బ్రహ్మణి స్టీల్స్ భూముల బాగోతం-వాస్తవాలు🙏🙏
జగన్ అవినీతి సామ్రాజ్యానికి పునాది బ్రహ్మాణి స్టీల్స్
ప్రజలకు బతుకు, భవిష్యత్, భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు పని చేస్తున్నారు🙏🙏
కానీ అవినీతి-దోపిడీ కోసం భూమి, బంగారం, బ్యాంక్ బ్యాలెన్సులు పెంచుకోవాలనే దురుద్దేశ్యంతో వైఎస్ కుటుంబం పని చేస్తోంది😡😡
ఇదేదో మాట వరుసకు అనడం లేదు... ప్రత్యర్థి కాబట్టి విమర్శించడం లేదు.. ఇది అక్షరాలా నిజమని నిరూపించే సంఘటనలు గత 20-25 ఏళ్ల కాలంలో చాలానే జరిగాయి.
తాజాగా బ్రహ్మణి స్టీల్స్ భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవడంతో వైఎస్ కుటుంబం ప్రజా ధనాన్ని.. ప్రభుత్వ భూములను ఏ స్థాయిలో దోచుకుందోననేది మళ్లీ చర్చనీయాంశంగా మారింది.
బ్రహ్మాణి సంస్థకు భూములు కేటాయించే విషయంలో నాటి వైఎస్ ప్రభుత్వం ఈ ప్రాథమిక నిబంధనలన్నింటినీ పక్కనబెట్టింది.
సంస్థ సామర్థ్యాన్ని ఏమాత్రం పరిశీలించకుండా ఏకపక్షంగా వేల ఎకరాల భూములను కేటాయించారు.
తనకు అత్యంత సన్నిహితుడైన గాలి జనార్దన్ రెడ్డికి చెందిన బ్రహ్మాణి స్టీల్స్ సంస్థకు నాటి సీఎం వైఎస్సార్ ఏకంగా 14 వేల ఎకరాలు అప్పన్నంగా కట్టబెట్టారు.
ఇందులో 10,760 ఎకరాలు స్టీల్ ప్లాంట్ కోసమని... 3,115 ఎకరాలు ఎయిర్ పోర్టు కోసమని కూడా వర్గీకరించి భూ కేటాయింపులు జరిపారు.
2007 జులై 8వ తేదీన కడప జిల్లాలో ఎకరా రూ.18 వేల చొప్పున 10,760 ఎకరాలు, రూ.25 వేలు చొప్పున మరో 3,115 ఎకరాల భూ కేటాయిస్తూ జీఓ నెం.785 జారీ చేశారు.
2007 జులై 18వ తేదీన జీఓ నెం.151, 152 ద్వారా అనంతపురం జిల్లాలో 107 హెక్టార్లు బ్రాహ్మణీ స్టీల్స్ పేరుతో గనులు కేటాయించారు.
2008 మార్చి 25వ తేదీన విమానాశ్రయం ఏర్పాటుకు 3,115.64 ఎకరాలు కేటాయించారు.
దీని ద్వారా 10 వేల మందికి ప్రత్యక్షంగా, లక్ష మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని నమ్మబలికారు.
ఏటా 20 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి చేస్తామని ప్రగల్భాలు పలికారు... దీని కోసం ఓబుళాపురం గనులను కూడా కేటాయించారు... కానీ అవన్ని బూటకాలని ఆ తర్వాత కొద్దికాలంలోనే తేలింది.
ఓబుళాపురం దోపిడీ వయా బ్రహ్మాణి స్టీల్స్...
ఓబుళాపురం గనులను తవ్వుకునేందుకు దోపిడీ చేసేందుకే బ్రహ్మణి స్టీల్స్ పుట్టింది.
బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ పేరుతో భూములను స్వాహా చేసిన గాలి జనార్దన్ రెడ్డికి తెర వెనుక పార్టనర్ జగన్.
బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామనే పేరుతో ఆ సంస్థకు ఓబుళాపురం భూములను క్యాప్టివ్ గనుల కింద కేటాయించారు... అలాగే ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి 320 ఎకరాల్లో మైనింగ్ లీజ్ ఇచ్చారు.
