సామాజిక న్యాయం నేటి నినాదం
1972 నాటి జైఆంధ్రా (ప్రత్యేక ఆంధ్రా) ఉద్యమంతో
నేను రాజకీయాల్లో క్రియాశీలంగా మారాను. అప్పటి నుండి నా సిధ్ధాంతం సామాజిక న్యాయం
(సోషల్ జస్టీస్). ఇప్పుడు అధికార పార్టి మెప్పుకోసం
నేను అధికార వికేంద్రీకరణ బిల్లును సమర్ధిస్తున్నాననే భావన కొందరిలో వ్యక్తం అవుతోంది.
ఇందులో కొందరు నా సహాధ్యాయులున్నారు. సహోద్యోగులూ వున్నారు. మిత్రులూ వున్నారు. అందరి
కోసం కాకున్నా నా సన్నిహితుల కోసం ఈ వివరణ ఇస్తున్నాను.
నేను 1978లో COCలో చేరాను. ఆ సంస్థ 1980లో
పీపుల్స్ వార్ గా మారింది. నేను చేరడానికి ముందే సివోసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని
కోరుతూ తీర్మానం చేసింది. నేను సివోసిలో చేరడం అంటే టెలంగాణ కు మద్దతు ఇచ్చినట్టే.
ప్రత్యేక తెలంగాణ కోరుతూ కాళోజీ నారాయణరావు నాయకత్వాన 1998లో ‘వరంగల్ డిక్లరేషన్’ వచ్చింది. ఆ సభలోనే
ప్రొఫెసర్ జయశంకర్ ను అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఆ సభ ఆహ్వాన సంఘానికి ప్రొఫెసర్
సాయిబాబ అధ్యక్షుడు. నేను ఆహ్వానసంఘ సభ్యుడ్ని. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు
రూపకల్పన జరుగుతున్నప్పుడు ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం నెలకొల్పి విభజనకు ఆంధ్ర ప్రాంత
డిమాండ్లను ముందుకు తేవాలని కొంత ప్రయత్నం చేశాను. ‘సమైక్యవాదులు’ దాన్ని అస్సలు పడనివ్వలేదు.
అంతకు ముందు 1986లో రాయలసీమలో జల ఉద్యమం
ఆరంభం అయినపుడు కడప, అనంతపురంలలో దాని నాయకులతో చాలా సన్నిహితంగా వున్నాను. అప్పట్లోనే
శ్రీభాగ్ ఒప్పందం ప్రాధాన్యాన్ని తెలుపుతూ వ్యాసాలు రాశాను. (ఈ ఫోటోలో పెట్టిన వ్యాసం
1986లో ఉదయం దినపత్రికలో రాసింది. ఇప్పటి ముఖ్యమంత్రికి అప్పుడు 14 ఏళ్లు కూడా వుండవు.
34 ఏళ్ళ తరువాత వారు ముఖ్యమంత్రి అవుతారనీ, పాలన వికేంద్రీకరణ చట్టం తెస్తారని ముందుగానే తెలిసి వారికి మద్దతు ఇవ్వాలనే ‘కుట్ర’తో
రాసిన వ్యాసం కాదిది)
1996లో రాయలసీమలో జలసాధన ఉద్యమం సాగినపుడూ ఆ నాయకులతో సన్నిహితంగా
వున్నాను. అలాగే ఉత్తరాంధ్ర ఆలోచనాపరులతోనూ సన్నిహితంగా వున్నాను. నేను కన్వీనర్ గా
వున్న పౌరసమాజం గుంటూరు, విజయవాడల్లో జరిపిన సదస్సుల్లోనూ అమరావతిని నిర్మిస్తున్న
తీరు మీద అసంతృప్తిని బాహాటంగానే చెప్పాము. అది ప్రజల రాజధాని కాదనీ ఒక ‘గేటెట్ కమ్యూనిటీ’
అని పేర్కొన్నాము.
ఒక రాష్ట్రంలో అనేక ప్రాంతాలువున్నప్పుడు
కీలకమైన ప్రాజెక్టులు నిర్మించే సమయంలో అన్ని
ప్రాంతాల మనోభావాలను పరిగణనలోనికి తీసుకోవాలి. అలా చేయకపోతే అసంతృప్తి అసమ్మతిగా మారుతుంది.
