Monday, 5 February 2024

Indian Constitution is a Revolutionary Document, But,

'భారత రాజ్యాంగం విప్లవకరమైనదే కానీ...'

వర్తమాన భారత రాజకీయ రంగంలో రెండు పరస్పర విరుధ్ధ వాస్తవాలు ఒకేసారి కొనసాగుతున్నాయి. మొదటిది;  ఒక ప్రజాస్వామిక రాజ్యాంగం అమలులో వున్నది. కొందరు దీన్ని లౌకిక, సామ్యవాద రాజ్యాంగం అని కూడ అంటున్నారు. రెండోది; దేశ పరిపాలన ఫాసిస్టు శక్తుల చేతుల్లోనికి పోయింది. ప్రజాస్వామిక రాజ్యాంగం అమలులోవుఉన్న కాలంలోనే రాష్ట్రపతి ఉత్తర్వులతో దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించడాన్ని గతంలో మనం చూశాం. ప్రజాస్వామిక, లౌకిక, సామ్యవాద రాజ్యాంగం అమల్లోవున్న కాలంలోనే ఫాసిస్టుశక్తులు రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడాన్నీ ఇప్పుడు చూస్తున్నాం.

          రాజ్యాంగం అమాయికంగా ఫాసిజాన్ని ప్రమోట్ చేస్తున్నదా?  ఫాసిస్టులు రాజ్యాంగాన్ని తెలివిగా వాడుకుంటున్నారా? అనే ప్రశ్న ఈ సందర్భంగా తలెత్తడం సహజం. నిజానికి ఇదేమీ విడ్డూరంకాదు. 1920లలో ఇటలీలో ఫాసిస్టు బెనిటో ముస్సోలినీ, 1930లలో జర్మనీలో నాజీస్టు అడాల్ఫ్ హిట్లర్ కూడ రాజ్యాంగ బధ్ధంగా ప్రజాస్వామిక ప్రాతినిధ్య పార్లమెంటరీ ఎన్నికల ద్వారానే అధికారాన్ని చేపట్టారు.  ఇంకో పోలిక ఏమంటే నాజీ పార్టి అంటే ‘జాతీయ సామ్యవాద జర్మన్ శ్రామికుల పార్టి’ (National Socialist German Workers' Party).

ఒకవైపు జాతియోద్యమ ఆదర్శాలు, దేశవిభజన కల్లోలం, మరోవైపు, దున్నేవానికి భూమి కోసం రైతాంగ సాయుధ పోరాటాలు  సాగుతున్న కాలంలో  రాజ్యాంగం పుట్టింది. ఎలా చూసినా భారత రాజ్యాంగం విప్లవకరమైనది. అమెరిక ప్రజాస్వామిక చరిత్రలో 1787 నాటి ఫిలడెల్ఫియా  కన్వెన్షన్ కన్నా 1946 నుండి 1949 చివరి వరకు సాగిన భారత రాజ్యాంగ సభ గొప్పది. మనువు విధించిన సామాజిక నిబంధనలతో, చాణుక్యుడు/కౌటిల్యుడు/విష్ణుగుప్తుడు రూపొందించిన ఆర్ధిక విధానాలతో నడిచే వ్యవస్థలో నలిగిపోతున్న కోట్లాది మంది ప్రజానీకానికి రాజ్యాంగం కొత్త జీవితాన్ని ఇచ్చింది. మరోమాటల్లో చెప్పాలంటే, కుల-మత ప్రధాన  ఫ్యూడల్ వ్యవస్థను పెట్టుబడీదారీ వ్యవస్థగా మార్చడంలో రాజ్యాంగం కేటలిస్ట్ పాత్రను నిర్వహించింది. సమాజంలో వచ్చిన ఆ గుణాత్మకమార్పును మనం స్పష్టంగా చూస్తున్నాం. అందుకు రాజ్యాంగాన్ని మెచ్చుకోవాలి.

