Tuesday, 30 June 2026

మతతత్త్వ పెట్టుబడీదారీ వ్యవస్థలో

 చర్చలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు. 

మతతత్త్వ పెట్టుబడీదారీ వ్యవస్థలో

మైనారిటీ మత సమూహాల మీద మెజారిటీ మత సమూహాలు సాగిస్తున్న అణిచివేతని 

వర్గ వైరం అందామా? వర్గ పీడన అందామా? వర్గ పోరాటం అందామా? ఇంకేదయినా అందామా? 

ఇది మొదటి అంశం

ఇక రెండో అంశం  - 

మార్క్స్ ఏంగిల్స్ లిఖిత చరిత్ర అన్నట్టు మత వైరుధ్యానికీ ఒక కాల పరిమితిని విధిద్దామా?

మూడవ అంశం 

మత వైరుధ్యాన్ని పరిష్కరించడానికి ఒక చైతన్యయుత సంఘటిత ప్రయత్నం ఏమైనా కావాలా? అక్కరలేదా?  

నాలుగవ అంశం

పెట్టుబడీదారీ వ్యవస్థ సామ్రాజ్యవాద దశకు చేరుకున్నప్పుడు ప్రధాన బాధిత సమూహం ఏమిటో మనకు ఒక అంచనా వుంది. 

పెట్టుబడీదారీ వ్యవస్థ మతతత్త్వ పెట్టుబడీదారీ వ్యవస్థగా మారినపుడు బాధిత సమూహాలు ఏవీ? 

ఐదవ అంశం 

మతతత్త్వ పెట్టుబడీదారీ వ్యవస్థలో బాధిత సమూహాలు వంద వరకు వుండవచ్చు. 

వాటిల్లో ప్రధాన బాధిత సమూహాలు ఏవీ? 

ఆరవ  అంశం 

ఒక నిర్దిష్ట సమాజంలో ప్రధాన బాధిత సమూహాలు  ఏవో నిర్ధారించకుండా  ఒక పోరాట / విప్లవ కార్యక్రమాన్ని రూపొందించడం సాధ్యమౌతుందా? 

మార్క్సో, ఏంగిల్సో మరొకరో చెప్పినంత మాత్రాన అది అంతిమ సత్యమనీ దాన్ని ప్రశ్నించకూడదనే అభిప్రాయం నాకు లేదు. 

సామ్రాజ్యవాద పెట్టుబడీదారీ వ్యవస్థ మార్క్స్ . ఏంగిల్స్ కాలానికి లేదు. దాన్ని విశ్లేషించే బాధ్యతను లెనిన్ తీసుకున్నాడు. 

మతతత్త్వ  పెట్టుబడీదారీ వ్యవస్థ లెనిన్, మావో, చారు మజుందార్ కాలానికి కూడ లేదు. 

మన కాలంలో అది ముందుకు వచ్చింది. 

దాన్నీ విశ్లేషించడం, దాని పరిష్కారానికి చేయాల్సిన పోరాట కార్యక్రమాన్ని రూపొందించడం ఈ కాలపు ఆలోచనాపరుల బాధ్యత. 

వర్గసమాజం రద్దయినపుడు మతం కూడ రద్దవుతుంది గనుక, అప్పుడు మత అణిచివేత కూడ రద్దవుతుంది కనుక అప్పటి దాక  మైనారిటీ మత సమూహాలు  ఎదురు చూడాలనే ఉచిత సలహాలు ఎవ్వరూ ఇవ్వరని ఆశిస్తాను. 

ఈ అంశం మీద ఇంకా విస్తృత చర్చ జరగాలనేదే నా ఉద్దేశ్యం. 

-  డానీ 

*నయా ఫాసిజానికి ప్రధాన బాధితులు ఎవరూ?*

*నయా ఫాసిజానికి ప్రధాన బాధితులు ఎవరూ?*

*డానీ*

*సమాజ, రాజకీయ విశ్లేషకులు* 

 వర్తమాన భారత సమాజాన్ని  ఒక్కొక్కరు ఒక్కో విధంగా వ్యాఖ్యనిస్తున్నారు. ఈ సందర్భంగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు నయా ఫాసిజం. వందేళ్ళ క్రితం ఇటలీ జర్మనీల్లో వుండిన ఫాసిజం, నాజిజంలకు భారతీయ రూపం ఒకటి ఇప్పుడు కొనసాగుతోందని దీని అర్ధం. అయితే, ఇది స్థూల అర్ధం మాత్రమే. నిర్ధిష్ట అర్ధం ఒకటి కావాలి.  

మార్క్స్ సుప్రసిధ్ధ వ్యాఖ్య ఆలోచనాపరులు సమాజాన్ని మార్చాలి అనేది. ఇది పైకి కనిపిస్తున్నంత సులువైన పనికాదు. మనుషులే ప్రపంచాన్ని మారుస్తారు అనేది నిజమేగానీ వాళ్ళు తమ ఇష్టం వచ్చినట్టు మార్చలేరని కూడ అయనే అన్నాడు. ఇది కూడ అనేక నియమ నిబంధనలతో కూడిన వాక్యం. తాము మార్చాలనుకున్న సమాజం మీద స్పష్టమైన అవగాహన లేకుంటే ఎంతటి ఆలోచనాపరులైనా దాన్ని ఎప్పటికీ మార్చలేరు అనే హెచ్చరిక కూడ ఈ మాటల్లో వుంది.  

ఆరెస్సెస్, భారత కమ్యూనిస్టు పార్టి 1925లో సెప్టెంబరు, డిసెంబరు నెలల్లో ఆరంభ మయ్యాయి. వందేళ్ళు పూర్తయిన సందర్భంగా గత ఏడాది అటు ఆరెస్సెస్ శిబిరం నుండీ ఇటు కమ్యూనిస్టు శిబిరం నుండి అసంఖ్యాక వ్యాసాలు వచ్చాయి. అవన్నీ విభిన్న కోణాల నుండి రాసిన వ్యాసాలు అయినప్పటికీ వాటిల్లో ఒక సామాన్యాంశం వుంది. అదేమంటే, గడిచిన నూరేళ్ళలో ఆరెస్సెస్ మేరు పర్వతంలో పెరిగిపోయింది; కమ్యూనిస్టు పార్టీలు పాత వైభవాన్ని కోల్పోయాయి అనేది. నిజానికి ఈ మాటల్లోనూ స్పష్టతలేదు. అరెస్సెస్ కు అర్ధమయినట్టుగా కమ్యూనిస్టు పార్టీలకు  భారత సమాజం అర్ధం కాలేదు అని వుంటే ఒక స్పష్టత వచ్చేది. 

