సక్సెస్ అయినట్టా? ఫెయిల్ అయినట్టా?
నిన్న ఉదయం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం వద్ద మార్నింగ్
వాక్ చేసి వస్తున్న పాత మిత్రుడు ఒకడు కనిపించాడు.
“ఎంత సంపాదించావూ?” అని అడిగాడు.
“ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు. మానాన్న ఇచ్చిన ఇంటిని,
మా మామ ఇచ్చిన పొలాన్ని పొగొట్టుకోలేదు. అంత వరకే ఆస్తి” అన్నాను.
“నువ్వు సక్సెస్ అయినట్టా? ఫెయిల్ అయినట్టా?” అనడిగాడు.
ఏం సమాధానం చెప్పాలో నాకు అర్ధం కాలేదు. “నా పధ్ధతిలో సక్సెస్
అయ్యాననే అనుకుంటున్నాను” అన్నాను.
“అంత తెలివివున్నా సంపాదించలేకపోయావంటే జీవితంలో ఘోరంగా ఫెయిల్
అయినట్టే. అవునా? కాదా? ” అని నిలదీశాడు.
నేనేమీ చెప్పలేక పోయాను.
“వైట్ అడ్వాంటేజెస్, రెడ్ ప్రివిలేజెస్ అని వుంటాయి కదా?
రెండోదాన్ని నేను అనుభవిస్తున్నాననే అనుకుంటాను” అని గట్టిగా చెప్పలేక నెమ్మదిగా గొణిగాను.
“నువ్వు బిగ్ పెయిల్యూర్” అని అతను గట్టిగా ప్రకటించి వెళ్ళిపోయాడు.
//
No comments:
Post a Comment