రాజ్యాంగ సభలోని దాదాపు డజను కమిటీల్లో కీలకమైన డ్రాఫ్టింగ్ కమిటీకి ఛైర్మన్ గా వ్యవహరించిన బిఆర్ అంబేడ్కర్ తన చివరి ఉపన్యాసంలో (నవంబరు 25, 1949) రాజ్యాంగం పరిధి-పరిమితుల గురించి ప్రస్తావించాడు. “ప్రతి మనిషికీ ఒక ఓటు; ప్రతి ఓటుకూ సమాన విలువ ఇవ్వడం ద్వార రాజకీయరంగంలో సమానత్వాన్ని సాధించాము. అయితే, ఇది సరిపోదు. సాంఘీక, ఆర్ధిక రంగాల్లోనూ సమానత్వాన్ని సాధించితీరాలి.  భవిష్యత్తు పాలకులు అందుకు కృషిచేయాలి. వాళ్ళు సాధ్యమైనంత త్వరగా  సాంఘీక, ఆర్ధిక రంగాల్లో సమానత్వాన్ని సాధించకపోతే ఆ రంగాల్లోని పీడితులకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోతుంది. అప్పుడు వాళ్ళు  తిరగబడి ఇన్నేళ్ళుగా మనం కష్టపడి నిర్మించిన ఈ  ప్రజాస్వామిక భవనాన్ని పేల్చి పడేస్తారు” అని హెచ్చరించాడు.

ప్రతిదానికీ వున్నట్టు  రాజ్యాంగాలకూ ఒక ఎక్స్ పైరీ డేట్ వుంటుంది; అది పెట్టుబడీదారుల రాజ్యాంగం కావచ్చు, సోషలిస్టుల రాజ్యాంగం కావచ్చు. దేనికీ మినహాయింపులేదు. రాజ్యాంగాలు ఎల్లకాలం తొలినాటి ఆదర్శాలతో కొనసాగలేవని వివిధ దేశాల చరిత్ర మనకు చెపుతున్నది.

రాజ్యాంగం అమల్లోనికి వచ్చి 50 యేళ్ళు అయిన సందర్భంగా 2000లో ఒక చర్చ మొదలయింది. అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ తన రిపబ్లిక్ డే ప్రసంగంలో “రాజ్యాంగం విఫలమయిందా? లేక మనం దాన్ని విఫలం చేశామా?” అని ప్రశ్నించారు.

స్వాతంత్ర్యానంతర భారతదేశంలో ముస్లింలను ఒక పథకం ప్రకారం ‘నయా అస్పృశ్యులు'గా మార్చారు. రాజకీయార్థిక సామాజిక రంగాల నుండి వాళ్ళను బుల్ డోజర్లతో నెట్టి పడేసారు.  2019 లోక్ సభ ఎన్నికల్ని పీష్వా బాలాజీ బాజీరావు, అహమద్ షా దుర్రానీ అబ్దాలీల మధ్య పోటీగా జరిపారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఛత్రపతి శివాజీ,  ఔరంగజేబ్ ల మధ్య పోటీగా జరిగాయి, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు రాణి అబ్బక్క, టిప్పూ సుల్తాన్ ల మధ్య పోటీగా జరిగాయి. రేపు లోక్ సభ ఎన్నికల్ని శ్రీరామునికీ శంభుకునికి మధ్య జరపడానికి పూర్తి సన్నాహాలు చేస్తున్నారు. 

          పోటీలోవున్న ఏ అభ్యర్ధి  తమకు నచ్చలేదని చెప్పడానికి పోలింగ్ లో ‘నోటా’ ను వాడడం ఒక ప్రజాస్వామిక హక్కుగా మనం భావిస్తున్నాం. “ముస్లింల ఓట్లు మాకు వద్దు” అనడం కూడ ఎన్నికల్లో ఒక ప్రజాస్వామిక హక్కుగా చెలామణీ అయిపోతున్నది. ఐదేళ్ళకొకసారి ఎన్నికలు జరపడమే కొలమానం కనుక దీన్ని వామపక్షాలు సహితం ప్రజాస్వామ్యం అనక తప్పడంలేదు. పైగా, ఇవన్నీ రాజ్యాంగ బధ్ధంగా, దేశ అత్యున్నత న్యాయస్థానం ఆశిస్సులతోనే జరుగుతున్నాయి. 