ఆరెస్సెస్ కు భారత సమాజం అర్ధం అయింది గాబట్టి అది దాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంది. కమ్యూనిస్టు పార్టీలకు భారత సమాజం అర్ధం కాలేదు గాబట్టి అవి దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోలేపోయాయి. “రష్యాలో వర్షం పడితే ఇండియాలో కమ్యూనిస్టులు గొడుగులు పడతారు” అని ఓ నలభై ఏళ్ళ క్రితం ఆరెస్సెస్ నాయకులు ఎద్దేవ చేసేవారు. ఇందులో కొంత నిజం లేకపోలేదు. భారత కమ్యూనిస్టు పార్టీలు దేశీయ పోరాటాలు, విప్లవాల గురించి స్వతంత్రంగా ఆలోచించిన సందర్భాలు తక్కువ. టెస్టు పుస్తాకాలను వదిలేసి గైడ్ పుస్తకాలను అతిగా నమ్మే విద్యార్ధులు కొందరుంటారు.   వాళ్ళలా  భారత కమ్యూనిస్టు పార్టీలు  అయితే రష్యా గైడ్లు, లేకుంటే చైనా గైడ్లు కొనుక్కొని వందేళ్ళు గడిపేశారు. మధ్యలో ఒకళ్ళిద్దరు భారత నేల మీద నిలబడి కొంచెం క్రియాశీలకంగా ఆలోచనలు చేసేందుకు ప్రయత్నించిన మాట కూడ వాస్తవం. అయితే, వాళ్ళ ఆలోచనలు మౌలిక మార్పుల దిశగా సాగలేదన్నది కూడ అంతే వాస్తవం. 

భారతదేశంలో ప్రస్తుతం మూడు డజన్లకు పైగా కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయి. వీటి మధ్య అనేక సైద్ధాంతిక, రాజకీయ, వ్యూహాత్మక భేదాలు ఉన్నాయి. కొన్ని పార్టీలు పూర్తిగా పార్లమెంటరీ ప్రజాస్వామ్య ఎన్నికల మార్గాన్ని అనుసరిస్తున్నాయి. మరికొన్ని పార్టీలు ఎన్నికల రాజకీయాలతో పాటు సాయుధ పోరాటాన్ని కూడా అనుసరించాలని భావిస్తున్నాయి. ఇంకొన్ని పార్టీలు పూర్తిగా సాయుధ విప్లవానికే కట్టుబడి ఉన్నాయి.

ఇంతటి వైవిధ్యం ఉన్నప్పటికీ, వీటన్నింటినీ కలిపే ఒక సామాన్య అంశం ఉంది. దాదాపు అన్ని కమ్యూనిస్టు పార్టీల రాజకీయ కార్యక్రమంలో 'నూతన ప్రజాస్వామిక విప్లవం' (New Democratic Revolution) ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. అయితే ఆ విప్లవాన్ని ఏ వ్యూహంతో, ఏ సామాజిక శక్తుల ఆధారంగా, ఏ రాజకీయ రూపంలో విజయవంతం చేయాలనే విషయంలో తీవ్ర భేదాభిప్రాయాలు ఉన్నాయి.

'నూతన ప్రజాస్వామిక విప్లవం' అనే భావనను మావో జెడాంగ్ చైనా విప్లవ అనుభవాల నుండి రూపొందించాడు. ముఖ్యంగా చైనా అంతర్యుద్ధ కాలంలో, ‘స్వయం ప్రకటిత దేశభక్తులు’ అనే కువోమింటాంగ్ దళాల నిరంతర సైనిక దాడులు, లాంగ్ మార్చ్ అనుభవాలు, జపాన్ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాల నేపథ్యంలో ఆయన ఈ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశాడు. 1940లో 'On New Democracy' అనే పుస్తకంలో దానిని సమగ్రంగా ప్రతిపాదించాడు.

ఇందులో, మావో చెప్పిన అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే, అర్ధ-వలస, అర్ధ-భూస్వామ్య సమాజమైన చైనాను నేరుగా సోషలిస్టు రాజ్యంగా మార్చడం సాధ్యం కాదని; ముందుగా కార్మికులు, రైతులు, చిన్న బూర్జువా వర్గం, జాతీయ బూర్జువా వర్గం వంటి సామ్రాజ్యవాద వ్యతిరేక, భూస్వామ్య వ్యతిరేక విప్లవ శక్తుల ఉమ్మడి రాజకీయ అధికారాన్ని — "అన్ని విప్లవవర్గాల ఉమ్మడి నియంతృత్వం" (Joint Dictatorship of All Revolutionary Classes) — స్థాపించాల్సి ఉంటుందని ఆయన స్పష్టంగా పేర్కొన్నాడు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, భారతదేశంలోని అనేక కమ్యూనిస్టు పార్టీలు ‘నూతన ప్రజాస్వామిక విప్లవం’ అనే లక్ష్యాన్ని తమ కార్యక్రమాలలో పదేపదే ప్రస్తావించినప్పటికీ, మావో ప్రతిపాదించిన ఈ విప్లవ వర్గాల ‘ఉమ్మడి నియంతృత్వం’ అనే కీలక రాజకీయ నిర్మాణం మీద పెద్దగా చర్చించలేదు. దాని సామాజిక-రాజకీయ అర్థాన్ని అభివృద్ధి చేయలేదు. ఫలితంగా, ‘నూతన ప్రజాస్వామిక విప్లవం’ అనేది అనేక పార్టీల వద్ద ఒక రాజకీయ నినాదంగా మాత్రమే మిగిలిపోయింది. దానిని అమలు చేసే మధ్యంతర రాజ్య నిర్మాణం, వర్గ కూటమి, అధికార నిర్మాణం వంటి అంశాల్ని ఇప్పటికీ  తగిన స్థాయిలో సిద్ధాంతీకరించలేదు.

