయినా ఈ సమస్యను చాలా సులువుగా పరిష్కారం చేసుకోవచ్చు. అలాంటి పరిష్కారాలకు స్కైబాబా సిధ్ధంగాలేరు. నిర్వచనం దగ్గర వారు ధార్మిక కోణాన్ని నిరాకరిస్తారుకానీ మొత్తం కార్యాచరణను ధార్మిక రంగం మీదే కేంద్రీకరిస్తారు. తాత్వికరంగంలో వారిది కుప్పిగంతుల వ్యవహారం.
ముస్లిం అస్థిత్వవాదానికి అంతర్గత చేటు - 10
ఇంటాబయటా స్కైబాబా అసందర్భ గందరగోళం
ఇస్లాంవాద బాలారిష్టం
స్కైబాబా వంటివారికి పోటీగా అన్నట్టు అప్పట్లో కరీముల్లావంటి కొందరు కవులు ఇస్లాంవాదం అంటూ కొంత హడావిడి చేశారు. ఇదొక అతివాద బాలారిష్టం. తప్పుకు తప్పు ఎప్పుడూ ఒప్పు అవ్వదు. స్కైబాబాది మితవాదం అయితే కరీముల్లాది అతివాదం. రెండు వాదాలూ భారత ముస్లిం సమాజానికి చేటు చేస్తాయి. తరువాతి కాలంలో కరీముల్లా కూడా తన తప్పుని సరిదిద్దుకుని ఇస్లాంవాదం అనే ప్రయోగాన్ని ఉపసంహరించుకున్నారుకనుక ఆ ఘట్టం ముగిసింది అనుకోవచ్చు. ఇప్పుడు వారు ప్రగతిశీల ముస్లీం సాహిత్యోద్యమాన్ని నిర్వహిస్తున్నారు.
ముస్లింవాదం పోరాడేది ఇతర ప్రజాసమూహాల ధార్మిక విశ్వాసాలతో కానేకాదు. మతం నెపంతో రాజకీయార్ధిక రంగాల్లో ముస్లిం సమాజాన్ని అణిచివేస్తున్న శక్తులతో మాత్రమే ముస్లింవాదం పోరాడుతుంది. భక్తులు, విశ్వాసులు ఏ మతసమూహానికి చెందినవారైనాసరే వారితో ముస్లింవాదానికి ఏ స్థాయిలోనూ వివాదంలేదు. భక్తులు, విశ్వాసులు సున్నిత మనస్కులు, అమాయకులు. వాళ్ళల్లో అత్యధికులు నిస్సహాయులు. ఇతర మతస్తుల విశ్వాస చిహ్నాలను మనం కూడా గౌరవించాలి. మతం, మతవిశ్వాసాలు వేరు; మతవాదం మతతత్త్వంవేరని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మతం ధార్మికం; మతతత్త్వం రాజకీయార్ధికం. మనం తలపడేది మతతత్త్వంతోనే.
నా వ్యాస పరంపర మరో వారం రోజ్లు సాగుతుంది.
రేపు
మేక-పులివాదాలు
ముస్లిం అస్థిత్వవాదానికి అంతర్గత చేటు - 11
ఇంటాబయటా స్కైబాబా అసందర్భ గందరగోళం
మేక-పులివాదాలు
అడవుల్లో పులులు, మేకల గుంపులు సహజీవనం చేస్తుంటాయి. వాటి మధ్యవైరమూ కొనసాగుతూ వుంటుంది. మేకల్ని తినేసే అవకాశం పులులకు సహజంగా వున్నట్టు,పులుల్ని తినేసే అవకాశం మేకలకు సాధారణంగా వుండదు.
కాళ్ళకు గోళ్ళు, దవడలకు కోరలు, తినడానికి మాంసం లేక బక్కచిక్కిన జీవాలు కూడాపులుల గుంపులో కొన్ని వుంటాయి. అంతమాత్రాన పులుల గుంపు అడవి మీద అధికారాన్ని కోల్పోదు. అలాగే బాగా బలిసిన జీవాలు కూడా మేకలగుంపులో కొన్ని వుంటాయి. అంతమాత్రాన మేకలగుంపుకు అడవి మీద అధికారం దక్కదు.
పులులే అధికారంలో వుంటాయికనుక పులులదే అడవి అనే అభిప్రాయమే బలంగా ప్రచారంలో వుంటుంది. తమను తినే పులులు బతుకుతున్నాయన్న మేకల ఆక్రందనలు పులుల గాండ్రింపుల మధ్య బయటికి వినిపించవు.
తాము మేకల్ని తినడం ప్రకృతి ధర్మం అని పులుల గుంపు అంటుంది. ఇది పులులవాదం. పులుల నుండి తమకు రక్షణ కావాలని మేకల గుంపు అంటుంది. అది మేకలవాదం. పులులది దాడివాదం. మేకలది ఆత్మరక్షణవాదం.
మేకల మీద దాడిచేసి తింటున్నపుడు పులులు మౌనంగా వుంటాయి. మేకలు మాత్రం ప్రాణ భయంతో గావు కేకలు పెడుతుంటాయి. ఇది పులుల గుంపుకు శబ్దకాలుష్యంలా వుంటుంది. జపాన్ తరహాలో మేకలు శబ్దం లేకుండా నిరసన తెలపాలని పులులు ఆదేశిస్తుంటాయి.
పులులు ప్రజాస్వామ్యబధ్ధంగా అడవిలో ఎన్నికలు కూడా నిర్వహిస్తుంటాయి. మేకలకు కూడా ఎన్నికల్లో పోటే చేసే స్వేఛ్ఛ ఇస్తాయి. అయితే మేకవాదం చేసే మేకలు ఎన్నికల్లో ఓడిపోతుంటాయి. పులివాదం చేసే పులులు గెలుస్తుంటాయి. వాటితోపాటూ పులివాదం చేసే కొన్ని మేకలు కూడా గెలుస్తుంటాయి. అలా గెలిచిన మేకలు వీలున్నప్పుడెల్లా పులుల ఔదార్యం గురించి మాట్లాడుతుంటాయి.
అడవిలో అధికార మాధ్యమాలన్నీ పులుల చేతుల్లోనే వుంటాయి. మేకలు కూడా తమ లాగ ప్రశాంతంగా జీవించాలని ఆ మాధ్యమాల్లో మేధోపులులు హితోక్తులు పలుకుతుంటాయి. పులి మీసాలు ఎంతో గంభీరంగా వుంటాయనీ మేకల గడ్డాలు పరమ చికాకుగా వుంటాయని అవి ఒకేసారి ఆత్మస్తుతి పరనింద చేస్తుంటాయి.