          ‘న్యాయం, స్వేఛా, సమానత్వం, సోదరభావం’ అనే రాజ్యాంగ ఆదర్శాలను అమలు చేయడానికి  ప్రభుత్వాలు చట్టాలు చేయాలి. ప్రభుత్వం తప్పుచేస్తే దాన్ని న్యాయస్థానం సరిదిద్దాలి అన్నంత వరకు బాగానే వుంది. రాజ్యాంగ రచయితలు న్యాయమూర్తుల్ని మరీ ఎక్కువగా నమ్మినట్టున్నారు. న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులు కూడ తప్పుచేస్తే? అనే సందేహం అప్పుడు రాలేదు. ఇప్పుడు వస్తున్నది. ఏం చేయాలీ?

వామపక్షాల వైఖరి

          భూస్వామ్యవ్యవస్థకన్నా పెట్టుబడీదారీవ్యవస్థ విప్లవకరమైనదని కార్ల్ మార్క్స్ – ఫ్రెడరిక్ ఏంగిల్స్ స్వయంగా మెచ్చుకున్నారు. లెనిన్ కూ అలాంటి అభిప్రాయమే వుంది. పెట్టుబడీదారీ వ్యవస్థను మించిన సోషలిస్టు, కమ్యూనిస్టు సమాజాలను నిర్మించాలంటే పెట్టుబడీదారీ రాజ్యాంగాన్ని మించిన రాజ్యాంగాలను రూపొందించుకోవాలని వాళ్ళు సమంజసంగానే ఆలోచించారు. మహాత్మా గాంధీజీ మరణం తరువాత 1948 ఫిబ్రవరిలో కలకత్తాలో జరిగిన ఉమ్మడి కమ్యూనిస్టు పార్టి జాతీయ మహాసభల్లో అప్పటి పార్టి ప్రధాన కార్యదర్శి   బిటి రణదివె స్వాతంత్ర్యాన్ని ‘అధికార మార్పిడి’గా పేర్కొన్నాడు.  దాదాపు అదే సమయంలో రాజ్యాంగ సభ లక్ష్య ప్రకటన తీర్మానాన్ని (ఆబ్జెక్టివ్ రిజల్యూషన్) ఆమోదించింది.  ‘న్యాయం, స్వేఛ్ఛా, సమానత్వం, సోదరభావం’ వంటి ఆదర్శాలు ఆ తీర్మానంలో వున్నాయి. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టి అప్పటికి వాటిని నమ్మలేదు సాయుధపోరాటానికి పిలుపిచ్చింది. లక్ష్య ప్రకటన తీర్మానమే తరువాత రాజ్యాంగ ప్రవేశిక (preamble)గా మారింది.

 అంబేడ్కరే ఆద్యుడు

రాజ్యాంగం మీద చర్చను ఒక విధంగా అంబేడ్కరే మొదలెట్టాడు అనవచ్చు. రాజ్యాంగం ఒక నిబంధనావళి కనుక అందులో ప్రకటించుకున్న ఆదర్శాలకన్నా వాటిని అమలు చేసేవారే ముఖ్యం. “అమలుపరచేవారు చెడ్డవారయితే మంచి రాజ్యాంగం కూడ చెడ్డదయిపోతుంది. అమలుపరచేవారు మంచివారయితే చెడ్డ రాజ్యాంగం కూడ మంచిదయిపోతుంది”  అన్నాడు. ఆయన అంతటితో ఆగలేదు; “గొప్ప ఆదర్శంతో దేవాలయాన్ని నిర్మిస్తే దాన్ని ప్రారంభించడానికి ముందే దెయ్యాలు ఆక్రమించుకున్నాయి” అన్నాడు. రాజ్యాంగం అమల్లోనికి వచ్చాక కూడ సమాజంలో పీడన కొనసాగుతుంటే దాన్ని ఇతరులకన్నా ముందు తనే తగలబెడతాననీ అన్నాడు. 