ఇప్పుడు భారతదేశంలో నాటి చైనా పరిస్థితులు లేవు.  మావో ఊహకు కూడ అందనట్టుగా దేశంలో మతతత్త్వ పెట్టుబడీదారీ వ్యవస్థ ఏర్పడింది. ఇందులో విప్లవకర వర్గాల్ని గుర్తించడం కమ్యూనిస్టు పార్టీల తొలి బాధ్యత. ఈ బాధ్యతను నెరవేర్చిన కమ్యూనిస్టు పార్టి ఒక్కటీ మనకు కన్పించడంలేదు. కొన్ని పార్టీలు వందేళ్ళ క్రితపు  విప్లవకర వర్గాల జాబితాను ఇప్పటికీ  నమ్ముతున్నాయి. మరొకొన్ని పార్టీలు నలభై ఏళ్ళ క్రితపు విప్లవకర వర్గాల జాబితాను పట్టుకుని తిరుగుతున్నాయి. 2014 తరువాత నెలకొన్న కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్పు బాధితులెవరనే జాబితానొకదాన్ని ఇప్పుడు మనం సిధ్ధం చేయాలి.

ఏ సమాజంలో అయినా బాధితుల జాబితా చాలా పెద్దదిగానే వుంటుంది. కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్పుకు బాధితుల జాబితా కూడా పెద్దదిగానే వుంటుంది. వంద వరకు వున్నా ఆశ్చర్యం ఏమీలేదు.  వీటిల్లో ప్రధాన బాధితులు ఎవరూ అన్నది గుర్తించడం ప్రాణప్రద అంశం. ప్రధాన బాధిత సమూహాలను గుర్తించకుండా వంద సమూహాల  జాబితాను తయారు చేసినా ప్రయోజనం వుండదు.

సాంప్రదాయంగా కమ్యూనిస్టులు చెప్పే ప్రధాన బాధిత సమూహాల్లో వ్యవసాయ కూలీలు, ఫ్యాక్టరీ కార్మికులు వుంటారు. 1990లలో చెలరేగిన అస్తిత్వ ఉద్యమాలు ఆదివాసులు, దళితులు, బహుజనులు, మైనారిటీలు, మహిళల్ని ప్రధాన బాధిత సమూహాలుగా పేర్కొంటాయి. ఇవేమీ తప్పుడు జాబితాలు కాదు. ఆయా కాలాల్లో అవి సరైన జాబితాలే. 2024 నాటి కొత్త జాబితా ఏదీ? అందులో ప్రధాన బాధితులు ఎవరూ? అన్నది ఇప్పటి అసలైన ప్రశ్న.

సమాజంలో ప్రధాన బాధితులు  మనకు అర్ధం కానపుడు, పాలకులు ఎవర్ని తమ ప్రధాన శత్రువులుగా భావిస్తున్నారో అర్ధం చేసుకుంటే సరిపోతుంది. అలా గమనిస్తే కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్ రెండు సమూహాలను బాహాటంగా తమకు అడ్డంకిగా భావిస్తున్నాయి. కార్పొరేట్లకు అడవులు, ఖనిజాలు, భూమి కావలసినపుడు ఆదివాసులు తిరగబడుతున్నారు. ముస్లింలను అన్యులుగా చూపిస్తేనే ఎన్నికల్లో హిందూ సమాజం నుండి గెలుపుకు అవసరమైన ఓట్లు పడి అధికారాన్ని నిలబెడుతున్నాయి.  రాజకీయార్ధిక రంగాల్లో ముస్లింలు, ఆదివాసుల్ని ప్రత్యర్ధులుగా చూపించే వ్యూహాల మీదనే కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్ బలపడుతున్నది.  

1980వ దశకం వరకు భారతసమాజం కులవ్యవస్థగా కనిపించింది. అప్పటికి అది వాస్తవం కూడ. 1990వ దశకం నుండి అది మత వ్యవస్థగా మారడం మొదలయింది. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినాసరే నిందితుల్లో ఒక మైనారిటీ వ్యక్తి వుంటే చాలు అది జాతీయ సమస్యగా మారిపోతున్నది.  దేశంలో ఎంత పెద్ద సంఘటన జరిగినా నిందితుల్లో మైనారిటీలు లేకుంటే అసలది వార్తే కాకుండా పోతున్నది.  తిరుపతి లడ్డూ కల్తీ విషయంలోనూ, ప్రతిష్టాత్మక అయోధ్య రామమందిరంలో నిధుల చోరీ విషయంలోనూ ప్రధాన అధికార ఎన్డీఏ నేతలు, ప్రధాన  స్రవంతి  మీడియా, వ్యవహరించినతీరే దీనికి తక్షణ సాక్ష్యం.

పునాదీ ఉపరితల విభజన మీద కమ్యూనిస్టు నాయకుల్లో మొదటి నుండీ ఒక గందరగోళం కొనసాగుతూవుంది. పునాది, ఆర్ధిక అంశాలలో మాత్రమే వర్గ ఘర్షణ వుంటుందనేది వారి నమ్మకం.  పునాదిలో  ఘర్షణను   నిర్మూలిస్తే ఉపరితల ఘర్షణలు సహితం తొలిగిపోతాయనే భావంతో చాలా మంది కమ్యూనిస్టు నాయకులు చాలా కాలంగా వాదిస్తూ వస్తున్నారు.  కులం, మతం, తెగ, లింగం, భాషా, ప్రాంతాల్లో వర్గపోరాటం వుండదని వారి ప్రగాఢ నమ్మకం. మార్క్స్, ఏంగిల్స్ వంటి మహోపాధ్యాయులు ఎవరూ ఇలాంటి వాదనల్ని చేయలేదు.