కొన్ని పులులు ఇంకో అడుగు ముందుకేసి మేకలకు కొత్తగా కొమ్ములు పుట్టుకొస్తున్నాయనీ ఆందోళన వ్యక్తం చేస్తుంటాయి. కొత్తగా వచ్చిన కొమ్ములతో మేకలు తమ మీద దాడులు చేస్తున్నాయని సోషల్ మీడియాలో వింత ఆరోపణలు చేస్తుంటాయి. పులులే పెట్టుకున్న రక్షణ వ్యవస్థ మేకలకు శాంతివచనాలు వల్లిస్తూ, పులులకు భద్రత కల్పిస్తూ వుంటుంది. మేకలు పళ్ళు కొరుకుతున్నాయనో, గిట్టల్ని పదును పెడుతున్నాయనో మేకల గుంపుల మీద పులులు తరచూ తనీఖీలు జరుపుతుంటాయి. కార్డన్ అండ్ సెర్చ్!
పులుల గుంపులోనూ సమవర్తి పులులుంటాయి. అవి పులుల్ని మేకల్ని సమానంగా చూస్తాయి. పులులు మేకల మధ్య పోటీల్ని కామన్ కండీషన్లతో నిర్వహించాలంటాయి. పోటీలో పాల్గొనే పులులకు కొమ్ములు లేనపుడు మేకలకు కూడా కొమ్ములు వుండకూడదంటాయి. మేకల కొమ్ముల్ని విరిచేసినపుడే సమన్యాయం సాధ్యం అవుతుంది అంటాయి. రెండు గుంపులకు సమన్యాయం ఇచ్చినా, వాటితో సమదూరం పాటించినా కొన్నాళ్ళకు అడవిలో మేకలుఅంతరించిపోయి పులులు మాత్రమే మిగులుతాయనీ ఈ సమవర్తి పులులకు కూడా తెలుసు. పోటీలో మేకలు ఓడిపోతున్నాయంటే మేకవాదం ఓడిపోయినట్టేనని ఇవి తీర్పులు చెపుతుంటాయి.
అటవీ సంపదను, అధికారాన్నీ పులులు మేకలకు సమానంగా కాకపోయినా జనాభా దామాషా ప్రకారం అయినా పంచుదామన్న ప్రతిపాదన ముందుకు రాగానే ఈ సమవర్తి పులులు పారిపోయిరాతియుగపు గుహల్లో దాక్కుంటాయి. పులులు నిజంగానే తినేయాలనుకుంటే అడవిలో ఒక్క మేక అయినా మిగులుద్దా? అని ఆ గుహల్లో నిలబడి హూంకరిస్తాయి. అడవిలో ఇంకా మేకలు బతికి గడ్డి మేయగలుగుతున్నాయంటే అది పులుల దయాగుణం వల్లనే అంటూ దర్పం ఒలకబోస్తాయి.
అడవిలోని న్యాయస్థానాల్లో పులులే న్యాయమూర్తులుగా వుంటాయి. అవి చాలా ధర్మబధ్ధంగా పులి న్యాయాన్ని ఆచరిస్తుంటాయి. మేక నిందుతుల్ని కఠినాతికఠినంగా శిక్షీస్తూ, పులి నిందితుల్ని ఉదరాతిఉదారంగా నిర్దోషులంటూ వదిలేస్తూ వుంటాయి.
పులుల గుంపులో దయాగుణంగల పులులు, ఉదారవాద పులులు కూడా వుంటాయి. పులివాదంతో విభేధించే పులుల్ని అసమ్మతి పులులంటారు. ఇవి పులివాదాన్ని ఖండిస్తాయి. వీటిల్లో కొన్ని పులులు మేకలపక్షం వహిస్తాయి. మేకల కోసం సాటి పులులతో నిజాయితీగా పోరాడుతాయి. ఆ పోరాటంలో కొన్ని సందర్భాల్లో ప్రాణాల్ని సహితం కోల్పోతాయి. అవి పుణ్యపులులు. అలాంటి పులుల్ని మేకలు కూడా సదా స్మరిస్తూ వుంటాయి.
మేకలగుంపులోనూ అతివాద మేకలు, మితవాద మేకలు, మేకవాదంతో విభేధించే మేకలు కొన్ని వుంటాయి. అయితే, పులివాదంతో విభేధీంచే పులుల్ని అసమ్మతిపులులు అన్నట్టు, మేకవాదంతో విభేదించే మేకల్ని అసమ్మతిమేకలు అనరు; మేకద్రోహులు అంటారు. ఎందుకంటే పులులది పీడకజాతి; మేకలది పీడిత జాతి. మానవ సమాజంలో అయినా జంతు ప్రపంచంలో అయినా ఏది పీడక జాతి, ఏది పీడిత జాతీ అనేది తేల్చుకోవడమే ముఖ్యం.
పుణ్య పులుల కోసం మేకలు స్మారక స్తూపాలు కడుతాయి. కొంత కాలానికి పులులు కూడా అక్కడికి వచ్చి అమరవీర పులులకు నివాళులు అర్పించడం మొదలు పెడతాయి. పుణ్య పులుల కీర్తిని తమ ఖాతాలో వేసుకుంటాయి. అసమ్మతి మేకలకు మేకలు గుంపు ఎలాగూ స్మారక స్తూపాలు కట్టదు. పులులు కూడా అసమ్మతి మేకల్ని ఎన్నడూ తలుచుకోవు. పాపం అసమ్మతి మేకల ప్రభుసేవ అలా ఎవరికీ చెందక కాలగర్భంలో కలిసిపోతుంది.
ముస్లిం అస్థిత్వవాదానికి అంతర్గత చేటు - 12
ఇంటాబయటా స్కైబాబా అసందర్భ గందరగోళం
పిర్యాదివాదం
స్కైబాబాకు దృగ్విషయాల మీద సైధ్ధాంతిక అవగాహనలేదు. సమాజశాస్త్రంలో ఒక సిధ్ధాంత వ్యాసం రాసే స్తోమత వారికి ఎన్నడూ లేదు. ప్రాధమిక అనుభవాల డేటా (ముడిసమాచారం)ను పిర్యాదుల రూపంలో ఏకరువు పెట్టగలరుగానీ వాటి నుండి ఒక సూత్రీకరణ చేయడం అనేది వారి శక్తికి మించిన పని. ఎంతగా జూమ్ చేసి చూసినా కూడా సిధాంత స్థాయిగల వాక్యం ఒక్కటి కూడా వారి రచనల్లో కనిపించదు. అయన పిర్యాదివాది. ఇతరుల్లో తప్పుల్ని వెతకడంతప్ప పిర్యాదివాదులకు స్వంతవాదన వుండదు. వాళ్ళు తరచుగా తమ తప్పుల్నే ఇతరుల తప్పులుగా చిత్రీకరించడానికి తంటాలు పడుతుంటారు.
