మాట్లాడడానికి ఒక మనిషి కావాలి!
లఘుచిత్రం
ఈ
షార్ట్ ఫిల్మ్ ను అక్టోబరులో తీయాలని నిర్ణయించాము.
కాన్సెప్ట్,
స్క్రిప్ట్ : డానీ
క్రియేటివ్
హెడ్ : అనిల్
అక్తర్ ఖాన్ చౌదరి
టెక్నికల్
హెడ్ : అరుణ్ ఇక్బాల్ ఖాన్ చౌదరి
ప్రొడక్షన్ : యేలూరి అజిత
నటీ
నటులు : (ఇప్పటికి ఇలా అనుకుంటున్నాం)
డానీ, సుఫియా బేగం (డానీ
వాళ్ల అమ్మ)
స్క్రిప్టు
1. హైదరాబాద్ రోడ్లు.
2. విపరీతమైన ట్రాఫిక్
3. పుట్ట
చితికిన చీమాల్లా మనుషులు కంగారుగా నడుస్తున్నారు.
4. ఎవరి జీవితం వారిది.
5. ట్రాఫిక్
ఇలాండ్ దగ్గర రెడ్ సిగ్నల్ పడింది.
6. కొడుకు స్కూటర్
కు బ్రేక్ వేశాడు.
7. కొడుకు వయస్సు
50 సంవత్సరాలుంటాయి.
8. ఎగువ మధ్య తరగతి జీవి.
9. ఫార్మల్
డ్రెస్సు. ఫార్మల్ షూస్.
10. స్కూటర్
చుట్టూ క్యారీ బ్యాగులు వేలాడుతున్నాయి.
11. క్యారీ
బ్యాగుల్లోంచి పండ్లు, మందులు, హాట్- స్వీట్స్, ఓఆర్ ఎస్ కనిపిస్తున్నాయి.
12. కొడుకు ముఖంలో
కంగారు, ఆతృత, ఆందోళన,
13. అంతా వెహికిల్స్ పొగమయం.
14. కొడుకు సెల్ ఫోన్ / వాచీలో టైం చూసుకుంటున్నాడు.
15. సమయం సాయంత్రం ఏడు అయింది.
16. గీన్ సిగ్నల్ పడింది.
17. వెహికిల్స్ హారన్ల మోత.
18. కొడుకు కంగారుగా
స్కూటర్ స్టార్ట్స్ చేసి ముందుకు సాగాడు.
19. కొడుకు స్కూటర్ ఒక వీధిలోనికి తిరిగింది.
20. బంజారా
హిల్స్ లో పెద్ద అప్పార్ట్ మెంట్
21. పెద్ద
కాంపౌండ్ వాల్
22. గేటులో
సెక్యూరిటీ గార్డ్ వున్నాడు.
23. “నమస్తే
......
సాబ్ ” అన్నాడు సెక్యూరిటీ గార్డ్.
24. స్పందించే స్థితిలో లేడు కొడుకు.
25. కొడుకు ర్యాంప్
మీదుగా సెల్లార్ లోనికి దిగి స్కూటర్ స్టాండ్ వేశాడు.
26. క్రారీ
బ్యాగులన్నీ కంగారుగా తీసుకుని లిప్ట్ దగ్గరకు పరుగెట్టాడు.
27. లిప్ ఎక్కడో పదవ అంతస్తులో వుంది.
28. కొడుకులో
ఆతృత పెరిగిపోతోంది.
29. కర్చిఫ్
తో చెమట తుడుచుకున్నాడు.
30. లిఫ్ట్
వచ్చింది. కొడుకు గబుక్కున లోపలికి దూరబోయాడు.
31. లిఫ్ట్
లో నుండి గార్బేజీ బ్యాగులు తీసుకుని హౌస్ కీపింగ్ స్టాఫ్ దిగుతున్నారు.
32. కొడుకులో అసహనం.
33. హౌస్ కీపింగ్ స్టాఫ్ వెళ్ళాక కొడుకు గబుక్కున లోపలికి వెళ్ళి 6-వ నెంబరు నొక్కాడు.
