Wednesday, 28 February 2024

I could not read Urdu now.

 ఉర్దూ చదవలేకపోతున్నందుకు చాలా బాధగా వుంది.

 

ముస్లిం సమాజంలో పురుషులకన్నా స్త్రీలలోనే అక్షరాశ్యత ఎక్కువగా వుంటుంది. ముస్లిం ఆడపిల్లలకు  ఉర్దూ, అరబ్బి విధిగా నేర్పుతారు. మానాన్న కన్నా మా అమ్మ ఎక్కువగా చదువుకుంది.

 

ఎలిమెంటరీ స్కూల్ లో తెలుగు మీడియంలో చదువుకునే రోజుల్లో సాయంత్రాలు ఖాజీ సాహెబ్ దగ్గర నేనూ ఉర్దూ అరబ్బీ చదివేవాడిని. నలుగురు అమ్మాయిలు నేనూ ఒక బ్యాచ్. ఆ బ్యాచ్ లో నేనే ఫస్ట్. ఉర్దూ బాగా చదివేవాడిని. ఎలిమెంటరీ స్కూలు దాటిన తరువాత ఉర్దూ తాలీమ్ ఆపాల్సి వచ్చింది. నా తెలుగు ఉఛ్ఛారణలో ఉర్దూ ప్రభావం వుండేది. ఇది కొంచెం అవమానకరంగా మారింది. కొంతకాలం మా సమూహంలో ఉర్దూ మాట్లాడేవాడినేగానీ రాసే అభ్యాసం పోయింది. తరువాత ఉర్దూ సమూహం కూడ లేక మాట కూడ పోయింది.

 

రాత్రి పడుకునే ముందు నా భార్య ఎందుకోగానీ “వ్యంగ్యం రాయడం ఎందుకు మానేశావూ?” అని  అడిగింది. “అది నీ స్ట్రాంగ్ పాయింట్” అని గుర్తు చేసింది. రాత్రంతా  దాని గురించే ఆలోచిస్తూ వుండిపోయాను. తెల్లారుగట్ల మెలుకువ వచ్చే సమయానికి కిషన్ చందర్ ఉర్దూ నవల ‘ఏక్ గధే కి సర్ గుజస్ట్’ (ఒక గాడిద ఆత్మకథ) గుర్తుకు వచ్చింది. బాల్యంలో మా ఇంటికి ‘షమా’ ఉర్దూ మాస పత్రిక వచ్చేది. అందులో ‘ఏక్ గధే కి సర్ గుజస్ట్’ సీరియల్ గా వచ్చేది. మా అమ్మమ్మ చదివి వినిపించేది. అప్పుడు మాకు అదేదో నవ్వులాటగా వుండేది. రచయిత పేరు కూడ తెలీదు.  కొంచెం ఊహ వచ్చాక దాని గంభీరత, దాని రచయిత పేరు తెలిసివచ్చింది. 

 

ఒక విధంగా నాకు తెలిసిన తొలి రచయిత కిషన్ చందర్. నేను రాసిన ‘గొయ్యి’  స్ట్రీట్ ప్లేకు ప్రేరణ కూడ కిషన్ చందర్ ‘ఏక్ గధే కి సర్ గుజస్ట్’.

 

ఉదయం లేవగానే ముందు నెట్ ఓపెన్ చేసి ‘ఏక్ గధే కి సర్ గుజస్ట్’ కోసం సెర్చ్ చేశాను. దొరికిందిగానీ ఉర్దూలో హెడ్డింగ్ మాత్రమే చదవగలిగాను. టెస్ట్ మ్యాటర్ చదవడం చాలా కష్టంగా వుంది. అక్షరాలు కూడబలుక్కున్నా (హిజ్జే) ముందుకు సాగడంలేదు. ఇక ప్రత్యామ్నాయంగా హిందీ బుక్ కోసం అమేజాన్ లో ఆర్డరు పెట్టాను. ఈ పుస్తకం తెలుగులో కూడ దొరుకుతుందని తెలుసు. అనువాదం కాకుండ ఒరిజినల్   చదవాలని కోరిక.

 

ఉర్దూ చదవలేక పోతున్నందుకు  బాధ వేసింది.

 

విజయవాడ

29 ఫిబ్రవరి 2024

Monday, 19 February 2024

Notes on Fall of Pakistan

 ఈరోజు మొదలెట్టిన  వ్యాసం 

పాకిస్తాన్ పతనం నుండి నేర్చుకోవాల్సిన  గుణపాఠాలు '


టాటా గ్రూపు సంస్థల మార్కెట్ విలువ 341  బిలియన్ డాలర్లు దాటిందని ఈరోజు (19  ఫిబ్రవరి 2024  ) అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF ) ప్రకటించింది. భారత కరెన్సీలో ......... లక్షల కోట్ల  డాలర్లు. ఇవ్వాల్టి మార్కెట్ గణాంకాల్లో ఇదేమీ గొప్ప విషయం ఏమికాదు.  అంతకన్నా ఎక్కువ మార్కెట్ విలువ కలిగిన కార్పొరేట్లు మన దేశంలోనే అరడజను వరకు వున్నాయి. అయితే,  ఇక్కడో ప్రత్యేకత ఉంది. టాటా గ్రూపు సంస్థల మార్కెట్ విలువ పాకిస్తాన్ జాతీయ స్థూల ఉత్పత్తి (GDP ) కన్నా  ఎక్కువ. 2023  లో  పాకిస్తాన్ జిడిపి  340  బిలియన్ డాలర్లు   మాత్రమే. 


పాకిస్తాన్  జిడిపి  ఈ స్థాయికి పడిపోవడానికి కారణం ఏమిటి? అనేది ఎవరికయినా రావలసిన ప్రశ్న. ఇందులో మనం నేర్చుకోవాల్సిన గుణపాఠాలనేకం వున్నాయి. పైగా పాకిస్తాన్ ఆవిర్భావంతో, ఆ దేశ జాతిపిత ముహమ్మద్ అలీ జిన్నాతో టాటా సంస్థకు ఒక అనుబంధం కూడ వుంది. 


పాకిస్తాన్ ఆవిర్భావ వేడుకల్లో పాల్గోవడానికి జిన్నా టాటా ఎయిర్ వేస్ విమానంలోనే కరాచీ వెళ్ళాడు. ఆ విమానంలో జేఆర్ డి టాటా కూడ వున్నాడు. జిన్నా రెండవ భార్య రుటి     జేఆర్ డి టాటాకు స్వయానా మేనత్త. ఆ రోజు విమానాన్ని జేఆర్ డి టాటా స్వయంగా నడిపారని కూడా అంటారు. 

మతపరమైన భావోద్వేగాలతో అధికారాన్ని నిలబెట్టుకోవచ్చని దేశాధినేతలు  భావించడం వల్లనే పాకిస్తాన్ పతనం అయ్యింది. 

పాకిస్తాన్ దుఖ్ఖ దాయిని కశ్మీర్ అనుకుంటాను. అది  ఎన్నికల అంశం అయి కూర్చున్నది. ఆదాయం రాదు;  నిర్వహణకు సైన్యాన్ని పోషిస్తుండాలి.  సైనికాధికారులు దేశాధినేతల్ని శాసిస్తుంటారు. లేదా వల్లే దేశాధినేతలు అయిపోతుంటారు. పాకిస్తాన్ ను ఎక్కువకాలం సైనికాధికారులే పాలించారు. 

యూరప్ దేశాల సంగతి వేరు. అవి  ప్రాధమికంగా  భాషాజాతులు  ( linguistic nations ). అయినప్పటికీ  ప్రతిదేశంలోనూ  అల్పసంఖ్యాకుల భాషలుంటాయి.  'ఒక భాష ఒకదేశం' అని నినదించిన నెపోలియన్ కే స్వదేశమైన   ఫ్రాన్స్  లో  ఫ్రెంచ్ ను ఏకైక భాష చేయడం కుదరలేదు. అక్కడా  కొన్ని సమూహాలు బ్రెట్టన్, ఓసితం వంటి భాషలు మాట్లాడుతారు. యునైటెడ్ కింగ్ డమ్ లోను స్కాటిష్ వెల్ష్, ఐరిష్ భాషలు మాట్లాడుతారు.  "ఒకే జాతి ఒకే భాష' అంటే మెజారిటీ సమూహాల మద్దతు ఉంటుందని నియంతలు నమ్ముతారు. 


   అనేక భాషలు మాట్లాడే దేశంలో  ఒక భాషను అధికార భాషగా ప్రకటించడం వివాదాలకు దారి తీస్తుంది.  మిగిలిన భాషల మనోభాలు దెబ్బతింటాయి. అప్పుడు దేశసమగ్రత కూడా ఇబ్బందుల్లో పడుతుంది. భారతదేశం వంటి బహుళ భాషా సంస్కృతులున్న దేశాల్లోని రాష్ట్రాల్లోనూ ఈ సమస్యలుంటాయి.  తెలుగు - తెలంగాణ భాషా ప్రాతిపదిక మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోవడాన్ని మనం పదేళ్లక్రితం చూశాం. 


పాకిస్తాన్ లో ఉర్దూను కేంద్రంగా  చేసుకుని దేశ సమగ్రతను సాధించాలని జిన్నా భావించినప్పుడు పెద్ద దుమారం రేగింది. అది చివరకు పశ్చిమ పాకిస్తాన్ నుండి తూర్పు పాకిస్తాన్ విడిపోయి  1971   లో  బంగ్లాదేశ్ ఏర్పడానికి దారి తీసింది. 