భారత కమ్యూనిస్టుల తప్పులు

వ్యవస్థను మార్చడానికి సిధ్ధపడిన వారికి మాత్రమే వ్యవస్థ అర్ధం అవుతుంది. జ్ఞానం అంటే చదవడంకాదు; మార్చడానికి ప్రయత్నించడం. “ఆలోచనాపరులు ప్రపంచాన్ని రకరకాలుగా వ్యాఖ్యానించారు; కానీ చెయ్యాల్సిందేమంటే దాన్ని మార్చడం అన్నాడు”  కార్ల్స్ మార్క్స్. లెనిన్ మరింత స్పష్టంగా “నిర్ధిష్ట పరిస్థితుల, నిర్ధిష్ట విశ్లేషణ” అన్నాడు. విశ్లేషించడం అంటే ఆ వ్యవస్థలో పీడకులు ఎవరో, పీడితులు ఎవరో తేల్చడం. భారత సమాజ  నిర్ధిష్ట పరిస్థితుల, నిర్ధిష్ట విశ్లేషణను భారత కమ్యూనిస్టు పార్టీలు ఏవీ ఇప్పటి వరకు చేయలేదు. ముఖ్యంగా, అప్పట్లో కుల వ్యవస్థనూ, ఇప్పట్లో మత వ్యవస్థను నిర్దిష్టంగా విశ్లేషించలేదు. సాంస్కృతిక మ్యాపింగ్ విధానాలు (Cultural Cartography) అభివృధ్ధి చెందిన కాలంలో అలాంటి విశ్లేషణలు చేయకుండా కమ్యూనిస్టు పార్టీలు చేపట్టిన పోరాటాలు లక్ష్యాలను సాధించలేదు. పైగా,  పెట్టుబడీదారీ వ్యవస్థ బలపడడానికే అవి దోహదపడ్డాయి. పీడిత ప్రజలు ఆర్ధిక ప్రయోజనాలకు ఆశపడేమాట నిజమేగానీ వాళ్ళు అంతకన్నా తమ సాంస్కృతిక ఉనికినే బలంగా కోరుకుంటారు. పీడిత ప్రజల సాంస్కృతిక మనోభావాలను కమ్యూనిస్టు పార్టీలు గుర్తించలేదు. అవి క్రమంగా ప్రజాదరణను కోల్పోతుండడానికి ఇది ప్రధాన కారణం.

 ఫూలే – అంబేడ్కరిస్టుల వైఖరి

వ్యవస్థ  భూస్వామ్యం నుండి పెట్టుబడీదారీ దిశగా, అక్కడి నుండి కార్పొరేట్ దశగా మారే క్రమంలో ఎస్టి, ఎస్సి, బిసిలకు చాలా మేళ్లు జరిగాయి. పట్టణీకరణ – నగరీకరణ జరిగేకొద్దీ బహుజనుల ఆత్మగౌరవం పెరిగింది. వాళ్ళ ఉనికిని కాపాడే అనేక చట్టాలు వచ్చాయి. రాజ్యాంగం కులాన్ని మతాన్ని గుర్తించింది.  ఆస రెండు వ్యవస్ధలలోని పీడితులకు కులమత ప్రాతిపదికగా ఉద్దీపన చర్యల్ని  ప్రకటించింది. ఈ రెండు పనుల్ని   కమ్యూనిస్టు పార్టీలు   చేయలేదు;  పైగా నిరాకరించాయి.

కనీసం మనుషులుగానే పరిగణించని సమూహాలకు వ్యక్తిగత ఆస్తిహక్కు వచ్చింది. వ్యక్తిగత ఆస్తిహక్కువల్ల కార్పొరేట్లకే ఎక్కువ మేలు జరుగుతున్నదనేది నిజమే. సంపద ఒక చోట పోగవుతూ మరోవైపు పేదరికం పెరుగుతున్నదనేదీ వాస్తవమే.  అయినప్పటికీ, సాంస్కృతికంగా  అణగారిన సమూహాలకు ఆస్తిహక్కువల్ల కొంచెం ఊపిరి పీల్చుకునే అవకాశం కలుగుతోంది. దీనికి కారణం రాజ్యాంగమేనని వాళ్ళు నమ్ముతున్నారు.  ఈ ఘనత అంబేడ్కర్ దేనని వాళ్ళు భావించడమూ సహజం.