క్యాప్టివ్ గనులుగా కేటాయించిన తర్వాత స్టీల్ ప్లాంట్ పనులు మొదలు పెట్టాల్సిన గాలి జనార్దన్ రెడ్డి అండ్ కో.. ఆ పనిని పక్కన పెట్టి.. ఓబుళాపురం గనుల్లో తవ్వకాలు మొదలు పెట్టారు.
2007-2009 మధ్య కాలంలో అంటే రెండేళ్ల కాలంలో ఓబుళాపురం మైనింగ్ స్కామ్ కు భారీ ఎత్తున తెరలేపారు.
ఉక్కు ఉత్పత్తి కోసం వినియోగించాల్సిన ఖనిజాన్ని ఎగుమతులు చేసుకుని భారీ ఎత్తున దోపిడీ చేశారు. కడపలో ఉక్కు కర్మాగారం రాలేదు కానీ...వేల కోట్ల అవినీతి జరిగింది. దీని వల్ల వైఎస్ కుటుంబం లబ్ది పొందింది.
2008 సెప్టెంబర్ లో ఓబుళాపురం మైనింగ్ కంపెనీతో ఒప్పందాన్ని కుదుర్చుకున్న రెడ్ గోల్డ్ సంస్థ కూడా సాక్షి పత్రికను ప్రచురించే జగతి పబ్లికేషన్స్ చిరునామాతోనే రిజిస్ట్రార్ అయింది.
జగన్‌కు ఇందిరా టెలివిజన్‌లో రూ.30 కోట్లు పెట్టుబడి పెట్టిన ఆర్ఆర్ గ్లోబల్ సంస్థ చిరునామా కూడా అదే.
ఓఎంసీ నుంచి ఉత్పత్తి అయ్యే ఇనుప ఖనిజంలో 50 శాతం ఉత్పత్తి ఖర్చుకు కేవలం 5 శాతాన్ని అదనంగా కలిపే ధరకు రెడ్ గోల్డ్ కు ఇచ్చేలా ఒప్పందం, అక్కడ నుంచి సాక్షిలోకి నిధులు వెళ్ళాయి.
ఓబుళాపురం అక్రమాలపై ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ పెద్ద ఎత్తున పోరాటాలు చేసింది... క్షేత్ర స్థాయి మొదలుకుని.. జాతీయ స్థాయి వరకు నాటి ప్రభుత్వ అక్రమాలను ఎండగట్టింది.
ఓఎంసీ అక్రమాలు వెలుగులోకి రావడంతో 2009 డిసెంబర్ 8వ తేదీన సీబీఐ దర్యాప్తునకు నాటి ప్రభుత్వం ఆదేశించింది... 2012 మే 31వ తేదీన బ్రహ్మాణి స్టీల్సుతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేశారు.
సీఎంగా బాధ్యతలు చేపట్టాక జగన్ ఓబుళాపురం అక్రమాలను మళ్లీ మొదలు పెట్టే ప్రయత్నం చేశారు.
ఓబులాపురం మైనింగ్ లీజులో తవ్వకాలు పునరుద్ధరించినా మాకెలాంటి అభ్యంతరం లేదని 2022లో నాటి జగన్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
సుప్రీంకోర్టు నియమించిన అమికస్ క్యూరీ అప్పట్లోనే బయటపెట్టడంతో ఓఎంసీ, జగన్ ప్రభుత్వం పాచిక పారలేదు.
జగన్ అధికారంలోకి వచ్చాక రెండు సార్లు స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపనలు చేసి డ్రామాలాడారు... కనీసం కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా చేపట్టలేదు.
కియా వర్సెస్ బ్రహ్మాణి...
కియా విషయంలో ఏం జరిగింది... బ్రహ్మాణి విషయంలో ఏం జరిగిందో పరిశీలిస్తే... జగన్ దోపిడీ ఏంటో అర్థమవుతుంది.