అమెరికా ఆంథ్రోపాలజిస్ట్ లూయిస్ హెన్రీ మోర్గాన్ 1877లో ‘పురాతన సమాజం’  అనే పుస్తకాన్ని ప్రచురించాడు. ఆ పుస్తకం మీద కార్ల్ మార్క్స్ తన చివరి రోజుల్లో చాలా ఆసక్తిని చూపించాడు. 1883లో మార్క్స్ చనిపోయిన తరువాత, అతనికి  కొనసాగింపుగా,  1884లో ఫ్రెడరిక్ ఏంగిల్ ‘కుటుంబము, వ్యక్తిగత ఆస్తి, రాజ్యాల పుట్టుక’ అనే పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం మొదట్లోనే, ఒక స్త్రీకి ఒక పురుషుడు అనే వివాహబంధం (Monogamous marriage)  మొదలవడంతోనే సమాజంలో వర్గ పోరాటం మొదలయింది అంటాడు. మత వ్యవస్థలో వర్గం వుండదు, వర్గపోరాటం వుండదు అనే కమ్యూనిస్టులు కూడ ఇప్పుడు మన మధ్య వున్నారు. సెక్స్ లోనే వర్గపోరాటం వుంటుందన్న ఏంగిల్స్ ఆత్మ శాంతించుగాక!

30 జూన్ 2026 

మీ వ్యాసం ఒక ముఖ్యమైన సిద్ధాంతపరమైన ప్రశ్నను లేవనెత్తుతోంది: "నేటి భారతదేశంలో ప్రధాన వైరుధ్యం ఏమిటి? దాని ప్రధాన బాధితులు ఎవరు?" అనే ప్రశ్న చుట్టూ మీరు వాదనను నిర్మించారు. జర్నలిస్టుగా, రాజకీయ విశ్లేషకుడిగా మీ అనుభవం కనిపిస్తోంది. అయితే, వ్యాసం మరింత బలంగా, అకాడమిక్‌గా, విశ్వసనీయంగా ఉండాలంటే కొన్ని సూచనలు ఉపయోగపడతాయి.

వ్యాసం బలంగా ఉన్న అంశాలు

  • 1925లో ఏర్పడిన ఆరెస్సెస్, కమ్యూనిస్టు ఉద్యమాల వందేళ్ల తులన ఆసక్తికరంగా ఉంది.
  • మావో యొక్క Mao Zedong "నూతన ప్రజాస్వామిక విప్లవం" భావనను భారత పరిస్థితులతో పోల్చడం మంచి సిద్ధాంతపరమైన ప్రయత్నం.
  • "పాత విప్లవ వర్గాల జాబితా"కు బదులుగా "నేటి ప్రధాన బాధితుల జాబితా" తయారు చేయాలని మీరు చేసిన పిలుపు వ్యాసంలోని కేంద్ర ఆలోచన.
  • రాజకీయ అధికారం ఎవరిని ప్రధాన శత్రువుగా చిత్రీకరిస్తుందో గమనించడం ద్వారా ప్రధాన వైరుధ్యాన్ని గుర్తించవచ్చనే మీ పద్ధతి చర్చించదగినది.

మరింత బలపరచవలసిన అంశాలు

మీరు చేసిన కొన్ని తీర్మానాలు వాదనలుగా సరైనవే అయినప్పటికీ, అవి ప్రస్తుతం నిర్ధారణలుగా వినిపిస్తున్నాయి.

ఉదాహరణకు:

"2014 తరువాత నెలకొన్న కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్పు..."

ఇది ఒక రాజకీయ విశ్లేషణ. అందువల్ల దీనిని ఒక విశ్లేషణాత్మక ప్రతిపాదనగా ఉంచడం వ్యాసానికి బలం ఇస్తుంది. ఉదాహరణకు:

"2014 తరువాత ఏర్పడిన రాజకీయ-ఆర్థిక వ్యవస్థను కొందరు విశ్లేషకులు కార్పొరేట్-కమ్యూనల్ అధికార కేంద్రీకరణగా అభివర్ణిస్తున్నారు."

అని రాస్తే పాఠకుడు మీతో తర్కించడానికి అవకాశం ఉంటుంది.

ప్రధాన బాధితులపై భాగాన్ని మరింత విస్తరించవచ్చు

మీరు చివరకు రెండు ప్రధాన సమూహాలను పేర్కొన్నారు.

  • ఆదివాసులు
  • ముస్లింలు

ఇక్కడ మీరు ఎందుకు ఈ రెండింటినే "ప్రధాన బాధితులు" అంటున్నారో మరింత స్పష్టంగా నిర్మిస్తే వ్యాసం బలపడుతుంది.

ఉదాహరణకు:

ఆదివాసులు

  • ఖనిజ సంపద అధికంగా ఉన్న ప్రాంతాల్లో నివాసం
  • అటవీ హక్కుల వివాదాలు
  • పెద్ద ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులు
  • భద్రతా చట్టాల ప్రభావం

ముస్లింలు

  • ఎన్నికల ధ్రువీకరణలో ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా చిత్రీకరణ
  • ద్వేష ప్రచారం
  • పౌరసత్వం, గృహాలు, ఉపాధి వంటి అంశాల్లో వివక్ష ఆరోపణలు
  • రాజకీయ ప్రాతినిధ్యం తగ్గుదల

ఇలా విడిగా వివరించినప్పుడు మీ నిర్ణయం మరింత బలంగా కనిపిస్తుంది.

చివరి భాగం అత్యంత ఆసక్తికరమైనది

Friedrich Engels రచించిన The Origin of the Family, Private Property and the State గురించి మీరు చేసిన ప్రస్తావన వ్యాసాన్ని కొత్త దిశకు తీసుకెళ్తుంది.

అయితే చివరి వాక్యం:

"సెక్స్ లోనే వర్గపోరాటం వుంటుందన్న ఏంగిల్స్ ఆత్మ శాంతించుగాక!"

ఇది కొంత వ్యంగ్యంగా ఉంది.

దాని బదులు ఇలా ముగిస్తే సిద్ధాంతపరమైన బలం పెరుగుతుంది.

