*బిజెపితో జతకట్టడం చంద్రబాబు చారిత్రక తప్పిదం *
ఏ యం ఖాన్ యజ్దానీ (డానీ)
సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు
‘ఇండియా టుడే’ డిప్యూటి ఎడిటర్ అమర్ నాథ్ కే మీనన్ నన్ను ఏపి ఎన్నికల మీద ఏప్రిల్ 26న ఇంటర్ వ్యూ చేశారు.
Note : నేను సాధారణంగా 10-15 పదాలు మించకుండ ఎదో ఒక అంశం మీద సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటాను. అంతకు మించి ఫేస్ బుక్ ఆమోదించదు కూడ. అవన్నీ ఒన్ లైనర్స్ కనుక ఒక్కోసారి సంపూర్ణ అర్ధాన్ని ఇవ్వవు. కొన్ని సందర్భాల్లో అపార్ధాలకు కూడ దారి తీస్తుంటాయి. వ్యాసాలు, ఇంటర్ వ్యూలు ఈ లోటును తీరుస్తుంటాయి. దానికి ఈ ఇంటర్ వ్యూ పనికి వస్తుందనుకుంటాను.
*Q – 1. How is the 2024 election in Andhra Pradesh different from that in 2019?*
2019లో చంద్రబాబు అధికారంలో వున్నారు. అప్పట్లో బిజెపికి పూర్తి వ్యతిరేకంగా వున్నారు. ఒంటరిగా పోటీచేశారు. 40 శాతం ఓట్లు వచ్చినా 23 సీట్లు మాత్రమే దక్కాయి. అధికారాన్ని కోల్పోయారు.
జగన్ అప్పుడు ప్రతిపక్షంలో వున్నారు. ఒంటరిగా పోటీచేసి చంద్రబాబు వైఫల్యాలతో, ‘నవరత్నాలు’ పథకాల ఆకర్షణతో 50 శాతం ఓట్లు సాధించారు. 152 సీట్లు దక్కీంచుకుని అధికారాన్ని చేపట్టారు.
ఇప్పుడు జగన్ అధికారంలో వున్నారు, చంద్రబాబు ప్రతిపక్షంలో వున్నారు. జగన్ పాలనలో సామాన్య ప్రజలు స్థూలంగా సంతోషంగా వున్నారా? లేదా? అన్నదొక్కటే ఇప్పుడు చర్చనీయాంశం. అదే ఇప్పుడు ఎన్నికల రెఫరెండం.
Q-2. What do you see as the role of Pawan Kalyan and his JSP? Has he emerged as an influential force?
సినిమాల్లో పవన్ కళ్యాణ్ 'పవర్ స్టార్'; రాజకీయాల్లో మాత్రం వారు పవర్ స్టార్ కాదు. గత పదేళ్ళుగా రాజకీయాల్లో ఒక పార్టికి నాయకునిగావున్నా ఇప్పటి వరకు వారికి చెప్పుకోదగ్గ విజయం ఒక్కటీ దక్కలేదు. జనసేన పార్టికి గ్రామ స్థాయిలో నిర్మాణం అస్సలు లేదు. ఎన్నికల నోటిఫికేషన్ తరువాత పవన్ కళ్యాణ్ బలహీనతలు ఒక్కొక్కటి వరుసగా బయటపడుతున్నాయి. ఆయన స్వీయ సామాజికవర్గం అయిన కాపులు సహితం ఆయనకు ఏ మేరకు మద్దతు ఇస్తారో చెప్పడం కూడ కష్టం. టిడిపితో జనసేన పొత్తు కుదుర్చుకున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న ప్రత్యేక సామాజిక పరిస్థితుల్లో కాపుల ఓట్లు కమ్మ సామాజికవర్గానికి ఏ మేరకు బదిలీ అవుతాయో ఎవరూ నమ్మకంగా చెప్పలేకపోతున్నారు.
Q-3. What do you perceive are his strengths and contribution to the National Democratic Alliance?
ఎన్నికల ప్రచార సభల్లో పవన్ కళ్యాణ్ చాలా గొప్పగా ఆకర్షణీయమైన సినిమా డైలాగులు చెపుతుంటారు. జనం కూడా ఒక సినిమా చూస్తున్నట్టు వినోదాన్ని ఆస్వాదిస్తుంటారు. అయితే, తెలుగుదేశం- బిజెపి- జనసేన కూటమి అభ్యర్ధుల్ని గెలిపించుకునే శక్తి సామర్ధ్యాలు ఆయనకు వున్నవని చెప్పడం కష్టం. వారు పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో గెలవడమే వారికి ఇప్పుడు చాలా పెద్ద సవాలుగా మారింది.
Q-4. What are the strengths and weaknesses of Chandrababu Naidu and the TDP?
చంద్రబాబు పరిపాలన విధానం మీద రాష్ట్ర ప్రజలకు ఒక స్థిర అభిప్రాయం వుంది. ఆ తీర్పును వాళ్ళు 2019 ఎన్నికల్లో చెప్పేశారు. మరోవైపు, ఈ ఐదేళ్లలో చంద్రబాబు కొత్తగా స్కోరు చేసిన అంశం ఒక్కటీ లేదు. అయితే, జగన్ పరిపాలనలో అనేక లోపాలు, వైఫల్యాలు వున్నాయి. అలాగే అధికార పార్టి మీద ప్రజల్లో సహజంగానే కొంత వ్యతిరేకత (ఇన్ కుంబెన్సీ ఫ్యాక్టర్స్) వుంటుంది. ఇవి రెండూ చంద్రబాబుకు కలిసి రావచ్చు.
చంద్రబాబు విజయం జగన్ ఓటమిగా మారే అవకాశాలకన్నా జగన్ ఓటమి చంద్రబాబు విజయంగా మారే అవకాశాలు ఎక్కువ.
