వర్ణన సాహిత్యం భావోద్వేగాలతో
నిండివుంటుంది; అది హృదయాన్ని సంభోధిస్తుంది. వ్యాసం ఆలోచనాత్మకమైనది; అది మెదడును
సంభోధిస్తుంది.
మనుషులు ఆనందం కలిగినప్పుడు
నవ్వుతారు; బాధ కలిగినపుడు ఏడుస్తారు. అన్యాయం జరిగినపుడు కోపంతో రగిలిపోతారు. ఇవి
మానవ సహజ అసంకల్పిత చర్యలు. వర్ణన సాహిత్యం అసంకల్పిత చర్య కాదు; అది సంకల్పిత చర్య.
రచయిత ఒక సంకల్పంతో పాత్రల సుఖదుఖ్ఖాలను పాఠకులు, ప్రేక్షకులు, శ్రోతలకు ట్రాన్స్ మిట్ చేయాలి. రచయితలు తాము లక్ష్యంగా పెట్టుకున్న భావోద్వేగాలను
సమర్ధంగా ప్రసారం చేయగలిగారా? లేదా? అన్నది ఒక్కటే వాళ్ళ సామర్ధ్యానికి ఏకైక కొలమానం.
అలాగే కథా నవల ప్రక్రియలు
ఒకటి కావు. నవల పొట్టిదయితే కథ అయిపోదు; కథ పెద్దదయితే నవల అయిపోదు. కథ సంఘటన ప్రధానమైనది;
నవల పాత్ర ప్రధానమైనది.
Reflective and
refractive
ప్రతిబింబం- ప్రతిఫలనం
No comments:
Post a Comment