సరికొత్త స్టాక్ పై

ప్రతీ రోజూ  

తగ్గింపు ధరలు!



వ్యక్తిగతంగా జగన్ మంచివారు చంద్రబాబు చెడ్డవారు అనే అభిప్రాయం నాకు ఎన్నడూ లేదు. వాళ్ళు  రాజకీయాల్లో బద్ధ శత్రువులు. ఒకరి మీద మరొకరు కక్ష తీర్చుకుంటా

రు.    

Sunday, 18 February 2024

Debate on Animal Farm

 Debate on Animal Farm 

Karlapalem Bhaskara Rao

మీ వ్యాసం బాగుందని ఎలా చెప్పగలను? ఫాసిజాన్ని కమ్యూనిజంతో ఈక్వేట్ చేస్తున్నందుకు బాగున్నదని చెప్పాలా? ఆస్తిత్వ ఉద్యమాల సుడిగుండంలో పడి కమ్యూనిస్టులకు కుల ఆధిపత్యం కట్టబెడుతున్నందుకు బాగుందని చెప్పాలా? కమ్యూనిస్టు రష్యాది సోషల్ సామ్రాజ్యవాదమని తెగడి ఇంపరియలిస్టులకు ఆనందం కలిగించటం బాగుందని చెప్పాలా? వెరసి వ్యాసం మొత్తం సమాకాలీన సాహిత్య అవసరాలకు తగ్గట్టు లేదని, రాజకీయాలలో లాగానే, సాహిత్య సృష్టిలో కూడా ఫాసిస్ట్, మరీ ముఖ్యంగా హిందూ ఫాసిస్ట్ ధోరణులను వ్యతిరేకించే భిన్న శక్తుల కూటమి అవసరం అన్న విషయం మీ వ్యాసం ప్రతిబింబించటం లేదు అని చెపితే సరిపోతుందేమో?

కర్లపాలెం భాస్కరరావుగారికి,

 ఇంత వివరంగా స్పందించినందుకు ధన్యవాదాలు. 

మీ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాను. కానీ ,ఆమోదించడంలేదు. 

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో  రెండు వందలకు పైగా  సామాజికవర్గాలు ఉంటాయి. వీటిలో రెండు లేదా మూడు సామాజికవర్గాలకు చెందినవారే కమ్యూనిస్టు ప్రభావం బలంగా ఉన్నకాలంలో  కమ్యూనిస్టు  పార్టీల రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు  ఎందుకు అయ్యారు? అనే ఒక సామాజిక  ప్రశ్నకు మీ దగ్గర సామాజికార్ధిక  వివరణ ఏమైనా వుందా?  ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలకు నాయకత్వం వహిస్తున్న  సామాజికవర్గాలే  కమ్యూనిస్టు పార్టీలకు కూడ నాయకత్వం వహించడంలో ఉన్న హేతువేమిటి? 

ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కడా కమ్యూనిస్టు సమాజం ఏర్పడే అవకాశమేలేదు. కనీసం   సోషలిస్టు సమాజం అయినా ఏర్పడిందా? అంటే అదీ జరగలేదు. అది ప్రజల లోపమా? నాయకుల లోపమా? ప్రజలు ఒకప్పుడు కమ్యూనిస్టు నాయకుల్ని అపారంగా ప్రేమించారు? వాళ్ళను గట్టిగా   నమ్మేరు. పార్టీ కోసం ప్రాణత్యాగం చేయమంటే చేశారు.  నాయకులేం చేశారు?   

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మూడువేల  మంది  చనిపోయారని అంచనా. అమరవీరుల సామాజికవర్గ విశ్లేషణ ఎవరయినా చేశారా?  అలాగే శ్రీకాకుళ గిరిజన రైతాంగ సాయుధ పోరాటంలో చనిపోయినవారి  సామాజికవర్గ విశ్లేషణ  చేశారా? అలాగే కరీంనగర్- ఆదిలాబాద్  రైతాంగ సాయుధ పోరాటంలో చనిపోయినవారి  సామాజికవర్గ విశ్లేషణ  చేశారా? నాయకులకు అమరులకు మధ్య సామాజికవర్గ  వైరుధ్యం ఉందని గమనించారా? ఈ తప్పులు కమ్యూనిస్టు పార్టీల నాయకత్వం నిరంతరం చేస్తున్నపుడు ప్రజలకు తమ సామాజిక ఉనికి గుర్తుకు రావడంలో తప్పేమిటి?  వచ్చి తీరాల్సిందే.  మార్క్సిజం ప్రకారం  సామాజిక అస్తిత్వమే మనుషుల ఛైతన్యన్ని నిర్ణయిస్తుంది. దాన్ని తప్పుపట్టడానికి కమ్యూనిస్టు పార్టీల నాయకులెవరూ? 

ఫాసిజం మత వ్యవస్థలో పీడక వర్గం పక్షాన నిలిచి పీడిత వర్గాల్ని  మరింతగా అణిచివేస్తుందనే సూత్రీకరణతో మీకు ఏకాభిప్రాయం వుందా? వర్తమాన భారతదేశ మత వ్యవస్థలో పీడకులు ఎవరో ? పీడితులు ఎవరో? నిర్ధారించి ఒక విధాన పత్రాన్ని విడుదల చేసే పని కమ్యూనిస్టు పార్టీలు ఎప్పుడయినా చేశాయా? 

ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలకు నాయకత్వం వహించిన రెండు సామాజికవర్గాలే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రెండు ప్రధాన పార్టీలుగా చీలిపోయి హోరాహోరీ పోరాటం చేస్తున్నాయి. మీరెటువైపు? ఒకనాడు సగర్వంగా కమ్యూనిస్టులమని చెప్పుకునే సమూహం ఇప్పుడు చంద్రబాబు ప్రత్యక్షంగా ఫాసిస్టు పార్టీతో పొత్తుపెట్టుకోవాలని వత్తిడి చేస్తున్నది.   మీరేమో "ఆస్తిత్వ ఉద్యమాల సుడిగుండంలో పడి కమ్యూనిస్టులకు కుల ఆధిపత్యం కట్టబెడుతున్నారు" అని 1990   ల నాటి  ఆవేదనను ఇప్పటికీ మరచిపోలేని స్థితిలో వున్నారు.  కమ్యూనిస్టు పార్టీల నాయకత్వపు వైఫల్యమే నేటి ఈ దుస్థితికి కారణం అని మీకు తెలీదా? పుచ్చలపల్లి సుందరయ్యగారి 'రాజీనామా' పత్రాన్ని చదవలేదా? సిపిఐ కాంగ్రెస్ ను అతిగా ప్రేమిస్తే, సిపియం జనసంఘ్ (ఆరెస్సెస్) తో అంటకాగింది నిజం కాదా?  

ఈ పరిణామాల్ని జార్జ్ ఆర్వెల్ చాలా ముందుగా ఊహించాడు. వీటికి సహజ పరిణామంగా వచ్చే ఫాసిస్టు పాలనను '1984 '   నవలలో  చాలా గొప్పగా రాశాడు. అందుకే ఆర్వెల్ నాకు ఇష్టం. ఆర్వెల్ ను విమర్శించడానికి వెచ్చించిన సమయాన్ని అతను హెచ్చరించిన అంశాల మీద  వెచ్చించి ఉంటే  కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడు ఇంతటి దయనీయ స్థితిలో ఉండేవి కావు. 

చివరగా ఒకమాట చెప్పాలి. కమ్యూనిస్టు ఆలోచనాపరులు అనుక్షణం ప్రజల్ని, పాఠకుల్ని హెచ్చరిస్తూ వచ్చారు. కమ్యూనిస్టు పార్టీల నాయకులే ప్రతి మలుపులోనూ ప్రజల్ని బలిపెడుతూ వచ్చారు.  కమ్యూనిస్టు ఆలోచనాపరుల్ని వెలివేస్తూ వచ్చారు. 

నేను పౌరునిగా  భారతీయుడిని, సామాజికవర్గంగా ముస్లింని, తాత్వికంగా మార్క్సిస్టుని. నేను మాట్లాడే ప్రతిమాటలో చేసే ప్రతి పనిలో ఈ మూడు అంశాలు ఉంటాయి.   

George Orwell - Animal Farm (1945)

 జార్జ్ ఆర్వెల్ నవలిక - యానిమల్ ఫార్మ్స్ (1945)

     నియంతృత్త్వానికి, ఫాసిజానికి  వ్యతిరేకంగా '1984' వంటి మహత్తర  నవలను  ప్రపంచానికి అందించినప్పటికీ కమ్యూనిస్టులకు జార్జ్ ఆర్వెల్ అంటే పడదు. అందుకు  కారణం   అతను రాసిన నవలిక 'యానిమల్ ఫార్మ్ ' నవలిక. ఆ పుస్తకం విడుదల అయ్యాక ఆర్వెల్ ను  సోవియట్  రష్యా వ్యతిరేకిగానేగాక ఏకంగా కమ్యూనిజానికి వ్యతిరేకిగా భావించి విరుచుకు పడ్డారు.   నిజానికి జార్జ్  ఆర్వెల్   సోషల్  డెమొక్రాట్. అతను సామ్యవాదాన్ని ఇష్టపడతాడు; ప్రజాస్వామ్యాన్ని ప్రేమిస్తాడు. మొరటు  కమ్యూనిస్టులకు సోషలిజమూ తెలీదు; ప్రజాస్వామ్యమూ తెలీదు.  వాళ్లకు ఆర్వెల్ సోషల్  డెమోక్రసీ నచ్చలేదు. అలా కమ్యూనిస్టుల అపార్ధానికి గురయిన రచయితల్లో జార్జ్ ఆర్వెల్  ఒకడు. 