సిధ్ధాంత వ్యాసాలు అనుకుని స్కైబాబా చేసే రచనలు అర్ధనిరక్షరాశ్యులు పోలీసు స్టేషన్లలో రాసి ఇచ్చే పిర్యాదుల్ని తలపిస్తాయి. ఒక చారిత్రక సందర్భంలో ఒక సవాలుగా తీసుకుని, శక్తులన్నీ ధారబోసి రాసినప్పటికీ డొల్లతనాన్ని పోగొట్టుకోని ఈ వ్యాసమే దానికి సజీవ సాక్ష్యం. ఈ పదమూడు వాక్యాల చిన్న వ్యాసంలోనే ఇన్ని పరస్పర విరుధ్ధమైన అంశాలు రాసి, కుప్పిగంతులు వేస్తే దాన్ని మేధోదారిద్ర్యం అనికాక మరేమంటారూ?
ముస్లిం అస్థిత్వవాదానికి అంతర్గత చేటు - 13
ఇంటాబయటా స్కైబాబా అసందర్భ గందరగోళం
ధార్మికసిధ్ధాంతం – కర్మకాండ
ముస్లిం సమాజంలోని జమాత్ ల గురించి తెలియని వారికి ఛాందసవాదం మీద స్కైబాబా భీకర పోరాటం చేస్తున్నారనే అభిప్రాయం కలగవచ్చు. బయటి సమాజాల్లో అలాంటి అభిప్రాయాన్ని కలిగించడానికి వారు శతవిధాలా తంటాలు పడుతుంటారు.
మతసమూహాలు అన్నింటిలోనూ ధార్మికసిధ్ధాంతం (డాక్ట్రిన్ ) – కర్మకాండ (రిచువల్స్) అనే రెండు దొంతరలు వుంటాయి. ఇస్లాం అనేది ఏకేశ్వరోపాసన మతం కనుక ముస్లిం సమాజంలో ధార్మిక సిధ్ధాంతం మేరకు పెద్దగా వైవిధ్యం లేదు.
అయితే, ప్రతిదేశంలోనూ, ఆయా దేశాల్లోని ప్రతి ప్రాంతంలోనూ విశ్వాసులు స్థానికంగా పాటించే కర్మకాండల విషయంలో ముస్లింసమాజంలో అపార వైవిధ్యం వుంటుంది. వీటి ఆధారంగా అనేక జమాత్ లు పుట్టుకొస్తుంటాయి. జమాత్ లను మతసంస్థలు అనలేంగానీ మతఉపశాఖలు అనవచ్చు. కొద్దిపాటి వైవిధ్యంతో ప్రతి జమాత్ కొన్ని ప్రత్యేకమయిన కర్మకాండల్ని పాటిస్తూ వుంటుంది. ఇలాంటి మతఉపశాఖలు (డినామినేషన్స్) ఇతర మతసమూహాల్లోనూ వుంటాయి.
ముస్లిం సమాజంలో ప్రస్తుతం అసంఖ్యాక జమాతులు వున్నాయి. వాటిమధ్య తరచూ కర్మకాండల విషయంలో వాదోపవాదాలు జరుగుతూనే వుంటాయి. వీటిల్లో అతివాదాలు, మితవాదాలు, మధ్యేవాదాలు, ఉదారవాదాలు, ఆచరణాత్మకవాదాలు వగయిరాలన్నీ వుంటాయి. ఇవి సూక్ష్మ అంశాల నుండి సంక్లిష్టమైన అంశాల వరకు ముస్లింలు అనుసరించాల్సిన విధానాల్ని చర్చిస్తుంటాయి.
అయితే, ఇటీవలి కాలంలో జమాతుల మధ్య వివాదాలు చాలా వరకు తగ్గిపోయాయి. స్థానిక కర్మకాండల మంచిచెడుల గురించి చర్చించడం కూడా తగ్గిపోయింది. కర్మకాండల వ్యవహారాన్ని స్థానిక విశ్వాసుల ఇష్టాఇష్టాలకు వదిలివేయడమే మంచిదని జమాతులు భావిస్తున్నాయి. వీటిలో, దర్గాలు, ఖబ్రస్తాన్లకు వెళ్ళేవారు, ఫాతెహాలు ఇచ్చేవారు, పీర్ల పండుగ చేసేవారు సభ్యులుగా వుండే జమాత్ లు కూడా వున్నాయి. అవన్నీ ముస్లిం సమాజంలో సమాన భాగస్వాములే.
ముస్లిం
అస్థిత్వవాదానికి అంతర్గత చేటు - 14
ఇంటాబయటా స్కైబాబా అసందర్భ గందరగోళం
స్కైబాబా బ్రాండు హేతువాదం
స్కైబాబా హఠాత్తుగా నాస్తిక, హేతువాద అవతారం
ఎత్తి తనను విమర్శించేవాళ్ళు “మత ఆచారాలను పాటిస్తున్నారనీ, విశ్వాసులుగా ప్రవర్తిస్తున్నారనీ” ఆరోపిస్తుంటారు. పోనీ అలా నాస్తిక,
హేతువాదిగా అయినా కొనసాగుతారా అంటే అదీలేదు. మరుక్షణంలో తాను ఒక ఆస్థికునిగా
మరిపోయి, విశ్వాసుల్లో కొన్ని జమాత్ లు గందరగోళం సృష్టిస్తున్నాయి అంటూ ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. దర్గాలు,
ఖబ్రస్తాన్లకు వెళ్లరాదంటూ, ఫాతెహాలు
ఇవ్వరాదంటూ, పీర్ల పండుగ చేయరాదంటూ కట్టడి చేస్తున్నాయంటారు. ఈ నిజాల్ని
(బయటివారికి) విప్పిచెపుతూ ఈ తప్పుల్ని
సరిచేయడానికి దర్గాలు, ఖబ్రస్తాన్లకు వెళ్ళేవారితో,
ఫాతెహాలు ఇచ్చేవారితో, పీర్ల పండుగ చేసేవారితో
ఒక ఉద్యమం చేయాల్సిన అవసరం వుందంటారు. అప్పుడది మరో ధార్మిక ఉద్యమం అవుతుందని కూడా
వారికి తెలీదు.