34. లిఫ్ట్
లో గార్బేజి వాసన వస్తోంది.
35. కర్చిప్
తో ముక్కు మూసుకున్నాడు.
36. వాచీలో
టైమ్ చూసుకున్నాడు.
37. లిఫ్ట్
6-వ ఫ్లోరుకు చేరుకుంది.
38. కొడుకు
లిప్ బయటికి వచ్చి కారిడార్ లో పరుగులాంటి నడక నడుస్తున్నాడు.
39. 604 ఫ్లాటు
దగ్గరికివచ్చి గబగబ కాలింగ్ బెల్ నొక్కాడు.
40. 604 ఫ్లాటులోపల ఒక ముసలామె టీవీ చూస్తూ కుర్చీలో కూర్చునివుంది.
41. ఆమెకు
80 సంవత్సరాలుంటాయి.
42. తెల్లటి
జుట్టు, తెల్లటి చీరా, జాకెట్టు. గోల్డ్ ఫ్రేమ్ కళ్లజోడు.
43. టివీలో
మదర్ ఇండియా / మిస్సమ్మ లాంటి పాత సినిమా వస్తోంది.
44. విలాసవంతమైన 3BHK ఫ్లాట్ అది.
45. కొడుకు బయటి నుండి కాలింగ్ బెల్ నొక్కుతున్నాడు.
46. లోపల సినిమా చూస్తున్న ముసలామెకు కాలింగ్ బెల్ వినిపించడంలేదు.
47. కొడుకు గట్టిగా “అమ్మా! అమ్మా!” అని అరవడం మొదలెట్టాడు.
48. లోపల ముసలామెకు “అమ్మా”
అన్నమాట వినిపించింది.
49. ముసలామె
నెమ్మదిగా కుర్చీలోంచి లేచి, డోరు దగ్గరికి వెళ్ళింది.
50. ముసలామె
డోరుకు సేఫ్టీ చైన్ వేసి, నెమ్మదిగా డోరు తెరిచి అనుమానంగా చూసింది.
51. డోరు సందులోంచి కొడుకు కనిపించాడు.
52. కొడుకు ముఖం చూడగానే ముసలామె ముఖంలో ఒక వెలుగు వచ్చింది.
53. ముసలామె
డోరు పూర్తిగా తెరిచింది.
54. క్యారీ
బ్యాగులతోపాటూ కొడుకు కంగారుగా లోపలికి వచ్చాడు.
55. ముసలామె
డోరు మూసి, గడియ పెట్టి కొడుకు వెనక నడిచింది.
56. “ఎన్నిసార్లు బెల్ కొట్టాలి?” అన్నాడు కొడుకు చిరాగ్గా.
57. “వినిపించలేదురా” అంది తల్లి.
58. “టివీ వాల్యూమ్ అంత పెద్దగా పెట్టాలా?” అన్నాడు
కొడుకు
మళ్ళీ చిరాగ్గా.
59. “అది తప్ప నా బతుక్కి ఇంకే ముంది?” అంది తల్లి అంతే చిరాగ్గా.
60. కొడుకు దగ్గర
మౌనం తప్ప సమాధానం
లేదు.
61. కొడుకు టేబుల్ మీద ట్రేలు పెట్టి క్యారీ బ్యాగుల్లోని సరుకులు బయటికి తీసి వాటిల్లో సర్దుతున్నాడు.
62. “ఇవి షుగర్ ట్యాబ్లెట్లు. “
63. ముసలామె
మౌనంగా చూస్తోంది.
64. “ఇవి బీపీ ట్యాబ్లేట్స్ రోజూ వేసుకోవాలి. స్ట్రిప్పు గులాబీ రంగులో వుంటుంది. మరచిపోకు” అన్నాడు
కొడుకు.
65. ముసలామే
ఆ స్ట్రిప్పును చేతిలోనికి తీసుకుని దాని రంగును చూస్తోంది.
