*అణగారిన సమూహాల సహజ లక్ష్యం సమసమాజం !!*
అణగారిన కులాలకు
కుల సమానత్వం సహజ లక్ష్యం.
అణగారిన వర్గాలకు
వర్గ సమానత్వం సహజ లక్ష్యం.
అణగారిన తెగలకు
తెగ సమానత్వం సహజ లక్ష్యం.
అణగారిన మతాలకు
మత సమానత్వం సహజ లక్ష్యం.
అణగారిన లింగాలకు
లింగ సమానత్వం సహజ లక్ష్యం.
అణగారిన భాషలకు
భాషా సమానత్వం సహజ లక్ష్యం.
అణగారిన
ప్రాంతాలకు ప్రాంతాల సమానత్వం సహజ లక్ష్యం.
ప్రతిమనిషి ప్రకృతి
మీద సమానహక్కు కోరడం మరో సహజ లక్ష్యం.
అందరూ
కోరుకుంటున్నది ఒక్కటే!
సమసమాజం
మానవులందరీ సహజ లక్ష్యం !!
ఈ లక్ష్యాలన్నింటిని
రాజ్యాంగం ద్వార సాధించగలిగితే
అంతకన్నా
ఆనందించాల్సింది మరేదీ వుండదు.
రాజ్యాంగం ద్వార ఈ
లక్ష్యాలను సాధించే ప్రణాళీక
ఎవరి దగ్గర అయినా
వుందా?
రాజ్యాంగం
ఇప్పుడు ఎవరి చేతుల్లో వుందీ?
దాన్ని విముక్తి
చేసే మార్గం ఏమిటీ?
లేకుంటే
ప్రత్యామ్నాయం ఏమిటీ?
అదే ఇప్పుడు అసలు
చర్చ.
No comments:
Post a Comment