రెండవ ప్రపంచ యుద్ధ విజేతగా జెవి స్టాలిన్ అనేక దేశాల్లో జేజేలు అందుకుంటున్న కాలంలో,  ఆర్వెల్ 1945  లో   'యానిమల్ ఫార్మ్' ను ప్రచురించాడు. "జంతువులన్నీ సమానం; కొన్ని జంతువులు మరింత సమానం" అనే మాట పెద్ద వివాదంగా మారింది.   

1917  నాటి అక్టోబరు విప్లవంలో  లెనిన్ తరువాత అంతటి నాయకుడు లియోన్ ట్రాట్స్కి.  పెట్రోగ్రాడ్ (సెయింట్ పీటర్స్ బర్గ్) యుద్ధ విజయంలో అతనిదే పెద్ద పాత్ర. క్రెస్తవుడయిన జార్  చక్రవర్తిని వింటర్ ప్యాలెస్ లో నేరుగా  ఎదుర్కోవడానికి  యూదుడయిన ట్రాట్క్సిని ఎంపిక చేశాడు లెనిన్.  ఆయనకు మతఘర్షణను వర్గ ఘర్షణగా మార్చడం తెలుసు. 

ఆ  తరువాత స్టాలిన్ హయాంలోనూ  రష్యన్ ప్రభుత్వంలో  ట్రాట్క్సీ నెంబర్  టు గా కొనసాగాడు. అది స్టాలిన్ కు ఇష్టంలేదు.  ప్రక్షాళన (purging ) కార్యక్రమంలో భాగంగా ట్రాట్క్సీ మీద దేశ బహిష్కరణ విధించారు. మెక్సికో వెళ్లి తలదాచుకున్నా అతన్ని   వదలలేదు. వెంటాడి చంపేశారు.  ఈ పరిణామాలు జార్జ్ ఆర్వెల్  మనసును  గాయపరిచాయి. సోషలిజం ముసుగులో   స్టాలిన్ నియంతృత్త్వాన్ని సాగిస్తున్నాడని అతనో నిర్ధారణకు వచ్చాడు. అలా పుట్టింది 'యానిమల్ ఫార్మ్'. 

ఈ పుస్తకాన్ని ఆర్వెల్  1943  నవంబరులో మొదలెట్టి  1944 ఫిబ్రవరిలో పూర్తి చేశాడు. నాజీ జర్మనీ నాయకత్వంలోని అక్షరాజ్యాల కూటమికి  వ్యతిరేకంగా ఏర్పడిన  మిత్రరాజ్యాల కూటమికి  రష్యా నాయకత్వం వహిస్తున్న రోజులవి. బ్రిటన్ లో లేబర్ పార్టీ పరపతి పెరుగుతున్న రోజులవి.  బ్రిటీష్ మేధావి వర్గం స్టాలిన్‌ను ఎంతగానో  గౌరవిస్తున్న రోజులవి. ఇలాంటి చారిత్రక సందర్భంలో ఏటికి  ఎదురీదాలని నిర్ణయించుకున్నాడు ఆర్వెల్. యానిమల్ ఫార్మ్స్ ను ప్రచురించడానికి బ్రిటీష్ పబ్లిషర్లు  నిరాకరించారు. అలాంటి ఆలోచనలు మానుకోమని సలహాలు ఇచ్చారు.  అయినా ఆర్వెల్  తన పట్టుదలను వదలలేదు.   

నిన్న జరిగింది ఈరోజు రాయడం సులువు. ఈరోజు జరిగింది ఈరోజు రాయడం కష్టం. రేపు జరగబోయేది ఈరోజు రాయడం ఒక సవాలు. అలాంటి సవాలుకు సిద్ధమయ్యాడు ఆర్వెల్. రెండవ ప్రపంచ యుద్ధం ముసుగుస్తున్న కాలంలో  'యానిమల్ ఫార్మ్'  ప్రచురించాడు. అతని జోస్యం నిజమైయింది. ఆర్వెల్  ఊహించినట్టే రష్యా సోషల్ సామ్రాజ్యవాదిగా మారింది. 1991 లో పూర్తిగా విచ్చిన్నం ఆయిపోయింది. \

రెండవ ప్రపంచ యుద్ధం ముగిశాక, ప్రచ్చన్నయుద్ధ కాలంలో యానిమల్ ఫార్మ్ బెస్ట్ సెల్లర్  గా మారింది. అనేకానేక అవార్డులు గెలుచుకుంది.   

 హాస్యం నవ్విస్తే సరిపోతుంది; వ్యంగ్యం  నవ్వించాలి వీలు చూసి కత్తితో పొడవాలి. 'యానిమల్ ఫార్మ్' శైలిపరంగా ఒక  వ్యంగ్య రచన. పైగా  ఇదొక కాల్పనిక గాధ. పాత్రలన్నీ జంతువులు పక్షులేగానీ వాటన్నింటికి మనుషుల భావోద్వేగాలు ఉంటాయి. మనిషి భాషలో మాట్లాడుకుంటాయి (anthropomorphic  animals).  

\1954 లో  హాలీవుడ్ లో యానిమల్ ఫార్మ్ ను కొంచెం తేలిక చేసి  2 -డి కార్టూన్ సినిమాగా తీశారు.  ఆ సినిమా అంతగా  ఆడలేదు. దానికి కారణం ఏమంటే పెద్దవాళ్లకు అది పిల్లల సినిమాగా అనిపించింది; పిల్లలకు అది పెద్దల సినిమాగా అనిపించింది. ఆ తరువాత కూడా 'యానిమల్స్ ఫార్మ్'   అనేకమార్లు  సినిమాలుగా వచ్చింది. విజువల్   క్యాప్చరింగ్ నటనలో ప్రపంచ మొనగాడుగా ఉన్న ఆండీ  సెర్కిస్  ( Andy Serkis)  ఇప్పుడు మళ్ళీ యానిమల్ ఫార్మ్స్ ను సినిమాగా నిర్మిస్తున్నాడు.  

క్లుప్తంగా కథ. 

1   ఇంగ్లాండ్ లోని వెల్లింగ్టన్  నగర శివార్లలో జోన్స్ అనేవాడు ఒక జంతువులశాలను నిర్వహిస్తుంటాడు. అక్కడ అనేక జంతువులు పక్షులు ఉంటాయి. దాని పేరు 'మ్యానోర్ ఫార్మ్'.  

2. జోన్స్ పిసినారి, స్వార్ధపరుడు, జంతువులను హింసిస్తుంటాడు. వాటికీ కావాల్సినంత దాణా కూడ పెట్టడు. వాటి గుడ్లను, పాలను, చివరకు మాంసాన్ని కూడా  అమ్ముకుని  విలాసాలు  అనుభవిస్తుంటాడు.

3   'ఓల్డ్  మేజర్'  అనే వృద్ధ పంది మ్యానోర్ ఫార్మ్ లోని జంతువులకు పెద్ద. 'మరో ప్రపంచం' పిలుస్తున్నట్టు ఓరోజు 'ఓల్డ్  మేజర్' కు కల వస్తుంది. ఆ కలను మిగిలిన జంతువులకు వివరించడానికి ఒక రహస్య సమావేశం పెడుతుంది. మరోప్రపంచాన్ని నిర్మించడానికి జంతువులన్నీ విప్లవించాలని చెపుతుంది.  ఆ వెంటనే చనిపోతుంది. 

4  'ఓల్డ్  మేజర్'  చనిపోయాక జయింతువులన్ని తిరగబడి జోన్స్ ను తరిమి కొట్టి 'మ్యానోర్ ఫార్మ్'ను స్వాధీనం చేసుకుంటాయి. ఈ తిరుగుబాటుకు స్నోబాల్, నెపోలియన్ అనే రెండు పందులు నాయకత్వం వహిస్తాయి.  

5   'మ్యానోర్ ఫార్మ్' పేరును  'యానిమల్ ఫార్మ్' గా మారుస్తాయి. ఏడు అంశాలతో కొత్త రాజ్యాంగాన్ని రాసుకుంటాయి. 

రెండు కాళ్ల మీద నడిచే జీవులు మన శత్రువులు. 

నాలుగు కాళ్లపై నడిచేవి, రెక్కలు ఉన్నవి మన స్నేహితులు. 

జంతువులు బట్టలు ధరించకూడదు.

జంతువులు  మంచం మీద పడుకోకూడదు.

జంతువులు  మద్యం తాగకూడదు.

జంతువులు  ఇతర జంతువులను చంపకూడదు.

జంతువులన్నీ సమానమే 

అనేవి ఇందులోని ఆదేశాలు. 