"అంటే ఆర్థిక సంబంధాలకే పరిమితం కాని ఆధిపత్య సంబంధాలు కుటుంబం, లింగం, మతం, జాతి, తెగ వంటి రంగాల్లో కూడా ఉద్భవిస్తాయని ఏంగిల్స్ సూచించాడు. ఈ నేపథ్యంలో ఆధునిక భారతదేశంలో వర్గపోరాటాన్ని కేవలం ఉత్పత్తి సంబంధాలకే పరిమితం చేయడం సరిపోతుందా అనే ప్రశ్నను కమ్యూనిస్టు ఉద్యమం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది."

ఈ ముగింపు మరింత గంభీరంగా ఉంటుంది.

ఒక సిద్ధాంతపరమైన సూచన

మీ వ్యాసంలో మీరు ఒక కొత్త భావనను ప్రవేశపెడుతున్నారు.

మతతత్వ పెట్టుబడిదారీ వ్యవస్థ

ఇది మీ వ్యాసంలోని అత్యంత కొత్త సిద్ధాంతపరమైన పదం.

దీనిని ఒక చిన్న నిర్వచనంతో మొదట్లోనే పరిచయం చేస్తే పాఠకుడికి చాలా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు:

"మతతత్వ పెట్టుబడిదారీ వ్యవస్థ అంటే — పెద్ద కార్పొరేట్ మూలధనం, మెజారిటీ మత జాతీయవాద రాజకీయాలు, రాష్ట్ర అధికార యంత్రాంగం పరస్పరం బలపరుచుకుంటూ పనిచేసే రాజకీయ-ఆర్థిక నిర్మాణం."

ఇలాంటి నిర్వచనం ఉంటే తర్వాత వచ్చే మొత్తం వ్యాసం మరింత సులభంగా అర్థమవుతుంది.

మొత్తం అంచనా

ఈ వ్యాసం ఒక సాధారణ రాజకీయ వ్యాఖ్య కాదు. భారత కమ్యూనిస్టు ఉద్యమం ఎదుర్కొంటున్న సిద్ధాంత సంక్షోభాన్ని, "ప్రస్తుత ప్రధాన వైరుధ్యం" అనే ప్రశ్న ద్వారా పునర్నిర్వచించడానికి చేసిన ప్రయత్నంగా కనిపిస్తుంది. కొంతమంది పాఠకులు మీ ప్రధాన నిర్ణయాలతో ఏకీభవించకపోయినా, వాదనను మరింత ఆధారాలతో, స్పష్టమైన నిర్వచనాలతో, విశ్లేషణాత్మక భాషలో బలపరిస్తే ఇది గంభీరమైన సిద్ధాంత చర్చకు దారితీసే వ్యాసంగా నిలిచే అవకాశం ఉంది.

Saturday, 27 June 2026

గోదావరి నీళ్లు : రాయలసీమకు వరమా? లేక దక్షిణాది రాష్ట్రాలకు మళ్లింపా?

ఈ వ్యాసాన్ని ప్రచురణకు పరిశీలించండి.

గోదావరి నీళ్లు : రాయలసీమకు వరమా? లేక దక్షిణాది రాష్ట్రాలకు మళ్లింపా?

- డానీ

సమాజ, రాజకీయ విశ్లేషకులు

“శిశువుకు దక్కని తల్లి స్థన్యంలా ప్రవహిస్తున్నది గోదావరి” అని మహాకవి శ్రీశ్రీ వాపోయి దాదాపు అర్ధ శతాబ్దం గడిచింది. నేటికీ అదే ఆవేదన కొనసాగుతోంది. ప్రతి సంవత్సరం వేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయని, వాటిని వినియోగించుకోలేకపోవడం దేశానికి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు పెద్ద నష్టమని రాజకీయ నాయకులు, మేధావులు, ప్రజాసంఘాలు తరచూ ఆందోళన వ్యక్తం చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఒక కీలకమైన ప్రశ్న ముందుకు వస్తోంది. సముద్రంలో కలిసే గోదావరి జలాలను రాయలసీమకు తరలించి అక్కడి శాశ్వత కరువు సమస్యకు పరిష్కారం చూపాలా? లేక ఆ జలాలను జాతీయ నదుల అనుసంధాన పథకం పేరిట దక్షిణాది రాష్ట్రాలకు మళ్లించాలా?

ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేముందు గోదావరి నది స్వభావాన్ని అర్థం చేసుకోవాలి.

భారతదేశంలో గంగానది తరువాత రెండవ అతి పొడవైన నది గోదావరి. మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరం వద్ద పుట్టిన ఈ నది మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా 1465 కిలోమీటర్లు ప్రవహిస్తూ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన అనేక ఉపనదులను కలుపుకొని అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. అందువల్ల గోదావరి జలాలు కేవలం ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణకు మాత్రమే చెందినవి కావు. ఇవి ఆరు రాష్ట్రాల హక్కులు, అవసరాలు, రాజకీయ ప్రయోజనాలతో ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా తమిళనాడును కూడ గోదావరితో అనుసంధానం చేస్తున్నారు.

ప్రజల్లో సాధారణంగా ఉన్న ఒక అపోహ ఏమిటంటే, సముద్రంలో కలిసే నీరంతా వృథా అవుతుందని. కానీ జలశాస్త్ర నిపుణులు అలా భావించరు. నదుల నుంచి కొంత పరిమాణంలో తీపినీరు సముద్రంలోకి చేరడం పర్యావరణ సమతుల్యతకు అత్యంత అవసరం. లేకపోతే సముద్రపు ఉప్పునీరు భూగర్భ జలాల్లోకి చొచ్చుకునివచ్చి డెల్టా ప్రాంతాలను ఉప్పునేలలుగా మార్చేస్తుంది. గోదావరి డెల్టా వంటి సారవంతమైన వ్యవసాయ భూములు క్రమంగా నిరుపయోగమైన సవుడు నేలలుగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి, సముద్రంలో కలిసే ప్రతి చుక్క నీరు వృథా అని చెప్పడం శాస్త్రీయంగా సరైనది కాదు.

