పాన్ ఇండియా సినిమాల థీమ్
మధ్యయుగాల్లో హిందూరాజులు హిందూ రాజులు యుధ్ధాలు చేసుకున్నారు. ముస్లిం రాజులు ముస్లిం రాజులు యుధ్ధాలు చేసుకున్నారు. హిందూ రాజులు ముస్లిం రాజులు యుధ్ధాలు చేసుకున్నారు.
వీటిల్లో మొదటి రెండింటినీ దాచిపెట్టి మూడోది మాత్రమే జరిగినట్టు చరిత్రను తిరగరాయడం మొదలెట్టారు. ఇప్పుడిది పాన్ ఇండియా సినిమాలకు థీమ్ గా మారింది.
హిందూ రాజుల కొలువులో ముఖ్య స్థానాల్లో ముస్లింలు వున్న సందర్భాలున్నాయి. అలాగే, ముస్లిం రాజుల కొలువులో ముఖ్య స్థానాల్లో హిందువులు వున్న సందర్భాలున్నాయి.
ఈ మత సామరస్యాన్ని దాచిపెట్టి హిందూమత పరిరక్షణ కోసమే అలనాటి యుధ్ధాలు జరిగాయని చెప్పడమూ ఈ థీముల్లో ఒక ముఖ్యమైన అంశం.
No comments:
Post a Comment