6   'యానిమల్ ఫార్మ్'  మొదలయిన రోజు నుండే స్నోబాల్, నెపోలియన్ ల మధ్య అధికార పోటీ మొదలవుతుంది. స్నోబాల్ తెలివైనది నెపోలియన్ కపటి. 

7     'యానిమల్ ఫార్మ్' లో విద్యుత్ కొరతను అధిగమించడానికి విండ్ మిల్ నిర్మించాలని స్నోబాల్ ప్రతిపాదిస్తుంది. కపటంతో స్నోబాల్ ను జంతు వ్యతిరేకిగా చిత్రిస్తుంది నెపోలియన్. స్నోబాల్  మీద  తన పెంపుడు కుక్కలను ఉసి గొలుపుతుంది. ప్రాణాలు దక్కించుకుని స్నోబాల్ తప్పించుకుంటుంది. 

8   'యానిమల్ ఫార్మ్' లో పాతపద్ధతులన్నీ వచ్చేస్తాయి.  జంతువులన్నీ సమానమే  అనేదాన్ని జంతువులన్నీ సమానమే గానీ కొన్ని జంతువులు మరింత సమానం అని రాజ్యాంగ సవరణ చేస్తారు.  

9.   నెపోలియన్ రెండుకాళ్ళజీవులతో సామరస్యంగా ఉండడం మొదలెడతాడు (రివిజనిజం అన్నమాట ) రెండుకాళ్ళజీవులు కూడ మంచివే అనే వాదనను ముందుకు తెస్తాడు. 

10.    జోన్స్ ను మించిన నియంతగా మారిన నెపోలియన్ తన అనుయాయులు, పెంపుడు కుక్కలతో విలాసాలను ఆస్వాదిస్తుంటుంది. తిరగబడినవారిని చంపించేస్తుంటుంది . స్నోబాల్ పథకమైన విండ్ మిల్ ప్రాజెక్టును తనదిగా చెప్పుకుని దాని పూర్తి  చేయమని  ఆదేశిస్తుంది. 

11.    ఇన్ని ఘోరాలు జరుగుతున్నా మరోప్రపంచం సాకారం అవుతుందని  బాక్సర్ అనే ఓ గుర్రం, బెంజమిన్ అనే గాడిద గట్టిగా నమ్ముతుంటాయి. అవి  పగలు రాత్రి విండ్ మిల్   దగ్గర పనిచేస్తుంటాయి.  

12.     ఒకరోజు  విండ్ మిల్  దగ్గర ప్రమాదం జరిగి  బాక్సర్ తీవ్రంగా గాయపడుతుంది . పని చేయలేని బాక్సర్ ను నెపోలియన్ కబేళాకు పంపించేస్తాడు. ఆ దారుణాన్ని చూసి జంతువుల్లో తిరుగుబాటు వస్తుంది. 

13. యానిమల్ ఫారంలో ఓల్డ్ మేజర్ ఫోటోను కూడా తొలగించేస్తాడు నెపోలియన్.  యానిమల్ ఫారంలో  తొలగించేస్తాడు నెపోలియన్  ఫారంలో తన పందుల సంతతిని పెంచుకుంటాడు. 

14. ఎల్లప్పుడూ తమను పందులు మాత్రమే ఎందుకు నాయకత్వం వహిస్తున్నాయని మిగిలిన జంతువులకు సమంజసమైన  పెద్ద అనుమానం వస్తుంది. ఈ సీన్స్ లో  భారతదేశ  కమ్యూనిస్టు పార్టీల్లో కొనసాగుతున్న కుల ఆధిపత్యం గుర్తుకు వస్తుంది. 

15.   ఓ రాత్రి జంతువుల ఉత్పత్తుల అమ్మకానికి  మానవ   వ్యాపారులతో నెపోలియన్ బేరసారాలు కుదుర్చుకుని విందులు చేసుకుంటుంది. 

16.   బయట కిటికీల నుండి ఈ విందు కోలాహలాన్ని చూస్తున్న  జంతువులకు పందులే మనుషులుగా మనుషులే పందులుగా కనిపిస్తుంటాయి. తాము మోసపోయామని వాటికీ అర్ధం  అవుతుంది.

17,   పశువులశాల మళ్లీ మనుషుల చేతుల్లోనికి పోవడానికేనా  తాము కష్టపడింది పోరాడింది  ప్రాణ త్యాగాలు చేసింది అని అవి బాధపడి కుమిలిపోతాయి.

18. తరువాత ఏం జరిగి ఉంటుందో  ఊహించుకోవచ్చు 

- ఉష యస్ డానీ

జార్జ్ ఆర్వెల్ నవలిక - యానిమల్ ఫార్మ్స్ ను  ఈ కింది లింకులో ఉచితంగా  చదవవచ్చు. 

https://docs.google.com/file/d/0B-qbgH1SfSUdUWNxNFBWeHNCR3M/view?resourcekey=0-y0UaERHtE7aLaKt_cwsElg



Saturday, 17 February 2024

Literature in the Fascist Phase - George Orwell

 Literature in the Fascist Phase - George Orwell 1984

ఫాసిస్టు దశలో సాహిత్యం - జార్జ్ ఆర్వెల్ 1984


            ఇటీవల విజయవాడలో జరిగిన విప్లవ రచయితల సంఘం మహాసభల్లో 'ఫాసిస్టు దశలో రచనలు' అనే అంశం మీద ఒక సెషన్ నిర్వహించారు.  అందులో నేను ఒక వక్తని. 

"ఫాసిస్టు దశలోని  రచయితలు ఐదు పనులు చేయాలి.  ఫాసిజం గురించి, ఫాసిస్టుల గురించి, ఫాసిజానికి బలవుతున్న సమూహాల గురించి, ఫాసిజాన్ని ఎదురు తిరుగుతున్న  సమూహాల గురించి, వీళ్లందరినీ ఏకంచేసి ఫాసిజాన్ని అంతంచేసే మార్గాల గురించి రాయాలి"  అన్నాను.  

అన్నింటికన్నా ముందు మనం స్పష్టం చేసుకోవాల్సిన అంశం ఒకటుంది; నియంతృత్త్వానికి ఫాసిజానికి మధ్య తేడాను తెలుసుకోవాలి. 

     మన దేశపు కమ్యూనిస్టు సాహిత్యంలో తరచూ ఒక లోపం  కనిపిస్తూ ఉంటుంది. విప్లవ వాస్తవిక సాహిత్యం పేరిట కమ్యూనిస్టు రచయితలు పీడితులు చేసే పాక్షిక పోరాటాలను చాలా అంకిత భావంతో  చిత్రిస్తుంటారు. అంతవరకు గొప్ప విషయమేగాని దీనికో పరిమితి వున్నది.  ఇది ప్రాధమిక అనుభవ జ్ఞానం  మాత్రమే .  ఇందులో , కాల్బలం, పాత్రధారులుతప్ప  సూత్రధారులు, కిరీటధారులు కనిపించరు.  జనం పోరాడుతున్నారని మనకు తెలుస్తుందిగాని  మొత్తం దేశవ్యాప్త  పోరాట సన్నివేశం అర్ధంకాదు. 

 శ్రీకాకుళం గిరిజన సాయుధ పోరాటానికి ప్రతీకగా భూషణం  'కొండగాలి' నవల  ప్రసిద్ధి చెందింది.   శ్రీకాకుళ అటవీ ప్రాంతపు ఓ గ్రామంలో గిరిజనులు  తిరగబడి,   కపటులు,   అత్యాశాపరులైన  ఓ భూస్వామిని ఓ కిరాణా కొట్టు యజమానిని కొందరు ఫారెస్టు గార్డుల్నీ  చంపడం ఆ నవల కథ.    కరీంనగర్  ఆదిలాబాద్ జిల్లాల్లో నక్సలైట్ ఉద్యమం ఉధృతంగా ఉన్న కాలంలో ఇలాంటి వందలాది కథలు మనకు వచ్చాయి.  వీటిల్లో ప్రజల పోరాటాలు ఆరాటాలు  వాటిపై ప్రభుత్వ దమనకాండ కనిపిస్తాయిగాని, అరుదుగా మాత్రమే స్థానిక భూస్వాములు కనిపిస్తారు.   పెట్టుబడిదారులు కనిపించరు,  రాజ్యాధినేతలు, దేశాధినేతలు  అసలు  కనిపించరు.

        ఫాసిస్టు వ్యతిరేక సాహిత్యం పేరిట  ఇప్పుడొస్తున్న కథల్లో  పీడితులు వుంటారు. చిన్నచిన్న  సమస్యలు ఉంటాయి.  ఫాసిస్టులు కనిపించరు. కనీసం ఫాసిస్టు అల్లరి  మూకలు కూడా కనిపించవు. బాలనాగమ్మ కథలో పులిని చంపి గోర్లు తెమ్మంటే తిప్పడు మొండితోక తెచ్చినట్టు ఉంటాయి అవి.  "ఇవేమి   ఫాసిస్టు వ్యతిరేక కథలు?"  అంటే సదరు రచయితలకు చాలా కోపం వస్తుంది. 

