Wednesday, 19 October 2022

RAHASYAM –Sridhar Bollepalli – Story Review

 స్త్రీపురుష సంబంధాల పునర్ నిర్వచనం

 

            అనేకమంది రచయితలు ముట్టుకోవడానికి కూడ భయపడే ఒక సరికొత్త సామాజిక పరిణామాన్ని శ్రీధర్ బొల్లేపల్లి పెద్ద కథ ‘రహాస్యం’ పట్టించుకుంది.

 

మానవ సంబంధాల్లో ప్రతి చారిత్రక దశలోనూ పాత నేరేటివ్స్ గతించి కొత్త నేరేటివ్స్ వస్తుంటాయి.  వాటిని ఎప్పటికప్పుడు పునర్-నిర్వచించాల్సి వుంటుంది. జాతి పునరుత్పత్తికి అదే మూలం కనుక, వీటిల్లో, అత్యంత ప్రాధమికమైనది స్త్రీపురుష సంబంధం.

 

వర్గం సర్వాంతర్యామి. ఆర్ధికరంగంలో యజమానివర్గపు ఆధిపత్యంలేని వ్యవస్థను  శ్రామికవర్గం కోరుకుంటున్నట్టు, సాంస్కృతిక రంగంలో మెజారిటీ సమూహాల  ఆధిపత్యంలేని వ్యవస్థను మైనారిటీ సమూహాలు కోరుకుంటున్నట్టు, ‘దాంపత్యం’లో  పురుష ఆధిపత్యంలేని వ్యవస్థను స్త్రీలు కోరుకుంటారు. పురుషాధిపత్యం అంతరించిపోయాక దాన్ని ‘దాంపత్యం’ అంటారా లేక సహజీవనం అంటారా మరొకటి అంటారా అనేది భాషా పండితులు తేల్చాల్సిన అంశం.

                   

మన దినచర్యను ప్రకృతితో అనుసంధానం చేయడాన్ని Circadian Rhythm అంటాము. ప్రకృతిలోని జీవులన్నీ సూర్యుని చీకటి వెలుగులతో ఒక సహజ అనుసంధానాన్ని కొనసాగిస్తుంటాయి; మనిషి కూడ అదే సాంప్రదాయాన్ని కొనసాగించాలి. అయితే, సమాచార సాంకేతిక (IT) విప్లవం భారత ఐటియన్ల Circadian Rhythmను సమూలంగా మార్చిపడేసింది.

 

అమెరికాలో పగలు భారతదేశంలో రాత్రి కావడం ఒక వరం; ఒక సవాలు. వరం ఏమంటే ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు పెరగడం; సవాలు ఏమంటే  Circadian Rhythmను మార్చుకోవాల్సిరావడం. భర్త పగలు డ్యూటీ చేసివచ్చి రాత్రి ఇంట్లో పడుకుంటుంటే, భార్య పగలు ఇంట్లో పడుకుని రాత్రి ఆఫీసులో డ్యూటీ చేయాల్సివస్తున్న సందర్భాలు ఇటీవలి కాలంలో  విస్తృతంగా పెరుగుతున్నాయి.

 

ఈధోరణి ముందుగా ఐటీ రంగంలో మొదలయింది. తరువాత మీడియా-సినిమా రంగానికి విస్తరించింది. ఆ తరువాత క్రమంగా ఇతర వృత్తినైపుణ్య రంగాలన్నింటికీ విస్తరిస్తోంది. ఈ కొత్త ధోరణికి అనువుగా హైదరాబాద్ వంటి  మహానగరాల్లో మాల్స్ రాత్రి తెరిచే వుంటున్నాయి. ఫ్యామిలీ (విడాకుల) కోర్టులు వీకెండ్ లో ప్రత్యేకంగా పని చేస్తున్నాయి. ఇన్ని రంగాల్లో ఇన్ని మార్పులు జరుగుతున్నప్పుడు దాంపత్య జీవితంలోనూ మార్పులు వచ్చి తీరుతాయి. అత్యంత సహజంగానే మన వర్తమాన సమాజంలో వివాహేతర సంబంధాలు పెరుగుతున్నాయి. ‘One-Night Stand’, ‘Work Place Sex’ ఒక కొత్త అవసరాలుగా మారుతున్నాయి.  

