జర్నలిస్టులు
వార్తల్ని సృష్టించరు; నివేదిస్తారు
పాత్రికేయ
వృత్తి అనేకాదు అన్ని వృత్తుల్లోనూ గత కాలపు విలువలు పడిపోయాయి. న్యాయాన్ని కాపాడాల్సిన
న్యాయమూర్తులు న్యాయస్థానాల్లో ఘోర అన్యాయాలు
చేస్తున్నారు. ప్రాణాలు రక్షించాల్సిన డాక్టర్లు మనుషుల అవయవాలతో వ్యాపారాలు చేస్తున్నారు.
జర్నలిజం కూడ పతనం అయిందిగానీ ఈ రేంజ్ లో పతనం అయిందని నేను అనుకోను.
జర్నలిస్టులు
వార్తల్ని సృష్టించరు; వార్తల్ని నివేదిస్తారు. ఇటీవల సంస్థాగత రాజకీయ అనుబంధాల కోసం
వార్తల్ని కూడ సృష్టిస్తున్నారు. ఇదొక కోణం అయితే, ఇప్పటి అర్హతల ప్రాతిపదికలు మారిపోయాయి.
గతంలో రచనానుభవం కలిగినవాళ్ళే ఈ రంగంలోనికి వచ్చేవారు. ఇప్పుడు రెవెన్యూ తేగలిగినవాళ్ళకే ఈ రంగంలో ప్రాధాన్యం ఇస్తున్నారు.
గతంలో ఎడిటర్ అంటే అగ్రపీఠం వేసేవారు. ఇప్పుడు సిఇఓ లదే అగ్రపీఠం. ఈ తేడాలను గుర్తించి
మన అర్హతల్ని పెంచుకోవాలి. అన్నింటికి మించి ప్రతి జర్నలిస్టూ తనదైన ఒక ప్రత్యేకతను
సాధించుకోవాలి. ఆర్ధిక విషయాల్లో మీడియా సంస్థలు ఎంతగా దిగజారినప్పటికీ వివిధ రంగాల్లో నిపుణులకు ఎప్పుడూ ఎంతో కొంత స్థానం
వుంటుంది.
No comments:
Post a Comment