       ఫాసిస్టు ముస్సోలిని, నాజిస్టు హిట్లర్ బతికుండగానే 1941 లో 'ద గ్రేట్  డిక్టేటర్'    సినిమాకు కథ,  స్క్రీన్ ప్లే, సంభాషణలు రాసి దర్శకత్వం వహించి తానే నటించాడు చార్లీ చాప్లిన్. అందులో బాధితుడు యూదు మంగలి ఉంటాడు, మరోవైపు, ఫాసిస్టు ముస్సోలిని, నాజిస్టు హిట్లర్ వుంటారు. అలా చాప్లిన్ మనకు ఒక దారి చూపించాడు. ఆ దారిలో మనం నడవడం లేదు; నడవడానికి   భయపడుతున్నాం.  

   చార్లీ చాప్లిన్ ది ఒక మంచి సంప్రదాయం. కిషన్ చందర్  'తిరిగి వచ్చిన గాడిద'  కాన్సెప్ట్ కు నా వెర్షన్ గా 1983లో   రాసిన "గొయ్యి''  స్ట్రీట్ ప్లే లో  ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు, ఆరెస్సెస్ ప్రచారక్ పాత్రల్ని ప్రవేశ పెట్టాను.   ఇప్పుడు ఎవరయినా 'గొయ్యి' స్ట్రీట్ ప్లే  వేస్తామంటే ఇందిరాగాంధీ, ఎన్టీ  రామారావు పాత్రల్ని తీసేసి  జగన్, చంద్రబాబు, అమిత్ షా, నరేంద్ర మోదీ  పాత్రల్ని చేరుస్తాను. నేను రాసిన అనేక వ్యంగ్య కథల్లో ఆనాటి రాజకీయ ప్రముఖులు చాలామంది ఉండేవారు.  

ప్రపంచ సాహిత్యంలో నియంతృత్త్వానికి వ్యతిరేకంగా వచ్చిన  నవలల్లో  '1984' ముందు పీఠిన ఉంటుంది.  దీనిని  బ్రిటీష్ రచయిత జార్జ్ ఆర్వెల్ 1949లో రాశాడు. ఆ తరువాతి స్థానం మరో బ్రిటీష్ రచయిత ఆల్డోస్ హాక్స్లే (Aldous Huxley) 1931 లో రాసిన 'బ్రేవ్ న్యూ వరల్డ్' నవలకు దక్కుతుంది.  జాక్ లండన్ 'ఉక్కుపాదం' నవల కూడా ఈ జాబితాలోకి వస్తుంది. ప్రధానమంత్రి, కేంద్ర హోమ్ మంత్రి, గౌతమ్ ఆదానీలను ముఖ్యపాత్రలుగా చేసి నవలలు రాయాల్సిన కాలం ఇది.   

     క్షయ రోగంతో తీవ్రంగా బాధపడుతున్న కాలంలో చనిపోతున్నాడని డాక్టర్లు చెప్పేశాక   తన తన జీవిత కాలపు  చివరి కోరికగా ఆర్వెల్ '1984'   రాశాడు. 1949 జూన్ 8న  నవల విడుదల అయింది. 1950  జనవరి 21  న ఆర్వెల్ చనిపోయాడు. 

ఫాసిజానికి వ్యతిరేకంగా  రచనలు చేసే వారు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం '1984 '. 


-  ఉష యస్ డానీ


'1984' ను ఈ కింది లింకులో ఉచితంగా  చదవవచ్చు. 

https://www.planetebook.com/free-ebooks/1984.pdf 



మనవి:  24   అంగుళాల కంప్యూటర్ స్క్రీన్ మీద, టీవీఎస్ గోల్డ్ పెద్ద  కి బోర్డుతో   ISM V6 ఫాంట్  ఓపెన్ చేసి ఫొనెటిక్ ఇంగ్లీషు కి బోర్డు మీద వ్యాసాలు రాయడం నా అలవాటు.  నాకు ఇక్కడ హైదరాబాద్ లో  తెలుగు టైపు చేయడానికి సరైన సౌకర్యం లేదు. మొబైల్ ఫోన్, ఈజీ తెలుగు యాప్ లలో కొన్ని పదాలు తప్పు పడుతున్నాయి. పైగా  నా మెకానిక్ బండ చేతులతో మొబైల్ ఫోన్ కీస్ ప్రెస్ చేయడం చాలా కష్టం. ఈ  పరిమితిని గమనించగలరు.  వీలు చూసుకుని '1984   నవలను  పరిచయం చేస్తాను.    









Monday, 5 February 2024

Indian Constitution is a Revolutionary Document, But,

'భారత రాజ్యాంగం విప్లవకరమైనదే కానీ...'

వర్తమాన భారత రాజకీయ రంగంలో రెండు పరస్పర విరుధ్ధ వాస్తవాలు ఒకేసారి కొనసాగుతున్నాయి. మొదటిది;  ఒక ప్రజాస్వామిక రాజ్యాంగం అమలులో వున్నది. కొందరు దీన్ని లౌకిక, సామ్యవాద రాజ్యాంగం అని కూడ అంటున్నారు. రెండోది; దేశ పరిపాలన ఫాసిస్టు శక్తుల చేతుల్లోనికి పోయింది. ప్రజాస్వామిక రాజ్యాంగం అమలులోవుఉన్న కాలంలోనే రాష్ట్రపతి ఉత్తర్వులతో దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించడాన్ని గతంలో మనం చూశాం. ప్రజాస్వామిక, లౌకిక, సామ్యవాద రాజ్యాంగం అమల్లోవున్న కాలంలోనే ఫాసిస్టుశక్తులు రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడాన్నీ ఇప్పుడు చూస్తున్నాం.

          రాజ్యాంగం అమాయికంగా ఫాసిజాన్ని ప్రమోట్ చేస్తున్నదా?  ఫాసిస్టులు రాజ్యాంగాన్ని తెలివిగా వాడుకుంటున్నారా? అనే ప్రశ్న ఈ సందర్భంగా తలెత్తడం సహజం. నిజానికి ఇదేమీ విడ్డూరంకాదు. 1920లలో ఇటలీలో ఫాసిస్టు బెనిటో ముస్సోలినీ, 1930లలో జర్మనీలో నాజీస్టు అడాల్ఫ్ హిట్లర్ కూడ రాజ్యాంగ బధ్ధంగా ప్రజాస్వామిక ప్రాతినిధ్య పార్లమెంటరీ ఎన్నికల ద్వారానే అధికారాన్ని చేపట్టారు.  ఇంకో పోలిక ఏమంటే నాజీ పార్టి అంటే ‘జాతీయ సామ్యవాద జర్మన్ శ్రామికుల పార్టి’ (National Socialist German Workers' Party).

ఒకవైపు జాతియోద్యమ ఆదర్శాలు, దేశవిభజన కల్లోలం, మరోవైపు, దున్నేవానికి భూమి కోసం రైతాంగ సాయుధ పోరాటాలు  సాగుతున్న కాలంలో  రాజ్యాంగం పుట్టింది. ఎలా చూసినా భారత రాజ్యాంగం విప్లవకరమైనది. అమెరిక ప్రజాస్వామిక చరిత్రలో 1787 నాటి ఫిలడెల్ఫియా  కన్వెన్షన్ కన్నా 1946 నుండి 1949 చివరి వరకు సాగిన భారత రాజ్యాంగ సభ గొప్పది. మనువు విధించిన సామాజిక నిబంధనలతో, చాణుక్యుడు/కౌటిల్యుడు/విష్ణుగుప్తుడు రూపొందించిన ఆర్ధిక విధానాలతో నడిచే వ్యవస్థలో నలిగిపోతున్న కోట్లాది మంది ప్రజానీకానికి రాజ్యాంగం కొత్త జీవితాన్ని ఇచ్చింది. మరోమాటల్లో చెప్పాలంటే, కుల-మత ప్రధాన  ఫ్యూడల్ వ్యవస్థను పెట్టుబడీదారీ వ్యవస్థగా మార్చడంలో రాజ్యాంగం కేటలిస్ట్ పాత్రను నిర్వహించింది. సమాజంలో వచ్చిన ఆ గుణాత్మకమార్పును మనం స్పష్టంగా చూస్తున్నాం. అందుకు రాజ్యాంగాన్ని మెచ్చుకోవాలి.

రాజ్యాంగ సభలోని దాదాపు డజను కమిటీల్లో కీలకమైన డ్రాఫ్టింగ్ కమిటీకి ఛైర్మన్ గా వ్యవహరించిన బిఆర్ అంబేడ్కర్ తన చివరి ఉపన్యాసంలో (నవంబరు 25, 1949) రాజ్యాంగం పరిధి-పరిమితుల గురించి ప్రస్తావించాడు. “ప్రతి మనిషికీ ఒక ఓటు; ప్రతి ఓటుకూ సమాన విలువ ఇవ్వడం ద్వార రాజకీయరంగంలో సమానత్వాన్ని సాధించాము. అయితే, ఇది సరిపోదు. సాంఘీక, ఆర్ధిక రంగాల్లోనూ సమానత్వాన్ని సాధించితీరాలి.  భవిష్యత్తు పాలకులు అందుకు కృషిచేయాలి. వాళ్ళు సాధ్యమైనంత త్వరగా  సాంఘీక, ఆర్ధిక రంగాల్లో సమానత్వాన్ని సాధించకపోతే ఆ రంగాల్లోని పీడితులకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోతుంది. అప్పుడు వాళ్ళు  తిరగబడి ఇన్నేళ్ళుగా మనం కష్టపడి నిర్మించిన ఈ  ప్రజాస్వామిక భవనాన్ని పేల్చి పడేస్తారు” అని హెచ్చరించాడు.