66. “ఇంతకు
ముందువి గచ్చకాయ రంగులో వుండేవికదరా?” అంది తల్లి
67. “ఇప్పుడు
డోసు పెంచారు. ఇవి కొత్తవి”
అన్నాడు కొడుకు.
68. ముసలామె
“డోసు పెంచారు. హు!” అని ఒక వైరాగ్యపు నవ్వు నవ్వింది.
69. టేబుల్
మీదున్న ట్రేల్లో పండ్లు,
హాట్ –స్వీట్లు సర్దుతున్నాడు కొడుకు.
70. “నీకు హాట్ కావాలంటే హటు తిను. నో ప్రాబ్లం. కాజూ మిక్చర్. అల్ మండ్ హౌస్ నుండి తెచ్చా. షుగర్ లెవల్ డౌన్ అవుతుంటే మాత్రం కొద్దిగా స్వీటు తిను. ఎక్కువగా తినకు. యాపిల్, దానిమ్మ, బత్తాయి. బొప్పాయి తినొచ్చు” అన్నాడు కొడుకు.
71. “నేను ఎప్పుడయినా పొప్పాయా తిన్నానా?. మీనాన్న తినేవారు పొప్పాయా. నాకు ఆ వాసనే నచ్చదు ”
72. “మరి నీకు ద్రాక్షపళ్ళు ఇవ్వద్దన్నాడు డాక్టర్.” అన్నాడు కొడుకు.
73. “అంతేలే
ఇక అన్నీ బందుపెట్టుకుంటా పోతారు”
అంది తల్లి మళ్ళీ.
74. ఓఅర్ ఎస్ టెట్రా ప్యాకులు తీసి ఫ్రిజ్ లో పెడుతున్నాడు కొడుకు
.
75. “గాబరాగా
అనిపిస్తే ఓఆర్ ఎస్ తాగు. ఫ్రిజ్
లో నుండి తీయగానే తాగకు. కాస్సేపు బయట వుంచి తాగు. లేకపోతే నిమోనియా రావచ్చు” అన్నాడు కొడుకు కొంచెం హెచ్చరికగా.
76. “అదొకటుందా?” అంది తల్లి.
77. “ఇది దగ్గు మందు. ఇవి ఒంటి నెప్పులకు బిళ్లలు. ఇవి ....” చెప్పుకుంటూ పోతున్నాడు కొడుకు.
78. “ఇంతకీ నేను చెప్పింది తీసుకువచ్చావా? అంది తల్లి అసహనంగా
79. “ఏంటదీ?”
అన్నాడు కొడుకు పండ్లు
సర్దుతూనే.
80. “ఇన్ని
తెస్తావు. దేనీకీ? నెత్తినెట్టి కొట్టుకోడానికా? చెప్పింది మాత్రం తేవూ” అంది తల్లి.
81. “ఏదీ మిస్సు కాలేదే. లిస్టు రాసుకుని మరీ వెళ్ళాను. అన్నీ తెచ్చానే.” అన్నాడు కొడుకు.
82. “నేనూ,
ఆ టీవీ ఇదేగా బతుకు?” అంది తల్లి
83. “ఇంట్లో
రెస్టు తీసుకోవడం ఎంత విలాసమో నీకేం తెలుసు. ఆపీసు టెన్షన్ చూస్తే తెలుస్తుంది నరకం అంటే ఏమిటో? ” అన్నాడు కొడుకు.
84. “నన్ను
ఈ హైదరాబాద్ కు తెచ్చి జైలు బతుకు చేసేశావుగా, “ అంది తల్లి.
85. “ ఈ వెటకారాలొద్దు. విషయం చెప్పు” అన్నాడు
కొడుకు
అసహనంగా.
86. “నాతో మాట్లాడడానికి ఒక మనిషిని తెమ్మని పోరుతున్నానా? తెచ్చావా?” అంది తల్లి.
87. “మనిషా?
ఈ హైదరాబాదు నగరంలోనా?”
నోరు వెళ్లబెట్టాడు డానీ.
END
No comments:
Post a Comment