మార్క్సిస్టు - లెనినిస్టు పార్టీల వైఖరి

మార్క్సిస్టు - లెనినిస్టు పార్టీలకు పెట్టుబడీదారీ రాజ్యాంగం మీద ఎన్నడూ నమ్మకం లేదు. రాజ్యాంగ ఆదర్శాలను ప్రభుత్వాధినేతలు ఏమాత్రం పాటించరు అనే అభిప్రాయం వారిలో బలంగా వుంటుంది. వాళ్ళే ప్రకటించుకున్న రాజ్యాంగాన్ని వాళ్ళే పాటించడం లేదు అనేది వాళ్ళ ప్రధాన విమర్శ. ప్రాతినిధ్య పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మొత్తంగా కార్పొరేట్లు హైజాక్ చేసినపుడు ప్రత్యామ్నాయం ఏమిటీ? అనేది ఇప్పుడు సమంజసమైన ప్రశ్న. ఇటీవల విజయవాడలో జరిగిన విప్లవ రచయితల సంఘం (విరసం) మహాసభలో ఇదే ప్రధాన చర్చనీయాంశం.   

అస్పృశ్యులు ఏకంకావాలి

ముస్లిం మతమైనారిటీల ఉనికి అంతరించిపోయే సందర్భం వచ్చినపుడు తలెత్తిన షాహీన్ బాగ్ ఉద్యమం భారత రాజ్యాంగాన్నే ఆశ్రయించింది. మార్క్స్  ఒక సందర్భంలో మతం గురించి చెప్పినట్టు నిస్సహాయులకు రాజ్యాంగం  పెద్ద దిక్కుగా కన్పించింది; నిరాశ్రయులకు ఒక ఆశ్రయంగా మారింది. “స్వేఛ్ఛా, సమానత్వం, సోదర భావం” నినాదాలతో ఢిల్లీ నగర శివార్లు ప్రతిధ్వనించాయి.  ఆ తరువాత సాగిన రైతాంగ ఉద్యమం షాహీన్ బాగ్ నుండే స్పూర్తి పొందింది. ఉమ్మడి పౌరస్మృతి అంశం ముందుకు వచ్చినప్పుడు ఈశాన్య భారత దేశంలోను ఆదివాసులు షాహీన్ బాగ్ మార్గాన్నే అనుసరించారు. వాళ్ళూ రాజ్యాంగాన్ని హృదయాలకు హత్తుకున్నారు.

కార్పొరేట్ వ్యవస్థను, అది రాజ్యాంగ ఆదర్శాలను కాలరాస్తున్న తీరునూ విరసం విమర్శించడంలో తప్పులేదు. విమర్శించాలి కూడ. పనికి రానపుడు రాజ్యాంగాన్నీ తిరస్కరించవచ్చు. కానీ, రాజ్యాంగంవల్ల తమ జీవితాలు కొంతవరకయినా (అది 10 శాతమే కావచ్చు) బాగుపడ్డాయని నమ్ముతున్న  పీడిత సమూహాలతో సున్నితంగా వ్యవహరించాలి. మతోన్మాదాన్ని ఆశ్రయించి  బలపడుతున్న కార్పొరేట్ వ్యవస్థలోని పీడితుల్ని, అస్పృశ్యుల్ని, నయా అస్పృశ్యుల్ని ఏకం చేయడానికి ప్రయత్నించాలి. ఇన్ని విశాల సమూహాలు రాజ్యాంగాన్ని నమ్ముతున్నప్పుడు వాళ్ళను కటువుగా ‘రాజ్యాంగవాదులు’ అనడం ఒక చారిత్రక తప్పిదం అవుతుంది.

ప్రత్యామ్నాయం ఏమిటీ?

నిస్సందేహంగా భారత రాజ్యాంగం ఒక సామాజిక విప్లవ దస్త్రం. అంతకన్నా మేలైన సమాజాన్ని నిర్మించాలనుకున్నవారు అంతకన్నా మేలైన, ఆచరణ సాధ్యమైన, రాజ్యాంగాన్ని ప్రతిపాదించాలి.

డానీ, సమాజ విశ్లేషకులు

రచన : ౩ జనవరి 2024

ప్రచురణ: 6 జనవరి 2024

https://www.andhrajyothy.com/2024/editorial/indian-constitution-is-revolutionary-but-1206999.html


'భారత రాజ్యాంగం విప్లవకరమైనదే కానీ...'

भारतीय संविधान क्रांतिकारी है लेकिन...