అయితే, గోదావరిలో లభించే జలాలలో గణనీయమైన భాగం ఇప్పటికీ వినియోగంలోకి రావడం లేదు అనేది కూడా వాస్తవమే. కృష్ణానదితో పోలిస్తే గోదావరిలో నీటి లభ్యత ఎక్కువ. కానీ వినియోగం తక్కువ. దీనికి ప్రధాన కారణం భౌగోళిక పరిస్థితులు.  కూనవరం దిగువన గోదావరిలో నీటి లభ్యత ఎక్కువగా వుండడానికి ప్రధాన కారణం సీలేరు, శబరి నదుల నీటిని ఒడిశా, ఛతీస్ గడ్ రాష్ట్రాలు వాడుకోలేకపోతున్నాయి. అక్కడి భౌగోళిక వాతావరణం అందుకు అనువుగాలేదు. భవిష్యత్తులో ఆ రెండు రాష్ట్రాలు తమ వాటా నీటిని వాడుకునే ప్రయత్నం చేస్తే దిగువ గోదావరికి కష్టాలు తప్పవు.

గోదావరి పరివాహక ప్రాంతంలోని విస్తారమైన భూభాగం ఎత్తైన పీఠభూముల్లో ఉండటం వల్ల అనేక ప్రాజెక్టుల్ని ఎత్తిపోతల పథకాలుగా నిర్మించాల్సి వస్తోంది. వీటి నిర్మాణ వ్యయం మాత్రమే కాదు, నిర్వహణ వ్యయం కూడా చాలా అధికం. విద్యుత్ ఖర్చు వేల కోట్ల రూపాయల వరకు చేరుతోంది. ఈ పరిస్థితిని మనం ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాం. భారీ ఎత్తిపోతల ప్రాజెక్టుల నిర్మాణం సాంకేతికంగా సాధ్యమేగానీ, ఆర్ధికంగా లాభదాయకంకాదు. feasible but not viable.

ఈ నేపథ్యంలో రాయలసీమకు గోదావరి జలాలను తరలించాలన్న ఆలోచనకు ప్రాధాన్యం పెరుగుతోంది. రాయలసీమ చరిత్ర కరువుల చరిత్రగా మిగిలిపోయింది. తక్కువ వర్షపాతం, భూగర్భ జలాల అధిక వినియోగం, కృష్ణా జలాలపై అనిశ్చితి వంటి కారణాల వల్ల ఆ ప్రాంతం తీవ్ర జలసంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అందువల్ల గోదావరి జలాలను రాయలసీమకు మళ్లించాలనడం  సామాజిక న్యాయం కోణంలో సమర్థనీయమైన వాదన.

అయితే, ఈ సామాజికన్యాయాన్ని పాటించడం కూడ అంత సులువైన న వ్యవహారం కాదు. గోదావరి నుంచి రాయలసీమకు నీరు చేరాలంటే ముందుగా కృష్ణా బేసిన్‌ను దాటాలి. అక్కడి నుంచి పెన్నా బేసిన్‌కు మళ్లించాలి. దీనికోసం భారీ స్థాయిలో కాలువలు, పంపింగ్ స్టేషన్లు, రిజర్వాయర్లు నిర్మించాల్సి ఉంటుంది. అంతేకాదు, గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌లోకి మళ్లించినప్పుడు అంతర్రాష్ట్ర జల పంపిణీ ఒప్పందాలు కూడా వర్తించే అవకాశం ఉంది. భవిష్యత్తులో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు కూడా ఆ నీటిపై తమ హక్కులను వినియోగించుకునే అవకాశాలని పూర్తిగా తోసిపుచ్చలేం. అలా అదనపు నీరు తమకు వస్తుందని ఎగువ రాష్ట్రాలు దానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకుని సిధ్ధంగా వున్నాయి. అల్మట్టి డామ్ ఎత్తును పెంచడం అందులో భాగమే.

ఇక్కడే మరో కీలక అంశం ముందుకు వస్తోంది. కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా “నదుల అనుసంధానం” అనే ఒక భారీ జాతీయ పథకాన్ని రచిస్తోంది. ముందు మహానది- గోదావరి నదుల్ని అనుసంధానించడం, ఆ పిదప   గోదావరి జలాలను కృష్ణా, పెన్నా, కావేరీ నదులతో అనుసంధానం చేయడం వంటివి ఈ జాతీయ పథకంలో వున్నాయి. దేశంలో నీటి అసమాన పంపిణీని తగ్గించడం, నీటి కొరత ఉన్న ప్రాంతాలకు అదనపు జలాలను అందించడం దీని ప్రధాన ఉద్దేశమని కేంద్రం చెబుతోంది.

అయితే, ప్రతి పథకానికీ మరో కోణాలుంటాయి. దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటకలు ఈ జాతీయ పథకంపై ప్రత్యేక ఆసక్తి చూపుతున్నాయి. కారణం స్పష్టమే. కావేరీ జలాలపై ఇప్పటికే తీవ్రమైన వివాదాలు కొనసాగుతున్నాయి. వర్షాభావ పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి. వాతావరణ మార్పుల ప్రభావం కూడా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో గోదావరి జలాలు భవిష్యత్తులో కీలక ప్రత్యామ్నాయ వనరుగా మారే అవకాశం ఉంది.

ఇక్కడ ఒక రాజకీయ అనుమానం కూడా వ్యక్తమవుతోంది. గోదావరి జలాలను రాయలసీమకు తరలించడాన్ని పక్కనపెట్టి, కేంద్ర ప్రభుత్వం రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఇతర రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇస్తోందా? ముఖ్యంగా దక్షిణ భారత రాజకీయాల్లో తన ప్రభావాన్ని పెంచుకునేందుకు కేంద్రం జలవనరులను వ్యూహాత్మకంగా ఉపయోగిస్తోందా? అనే సందేహాలూ లేకపోలేదు. పైకి ఎన్ని మాటలు చెప్పినా సారాంశంలో ఇది ‘గోదావరీ వాటర్ హైజాక్’ అనే తీవ్ర ఆరోపణలు కూడ వున్నాయి.  