 

ప్రపంచంలో ప్రతీదీ చలనశీలమైనదైనప్పుడు స్త్రీ పురుష సంబంధాలు కూడ చలనశీలంగానే వుంటాయి. స్త్రీపురుష సంబంధాలు కాన్ స్టాంట్ కాదు; వేరియబుల్ అంటే ఛాందసవాదులకేకాదు; అభ్యుదయవాదులుగా కనిపించేవాళ్ళకు కూడ గుండె ఆగిపోతోంది.  

పాతివ్రత్యం, ఏకపత్నీవ్రతం అనేవి ఆచరణ సాధ్యంకాని భూస్వామ్య యుగపు ఆదర్శాలేతప్ప వివాహేతర సంబంధాలనేవి అనాదిగా వున్నవే. గతంలో, యజమాని కులాలు వాటిని బహిరంగంగా సాగించేవి; శ్రామిక కులాలు వాటిని రహాస్యంగా సాగించేవి. వివాహేతర సంబంధాలు ఒక సామాజిక అవసరంగా మారాయని ఇప్పుడు న్యాయవ్యవస్థ సహితం గుర్తించాల్సి వచ్చింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న పురుషుల్ని నేరస్తులుగా పరిగణించి కఠినంగా శిక్షించే ఐపిసి సెక్షన్ 497ను సుప్రీం కోర్టు 2018 సెప్టెంబరులో రద్దు చేసింది.

 

గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కలిసి ఓ మంచి బార్లో కూర్చొని మంచి మద్యం తాగుతూ హ్యాప్పీగా తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వివాహపూర్వ విడాకుల (బ్రేకప్) పార్టి జరుకుంటారని గతంలో  ఎవరైనా ఊహించారా? ఎక్స్ బాయ్ ఫ్రెండ్ బర్త్ డేకు అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ అందరూ ఒక జట్టుగా వచ్చి (వీలయితే తమ కొత్త బాయ్ ఫ్రెండ్స్ ను కూడ వెంటబెట్టుకుని వచ్చి) గిఫ్ట్స్ ఇచ్చి అభినందిస్తారని మనలో ఎంత మందికి తెలుసూ? 

ఇదొక కొత్త ప్రపంచం. అక్కడా భావోద్వేగాలు,  ప్రేమానురాగాలు, త్యాగాలు, ఒకరికొకరు కొంత ప్రైవేటు స్పేస్ ఇచ్చుకోవడాలు వంటి విలువలు గొప్పగానూ  వుంటాయి. 

 “సమాజం చేత మొగుడూ పెళ్ళాలుగా ముద్ర వేయించుకున్నవాళ్ళు వుండే చోటుని యిల్లు అనాలి; బ్యాచిలర్స్ వుండేదాన్ని రూమ్ అనాలి” అని ఈ కథలో ఓ చోట ప్రొటోగోనిస్టు అంటుంది. బ్యాచిలర్స్ అంటే మగవాళ్ళే కాకుండ ఆడవాళ్లు కూడ అని ఎక్స్ టెండ్ చేస్తే దాన్ని ‘ట్రయల్ రూం’ అనవచ్చు. సెక్స్ పార్టనర్ కు కేవలం ఫ్రెండ్షిప్ కంటెంట్ మాత్రమే కాకుండ ఫ్యామిలీ కంటెంట్  కూడ  వుందోలేదో  పరీక్షించుకునే ప్రదేశం అన్నమాట.

పేరుకు తగ్గట్టు ‘రహాస్యం’ కథ చివరి వరకు కొంత యాంగ్జైటీ, కొంత థ్రిల్, కొన్ని సర్ప్రైజింగ్ ట్విస్టులతో ఆసక్తికరంగా సాగుతుంది. తప్పక చదవాల్సిన అత్యంత ఆధునిక కథ ఇది.