అసమ్మతి ప్రత్యేక రాష్ట్రం దిశగా అడుగులేస్తుంది. ఇది నా అవగాహన. మిత్రులకు భిన్నాభిప్రాయలుండవచ్చు.
Let us agree to disagree.
కొత్త ప్రతిపాదనల్ని ప్రజాసంఘాలే ముందుకు తెస్తాయి
(Raffi Syed ! నీ వివరణ చాలా బాగుంది.
I am really happy.)
ఎప్పుడయినా కొత్త ప్రతిపాదనల్ని ప్రజాసంఘాలే
ముందుకు తెస్తాయి. పాలక పార్టిలు వాటిని నిర్లక్ష్యం చేస్తాయి. అవహేళన కూడ చేస్తాయి.
క్రమంగా ఈ డిమాండు చేసె ప్రజాసంఘాల సంఖ్య పెరుగుతుంది. అవన్నీ ఒక సమాఖ్యగానూ ఏర్పడతాయి.
అప్పుడు ఒక రాజకీయ పార్టి ఆవిర్భవిస్తుంది. ఈ పరిణామాల్ని నేను తెలంగాణలో 1998 నుండి
అతి దగ్గరగా గమనించాను. చంద్రబాబు మంత్రి వర్గం
నుండి తొలగించడంతో కేసిఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టారని చాలామంది అనుకుంటుంటారు.
అది తప్పు.
కేసిఆర్ రవాణాశాఖా మంత్రిగా వుండగానే సెంటర్
ఫర్ సబ్ ఆల్ ట్రన్ స్టడీస్ (CSS) అనే ఒక పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ
వెనుకబాటుతనం మీద పరిశోధనలు చేయడం దాని పని. ఆ ఇన్ పుట్ లన్నీ తన చేతికి వచ్చాక కేసిఆర్
TRS ను నెలకొల్పారు. కృష్ణా గోదావరి నదుల కంటూర్స్ లెవల్స్ అన్నీ కేసిఆర్ కు బాగా తెలుసు.
ఏ పాయింట్ దగ్గర ఎంత నీటి లభ్యత వుందో కూడా తెలుసు. ఈ విషయాలను నేను చాలా దగ్గరగా హమనించాను.
ఎందుకంటే CSS సంస్థకు నేను కొన్ని నెలలు ఆఫీస్ మేనేజర్ గా వున్నాను.
ఇప్పుడు రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో
విద్యావంతులు, ఆలోచనాపరుల వేదికలు కొత్త ప్రతిపాదనతో పనిచేస్తున్నాయి. ప్రధాన రాజకీయ
పార్టీల నేతలు కొందరు వాటికి రహాస్య మద్దతు తెలుపుతుంటారు. వాళ్లు బయట పడి రాజకీయ పార్టీని
నెలకొల్పిన కొత్త ఉద్యమంలో దశ మొదలవుతుంది.
అప్పుడు బయటి వారు చేయడానికి ఏమీ వుండదు. టీఆర్
ఎస్ కు వున్నది ఇద్దరు ఎంపీలే, మొత్తం తెలంగాణకు వున్నది 19 ఎంపీలే ఆంధ్రాప్రాంతానికున్న
25 మంది ఎంపీలతో పోలిస్తే వాళ్లు ‘అల్పసంఖ్యాకులు’ అని ఆంధ్రా నాయకులు గొప్పలకు పోయేవారు.
చివర్రకు ఏమయిందో అందరికీ తెలుసు. తెలంగాణ ఇచ్చే నాటికి విజయశాంతి కూడ TRSలోలేరు. ఒక్క
ఎంపి 41 ఎంపీలకన్నా బలవంతుడు అనిపించుకున్నాడు.
మా డానీ టీవీ ఛానల్
థీమ్ :
#FosterDiversityEquityAndInclusion
#JusticeLibertyEqualityAndFraternity
నేను ఇప్పుడు దానికి
అనుగుణంగానే పని చేస్తున్నాను.
#AndhraPradeshThreeCapitalCities
#Amaravati #Kurnaool #Visakhapatnam
No comments:
Post a Comment