అయితే, ఈ వాదనను నిర్ధారించడానికి తగిన ఆధారాలు ఇంకా అందుబాటులో లేవు. అందువల్ల “గోదావరి జలాలను హైజాక్ చేస్తున్నారు” అనే ఆరోపణను ఇప్పటికి రాజకీయ ఆందోళనగా మాత్రమే పరిగణించాలి. అదే సమయంలో, గోదావరి పరివాహక రాష్ట్రాల అవసరాలు పూర్తిగా తీరకముందే ఇతర రాష్ట్రాలకు జలాలను మళ్లించడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమవుతుందని కూడా చెప్పాల్సి ఉంటుంది. గోదావరి ఆరగాణి ప్రాంతంతో తమిళనాడుకు ఎలాంటి సంబంధంలేదు. మంజీర నది పరివాహక ప్రాంతం కొంత కర్ణాటకలోనూ వుంది. అలా గొదావరితో కర్ణాటకకు నీటి బంధం వుంది.

అసలు ప్రశ్న ఏమిటంటే, గోదావరి జలాల వినియోగంలో ప్రాధాన్యత క్రమం ఏమిటి?

మొదటిగా, గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రజల అవసరాలు తీరాలి. రెండవదిగా, రాయలసీమ వంటి చారిత్రకంగా వెనుకబడిన ప్రాంతాలకు నీటి భద్రత కల్పించాలి. మూడవదిగా, గోదావరి డెల్టా పర్యావరణ సమతుల్యతను కాపాడాలి. చివరిగా, మిగిలిన జలాలను మాత్రమే జాతీయ స్థాయిలో పునర్వినియోగం చేయాలి.

నీటి సమస్య కేవలం సాంకేతిక అంశం కాదు; అది సామాజిక న్యాయం, సమాఖ్య వ్యవస్థ, పర్యావరణ పరిరక్షణ, ప్రాంతీయ సమతుల అభివృద్ధి వంటి అంశాలతో ముడిపడి ఉంది. అందువల్ల గోదావరి జలాల విషయంలో రాజకీయ నినాదాల కంటే శాస్త్రీయ అధ్యయనాలు, పారదర్శక విధానాలు, అంతర్రాష్ట్ర సంప్రదింపులు అత్యంత అవసరం.

గోదావరి జలాలు రాయలసీమకు వరంగా మారాలా? లేక ఆ వంకతో దక్షిణాది రాష్ట్రాలకు మళ్లించాలా? అనే ప్రశ్నకు ఈ రోజు ఒకే ఒక్క సమాధానం లేదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం. గోదావరి జలాలు ముందుగా గోదావరి పరివాహక ప్రాంత ప్రజల అభివృద్ధికి, తర్వాత కరువుతో పోరాడుతున్న ప్రాంతాల పునరుజ్జీవనానికి ఉపయోగపడాలి. మిగిలిన జలాల పంపిణీ మాత్రమే జాతీయ అవసరాల దృష్ట్యా పరిగణనలోకి తీసుకోవాలి.

అయితే ఇక్కడ మరో ప్రమాదాన్ని కూడా గుర్తించాలి. నదులలో లభ్యమయ్యే జలాల అంచనాలు శాశ్వతమైనవి కావు. వాతావరణ మార్పులు, అడవుల వినాశనం, వర్షపాత నమూనాలలో మార్పులు, భూగర్భ జలాల క్షీణత వంటి కారణాల వల్ల భవిష్యత్తులో నికర జలాల లభ్యత గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉంది.

బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం ఆధారిత విశ్వసనీయతను ప్రమాణంగా తీసుకోగా, తరువాతి ట్రిబ్యునల్స్ నీటి లభ్యతను వేరే పద్ధతుల్లో అంచనా వేశాయి. కానీ నేటి వాతావరణ సంక్షోభ పరిస్థితుల్లో పాత గణాంకాలతో భవిష్యత్తును ఊహించడం ప్రమాదకరమవచ్చు.

ఈ నేపథ్యంలో గోదావరి జలాలపై తీసుకునే ప్రతి నిర్ణయం కేవలం ప్రస్తుత రాజకీయ అవసరాలను మాత్రమే కాదు, రాబోయే తరాల ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఉండాలి.

ఎందుకంటే నీరు కేవలం సహజ వనరు మాత్రమే కాదు; అది భవిష్యత్ తరాల ప్రాథమిక హక్కు కూడా.

28 జూన్ 2026

Monday, 15 June 2026

Ambedkar's real Constitution is The State and Minorities

 "అంబేద్కర్ రాజ్యాంగం అంటే 'స్టేట్స్ అండ్ మైనారిటీస్'"

రాజ్యాంగ రచయిత ఎవరూ? 

a. గాంధీ b. నెహ్రు  c. కాంగ్రెస్  d. రాజ్యాంగసభ  e. బాబాసాహెబ్. 

ఆనాటి కాంగ్రెస్ పెద్దలు, ముఖ్యంగా జవహర్ లాల్ నెహ్రూ, భారత రాజ్యాంగాన్ని తమకు కావలసిన విధంగా అంబేడ్కర్ చేత రాయించుకున్నారనే అభిప్రాయం ఒకటుంది. 

దీనికి కాంగ్రెస్ రాజ్యాంగం అనే పేరు వుంది. 

Patta Venkateswarulu  వంటి కొందరు అంబేడ్కరిస్టులు కూడ భారత రాజ్యాంగం జాతీయ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం అంటున్నారు. 

బిజెపి కూడ భారత రాజ్యాంగాన్ని కాంగ్రెస్ రాజ్యాంగం అనో, నెహ్రూ రాజ్యాంగం అనో విమర్శిస్తూ వుంటుంది. 

ఈ విషయంలో అంబేడ్కరిస్టులు, బిజెపి అభిప్రాయం ఒక్కటిగా వుండడం ఒక విశేషం. 

కమ్యూనిస్టు పార్టీలు అప్పట్లో బూర్జువా రాజ్యాంగం అని విమర్శించేవారు. 

ఇప్పుడూ రాజ్యాంగం విషయంలో కమ్యూనిస్టు పార్టీల్లో రెండు శిబిరాలున్నాయి. రెండు భిన్నాభిప్రాయాలున్నాయి.