एबीएन , प्रकाशन दिनांक - फ़रवरी 06, 2024 | 

    वर्तमान भारतीय राजनीतिक परिदृश्य में दो विरोधाभासी वास्तविकताएँ एक साथ विद्यमान हैं। पहला: एक लोकतांत्रिक संविधान लागू है। कुछ लोग इसे धर्मनिरपेक्ष, समाजवादी संविधान भी कहते हैं। दूसरा: देश का शासन फासीवादी ताकतों के हाथ में चला गया। हमने लोकतांत्रिक संविधान के दौरान भी राष्ट्रपति के आदेश से देश में आपातकाल की घोषणा होते देखी है। अब हम उस दौर में फासीवादी ताकतों को राज्य की सत्ता पर काबिज होते देख रहे हैं, जब लोकतांत्रिक, धर्मनिरपेक्ष और समाजवादी संविधान लागू है।

क्या संविधान मासूमियत से फासीवाद को बढ़ावा देता है? क्या फासीवादी संविधान का बुद्धिमानी से उपयोग कर रहे हैं? ऐसे में सवाल उठना स्वाभाविक है. किसी भी तरह, भारतीय संविधान क्रांतिकारी है। इसने करोड़ों लोगों को जीवन का एक नया पट्टा दिया जो मनु द्वारा लगाए गए सामाजिक मानदंडों और चाणुक्य/कौटिल्य/विष्णुगुप्त द्वारा तैयार की गई आर्थिक नीतियों से प्रेरित व्यवस्था में फंसे हुए थे। दूसरे शब्दों में, संविधान ने जाति-धर्म प्रधान सामंती व्यवस्था को पूंजीवादी व्यवस्था में बदलने में उत्प्रेरक की भूमिका निभाई। हम समाज में गुणात्मक परिवर्तन स्पष्ट रूप से देख रहे हैं। इसके लिए संविधान की सराहना की जानी चाहिए.

बीआर अंबेडकर, जो संविधान सभा की दर्जन भर समितियों में से एक, मसौदा समिति के अध्यक्ष थे, ने अपने अंतिम भाषण (25 नवंबर, 1949) में संविधान की दायरे-सीमाओं का उल्लेख किया था। 'हर आदमी के लिए एक वोट; हमने हर वोट को समान मूल्य देकर राजनीति में समानता हासिल की है। हालाँकि, यह पर्याप्त नहीं है. सामाजिक एवं आर्थिक क्षेत्र में समानता प्राप्त की जानी चाहिए। भावी शासकों को इसके लिए प्रयास करना चाहिए। यदि वे जल्द से जल्द सामाजिक और आर्थिक क्षेत्रों में समानता हासिल नहीं करते हैं, तो उन क्षेत्रों में उत्पीड़ितों का लोकतंत्र में विश्वास खो जाएगा। फिर वे पलटेंगे और इस लोकतांत्रिक इमारत को उड़ा देंगे जिसे हमने वर्षों से कड़ी मेहनत से बनाया है,'' उन्होंने चेतावनी दी। बाकी सभी चीजों की तरह संविधान की भी एक समाप्ति तिथि होती है; यह पूंजीवादी संविधान या समाजवादी संविधान हो सकता है। कुछ भी छूट नहीं है. विभिन्न देशों का इतिहास हमें बताता है कि संविधान हमेशा शुरुआत के आदर्शों को जारी नहीं रख सकता।

आज़ादी के बाद के भारत में मुसलमानों को एक योजना के तहत 'नया अछूत' बना दिया गया। 2019 का लोकसभा चुनाव पेशवा बालाजी बाजीराव और अहमद शाह दुर्रानी अब्दाली के बीच लड़ा गया था। उत्तर प्रदेश विधानसभा चुनाव छत्रपति शिवाजी और औरंगजेब के बीच लड़ा गया था। कर्नाटक विधानसभा चुनाव रानी अब्बक्का और टीपू सुल्तान के बीच लड़ा गया था। श्रीराम और संभू के बीच कल होने वाले लोकसभा चुनाव की पूरी तैयारी की जा रही है.