నాడు బ్రహ్మాణీ స్టీల్స్ కు భూ కేటాయింపులు జరిపారు.. కానీ తట్ట మట్టి పని కూడా చేయలేదు. సుమారు రూ. 5 వేల కోట్ల విలువైన 10 వేల ఎకరాల భూములను నిర్వీర్యం చేశారు. సీమ ప్రజలను వంచించారు.
అదే కియా సంస్థకు సీఎం చంద్రబాబు 2014-19 మధ్య కాలంలో భూములు కేటాయించారు.
దేశ వ్యాప్తంగా పోటీ ఉన్నా 2017లో అనంతపురం జిల్లాకు కియా కార్ల పరిశ్రమల తెచ్చారు.
536 ఎకరాలు కేటాయించారు. నీళ్లు ఇచ్చి, అన్ని విధాలుగా సహకరించి ఉత్పత్తి ప్రారంభించారు.
ఇప్పటికి దాదాపు 19 లక్షల కార్లు మన ఉత్పత్తి అయ్యాయి. ఇందులో 3 లక్షల కార్లు ఏకంగా 90కి పైగా దేశాలకు ఎగుమతి అయ్యాయి.
వైఎస్ హయాంలో బ్రహ్మాణి స్టీల్స్ కు ఏకంగా 10 వేల భూములు కట్టబెట్టారు.
క్యాప్టివ్ మైనింగ్ అంటూ ఓబులాపురం గనులు రాయించుకున్నారు. ప్లాంట్ పెట్టలేదు కానీ ఓబులాపురం గనులను దోచుకున్నారు.
పెనుకొండలో ఉత్పత్తి అయిన కియా కార్లు 90 దేశాలకు ఎగుమతి అవుతుంటే... జగన్ పార్టనర్షిప్ లో ఓబుళాపురంలోని ఇనుప ఖనిజాన్ని అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేశారు.
ఇలాంటివి జగన్ మోహన్ రెడ్డి చాలానే చేశారు... సరస్వతి పవర్ కు 1,516 ఎకరాలు కేటాయించారు... 15 ఏళ్లు అయినా... నేటికి పరిశ్రమ పూర్తి చేయలేదు.ఆ భూములను తనఖా పెట్టి తెచ్చుకున్న నిధులను దారి మళ్లించారు.
సెజ్ లకు 20 వేల ఎకరాలు, లేపాక్షి నాలెడ్జ్ హబ్ కు 8,844 ఎకరాలు, నెల్లూరులో థర్మల్ పవర్ కు 15 వేల ఎకరాలు కేటాయించారు.. కానీ ఒక్క పరిశ్రమ రాలేదు... ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వలేదు.
నిబంధనలకు విరుద్దంగా భూములు కేటాయించడం.. గనులైతే దోచుకోవడం... మామూలు భూములైతే వాటిని బ్యాంకులో తనఖా పెట్టి డబ్బులు డ్రా చేయడం ఇదీ వీళ్లు చేసే పని.
వీళ్లా విమర్శలు చేసేది.. సిగ్గు సిగ్గు
ఇంతటి సిగ్గుమాలిన పనులు చేసిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వం మీద ఇంకా బురద జల్లేందుకు గొడ్డలి పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు.
ఉద్యోగాలు వస్తాయి... అభివృద్ధి జరుగుతుందని గూగుల్ కు భూములిస్తే.. కోర్టులకెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఐటీ చదువుకున్న యువత హైదరాబాద్, బెంగళూరులకు వెళ్లకుండా విశాఖలోనే ఉద్యోగాలు తెచ్చుకునేలా టీసీఎస్, కాగ్నిజెంట్ కంపెనీలకు భూములిస్తే దాని మీద పడి ఏడ్చారు.
పెట్టని స్టీల్ ఫ్యాక్టరీ కోసం భూములివ్వడంతో పాటు.. ఏకంగా విమానాశ్రయం నిర్మిస్తామనే పేరుతో 3 వేల ఎకరాలను కట్టబెట్టిన వాళ్లు రాజధానికి అంత భూమి ఎందుకంటూ అక్కసు వెళ్లగక్కుతున్నారు.