తాను
ప్రవచిస్తున్న ప్రగతిశీల నాస్తిక-హేతువాదాల్ని స్కైబాబా ఏమేరకు పాటిస్తున్నారో తెలుసుకోవడానికి
వారు జంటకవిగా రాసిన ఒక కవితను పరిశీలిద్దాం.
తెలంగాణ
ఉద్యమకాలంలో వచ్చిన ఆ సంచలన కవిత పేరు ‘దెంగెయ్’
(మీరు సరిగ్గానే చదివారు). వారు ఆంధ్రావారిని ఆ భాషలోనే సంభోధించేవారు. “ఇగెట్ల
కలిసుంటంరా / నా బతుకమ్మ నీకు తెల్వకపోయే/ నీ అట్లతద్ది నాకంటకపోయే” అని
ఆరంభమవుతుంది ఆ కవిత (క్విట్ తెలంగాణ కవితా సంకలనం).
తనకు నచ్చినపుడు వారు అలా పరమ భక్తి విశ్వాసాలతో పరవశించిపోతుంటారు.
తనకు నచ్చనపుడు వారు ఇలా పరమ ప్రగతిశీల నాస్థిక-హేతువాదిగా రెచ్చిపోతుంటారు.
విశ్వాసం నుండి అవిశ్వాసానికి
విశ్వాసిగా వుండడం స్కైబాబాకు నచ్చకపోవచ్చు.
“నేను హిందువుగా పుట్టాను. కానీ, హిందువుగా మాత్రం చనిపోను” అని అంబేడ్కర్ ప్రకటించారు. ‘వ్హై ఐ యామ్ నాట్ ఏ క్రీస్టియన్’ అని బెట్రాండ్
రస్సెల్ ఒక పుస్తకం రాశాడు. ‘నేను హిందువు నెట్లైతా?’ అని కంచ ఐలయ్య ఇంకో పుస్తకం రాశారు. ఇబ్న్ వారఖ్
అనే అతను ‘వ్హై ఐ యామ్ నాట్ ఏ ముస్లిం’ అని ఓ పుస్తకం రాశాడు. స్కైబాబా ఆ సాంప్రదాయాల్ని
ఎంచుకోవచ్చు. అది వారి ఇష్టం. గతంలో వారు ‘కాఫిర్’ నంటూ ఒక కవిత కూడా రాసినట్టున్నారు.
ఆదిశగా ప్రయాణించినా అదో ఇది.
ఇస్లాం
గోడలు, తలుపులు లేని బహిరంగ మతం. బయటివారు సహితం ఎవరయినా ఎప్పుడయినా విశ్వసించి లోపలికి
రావచ్చు. లోపలివారు సహితం ఎవరయినా ఎప్పుడయినా
విశ్వాసాన్ని కోల్పోయి బయటికి పోవచ్చు. మోమిన్లు కాఫిర్లుగా మారడం, కాఫిర్లు మోమిన్లుగా
మారడం ఇస్లాంలో నిరంతర ప్రక్రియ. నేటి అవిశ్వాసులే రేపటి విశ్వాసులు అనే విశ్వాసంతో
ముస్లిం సమాజం వుంటుంది. ప్రపంచమంతటా ఇంతటి అననుకూల వాతావరణాన్ని తట్టుకుని ముస్లిం
సమాజం నిలబడుతున్నదంటే దానికి కారణం ఆ విశ్వాసమే.
ముస్లిం అస్థిత్వవాదానికి అంతర్గత చేటు - 15
ఇంటా బయటా స్కైబాబా అసందర్భ గందరగోళం
గతించిన నాస్తిక-హేతువాదాలు
ఇటీవల జరిపిన ప్రయాణాల సందర్భంగా బస్సుల్లో అనివార్యంగా
కొన్ని సినిమాలు చూడాల్సి వచ్చింది. వాటిల్లో ఆత్మలు, దెయ్యాల సినిమాలు కూడా మూడు వున్నాయి.
ఆ సినిమాల లాజిక్కు ప్రకారం ప్రేతాత్మలు భౌతికచర్యలకు పాల్పడలేవు. అంచేత అవి ఎవరో ఒకరి
శరీరంలోనికి ప్రవేశించి భౌతికచర్యలు సాగిస్తుంటాయి. ఇక్కడ ఇంకో వింతవుంది. ప్రేతాత్మలు
ప్రవేశించి కల్లోలం సృష్టిస్తున్నపుడు వాటికి తమ శరీరాన్ని అద్దెకు ఇచ్చినవారికి స్పృహ
వుండదు. ఎక్కడికి పోతున్నారో ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకు తెలీదు.
అలా తపిస్తున్న ఓ హేతువాది ప్రేతాత్మ
స్కైబాబా శరీరంలోనికి ప్రవేశించిందో, లేకపోతే స్కైబాయే శిధిలమైపోయిన హేతువాదాశ్రమాలకు వెళ్ళి ప్రేతాత్మలతో శవజీవనం చేస్తున్నారో
తెలీదుగానీ వారిప్పుడు కొత్తగా నాస్తిక-హేతువాద భాష మాట్లాడుతున్నారు. వారికి తెలియంది ఏమంటే నేను
ఆ శిధిల గురుకులానికి విశ్రాంత కులపతినని. నాలాంటివాళ్ళు తప్పుకున్నాక ఆ గురుకులం ఎలా
దెయ్యాల నివాసంగా మారిందో ఇప్పుడు చూద్దాం.
ప్రతి
దృక్పధానికీ, భావజాలానికీ ఒక సమయం సందర్భం వుంటుంది. ఏ వాదాన్నయినా దాని
మంచిచెడుల్ని గాలిలో అంచనావేయడం తప్పు. దానిని నేల మీదికి దించి సమాజంలో అది
నిర్వహిస్తున్న చారిత్రక పాత్రను విశ్లేషించాలి. ఎందుకంటే ఒక
చారిత్రక దశలో ప్రగతిశీలపాత్ర నిర్వహించిన దృక్పధాలు ఇంకో చారిత్రక దశలో ప్రగతివ్యతిరేక పాత్రను
నిర్వహిస్తాయి.