हम मतदान में 'नोटा' का उपयोग करके यह कहना लोकतांत्रिक अधिकार मानते हैं कि उन्हें चुनाव में कोई भी उम्मीदवार पसंद नहीं है। चुनावों में 'हमें मुस्लिम वोट नहीं चाहिए' कहना भी लोकतांत्रिक अधिकार बनता जा रहा है. चूंकि हर पांच साल में चुनाव होते हैं, इसलिए इसे वामपंथी दलों वाला लोकतंत्र नहीं कहा जा सकता। इसके अलावा, यह सब संवैधानिक रूप से और देश की सर्वोच्च अदालत के आशीर्वाद से किया जा रहा है।

कार्ल मार्क्स-फ्रेडरिक एंगेल्स ने स्वयं पूंजीवाद की प्रशंसा करते हुए इसे सामंतवाद से अधिक क्रांतिकारी बताया। लेनिन की भी यही राय थी. उन्होंने उचित रूप से सोचा कि पूंजीवादी व्यवस्था से परे समाजवादी और साम्यवादी समाज के निर्माण के लिए पूंजीवादी संविधान से परे संविधान का निर्माण किया जाना चाहिए। महात्मा गांधी की मृत्यु के बाद फरवरी 1948 में कलकत्ता में आयोजित संयुक्त कम्युनिस्ट पार्टी की राष्ट्रीय कांग्रेस में पार्टी के तत्कालीन महासचिव बीटी रणदिवे ने स्वतंत्रता को 'सत्ता का हस्तांतरण' कहा था। लगभग उसी समय संविधान सभा ने उद्देश्य प्रस्ताव पारित किया। उस संकल्प में 'न्याय, स्वतंत्रता, समता, बंधुत्व' जैसे आदर्श हैं। यूनाइटेड कम्युनिस्ट पार्टी ने तब उन पर विश्वास नहीं किया और सशस्त्र संघर्ष का आह्वान किया। उद्देश्य की घोषणा संकल्प बाद में संविधान की प्रस्तावना बन गया।

कहा जा सकता है कि संविधान पर चर्चा की शुरुआत एक तरह से अंबेडकर ने ही की थी. चूंकि संविधान नियमों का एक समूह है, इसलिए इसमें घोषित आदर्शों की तुलना में उन्हें लागू करने वाले लोग अधिक महत्वपूर्ण हैं। "यदि निष्पादक बुरे हों तो एक अच्छा संविधान भी ख़राब हो जाता है।" यदि कार्यान्वयनकर्ता अच्छे हैं, तो एक बुरा संविधान भी अच्छा बन जाएगा', उन्होंने कहा। बात यहीं नहीं रुकी; उन्होंने कहा, 'यदि आप महान आदर्शों के साथ मंदिर का निर्माण करते हैं, तो आपके शुरू होने से पहले ही शैतान उस पर कब्जा कर लेंगे।' उन्होंने कहा कि अगर संविधान लागू होने के बाद भी समाज में अत्याचार जारी रहा तो वह दूसरों से पहले इसे जला देंगे.

'विचारकों ने दुनिया की विभिन्न तरीकों से व्याख्या की है; लेकिन जो करने की ज़रूरत है वह है इसे बदलना," कार्ल्स मार्क्स ने कहा। लेनिन ने अधिक स्पष्ट रूप से कहा 'विशिष्ट परिस्थितियाँ, विशिष्ट विश्लेषण'। विश्लेषण करने का अर्थ है यह निर्धारित करना कि उस व्यवस्था में उत्पीड़क कौन है और उत्पीड़ित कौन है। भारतीय कम्युनिस्ट पार्टियों में से किसी ने भी अब तक भारतीय समाज की विशिष्ट स्थितियों का विशेष विश्लेषण नहीं किया है। विशेष रूप से, तब न तो जाति व्यवस्था और न ही धार्मिक व्यवस्था का विशेष रूप से विश्लेषण किया गया था। उस अवधि के दौरान जब सांस्कृतिक मानचित्रण विकसित हुआ था, ऐसे विश्लेषण के बिना, कम्युनिस्ट पार्टियों द्वारा किए गए संघर्षों ने अपने लक्ष्य हासिल नहीं किए। इसके अलावा, उन्होंने निवेश प्रणाली को मजबूत करने में मदद की। यह सच है कि उत्पीड़ित लोग आर्थिक लाभ की आशा रखते हैं, लेकिन वे अपना सांस्कृतिक अस्तित्व और अधिक मजबूती से चाहते हैं। यही मुख्य कारण है कि कम्युनिस्ट पार्टियाँ धीरे-धीरे लोकप्रियता खोती जा रही हैं।