నాడు వైఎస్ జమానాలో.. ఆ తర్వాత జగన్ జమానాలో భూములను అడ్డం పెట్టుకుని దోపిడీ చేసింది చాలక.. ఇప్పుడు పరిశ్రమలకు భూములిచ్చి యువతకు ఉపాధి కల్పిస్తుంటే ఓర్వలేకపోతున్నారు.
వాళ్లకు భూమి అంటే దోపిడీ... భూమి అంటే అవినీతి... భూమి అంటే కబ్జా.. భూమి అంటే బ్యాంక్ బ్యాలెన్స్.
కానీ కూటమి ప్రభుత్వానికి భూమి అంటే భవిష్యత్.. భూమి అంటే ఉద్యోగాలు.. భూమి అంటే అభివృద్ధి.. భూమి అంటే పరిశ్రమలు.
క్రోనాలజీ
S.no
Date
వివరాలు
1
01.06.2007
భూ కేటాయింపులు జరపమని కడప కలెక్టర్‌కు లేఖ
2
04.06.2007
భూ కేటాయింపులకు సీసీఎల్ఏ క్లియరెన్స్
3
08.06.2007
కడప జిల్లాలో బ్రాహ్మణీ స్టీల్స్ కు ఎకరా రూ.18 వేల చొప్పున 10,760 ఎకరాలు, రూ.25 వేలు చొప్పున మరో 3,115 ఎకరాల భూ కేటాయింపు చేస్తూ జీఓ నెం.785 జారీ
4
10.06.2007
బ్రాహ్మణీ స్టీల్స్ కు వైఎస్ఆర్ శంకుస్థాపన (జగన్ హాజరు)
5
18.06.2007
జీఓ నెం.151, 152 ద్వారా అనంతపురం జిల్లాలో 107 హెక్టార్లు బ్రాహ్మణీ స్టీల్స్ పేరుతో గనులు కేటాయింపు.
6
25.03.2008
విమానాశ్రయం ఏర్పాటుకు 3,115.64 ఎకరాలు కేటాయింపు
09.05.2008
జీఓ నెం.94 ద్వారా బ్రాహ్మణీ స్టీల్స్ కు మైలవరం రిజర్వాయర్ నుండి 2 టీఎంసీల నీరు
7
08.12.2009
ఓబులాపురంపై సిబిఐ దర్యాప్తుకు కేంద్రం ఆదేశం
8
31.05.2012
బ్రాహ్మణీ స్టీల్స్ MoU ను రద్దు చేసిన ప్రభుత్వం
9
20.06.2013
బ్రాహ్మణీ స్టీల్స్ కు కేటాయించిన భూములను రద్దు చేస్తూ జీఓ నెం.333 జారీ.
06.11.2018
SAEL సాధ్యం కాదని చెప్పడంతో పీపీపీ విధానంలో 'రాయలసీమ స్టీల్ కార్పొరేషన్' ఏర్పాటుకు చంద్రబాబు ప్రభుత్వం ఆమోదం.
27.12.2018
మైలవరం మండలం కంబాలదిన్నె గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన.
Nov.2019
వైసీపీ అధికారంలోకి వచ్చాక 'ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్' (APHGSL) అనే ప్రభుత్వ రంగ సంస్థ ఏర్పాటు.
18.12.2019
18 డిసెంబర్ 2019: ఏడాదికి 5 మిలియన్ టన్నుల ఐరన్ ఓర్ సరఫరా కోసం ఎన్‌ఎండీసీ (NMDC) సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం.
23.12.2019
జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన.
15.02.2023
15 ఫిబ్రవరి 2023: సున్నపురాళ్లపల్లెలో సీఎం జగన్ మరోసారి శంకుస్థాపన.
03.06.2026
సున్నపురాల్లపల్లెలో ఉక్కు కర్మాగారం నిర్మాణానికి పనులు పునఃప్రారంభం.
10
25.06.2026
జీఓ నెం.333 సవాల్ చేస్తూ బ్రాహ్మణీ స్టీల్స్ వేసిన పిటిషన్‌ను డీఫాల్ట్‌గా హైకోర్టు కొట్టేసింది.
No comments:
Post a Comment