పారిశ్రామిక
విప్లవం ఊపందుకున్న కాలంలో యూరోప్ అంతటా ప్రగతిశీల నాస్తిక-హేతువాదాలు బలంగా
ముందుకు వచ్చాయి. పారిశ్రామిక ఉత్పత్తుల మార్కెట్ విస్తరణకు మత ఆంక్షలు
అడ్డుపడకుండా ఇవి ఒక చారిత్రక పాత్రను నిర్వహించాయి. అప్పట్లో కొత్త ఆర్ధిక
శక్తిగా ఆవిర్భవిస్తున్న పెట్టుబడీదారీవర్గం ఈ వాదాల్ని అన్ని విధాలా
ప్రోత్సహించింది. అలా నాస్తిక-హేతువాదులు, పెట్టుబడీదారీవర్గం ఒకరినొకరు
సమర్ధించుకుంటూ ముందుకు సాగారు.
పెట్టుబడీదారీ
మార్కెట్ విస్తరించి సామ్రాజ్యవాదంగా బలపడి, ప్రపంచమార్కెట్ ఏకధృవ వ్యవస్థగా
మారిపోయాక దానికి ఇక నాస్తిక-హేతువాదాలతో పనిలేకుండాపోయింది. మరింత వివరంగా
చెప్పాలంటే ప్రస్తుత సామ్రాజ్యవాదశక్తులు
తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి మతాన్నే పెద్ద ఆలంబనగా మార్చుకున్నాయి. సామ్యాజ్యవాదం
ప్రపంచ ప్రజాసమూహాలని పీడిత, పీడక మతాలుగా చీల్చివేసి తన ప్రయోజనాల కోసం ఒక మతాన్నో,
కొన్ని మతసమూహాలనో ఆశ్రయిస్తున్నపుడు ప్రపంచంలోని మిగిలిన మతాల్నీ, మతసమూహాలని
పీడిత మతాలుగానూ, వాటిని ఆచరించే జనసమూహాలను పీడిత సామాజికవర్గాలుగానూ గుర్తించాల్సివుంటుంది.
వర్తమాన ప్రపంచంలో అలాంటి పీడిత మతసమూహం
ముస్లింలు.
ఇక ఎవరు
ఎటువైపు వుండాలన్నది వాళ్ళవాళ్ల తాత్విక, ఆర్ధిక దృక్పధాలు, అవసరాలు వగయిరాల మీద
ఆధారపడివుంటాయి. కొందరు పీడకుల పక్షం వహిస్తారు. మరి కొందరు పీడితుల పక్షం
వహిస్తారు. పీడకుల పక్షం వహించేవాళ్ళు చేసే మొదటిపని ఏమంటే పీడితుల
ఆచారవ్యవహారాల్లో తప్పుల్ని వెతకడం.
యాగాలు జరపడం,
పుష్కరాలు నిర్వహించడంమీద సామ్రాజ్యవాదానికి ఏమాత్రం అభ్యంతరం లేదు. దానికి కావలసినవి
రెండే. మార్కెట్ విస్తరణ. దానికి అవసరమైన సైధ్ధాంతిక మద్దతు. యాగాల్లో ఏ బ్రాండు నెయ్యి
వాడారూ? ఏ కంపెనీకి పెండాల్స్ ఆర్డర్లు ఇచ్చారు?
పుష్కరాల ఏర్పాట్లలో ఏఏ నిర్మాణ సంస్థలకు కాంట్రాక్టులు
ఇచ్చారూ? వాళ్ళు ఏఏ బ్రాండ్ల యంత్రాలను వాడారూ? ఇలాంటివి సామ్రాజ్యవాదానికి ముఖ్యం.
ఇస్లాంను కూడా
సామ్రాజ్యవాద శిబిరంలోనికి తేవడానికి కొన్ని ప్రయత్నాలు జరిగాయి. హైదరాబాద్ లో రంజాన్
నెలలో హలీమ్ తో పాటూ సాఫ్ట్ డ్రింక్స్ ఉచితంగా ఇవ్వడం మొదలెట్టారు. అయితే సామ్రాజ్యావాదానికి ఇస్లాంతో సైధ్ధాంతిక విబేధాలున్నాయి.
సామ్రాజ్యవాదం ఫైనాన్స్ పెట్టుబడి మీద బతుకుతుంది. ఇస్లాం వడ్డీ వ్యాఒపారం మీద ధార్మిక
పోరాటం చేస్తుంది. ఇది గద్దా
పిచ్చుకల పోరు!
భారత
దేశంలోనూ 19వ శతాబ్దం చివర్లో 20వ శతాబ్దం ఆరంభంలో పారిశ్రామిక ప్రగతి ఆరంభమయింది.
వ్యవసాయం ద్వార బలపడి వాణిజ్య పారిశ్రామిక రంగాల్లో ప్రవేశించిన కొన్ని శూద్రవర్ణ
సామాజికవర్గాలు ప్రగతిశీల నాస్తిక-హేతువాదాల్ని ప్రోత్సహించి
సాంస్కృతికరంగంలో గొప్ప ఆమోదాంశాన్ని సాధించాయి.
ఆ క్రమంలో నాస్తిక కేంద్రాల్నీ,
శూతాశ్రమాల్నీ నెలకొల్పాయి. మూడు ప్రాంతాల నుండి మూడు ప్రధాన ఆధిపత్య
సామాజికవర్గాలకు చెందిన కట్టమంచి రామలింగా రెడ్డి, త్రిపురనేని రామస్వామి చౌదరి,
తాపి ధర్మారావు వంటివారు ఈ చారిత్రక కర్తవ్యాన్ని సమర్ధంగా నిర్వర్తించారు.
సాంధ్రీభూత
ఆర్ధిక వ్యక్తీకరణే రాజకీయాలు గనుక, రాజకీయరంగంలోనూ శూద్రవర్ణ సామాజికవర్గాల
ముందడుగు అంతే వేగంగా కొనసాగింది. కాంగ్రెస్ తో మొదలై, కమ్యూనిస్టు, జస్టీస్, స్వతంత్ర, జనతా, లోక్ దళ్, తెలుగు
దేశం పార్టీల వరకు ఈ ప్రయాణం సాగింది.
ప్రగతిశీలురు,
అభ్యుదయవాదులు, అభివృధ్ధికాముకులు, హేతువాదులు, నాస్తికులు, సూతాశ్రమవాదులు,
హ్యూమనిస్టులు, సామ్యవాదులు, తదితరులు అభివృధ్ధిచేసిన ఇరవయ్యవ
శతాబ్దపు భావస్రవంతి మొత్తం కులమతాలకు అతీతంగా సాగింది. జాతికులమతతెగలను ప్రస్తావించడం తిరోగమనవాదమని వాళ్ళు గట్టిగా నమ్మి ప్రచారం చేశారు.