ప్రతిదానికీ వున్నట్టు  రాజ్యాంగాలకూ ఒక ఎక్స్ పైరీ డేట్ వుంటుంది; అది పెట్టుబడీదారుల రాజ్యాంగం కావచ్చు, సోషలిస్టుల రాజ్యాంగం కావచ్చు. దేనికీ మినహాయింపులేదు. రాజ్యాంగాలు ఎల్లకాలం తొలినాటి ఆదర్శాలతో కొనసాగలేవని వివిధ దేశాల చరిత్ర మనకు చెపుతున్నది.

రాజ్యాంగం అమల్లోనికి వచ్చి 50 యేళ్ళు అయిన సందర్భంగా 2000లో ఒక చర్చ మొదలయింది. అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ తన రిపబ్లిక్ డే ప్రసంగంలో “రాజ్యాంగం విఫలమయిందా? లేక మనం దాన్ని విఫలం చేశామా?” అని ప్రశ్నించారు.

స్వాతంత్ర్యానంతర భారతదేశంలో ముస్లింలను ఒక పథకం ప్రకారం ‘నయా అస్పృశ్యులు'గా మార్చారు. రాజకీయార్థిక సామాజిక రంగాల నుండి వాళ్ళను బుల్ డోజర్లతో నెట్టి పడేసారు.  2019 లోక్ సభ ఎన్నికల్ని పీష్వా బాలాజీ బాజీరావు, అహమద్ షా దుర్రానీ అబ్దాలీల మధ్య పోటీగా జరిపారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఛత్రపతి శివాజీ,  ఔరంగజేబ్ ల మధ్య పోటీగా జరిగాయి, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు రాణి అబ్బక్క, టిప్పూ సుల్తాన్ ల మధ్య పోటీగా జరిగాయి. రేపు లోక్ సభ ఎన్నికల్ని శ్రీరామునికీ శంభుకునికి మధ్య జరపడానికి పూర్తి సన్నాహాలు చేస్తున్నారు. 

          పోటీలోవున్న ఏ అభ్యర్ధి  తమకు నచ్చలేదని చెప్పడానికి పోలింగ్ లో ‘నోటా’ ను వాడడం ఒక ప్రజాస్వామిక హక్కుగా మనం భావిస్తున్నాం. “ముస్లింల ఓట్లు మాకు వద్దు” అనడం కూడ ఎన్నికల్లో ఒక ప్రజాస్వామిక హక్కుగా చెలామణీ అయిపోతున్నది. ఐదేళ్ళకొకసారి ఎన్నికలు జరపడమే కొలమానం కనుక దీన్ని వామపక్షాలు సహితం ప్రజాస్వామ్యం అనక తప్పడంలేదు. పైగా, ఇవన్నీ రాజ్యాంగ బధ్ధంగా, దేశ అత్యున్నత న్యాయస్థానం ఆశిస్సులతోనే జరుగుతున్నాయి. 

          ‘న్యాయం, స్వేఛా, సమానత్వం, సోదరభావం’ అనే రాజ్యాంగ ఆదర్శాలను అమలు చేయడానికి  ప్రభుత్వాలు చట్టాలు చేయాలి. ప్రభుత్వం తప్పుచేస్తే దాన్ని న్యాయస్థానం సరిదిద్దాలి అన్నంత వరకు బాగానే వుంది. రాజ్యాంగ రచయితలు న్యాయమూర్తుల్ని మరీ ఎక్కువగా నమ్మినట్టున్నారు. న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులు కూడ తప్పుచేస్తే? అనే సందేహం అప్పుడు రాలేదు. ఇప్పుడు వస్తున్నది. ఏం చేయాలీ?

వామపక్షాల వైఖరి

          భూస్వామ్యవ్యవస్థకన్నా పెట్టుబడీదారీవ్యవస్థ విప్లవకరమైనదని కార్ల్ మార్క్స్ – ఫ్రెడరిక్ ఏంగిల్స్ స్వయంగా మెచ్చుకున్నారు. లెనిన్ కూ అలాంటి అభిప్రాయమే వుంది. పెట్టుబడీదారీ వ్యవస్థను మించిన సోషలిస్టు, కమ్యూనిస్టు సమాజాలను నిర్మించాలంటే పెట్టుబడీదారీ రాజ్యాంగాన్ని మించిన రాజ్యాంగాలను రూపొందించుకోవాలని వాళ్ళు సమంజసంగానే ఆలోచించారు. మహాత్మా గాంధీజీ మరణం తరువాత 1948 ఫిబ్రవరిలో కలకత్తాలో జరిగిన ఉమ్మడి కమ్యూనిస్టు పార్టి జాతీయ మహాసభల్లో అప్పటి పార్టి ప్రధాన కార్యదర్శి   బిటి రణదివె స్వాతంత్ర్యాన్ని ‘అధికార మార్పిడి’గా పేర్కొన్నాడు.  దాదాపు అదే సమయంలో రాజ్యాంగ సభ లక్ష్య ప్రకటన తీర్మానాన్ని (ఆబ్జెక్టివ్ రిజల్యూషన్) ఆమోదించింది.  ‘న్యాయం, స్వేఛ్ఛా, సమానత్వం, సోదరభావం’ వంటి ఆదర్శాలు ఆ తీర్మానంలో వున్నాయి. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టి అప్పటికి వాటిని నమ్మలేదు సాయుధపోరాటానికి పిలుపిచ్చింది. లక్ష్య ప్రకటన తీర్మానమే తరువాత రాజ్యాంగ ప్రవేశిక (preamble)గా మారింది.

 అంబేడ్కరే ఆద్యుడు

రాజ్యాంగం మీద చర్చను ఒక విధంగా అంబేడ్కరే మొదలెట్టాడు అనవచ్చు. రాజ్యాంగం ఒక నిబంధనావళి కనుక అందులో ప్రకటించుకున్న ఆదర్శాలకన్నా వాటిని అమలు చేసేవారే ముఖ్యం. “అమలుపరచేవారు చెడ్డవారయితే మంచి రాజ్యాంగం కూడ చెడ్డదయిపోతుంది. అమలుపరచేవారు మంచివారయితే చెడ్డ రాజ్యాంగం కూడ మంచిదయిపోతుంది”  అన్నాడు. ఆయన అంతటితో ఆగలేదు; “గొప్ప ఆదర్శంతో దేవాలయాన్ని నిర్మిస్తే దాన్ని ప్రారంభించడానికి ముందే దెయ్యాలు ఆక్రమించుకున్నాయి” అన్నాడు. రాజ్యాంగం అమల్లోనికి వచ్చాక కూడ సమాజంలో పీడన కొనసాగుతుంటే దాన్ని ఇతరులకన్నా ముందు తనే తగలబెడతాననీ అన్నాడు. 

భారత కమ్యూనిస్టుల తప్పులు

వ్యవస్థను మార్చడానికి సిధ్ధపడిన వారికి మాత్రమే వ్యవస్థ అర్ధం అవుతుంది. జ్ఞానం అంటే చదవడంకాదు; మార్చడానికి ప్రయత్నించడం. “ఆలోచనాపరులు ప్రపంచాన్ని రకరకాలుగా వ్యాఖ్యానించారు; కానీ చెయ్యాల్సిందేమంటే దాన్ని మార్చడం అన్నాడు”  కార్ల్స్ మార్క్స్. లెనిన్ మరింత స్పష్టంగా “నిర్ధిష్ట పరిస్థితుల, నిర్ధిష్ట విశ్లేషణ” అన్నాడు. విశ్లేషించడం అంటే ఆ వ్యవస్థలో పీడకులు ఎవరో, పీడితులు ఎవరో తేల్చడం. భారత సమాజ  నిర్ధిష్ట పరిస్థితుల, నిర్ధిష్ట విశ్లేషణను భారత కమ్యూనిస్టు పార్టీలు ఏవీ ఇప్పటి వరకు చేయలేదు. ముఖ్యంగా, అప్పట్లో కుల వ్యవస్థనూ, ఇప్పట్లో మత వ్యవస్థను నిర్దిష్టంగా విశ్లేషించలేదు. సాంస్కృతిక మ్యాపింగ్ విధానాలు (Cultural Cartography) అభివృధ్ధి చెందిన కాలంలో అలాంటి విశ్లేషణలు చేయకుండా కమ్యూనిస్టు పార్టీలు చేపట్టిన పోరాటాలు లక్ష్యాలను సాధించలేదు. పైగా,  పెట్టుబడీదారీ వ్యవస్థ బలపడడానికే అవి దోహదపడ్డాయి. పీడిత ప్రజలు ఆర్ధిక ప్రయోజనాలకు ఆశపడేమాట నిజమేగానీ వాళ్ళు అంతకన్నా తమ సాంస్కృతిక ఉనికినే బలంగా కోరుకుంటారు. పీడిత ప్రజల సాంస్కృతిక మనోభావాలను కమ్యూనిస్టు పార్టీలు గుర్తించలేదు. అవి క్రమంగా ప్రజాదరణను కోల్పోతుండడానికి ఇది ప్రధాన కారణం.