అయితే, విధాన ప్రకటనల్లో చంద్రబాబుకు ఏమాత్రం స్థిరత్వంలేదు. జగన్ మార్కు ఉచితాలవల్ల రాష్ట్ర అభివృధ్ధి 30 ఏళ్ళు వెనక్కి పోయిందని వారు ఒకరోజు అంటారు. మరునాడు జగన్ ను మించిన ఉచితాలు ఇస్తానని మరిన్ని భారీ హామీలు ఇస్తున్నారు. (30 ఏళ్ల క్రితం అసలు ఈ రాష్ట్రమే లేదు. అది వేరే కత.)
వార్డు వాలంటరీ వ్యవస్థ మీద, అయితే ఒకదానితో మరోదానికి బొత్తిగా పొంతన లేని అభిప్రాయాల్ని చంద్రబాబు రోజుకొకటి చొప్పున ప్రకటిస్తున్నారు. వారివల్ల సామాజిక పెన్షన్ల లబ్దిదారులు చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. అది టిడిపికి ప్రతికూల ఫలితాలు ఇవ్వవచ్చు.
Q-5. What is it that they need to fulfil their goal of edging out the YSRCP?
వైయస్సార్ సిపిని తాను ఒంటరిగా ఓడించగలననే నమ్మకం చంద్రబాబుకు ఏ కోశానా లేదు. అదనపు బలం కోసం ఆయన జనసేన, బిజెపిలతో పొత్తు పెట్టుకున్నారు. ఓటర్లలో జనసేన శక్తి 6 - 8 శాతానికి మించి వుండదు. పైగా నరేంద్ర మోదీ, అమిత్ షా, పియూష్ గోయల్, రాజ్ నాధ్ సింగ్ ల విద్వేషపూరిత ప్రచార శైలితో ముస్లిం తదితర మైనారిటీల సమూహాలు టిడిపి-కూటమి మీద అసహనంతో వున్నాయి.
బాబూ మార్కు అభివృధ్ధి 'సంపదను పెంచడం'. దీని మీద టిడిపి అభిమానులు గట్టిగా ఆశలు పెంచుకుని వున్నారు. గానీ, ఆ విధానాల మీద సామాన్య ప్రజలకు సదభిప్రాయం లేదు. నాడు కాంగ్రెస్ నేడు బిజెపి ఏపికి అన్యాయం చేశాయనే అభిప్రాయం ప్రజల్లో బలంగా వుంది. నిజానికి రెండు నెలల క్రితం రాజకీయ వాతావరణం చంద్రబాబుకు అనుకూలంగా కనిపించింది. బిజెపితో పొత్తు పెట్టుకున్నాక ఆయన గ్రాఫ్ వేగంగా పడిపోతున్నది. బిజెపి ఏపి నేల మీద తానుగా మొలకెత్తలేని విత్తనం. ఆ పార్టికి చంద్రబాబు నారు నీరు పోశారు. ఇది కూడ టిడిపికి ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు.
Q-6. What is the mainstay of YSRCP and what are the weaknesses that it has to plug to ensure a second term in office?
ఎన్నికల ప్రచారం సందర్భంగా మీడియాలో వచ్చే 'ప్రాయోజిత' కథనాలకూ సామాన్య ప్రజల ఆలోచనలకు పొంతన వుండదు. జగన్ పాలనలో సామాన్య ప్రజలు స్థూలంగా సంతోషంగా వున్నారా? లేదా? అన్నదొక్కటే ఇప్పుడు చర్చనీయాంశం. ‘నవరత్నాలు’ పథకాలలే ఇప్పటికీ జగన్ ఆయువుపట్టు. అందులో వైన్ పాలసీ తప్ప మిగిలినవి జనాదరణ పొందాయని జగన్ గట్టిగా నమ్ముతున్నారు. అయితే, శాండ్, మైనింగ్ విధానాలు, కొత్తగా తెచ్చిన 'ల్యాండ్ టైటిల్ చట్టం', వ్యవసాయ మోటార్లకు మీటర్లు అమర్చడం వగయిరాలు జగన్ కు స్పష్టంగా మైనస్ పాయింట్లు.
ఏపిలో రెడ్లు ఇప్పుడు అధికార సామాజికవర్గం. ఆ సామాజికవర్గం మీద సహజంగానే కొంత వ్యతిరేకత వుంటుంది. అది కూడ జగన్ కు మైనస్ కావచ్చు.
ఎస్టి, ఎస్సీ, బిసి, మైనారిటీ సామాజికవర్గాల్లో ఇప్పటికీ జగన్ కే గట్టి పట్టు వుంది. ఓసీ సమూహాల్లో స్వీయ సామాజికవర్గమైన రెడ్లతోపాటు కాపు సామాజికవర్గం మీద జగన్ నమ్మకం పెట్టుకున్నారు. వార్డు వాలంటీర్స్ వ్యవస్థ జగన్ కు చాలా పెద్ద ఎస్సెట్. వాలంటీర్లు ఉద్యోగాలకు సామూహిక రాజీనామాలు చేసి వైసిపికి కాల్బలంగా పనిచేస్తున్నారు. ఈ సోషల్ ఇంజినీరింగ్ మంచి ఫలితాలను ఇస్తుందనే ధైర్యంతోనే మరోసారి ఆయన ఒంటరి పోరాటానికి సిధ్ధం అయ్యారు.
(ఇంటర్ వ్యూ ఇంగ్లీషులో సాగింది. ఫేస్ బుక్ లోని తెలుగు మిత్రుల సౌకర్యం కోసం తెలుగు అనువాదాన్ని పోస్ట్ చేస్తున్నాను)
No comments:
Post a Comment