యంత్రాల అభివృధ్ధి, పారిశ్రామిక పురోగతి సమాజంలోని
సమస్త సమూహాలకూ సౌభాగ్యాన్ని తెచ్చి, కులమతాలు
లేని ఒక ఆదర్శ ప్రపంచాన్ని సృష్టిస్తుందనీ ఆ కాలపు ఆలోచనాపరులు
గట్టిగా నమ్మేరు. అంబేడ్కరిస్టులు దీనికి మినహాయింపు కావచ్చు. వాళ్ళకు ఇలాంటి భ్రమలు ఎప్పుడూ లేవు.
ఈ ఆశ నిరాశేనని 1970వ దశకం ఆరంభానికి ముందే తేలిపోయింది. స్థితిమంతులు మరింత ఆస్థిని
పోగేసుకోగా, సామాన్యులు వున్న కొద్దిపాటి ఆస్థిని పోగొట్టుకున్నారు. ప్రాజెక్టుల కోసం
కన్నకలలు సహితం చితికిపోయాయి. ప్రాజెక్టులు బలహీనవర్గాలని నిర్వాశితులుగా మారుస్తాయని
స్పష్టమైపోయింది. అభివృధ్ధి మంత్రం స్థితిమంతుల్ని
కుబేరుల్ని చేసి సామాన్యప్రజల మీద ఒలికిడు ప్రభావాన్ని (ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్) మాత్రమే మిగులుస్తుందని నిర్ధారణ అయిపోయింది.
ఒకసారి
ఆర్ధిక వ్యవస్థ మీద సంపూర్ణ ఆధిపత్యం దక్కించుకున్న తరువాత పెత్తందారీ సామాజికవర్గాలకు ప్రగతిశీల, నాస్తిక-హేతువాదాలతో
పనిలేకుండాపోయింది. పైగా ఆ సామాజికవర్గాలే అప్పటి వరకు తాము నిరాకరిస్తూ వచ్చిన
కులమతాల్ని పునరుధ్ధరించడమేగాక వాటికి నాయకత్వం వహించడం మొదలెట్టాయి. వాటి ఫలితమే ‘కారంచేడు కండకావరం’.
కారంచేడు
దురంతానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సామాజిక చరిత్రలో గొప్ప ప్రాముఖ్యత
వుంది. అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘానికి ప్రధాన కార్యదర్శిగావున్న కత్తి
పద్మారావు కారంచేడు ఉద్యమ కేంద్రమయిన చీరాలలో దళితమహాసభను ఆరంభించారు. అక్కడితో ఆధునిక,
నాస్తిక-హేతువాద, ప్రగతిశీల, అభ్యుదయ యుగం ముగిసింది. ఆధునిక, ప్రగతిశీల, నాస్థిక-హేతువాదానంతర
యుగం ఆరంభం అయింది. మరోమాటల్లో చెప్పాలంటే అస్థిత్వవాద యుగం ఆరంభమయింది. చుండూరు,
వేంపెంట దాడులు ఈ క్రమాన్ని వేగవంతం చేశాయి.
ఎప్పుడయినా
సరే అనంతర దశ అంటే అంతకు ముందు వున్నది చనిపోయిందని అర్ధం. అది ఒక ఆలోచన
కావచ్చు. ఒక సంస్థ కావచ్చు.
జీవి
చనిపోయాక ఆ శవాలు కుళ్ళడానికీ, కుళ్ళినశవాలు మట్టిలో కలవడానికీ కొంతకాలం పడుతుంది.
దాని అర్ధం ఆ శవాలు బతికి వున్నాయనీకాదు; బతుకుతాయనీకాదు.
దాదాపు ఎనిమిది దశాబ్దాలపాటు కొనసాగిన ప్రగతిశీల నాస్తిక-హేతువాద
స్రవంతులు కారంచేడు, చుండూరు, వేంపెంట సంఘటనలతో తమ ప్రాసంగీకతను కోల్పోయాయి. భారత
సమాజపు అస్థిత్వంగా వుంటున్న కులమతాల్ని ఎక్కువమంది ఆలోచనాపరులు దాదాపు ఒక శతాబ్దంపాటు అంటరానిదిగా భావించిన కారణంగా సమాజంలో అనేక అనర్ధాలు జరిగిపోయాయి. సహజ వనరులు, సమాజ వ్యవస్థల మీద పెత్తందారీకులాలు, మత అధికసంఖ్యాకవర్గాల ఆధిపత్యం విపరీతంగా పెరిగిపోయింది. అణగారిన కులాలు, తెగలు, మత అల్పసంఖ్యాకవర్గాలు అన్ని రంగాలలో తీవ్ర అణిచివేతకు గురయ్యారు. ఊపిరి ఆడని ఆ స్థితినుండి గతకాలపు ఆలోచనా స్రవంతుల్ని ఛేదిస్తూ ఒక చారిత్రక అవసరంగా దళిత, బహుజన, ఆదివాసీ, మత అల్పసంఖ్యాక తదితర అస్థిత్వవాదాలు ఆవిర్భవించాయి. ఇవన్నీ ఆధునికానంతర ఆలోచనా స్రవంతులు.
గత శతాబ్దపు ఆలోచనా స్రవంతులు ఏవైనా సరే
బతికి బట్టకట్టాలంటే దళిత, బహుజన, ఆదివాసీ, మత అల్పసంఖ్యాక, ప్రాంతీయ తదితర అస్థిత్వవాదాల్ని బలపరచకా తప్పదు; అనుసరించకా తప్పదు.
స్కైబాబాకు తెలీని మరో విషయం ఏమంటే ఆధునిక యుగం అంతరించి అస్థిత్వవాద యుగం ఆరంభం
అవుతున్నప్పుడు, పశ్చిమ భావజాలం అస్తమించి తూర్పు భావోద్వేగాలు ఉదయిస్తున్నపుడు నేను చీరాల విజయనగర్ శిబిరంలోనే
వున్నాననీ; ఆ పరిణామాలకు నాయకత్వం వహించినవారిలో ఒకనిగా వున్నాననీ.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మతఅల్పసంఖ్యాకవాదాల పుట్టుకకు మూలాలు కారంచేడు ఉద్యమంలోనే
వున్నాయి. అంతేకాదు ఇటీవల ప్రాచూర్యంలోనికి
వచ్చిన జై భీం-జై మీమ్, నీల్ సలాం – హర్యాలీ సలాం నినాదాలకు పునాది కూడా అక్కడే పడింది.
