కొత్త పుస్తకం : ‘ఆర్ ఎస్ ఎస్ లోతుపాతులు’.
కొత్త పుస్తకం : ‘ఆర్ ఎస్ ఎస్ లోతుపాతులు’.
రానున్న 2024 లోక్ సభ ఎన్నికల్లో
కేంద్రంలోని ప్రభుత్వాన్ని మార్చాలనే ఆలోచనలు కొంచెం ఊపందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో
చాలా మంది బిజెపి పనితీరును అధ్యయనం చేస్తున్నారు.
దేశరాజకీయాల్లో బిజెపి
అతిపెద్ద పార్టి అతి సంపన్న పార్టి మాత్రమేకాదు; అతి విభిన్నమైన పార్టి కూడ. పైన కనిపించే
బిజెపికన్నా వందరెట్లు బలమైనది దాని తల్లివేరులాంటి
ఆర్ ఎస్ ఎస్.
ఆర్ ఎస్ ఎస్. స్వయంగా అనేక పుస్తకాలను ప్రచురించింది.
ఆ సంస్థ మీద అనేక పుస్తకాలు వచ్చాయి. అనేక పుస్తకాలు వస్తున్నాయి. అయినప్పటికీ ఆర్
ఎస్ ఎస్ విరాట్ స్వరూపాన్ని సంపూర్ణంగా చిత్రించిన పుస్తకం ఇప్పటి వరకు రాలేదనే చెప్పాలి.
ఈ పరంపరలో కొత్తగా వచ్చిన పుస్తకం ‘ఆర్ ఎస్ ఎస్ లోతుపాతులు’.
కన్నడ రచయిత దేవనూరు
మహాదేవ రచించిన ఈ 40 పేజీల ఈ చిన్ని పుస్తకం ఈ ఏడాది జులైలో విడుదలయి తొలి నెలలోనే
లక్ష కాపీలు అమ్ముడయి ఒక సంచలనాన్ని సృష్టించింది. అజయ్ వర్మ అల్లూరి ఈ పుస్తకాన్ని తెలుగులోనికి అనువదించగా
వేమన వసంత లక్ష్మి సంపాదకత్వంలో హెచ్ బిటి, నలుపు, ప్రజాశక్తి బుక్ హౌస్, విశాలాంధ్ర,
సాహితీ మిత్రులు తదితర ఎనిమిది ప్రచురణ సంస్థలు సంయుక్తంగా ప్రచురించాయి.
ఆరెస్సెస్ ప్రాపంచిక
దృక్పథం గురించీ, దాని పనితీరు గురించి అనేక అంశాలు, రచయిత అనుభవాలు ఈ పుస్తకంలో
వున్నాయి.
“దేశంలో (ప్రజాస్వామిక)
రాజ్యంగ సంహారం; మను ధర్మశాస్త్ర ప్రతిష్టాపన జరుగుతోంది. (పేజీ 34)”
“సాంస్కృతికంగా అణిచివేతకు
గురవుతున్న హిందూ దళిత సమూహాల ఓట్ల మద్దతుతోనే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఏర్పడింది”
(పేజీ 33).
“కర్ణాటక ప్రభుత్వం
తీసుకుని వచ్చిన ‘మత స్వేఛ్ఛ రక్షణ చట్టం’
నిజానికి ‘మతమార్పిడి నిరోధక చట్టం’ “(పేజి 31).
“హిజాబ్ వివాదం, హలాల్ చేసిన మాసం అమ్మకాల నిషేధం, అజాన్
మొదలయిన ముస్లిం అంశాలపై గొడవలు చేసే ఉన్మాద ముఠాల్లో వున్న కుర్రాళ్ళందరూ బడుగు బలహీనవర్గాలకు
చెందినవారే” (పేజీ 29).
“ఎప్పుడయితే హిందూ-ముస్లిం ద్వేషపూరిత సమరంలో ఈ మాజీ-శూద్రులు
(ST
SC BC) హిందువులుగా పాల్గొంటారో అప్పుడు ఆ ‘విశాల’ హిందూ గుర్తింపులో ఈ వంచిత సముదాయాల
రాజ్యంగ హక్కులు మసకబారిపోతాయి” (పేజీ 18)
“సంస్కృతాన్ని భారతదేశంలో అనుసంధాన భాష చేయాలన్నది
ఆర్ ఎస్ ఎస్ లక్ష్యం. అంతవరకు హిందీ భాషను అనుసంధాన భాష చేయాలని ఆ సంస్థ భావిస్తున్నది”
(పేజీ 14).
ఇలాంటి పరిశీలనలు అనేకం ఈ పుస్తకంలో వున్నాయి.
ఆర్ ఎస్ ఎస్ లక్ష్యాలు పనితీరు గురించి
ప్రాధమిక సమాచారం కోసం చాలా ఉపయోగపడే పుస్తకం ఇది. తప్పక చదవండి.
డానీ
20221019
No comments:
Post a Comment