एसटी एससी बीसी ने व्यवस्था को जमींदारी से पूंजीकरण और वहां से कॉर्पोरेट चरण में बदलने की प्रक्रिया में बहुत अच्छा काम किया है। शहरीकरण - जैसे-जैसे शहरीकरण हुआ, जनता का आत्म-सम्मान बढ़ा। इनके अस्तित्व की रक्षा के लिए कई कानून पारित किये गये हैं। कम से कम उन समूहों को निजी संपत्ति का अधिकार प्राप्त हुआ जिन्हें मानव नहीं माना जाता था। यह सच है कि निजी संपत्ति अधिकारों से निगमों को सबसे अधिक लाभ होता है। यह भी सत्य है कि एक जगह धन का प्रवाह हो रहा है तो दूसरी ओर गरीबी बढ़ती जा रही है। हालाँकि, वर्तमान स्थिति सांस्कृतिक रूप से उत्पीड़ित समूहों के लिए थोड़ी राहत की बात है। उनका मानना ​​है कि इसकी वजह संविधान है. स्वाभाविक है कि वे सोचते हैं कि यह उपलब्धि अम्बेडकर की है।

दूसरी ओर, मार्क्सवादी-लेनिनवादी पार्टियों ने कभी भी पूंजीवादी संविधान में विश्वास नहीं किया। उनमें यह राय प्रबल है कि शासनाध्यक्ष संवैधानिक आदर्शों का पालन नहीं करते। उनकी मुख्य आलोचना यह है कि वे अपने द्वारा घोषित संविधान का पालन नहीं कर रहे हैं। जब प्रतिनिधि संसदीय लोकतंत्र पूरी तरह से कॉरपोरेट्स द्वारा अपहरण कर लिया गया है तो विकल्प क्या है? एक वाजिब सवाल है. हाल ही में विजयवाड़ा में आयोजित क्रांतिकारी लेखक संघ (विरासम) महासभा में यह चर्चा का मुख्य विषय था।

मुस्लिम अल्पसंख्यकों का अस्तित्व समाप्त होने पर उठे शाहीन बाग आंदोलन ने भारत के संविधान का ही सहारा लिया। इसे बेघरों और असहायों के लिए एक महान दिशा के रूप में देखा गया। दिल्ली का बाहरी इलाका 'स्वतंत्रता, समानता, बंधुत्व' के नारों से गूंज उठा। इसके बाद जो किसान आंदोलन हुआ वह शाहीन बाग से ही प्रेरित था। जब समान नागरिकता का मुद्दा आया तो पूर्वोत्तर भारत के आदिवासियों ने शाहीन बाग का रास्ता अपनाया. संविधान को दिल से लगा लिया गया.

कॉरपोरेट व्यवस्था और जिस तरह से यह संवैधानिक आदर्शों को नष्ट कर रही है, उसकी आलोचना करने में कुछ भी गलत नहीं है। आलोचना भी करें. सभी संविधानों को तब खारिज किया जा सकता है जब वे काम न करें। लेकिन, जो दलित समूह यह मानते हैं कि संविधान से उनके जीवन में सुधार हुआ है, उनके साथ संवेदनशीलता से पेश आना चाहिए। कट्टरता का सहारा लेकर मजबूत हो रही कॉरपोरेट व्यवस्था में दलितों, अछूतों और नये अछूतों को एकजुट करने का प्रयास किया जाना चाहिए. जब इतना बड़ा समूह संविधान में विश्वास करता था तो उन्हें पूरी तरह से 'संविधानवादी' कहना एक ऐतिहासिक गलती होगी। निस्संदेह भारत का संविधान एक सामाजिक क्रांतिकारी दस्तावेज़ है। जो लोग एक बेहतर समाज का निर्माण करना चाहते हैं उन्हें एक बेहतर, व्यावहारिक संविधान का प्रस्ताव देना चाहिए।

डैनी

सामुदायिक विश्लेषक

No comments:

Post a Comment