16. సామ్యవాదం నుండి అస్థిత్వవాదానికి
గతకాలపు ప్రగతిశీలురు అపటివరకు తాము అల్పమైన
విషయాలుగా చూసిన కుల, మత, తెగ, భాష, ప్రాంతం, లింగం తదితర అస్థిత్వాలని కొత్త యుగంలో
మహత్తర విషయాలుగా భావించి స్వంతం చేసుకోవడం
కొత్తదీకాదు, విడ్డూరమైనదీకాదు. పైగా చారిత్రకంగా అవసరమైనది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కుల మత తెగ ప్రాంత లింగ తదితర అస్థిత్వవాద సంఘాల్ని నెలకొల్పిన
వాళ్ళందరూ గతంలో ప్రగతిశీలురే. మరీ నిర్ధిష్టంగా చెప్పాలంటే విప్లవ కమ్యూనిస్ఠులే.
బొజ్జాతారకం, గద్దర్, మంద కృష్ణ, రసమయి బాలకిషన్, వై కోటేశ్వరరావు, ఊ సాంబశివరావు,
బీయస్ రాములు, డాక్టర్ యంయఫ్ గోపీనాథ్, అల్లం నారాయణ, ఈటెల రాజేందర్, సంధ్య, రత్నమాల,
విమల ... ఇలా ఎన్ని పేర్లు రాసినా ఈ జాబితా
పూర్తికాదు. తెలుగు-తెలంగాణ రాష్ట్రాల్లో అస్థిత్వవాద ఉద్యమాలకు నాయకత్వం వహించినవారిలో
పూర్వ కమ్యూనిస్టులు కానివారు ఎవరయినా వున్నారా? అని తిరగేసి అడిగితే సమాధానం దాదాపు
లేరనే వస్తుంది.
అసలు తెలుగు – తెలంగాణ రాష్ట్రాల్లో తొలి అస్థిత్వవాద సంస్థాగా పేరున్న దళితమహాసభ
ప్రారంభంలోనే ఈ భావమార్పిడి వుంది. ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘానికి
ప్రధాన కార్యదర్శి. వుండి ఒక కులసంఘాన్ని పెట్టినందుకు కత్తి పద్మారావును ఆయన మాతృసంస్థవారు
బహిష్కరించారు. ఇలా సర్వేసర్వత్రా జరుగుతున్నదానిని
గమనించక “ప్రగతిశీలురు విశ్వాసులుగా ప్రవర్తించడం”
ఒక్క ముస్లిం సమాజంలోనే దాపురించింది అనడం స్కైబాబా అజ్ఞానమైనా అయ్యుండాలి, అంధకారమైనా అయ్యుండాలి.
విశ్వాసులు ప్రగతిశీలురుకారనిగానీ, ప్రగతిశీలురకు
విశ్వాసాలు వుండకూడదనిగానీ ఎక్కడయినా ఒక నియమం వుందో లేదో వారుచెప్పాలి. వారితో
వ్యవహరించడం చాలా కష్టం. తాము మతాచారాల్ని
పాటిస్తున్నట్టు ఎవరయినా ప్రకటిస్తే “విశ్వాసులుగా ప్రవర్తిస్తున్నారు” అని
విమర్శిస్తారు. తాము కొన్ని
మతాచారాల్ని పాటించడంలేదని ఎవరయినా
ప్రకటిస్తే అప్పుడూ వీరే “విశ్వాసుల్ని ఇబ్బంది పెడుతున్నారు” అంటూ అదే నోటితో విమర్శిస్తారు. ఒకే సమయంలో ఒకే కీబోర్డుతో ఒకే
వ్యాసంలో పరస్పర విరుధ్ధమైన అభిప్రాయాల్నీ
చెప్పగల దిట్టవారు. ఏ విషయం మీద కూడా ఒక స్థిర అభిప్రాయం లేక మతిభ్రమించిన రచయిత
స్కైబాబా.
మతరహితంకాదు; మతసామరస్యం
అస్థిత్వవాద వుద్యమాలకు వుండే ఒక ప్రధాన లక్షణం ఏమంటే అవి ఒక నియమంగా స్వీయసాంస్కృతిక వారసత్వాన్ని స్వంతం
చేసుకుంటాయి. వాటిని పదిలంగా కాపాడుకుంటాయి.
ఈ యుగం అశించేది మత రహిత, కుల రహిత సమాజం కాదు; మత సామరస్య, కుల సామరస్య సమాజం.
విభిన్నమత సమూహాల మధ్య సామరస్యం, సంయమనం,
సమన్వయం నేటి అవసరం. గతయుగంలో కులం, మతం లేదని చెప్పుకోవడం ప్రగతిశీలతగా భావించేవారు. ఈ యుగంలో కులం
మతం ప్రకటించడం మహత్తర విషయంగా భావించాలి.
మంద కృష్ణ పేరు చివర మాదిగ చేరినట్టే డానీ పొట్టిపేరు సాగి అహ్మద్
మొహిద్దీన్ ఖాన్ యజ్దానీ అయింది. స్కైబాబాకు కొత్త యుగపు తూకపురాళ్ళను సమకూర్చుకునే శక్తిలేదు. అంచేత వారు వందేళ్ల క్రితపు ప్రగతిశీల ప్రమాణాలతో తన ప్రత్యర్ధుల్ని తూకం వేసే విఫల యత్నం చేస్తున్నారు. తనువుచాలించి
తలకిందులుగా వేలాడుతున్న నాస్తిక-హేతువాదుల మెప్పుపొందడానికి ఉవ్విళ్ళూరు తున్నారు.
A very well balanced and progressive analysis.. .its ideologically has a foundation for future scope of thinking.. .keep doing it..
ReplyDeleteA very well balanced and progressive analysis.. .its ideologically has a foundation for future scope of thinking.. .keep doing it..
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteA.M. Khan Yazdani గారూ,
ReplyDeleteనేనొక ఫ్రీథింకర్ని. అంటే, ఏ మతవిశ్వాసాలనూ పాటించనివాడిని. మీకూ, స్కైబాబాకు జరుగుతున్న ఈ తాత్త్విక చర్చ గురించి నేను మాట్లాడబోవడంలేదు.