 

-        డానీ

 

 

ఈ కథలో ప్రొటోగోనిస్టు ఒక మహిళ. చాలామంది రచయితలకు వాక్య నిర్మాణంలో  స్త్రీపురుష బేధాలు తెలీవు. ఈ కథ మొత్తం ఒక మహిళ చెపుతున్నట్టే వుంటుంది. పదాల ఎంపికలో తీసుకున్న జాగ్రత్తలకు రచయితను మెచ్చుకోవాలి.

 

మానవ సమూహాల చలనం అడవుల నుండి గ్రామాలకు, అక్కడి నుండి పట్టణాలకూ, అక్కడి నుండి నగరాలకూ, అక్కడి నుండి మహానగరాలకు, అక్కడి నుండి ప్రపంచ మహానగరాలకు సాగుతున్నట్టు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కేవలం క్షితిజ సమాంతర చలనం (horizontal mobility)  మాత్రమేకాదు;   నిలువు చలనం (vertical mobility) కూడ. జీవితంలో వుధృతంగా సాగుతున్న చలనశీలత ఇప్పుడు స్త్రీపురుష సంబంధాల్ని ఎలా ప్రభావితం చేస్తున్నదన్నది ఎవరికయినా రావలసిన సందేహం.

 

 

జీవన విధానంలో వస్తున్న పెను మార్పులు ‘దాంపత్యాన్ని’ ఎలా ప్రభావితం చేస్తున్నాయో గమనించడం చాలా అవసరం. అమెరికాలో పెళ్ళి చేసుకునేవారి సంఖ్య క్రమంగా తగ్గిపోతున్నది. 2021 సెన్సెస్ ప్రకారం 33 కోట్ల మందిగల అమెరిక జనాభాలో  వివాహ వయస్సుగల పురుషులు 12.9 కోట్ల మంది, స్త్రీలు 13.6 కోట్ల మంది. వీరిలో ఎన్నడూ పెళ్ళి చేసుకోని పురుషులు 4.47 కోట్లమంది; స్త్రీలు 4.18 కోటల మంది. అంటే వివాహ వయస్సు గలవారిలో 33.53 శాతం మంది అస్సలు పెళ్ళి చేసుకోలేదు.  ప్రతి ముగ్గురురిలో ఒకరు పెళ్ళిని నిరాకరిస్తున్నారు. వీరుగాక, విడాకులు పొందినవాళ్ళు మరో రెండున్నర కోట్ల మంది వున్నారు. భారతదేశ ‘దాంపత్య’ గణాంకాలు కూడ దీనికి భిన్నంగా ఏమీ వుండవు.

 

గత శతాబ్దంలో అయితే,  అమెరికాలో జరిగిన పరిణామాలు రెండు మూడు దశాబ్దాల తరువాత ఇండియాలో జరిగేవి. ఇప్పుడు అంత సమయం పట్టడంలేదు. అమెరికాలో నిన్న జరిగింది ఈరోజు మనదేశంలో  జరిగిపోతున్నది. అంచేత వీటిని అమెరిక ప్రత్యేక అంశంగా చూడకూడదు.

 

 

జంతు ప్రపంచంలో జీవుల మధ్య సంబంధాల్లో పెద్దగా వైవిధ్యం వుండదు. కానీ, మానవ ప్రపంచంలో మనుషుల మధ్య సంబంధాలు విపరీతమైన వైవిధ్యంతో వుంటాయి. జంతు ప్రపంచంలో గుంపు అనే మాట మానవ ప్రపంచంలో సమాజంగా మారిపోతుంది. ఈ సమాజం అత్యంత చలనశీలమైనది, జటిలమైనది, అంతులేని వైవిధ్య పూరితమైనది. 

 

 

Marital status of the United States population in 2021, by sex

https://www.statista.com/statistics/242030/marital-status-of-the-us-population-by-sex/

 

 

 

Fiancée

కాబోయే భార్య

 

Future Husband

కాబోయే భర్త

 

A one-night stand is a single sexual encounter in which there is an expectation that there shall be no further relations between the sexual participants. The practice can be described as "sexual activity without emotional commitment or future involvement".

 

 

 

Marital status of the India population in 2021, by sex

 

 

These natural processes respond primarily to light and dark and affect most living things, including animals, plants, and microbes. Chronobiology is the study of circadian rhythms

         

No comments:

Post a Comment