Sunday 31 August 2014

రాజధాని రాజకీయం - రియల్ ఎస్టేట్

చంద్రబాబు హైటెక్కు శైలి

నిర్ణయాలు తీసుకోవడంలో చంద్రబాబుగారిది హైటెక్కు శైలి. ముందు చర్చకు పెట్టి  తరువాత నిర్ణయాలు తీసుకోవడం సాంప్రదాయ శైలి. చంద్రబాబు ముందు నిర్ణయాలు తీసుకుని తరువాత చర్చకు పెడతారు.


రాజధాని రాజకీయం - రియల్ ఎస్టేట్


ఆంధ్రప్రదేశ్ అప్పాయింటెడ్ డే ను ప్రకటించడానికి ఏడాది ముందు నుండే రాజధాని ఎక్కడ

నిర్మిస్తారు నే విషయం మీద అనేక ఊహాగానాలు చెలరేగాయి. వీటిల్లో కొన్ని రాజకీయపరమైనవి

అయితే, మిగిలినవి రియల్ ఎస్టేట్‍ కు సంబంధించినవి.  మొదట్లో ఒంగోలు రాజధాని అంటూ ప్రచారం

సాగింది. ప్రకాశం జిల్లాలో దాయాదులైన నాలుగు ప్రధాన ఇంటి పేర్లవారి ఆధీనంలో దాదాపు యాభై

వేల ఎకరాల భూమి వుందని అంచనా. ఆ కుటుంబాలు వాళ్లకు సనిహితులైనవాళ్ళు, వ్యాపార

భాగస్వాములు మరో యాభై వేల ఎకరాలు కొత్తగా కొని రాజధాని ప్రకటన కొరకు ఎదురు చూశారు.

ప్రకాశంజిల్లాకే చెందిన మంత్రి ఒకరు యూపియే ఛైర్ పర్సన్  సోనియా గాంధీకి అత్యంత

సన్నిహితురాలుగా వున్నారు. ఆమె రాష్ట్ర పునర్ వ్య్వస్థీకరణ  బిల్లు లోనే ఒంగోలును రాజధానిగా

ప్రకటింపచేస్తారని ప్రచారం సాగింది. దానితో, రియల్ ఎస్టేట్ గిగ్గజాలు ప్రకాశం జిల్లాను కమ్మేశాయి.

ఇలా కమ్ముకున్న వాళ్లతో తెలంగాణకు చెందిన రియల్ ఎస్టేట్ గిగ్గజాలు, రాజకీయ ప్రముఖులూ

వున్నారు. ఒకవేళ ఒంగోలు కాకపోతే, దోనకొండ, మార్టూరు, వినుకొండ, దర్శి. పొదిలి, మార్టూరు

ఎక్కడ రాజధానిని ప్రకటించినా ఇబ్బందిలేదనే వ్యూహంతో   రియల్ ఎస్టేట్ గిగ్గజాలు భూలు కొని

సిధ్ధంగా వున్నారు.

A.m. Khan Yazdani Danny
August 17 at 8:06pm · Hyderabad · Edited ·
రాజధాని, ప్రత్యేక రాష్ట్రం డిమాండు రెండూ ప్రజాస్వామిక హక్కులే.
Venkateswarlu Koya ! అక్కసు , ప్రేలాపనలు ప్రతిదాడులుకావు. నీకు దాడిచేసే శక్తిలేదు. ప్రతిదాడిచేసే శక్తి అంతకన్నాలేదు. ప్రతి జిల్లావారికీ తమ జిల్లాలోనే రాజధాని నగరం కట్టాలని కోరే హక్కు వుంటుంది. తమ కోరిక నెరవేరకపోతే స్వంత రాష్ట్రం ఏర్పాటు చేసుకుంటామనే హక్కు వుంటుంది. ఇది ప్రజాస్వామిక హక్కు.
నీ హక్కును నువ్వు కోరుకో. విజయవాడను ఎందుకు రాజధాని చేయాలో చెప్పుకో. విజయవాడను రాజధాని చెయ్యకపోతే కృష్ణాజిల్లాను ప్రత్యేక రాష్ట్రం చేసుకుంటామని చెప్పు. అది నీ హక్కు. కానీ తమకు రాజధాని కావాలని కోరే హక్కు రాయలసీమ వాళ్లకు లేదని చెప్పే హక్కు నీకు ఎవరిచ్చారూ? నీలాంటి వాళ్ళు విజయవాడలో కూర్చొని ఇలాంటి రంకెలు వేయడంవల్లే పది జిల్లాలు కళ్లముందు విడిపోయాయి. ఏ ప్రాతిఇపదిక మీద పదమూడు జిల్లాలను కలిపివుంచవచ్చో ఆలోచించు. కానీ, పిచ్చి వాదనలతో విజయవాడ పరువు తీయకు.

Aparna Kothapalli గారూ! Crores of rupees involved అని మీరే అన్నారుగా. డబ్బు రంగ ప్రవేశం చేసిన తరువాత ఎక్కువ వాటా కోసం అందరూ ఎగబడతారు. ఇందులో దాంపత్యానికీ, కుటుంబానికీ, రాష్ట్రానికీ, రాజకీయానికీ తేడా వుందదు. ఆస్థి అనే కరకు వాస్తవాన్ని వదిలిపెట్టి భావోద్వేగాలను మాట్లాడడం అమాయకత్వం అయినా అవుతుంది లేదా బూటకమైనా అవుతుంది.







No comments:

Post a Comment