నేను మీనుండి తెలుసుకోవాలనుకున్నదేమంటే అవిశ్వాసులను, బహుదేవతారాధకులను, విగ్రహారాధకులను, గ్రామదేవతారాధకులను, క్రైస్తవ, యూదు మతానుయాయులను (ఈ మొత్తం వివరణ అంతా నాకు తెలిసి కాఫిర్ అనే పదానికి అర్థం) ముస్లిం మతస్థులు ఏ విధంగా ఆదరించాలి, లేదా వారితో ఎలా ప్రవర్తించాలి, వారిని ఏ విధంగా పరిగణించాలి అనే విషయంలో ఖురాన్ ఏం చెబుతుంది?
ఇప్పటి స్థలకాలాల మారణహోమాలకు సంబంధించి ఈ సందేహం చాలా ప్రాసంగికత కలిగివున్నదనే నా భావన.
ఈ ప్రశ్నకు జరుగుతున్న చర్చకు సంబంధంలేదు అని మీరు భావిస్తే దయచేసి నా ఈ వ్యాఖ్యను తొలగించగలరు.
.....శ్రీనివాసుడు.
Sir, You have raised a good question. In fact my article is not for SKY Baba alone; I want to make clarification on various issues related o Muslim community. I will certainly deal with your point also in the present series itself.
ReplyDeleteA.M. Khan Yazdani గారూ,
ReplyDeleteముస్లిం సమాజానికి సంబంధించిన అనేక సమస్యలలో తీవ్ర/ఉగ్రవాదీకరణ (రాడికలైజేషన్)కు సంబంధించి నేటి ఫస్ట్ పోస్ట్ లో తుఫైల్ అహ్మద్ నాలుగు వ్యాసాలు వ్రాసారు. వాటి లంకెలను వరుసుగా ఇస్తున్నాను. మీకేమైనా ఉపయోగపడతాయనుకుంటే ఈ టపాను ఉంచండి.
The Radicalisation Series: Analysing the threat to Muslim youths in Kerala
http://www.firstpost.com/india/the-radicalisation-series-analysing-the-threat-to-muslim-youths-in-kerala-2975270.html
‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘
The Radicalisation Series: Analysing the threat to Muslim youths in Hyderabad
http://www.firstpost.com/india/the-radicalisation-series-analysing-the-threat-to-muslim-youths-in-hyderabad-2973118.html
‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘
The Radicalisation Series: Analysing the threat to Muslim youths in Maharashtra
http://www.firstpost.com/india/the-radicalisation-series-analysing-the-threat-to-muslim-youths-in-maharashtra-2971348.html
‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘
The Radicalisation Series: Analysing the threat to Muslim youths in India
http://www.firstpost.com/india/the-radicalisation-series-analysing-the-threat-to-muslim-youths-in-india-2969838.html
నాలుగో భాగం ఈ క్రమంలోనే వస్తుంది. వచ్చినప్పుడు తెలియజేస్తాను.
........శ్రీనివాసుడు.
Thank you for the information
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteA.M. Khan Yazdani గారూ,
ReplyDeleteముస్లిం సమాజంలో ప్రపంచ స్థాయిలో ఇవ్వాళ రెందు ప్రధానమైన ఆలోచనా స్రవంతులు ఉన్నాయి.షియా,సున్నీ లాంటి శాఖల గురించి కాదు నేను చెప్తున్నది అరబిక్ ఇస్లాం,ఇండియన్ ఇస్లాం అనేవి ఇవ్వాళ స్పష్తంగా తెలుస్తున్న బలమైన సాంస్కృతిక అస్థిత్వాలు.ఇవి ఒక్క రోజులో కమ్ముకు రాలేదు.
ఐసిస్ తీవ్రవాదులు మక్కా,మదీనాలలో బాంబులు పేల్చడం గురించి నిర్ఘాంతపోయేవాళ్లు ఒక విషయాన్ని తెలుసుకోవాలి.1957లో హజ్ యాత్రికులు చాలా తక్కువ మంది ఉండేవాళ్లు,అప్పటి ఫొటోలను చూస్తే తెలుస్తుంది.ఇప్పటి రోజున అంత కోలాహలం చేస్తున్నవాళ్లలో భారత్ ఉపఖనడంలోని భారత్,పాకిస్తాన్,బంగ్లాదేశ్ నుంచి వెళ్ళేవాళ్ళు అధికసంఖ్యలో ఉంటున్నారు.ముస్లిములని మచ్చిక చేసుకోవడానికి హజ్ యాత్రలకి ధనసహాయం చేసినదాని ఫలితం అది!ఇనత్ ఆర్భాటంగా హజ్ యాత్ర చెస్తున్న వీళ్ళమీద వెనకటి కాలపు హైందవ విశ్వాసాల ప్రభావం ఉంది.ఆ రకంగా ప్రపంచ స్థాయిలో దీనిని వైదిక ఇస్లాం అని కూడా అంటారు.భారత ఉపఖండంలోని ముస్లిములు శాంతికాముకులుగా ఉండటమూ అరబిక్ ఇస్లామును పాటించే వారినుంచి ఐసిస్ లాంటి ఉగ్రవాద సంస్థలు పుట్టుకు రావటమూ యాదృచ్చికమో,కాకతాళీయమో కాదు.
ఇక్కడ అసమానతలకి గురై మేము మతం మారామని చెప్పుకుంటున్న భారతీయ ముస్లిముల పట్ల అరబిక్ ముస్లిములకి ఎంత చిన్నచూపు ఉంటుందో మీకు తెలుసా!అమెరికాలో తెల్లవాళు నలజాతివాళ్లకి పెట్టుకున్న "నిగ్గర్లు" అనేలాంటి అవమానకరమైన ముద్దుపేరుతో పిలుస్తూ ఉంటారు.మతం అంటేనే మొదట ధార్మికపరమైన విష్యాలతో మొదలవుతుంది,అలాంటిది నాకు ధార్మిక విష్యాల పట్ల అవగాహన లేదంటున్న మీరు ఏమి సాదించాలనుకుంటున్నారు?
స్కైబాబా గారు ప్రస్తావనకి పెడుతున్న ఆధ్యాత్మికమైన దోషాల్ని సవరించుకోకుండా వాటికి కోవర్టుతనం అనే ముసుగు తొడిగేసి కొద్దిమంది తెలివైనవాళ్లకి మాత్రమే దక్కే రాజకీయ ప్రాతింధ్యమూ ఎంత దుర్మార్గమైనా చెయ్యగలిగిన మరో కొద్దిమందికి దక్కే ఆర్ధికపరమైన వెసులుబాటూ చాలునా?