 ఫూలే – అంబేడ్కరిస్టుల వైఖరి

వ్యవస్థ  భూస్వామ్యం నుండి పెట్టుబడీదారీ దిశగా, అక్కడి నుండి కార్పొరేట్ దశగా మారే క్రమంలో ఎస్టి, ఎస్సి, బిసిలకు చాలా మేళ్లు జరిగాయి. పట్టణీకరణ – నగరీకరణ జరిగేకొద్దీ బహుజనుల ఆత్మగౌరవం పెరిగింది. వాళ్ళ ఉనికిని కాపాడే అనేక చట్టాలు వచ్చాయి. రాజ్యాంగం కులాన్ని మతాన్ని గుర్తించింది.  ఆస రెండు వ్యవస్ధలలోని పీడితులకు కులమత ప్రాతిపదికగా ఉద్దీపన చర్యల్ని  ప్రకటించింది. ఈ రెండు పనుల్ని   కమ్యూనిస్టు పార్టీలు   చేయలేదు;  పైగా నిరాకరించాయి.

కనీసం మనుషులుగానే పరిగణించని సమూహాలకు వ్యక్తిగత ఆస్తిహక్కు వచ్చింది. వ్యక్తిగత ఆస్తిహక్కువల్ల కార్పొరేట్లకే ఎక్కువ మేలు జరుగుతున్నదనేది నిజమే. సంపద ఒక చోట పోగవుతూ మరోవైపు పేదరికం పెరుగుతున్నదనేదీ వాస్తవమే.  అయినప్పటికీ, సాంస్కృతికంగా  అణగారిన సమూహాలకు ఆస్తిహక్కువల్ల కొంచెం ఊపిరి పీల్చుకునే అవకాశం కలుగుతోంది. దీనికి కారణం రాజ్యాంగమేనని వాళ్ళు నమ్ముతున్నారు.  ఈ ఘనత అంబేడ్కర్ దేనని వాళ్ళు భావించడమూ సహజం.

మార్క్సిస్టు - లెనినిస్టు పార్టీల వైఖరి

మార్క్సిస్టు - లెనినిస్టు పార్టీలకు పెట్టుబడీదారీ రాజ్యాంగం మీద ఎన్నడూ నమ్మకం లేదు. రాజ్యాంగ ఆదర్శాలను ప్రభుత్వాధినేతలు ఏమాత్రం పాటించరు అనే అభిప్రాయం వారిలో బలంగా వుంటుంది. వాళ్ళే ప్రకటించుకున్న రాజ్యాంగాన్ని వాళ్ళే పాటించడం లేదు అనేది వాళ్ళ ప్రధాన విమర్శ. ప్రాతినిధ్య పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మొత్తంగా కార్పొరేట్లు హైజాక్ చేసినపుడు ప్రత్యామ్నాయం ఏమిటీ? అనేది ఇప్పుడు సమంజసమైన ప్రశ్న. ఇటీవల విజయవాడలో జరిగిన విప్లవ రచయితల సంఘం (విరసం) మహాసభలో ఇదే ప్రధాన చర్చనీయాంశం.   

అస్పృశ్యులు ఏకంకావాలి

ముస్లిం మతమైనారిటీల ఉనికి అంతరించిపోయే సందర్భం వచ్చినపుడు తలెత్తిన షాహీన్ బాగ్ ఉద్యమం భారత రాజ్యాంగాన్నే ఆశ్రయించింది. మార్క్స్  ఒక సందర్భంలో మతం గురించి చెప్పినట్టు నిస్సహాయులకు రాజ్యాంగం  పెద్ద దిక్కుగా కన్పించింది; నిరాశ్రయులకు ఒక ఆశ్రయంగా మారింది. “స్వేఛ్ఛా, సమానత్వం, సోదర భావం” నినాదాలతో ఢిల్లీ నగర శివార్లు ప్రతిధ్వనించాయి.  ఆ తరువాత సాగిన రైతాంగ ఉద్యమం షాహీన్ బాగ్ నుండే స్పూర్తి పొందింది. ఉమ్మడి పౌరస్మృతి అంశం ముందుకు వచ్చినప్పుడు ఈశాన్య భారత దేశంలోను ఆదివాసులు షాహీన్ బాగ్ మార్గాన్నే అనుసరించారు. వాళ్ళూ రాజ్యాంగాన్ని హృదయాలకు హత్తుకున్నారు.

కార్పొరేట్ వ్యవస్థను, అది రాజ్యాంగ ఆదర్శాలను కాలరాస్తున్న తీరునూ విరసం విమర్శించడంలో తప్పులేదు. విమర్శించాలి కూడ. పనికి రానపుడు రాజ్యాంగాన్నీ తిరస్కరించవచ్చు. కానీ, రాజ్యాంగంవల్ల తమ జీవితాలు కొంతవరకయినా (అది 10 శాతమే కావచ్చు) బాగుపడ్డాయని నమ్ముతున్న  పీడిత సమూహాలతో సున్నితంగా వ్యవహరించాలి. మతోన్మాదాన్ని ఆశ్రయించి  బలపడుతున్న కార్పొరేట్ వ్యవస్థలోని పీడితుల్ని, అస్పృశ్యుల్ని, నయా అస్పృశ్యుల్ని ఏకం చేయడానికి ప్రయత్నించాలి. ఇన్ని విశాల సమూహాలు రాజ్యాంగాన్ని నమ్ముతున్నప్పుడు వాళ్ళను కటువుగా ‘రాజ్యాంగవాదులు’ అనడం ఒక చారిత్రక తప్పిదం అవుతుంది.

ప్రత్యామ్నాయం ఏమిటీ?

నిస్సందేహంగా భారత రాజ్యాంగం ఒక సామాజిక విప్లవ దస్త్రం. అంతకన్నా మేలైన సమాజాన్ని నిర్మించాలనుకున్నవారు అంతకన్నా మేలైన, ఆచరణ సాధ్యమైన, రాజ్యాంగాన్ని ప్రతిపాదించాలి.

డానీ, సమాజ విశ్లేషకులు

రచన : ౩ జనవరి 2024

ప్రచురణ: 6 జనవరి 2024

https://www.andhrajyothy.com/2024/editorial/indian-constitution-is-revolutionary-but-1206999.html


'భారత రాజ్యాంగం విప్లవకరమైనదే కానీ...'

भारतीय संविधान क्रांतिकारी है लेकिन...

एबीएन , प्रकाशन दिनांक - फ़रवरी 06, 2024 | 

    वर्तमान भारतीय राजनीतिक परिदृश्य में दो विरोधाभासी वास्तविकताएँ एक साथ विद्यमान हैं। पहला: एक लोकतांत्रिक संविधान लागू है। कुछ लोग इसे धर्मनिरपेक्ष, समाजवादी संविधान भी कहते हैं। दूसरा: देश का शासन फासीवादी ताकतों के हाथ में चला गया। हमने लोकतांत्रिक संविधान के दौरान भी राष्ट्रपति के आदेश से देश में आपातकाल की घोषणा होते देखी है। अब हम उस दौर में फासीवादी ताकतों को राज्य की सत्ता पर काबिज होते देख रहे हैं, जब लोकतांत्रिक, धर्मनिरपेक्ष और समाजवादी संविधान लागू है।

क्या संविधान मासूमियत से फासीवाद को बढ़ावा देता है? क्या फासीवादी संविधान का बुद्धिमानी से उपयोग कर रहे हैं? ऐसे में सवाल उठना स्वाभाविक है. किसी भी तरह, भारतीय संविधान क्रांतिकारी है। इसने करोड़ों लोगों को जीवन का एक नया पट्टा दिया जो मनु द्वारा लगाए गए सामाजिक मानदंडों और चाणुक्य/कौटिल्य/विष्णुगुप्त द्वारा तैयार की गई आर्थिक नीतियों से प्रेरित व्यवस्था में फंसे हुए थे। दूसरे शब्दों में, संविधान ने जाति-धर्म प्रधान सामंती व्यवस्था को पूंजीवादी व्यवस्था में बदलने में उत्प्रेरक की भूमिका निभाई। हम समाज में गुणात्मक परिवर्तन स्पष्ट रूप से देख रहे हैं। इसके लिए संविधान की सराहना की जानी चाहिए.

बीआर अंबेडकर, जो संविधान सभा की दर्जन भर समितियों में से एक, मसौदा समिति के अध्यक्ष थे, ने अपने अंतिम भाषण (25 नवंबर, 1949) में संविधान की दायरे-सीमाओं का उल्लेख किया था। 'हर आदमी के लिए एक वोट; हमने हर वोट को समान मूल्य देकर राजनीति में समानता हासिल की है। हालाँकि, यह पर्याप्त नहीं है. सामाजिक एवं आर्थिक क्षेत्र में समानता प्राप्त की जानी चाहिए। भावी शासकों को इसके लिए प्रयास करना चाहिए। यदि वे जल्द से जल्द सामाजिक और आर्थिक क्षेत्रों में समानता हासिल नहीं करते हैं, तो उन क्षेत्रों में उत्पीड़ितों का लोकतंत्र में विश्वास खो जाएगा। फिर वे पलटेंगे और इस लोकतांत्रिक इमारत को उड़ा देंगे जिसे हमने वर्षों से कड़ी मेहनत से बनाया है,'' उन्होंने चेतावनी दी। बाकी सभी चीजों की तरह संविधान की भी एक समाप्ति तिथि होती है; यह पूंजीवादी संविधान या समाजवादी संविधान हो सकता है। कुछ भी छूट नहीं है. विभिन्न देशों का इतिहास हमें बताता है कि संविधान हमेशा शुरुआत के आदर्शों को जारी नहीं रख सकता।

आज़ादी के बाद के भारत में मुसलमानों को एक योजना के तहत 'नया अछूत' बना दिया गया। 2019 का लोकसभा चुनाव पेशवा बालाजी बाजीराव और अहमद शाह दुर्रानी अब्दाली के बीच लड़ा गया था। उत्तर प्रदेश विधानसभा चुनाव छत्रपति शिवाजी और औरंगजेब के बीच लड़ा गया था। कर्नाटक विधानसभा चुनाव रानी अब्बक्का और टीपू सुल्तान के बीच लड़ा गया था। श्रीराम और संभू के बीच कल होने वाले लोकसभा चुनाव की पूरी तैयारी की जा रही है.

हम मतदान में 'नोटा' का उपयोग करके यह कहना लोकतांत्रिक अधिकार मानते हैं कि उन्हें चुनाव में कोई भी उम्मीदवार पसंद नहीं है। चुनावों में 'हमें मुस्लिम वोट नहीं चाहिए' कहना भी लोकतांत्रिक अधिकार बनता जा रहा है. चूंकि हर पांच साल में चुनाव होते हैं, इसलिए इसे वामपंथी दलों वाला लोकतंत्र नहीं कहा जा सकता। इसके अलावा, यह सब संवैधानिक रूप से और देश की सर्वोच्च अदालत के आशीर्वाद से किया जा रहा है।

कार्ल मार्क्स-फ्रेडरिक एंगेल्स ने स्वयं पूंजीवाद की प्रशंसा करते हुए इसे सामंतवाद से अधिक क्रांतिकारी बताया। लेनिन की भी यही राय थी. उन्होंने उचित रूप से सोचा कि पूंजीवादी व्यवस्था से परे समाजवादी और साम्यवादी समाज के निर्माण के लिए पूंजीवादी संविधान से परे संविधान का निर्माण किया जाना चाहिए। महात्मा गांधी की मृत्यु के बाद फरवरी 1948 में कलकत्ता में आयोजित संयुक्त कम्युनिस्ट पार्टी की राष्ट्रीय कांग्रेस में पार्टी के तत्कालीन महासचिव बीटी रणदिवे ने स्वतंत्रता को 'सत्ता का हस्तांतरण' कहा था। लगभग उसी समय संविधान सभा ने उद्देश्य प्रस्ताव पारित किया। उस संकल्प में 'न्याय, स्वतंत्रता, समता, बंधुत्व' जैसे आदर्श हैं। यूनाइटेड कम्युनिस्ट पार्टी ने तब उन पर विश्वास नहीं किया और सशस्त्र संघर्ष का आह्वान किया। उद्देश्य की घोषणा संकल्प बाद में संविधान की प्रस्तावना बन गया।

कहा जा सकता है कि संविधान पर चर्चा की शुरुआत एक तरह से अंबेडकर ने ही की थी. चूंकि संविधान नियमों का एक समूह है, इसलिए इसमें घोषित आदर्शों की तुलना में उन्हें लागू करने वाले लोग अधिक महत्वपूर्ण हैं। "यदि निष्पादक बुरे हों तो एक अच्छा संविधान भी ख़राब हो जाता है।" यदि कार्यान्वयनकर्ता अच्छे हैं, तो एक बुरा संविधान भी अच्छा बन जाएगा', उन्होंने कहा। बात यहीं नहीं रुकी; उन्होंने कहा, 'यदि आप महान आदर्शों के साथ मंदिर का निर्माण करते हैं, तो आपके शुरू होने से पहले ही शैतान उस पर कब्जा कर लेंगे।' उन्होंने कहा कि अगर संविधान लागू होने के बाद भी समाज में अत्याचार जारी रहा तो वह दूसरों से पहले इसे जला देंगे.

'विचारकों ने दुनिया की विभिन्न तरीकों से व्याख्या की है; लेकिन जो करने की ज़रूरत है वह है इसे बदलना," कार्ल्स मार्क्स ने कहा। लेनिन ने अधिक स्पष्ट रूप से कहा 'विशिष्ट परिस्थितियाँ, विशिष्ट विश्लेषण'। विश्लेषण करने का अर्थ है यह निर्धारित करना कि उस व्यवस्था में उत्पीड़क कौन है और उत्पीड़ित कौन है। भारतीय कम्युनिस्ट पार्टियों में से किसी ने भी अब तक भारतीय समाज की विशिष्ट स्थितियों का विशेष विश्लेषण नहीं किया है। विशेष रूप से, तब न तो जाति व्यवस्था और न ही धार्मिक व्यवस्था का विशेष रूप से विश्लेषण किया गया था। उस अवधि के दौरान जब सांस्कृतिक मानचित्रण विकसित हुआ था, ऐसे विश्लेषण के बिना, कम्युनिस्ट पार्टियों द्वारा किए गए संघर्षों ने अपने लक्ष्य हासिल नहीं किए। इसके अलावा, उन्होंने निवेश प्रणाली को मजबूत करने में मदद की। यह सच है कि उत्पीड़ित लोग आर्थिक लाभ की आशा रखते हैं, लेकिन वे अपना सांस्कृतिक अस्तित्व और अधिक मजबूती से चाहते हैं। यही मुख्य कारण है कि कम्युनिस्ट पार्टियाँ धीरे-धीरे लोकप्रियता खोती जा रही हैं।

एसटी एससी बीसी ने व्यवस्था को जमींदारी से पूंजीकरण और वहां से कॉर्पोरेट चरण में बदलने की प्रक्रिया में बहुत अच्छा काम किया है। शहरीकरण - जैसे-जैसे शहरीकरण हुआ, जनता का आत्म-सम्मान बढ़ा। इनके अस्तित्व की रक्षा के लिए कई कानून पारित किये गये हैं। कम से कम उन समूहों को निजी संपत्ति का अधिकार प्राप्त हुआ जिन्हें मानव नहीं माना जाता था। यह सच है कि निजी संपत्ति अधिकारों से निगमों को सबसे अधिक लाभ होता है। यह भी सत्य है कि एक जगह धन का प्रवाह हो रहा है तो दूसरी ओर गरीबी बढ़ती जा रही है। हालाँकि, वर्तमान स्थिति सांस्कृतिक रूप से उत्पीड़ित समूहों के लिए थोड़ी राहत की बात है। उनका मानना ​​है कि इसकी वजह संविधान है. स्वाभाविक है कि वे सोचते हैं कि यह उपलब्धि अम्बेडकर की है।

दूसरी ओर, मार्क्सवादी-लेनिनवादी पार्टियों ने कभी भी पूंजीवादी संविधान में विश्वास नहीं किया। उनमें यह राय प्रबल है कि शासनाध्यक्ष संवैधानिक आदर्शों का पालन नहीं करते। उनकी मुख्य आलोचना यह है कि वे अपने द्वारा घोषित संविधान का पालन नहीं कर रहे हैं। जब प्रतिनिधि संसदीय लोकतंत्र पूरी तरह से कॉरपोरेट्स द्वारा अपहरण कर लिया गया है तो विकल्प क्या है? एक वाजिब सवाल है. हाल ही में विजयवाड़ा में आयोजित क्रांतिकारी लेखक संघ (विरासम) महासभा में यह चर्चा का मुख्य विषय था।

मुस्लिम अल्पसंख्यकों का अस्तित्व समाप्त होने पर उठे शाहीन बाग आंदोलन ने भारत के संविधान का ही सहारा लिया। इसे बेघरों और असहायों के लिए एक महान दिशा के रूप में देखा गया। दिल्ली का बाहरी इलाका 'स्वतंत्रता, समानता, बंधुत्व' के नारों से गूंज उठा। इसके बाद जो किसान आंदोलन हुआ वह शाहीन बाग से ही प्रेरित था। जब समान नागरिकता का मुद्दा आया तो पूर्वोत्तर भारत के आदिवासियों ने शाहीन बाग का रास्ता अपनाया. संविधान को दिल से लगा लिया गया.

कॉरपोरेट व्यवस्था और जिस तरह से यह संवैधानिक आदर्शों को नष्ट कर रही है, उसकी आलोचना करने में कुछ भी गलत नहीं है। आलोचना भी करें. सभी संविधानों को तब खारिज किया जा सकता है जब वे काम न करें। लेकिन, जो दलित समूह यह मानते हैं कि संविधान से उनके जीवन में सुधार हुआ है, उनके साथ संवेदनशीलता से पेश आना चाहिए। कट्टरता का सहारा लेकर मजबूत हो रही कॉरपोरेट व्यवस्था में दलितों, अछूतों और नये अछूतों को एकजुट करने का प्रयास किया जाना चाहिए. जब इतना बड़ा समूह संविधान में विश्वास करता था तो उन्हें पूरी तरह से 'संविधानवादी' कहना एक ऐतिहासिक गलती होगी। निस्संदेह भारत का संविधान एक सामाजिक क्रांतिकारी दस्तावेज़ है। जो लोग एक बेहतर समाज का निर्माण करना चाहते हैं उन्हें एक बेहतर, व्यावहारिक संविधान का प्रस्ताव देना चाहिए।

डैनी

सामुदायिक विश्लेषक