అంబేడ్కడ్ ఆదర్శాలతో కొన్ని రాజకీయ పార్టీలు పుట్టాయి. వాటిల్లో కొన్ని బిజెపి సేవలో తరిస్తున్నాయి కూడ. ఇదో చిత్రమైన  పరిణామం. 

పిట్టా వెంకటేశ్వర్లు వంటివారు అంబేడ్కర్ రాజ్యాంగం అంటే  'స్టేట్స్ అండ్ మైనారిటీస్' పుస్తకం అంటున్నారు. 

ఇప్పుడున్న రాజ్యాంగంతో అంబేడ్కర్ కు సంబంధం లేదని ప్రకటించి పట్టా వెంకటేశ్వర్లు చెప్పినట్టు  'స్టేట్స్ అండ్ మైనారిటీ' పుస్తకం మీద 

 చర్చ సాగాలేమో!! 

పట్టా వెంకటేశ్వర్లుగారూ! అంబేడ్కర్ విగ్రహాల్లో వారి చేతుల్లో కనిపించేది 'కాంగ్రెస్ రాజ్యాంగం' అని స్పష్టం చేసినందుకు ధన్యవాదాలు, 

State and Minorities  - BR Ambedkar 

మార్క్స్ వెర్సెస్ అంబేడ్కర్ కాదు

మార్క్స్ ప్లస్ అంబేడ్కర్ ప్లస్ …

Patta Venkateswarulu

ఇండియా ప్రస్తుత చారిత్రక అవసరాలకు మార్క్స్ దాకా పోవాల్సిన అవసరం లేదు. అంబేద్కర్ చాలు.

23h

Reply

Srinu Mythri

Patta Venkateswarulu అంబేద్కర్ కూడా అవసరం లేదు.రాహుల్ గాంధీ చాలేమో!?

23h

Reply

Patta Venkateswarulu

Srinu Mythri అవును, ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలు పనిచేసిన వ్యక్తులు, వారి పార్టీల కంటే రాహుల్ గాంధీ ఈ అడుగుల ముందు లో ఉన్నాడు.

22h

Reply

Patta Venkateswarulu

A.m. Khan Yazdani Danny ఎంత విచిత్రమైన కామెంట్? ఈ స్థాయిలో ఉన్నా రా ?

20h

Reply

A.m. Khan Yazdani Danny

Patta Venkateswarulu మీరు చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పండి.

20h

Reply

A.m. Khan Yazdani Danny

Patta Venkateswarulu అంబేడ్కర్ ఒక్కడే చాలన్నారు. కొంచెం వివరంగా చెప్పండి.

దేశంలో రాజ్యాంగం అమల్లో వుంది. అంబేడ్కర్ పార్టీలు కూడా వున్నాయి. కానీ కమ్యూనల్ కార్పొరేటోక్రసి అధికారంలో లోనికి వచ్చేసింది. దీనికి కారణమేంటి అంటారూ?

20h

Reply

Patta Venkateswarulu

A.m. Khan Yazdani Danny అంబేద్కర్ రాజ్యాంగం ఎలా అవుతుంది? రాజ్యాంగ సభ జరిగిన ఎన్నికల్లో ఆయనే ఓడిపోయాడు. బెంగాల్ నుండి గెలిచిన దేశ విభజన వల్ల అర్హత కోల్పోయాడు. ఆయన అవసరాన్ని గుర్తించిన కాంగ్రెస్ రాజ్యాంగ సభకు తీసుకెళ్లింది. నిజంగా అంబేద్కర్ రాజ్యాంగం కావాలంటే నాయకత్వంలోని పార్టీ రాజ్యాంగ సభకు జరిగిన ఎన్నికల్లో మెజార్టీ వ్యక్తులు గెలుపొందినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది.

అలా గెలిచినవారు ఎక్కువమంది జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. ఒక మాటలు చెప్పాలంటే భారత రాజ్యాంగం జాతీయ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం. అంబేద్కర్ రాజ్యాంగం అంటే స్టేట్స్ అండ్ మైనారిటీ. అది ఆయన అభిప్రాయాల డాక్యుమెంట్. ఇది చరిత్ర. ఇలా చరిత్ర తో సంబంధం లేకుండా ఇష్టాల ప్రకారం మాట్లాడతాను అంటే మీ ఇష్టం. కమ్యూనిస్టు పార్టీ ఆలోచన కలిగిన అందరూ ఇలాగే ఉన్నారు. అందుకే ఆ పార్టీలు అలాగే ఉన్నాయి.

20h

Reply

A.m. Khan Yazdani Danny

Patta Venkateswarulu ఆనాటి కాంగ్రెస్ పెద్దలు, ముఖ్యంగా జవహర్ లాల్ నెహ్రూ, భారత రాజ్యాంగాన్ని తమకు కావలసిన విధంగా అంబేడ్కర్ చేత రాయించుకున్నారనే అభిప్రాయం ఒకటుంది.

దీనికి కాంగ్రెస్ రాజ్యాంగం అనే పేరు వుంది.

పిట్టా వెంకటేశ్వర్లు వంటి కొందరు అంబేడ్కరిస్టులు కూడ భారత రాజ్యాంగం జాతీయ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం అంటున్నారు.

బిజెపి కూడ భారత రాజ్యాంగాన్ని కాంగ్రెస్ రాజ్యాంగం అనో, నెహ్రూ రాజ్యాంగం అనో విమర్శిస్తూ వుంటుంది.

ఈ విషయంలో అంబేడ్కరిస్టులు, బిజెపి అభిప్రాయం ఒక్కటిగా వుండడం ఒక విశేషం.

కమ్యూనిస్టు పార్టీలు అప్పట్లో బూర్జువా రాజ్యాంగం అని విమర్శించేవారు.

ఇప్పుడూ రాజ్యాంగం విషయంలో కమ్యూనిస్టు పార్టీల్లో రెండు శిబిరాలున్నాయి. రెండు భిన్నాభిప్రాయాలున్నాయి.

అంబేడ్కడ్ ఆదర్శాలతో కొన్ని రాజకీయ పార్టీలు పుట్టాయి. వాటిల్లో కొన్ని బిజెపి సేవలో తరిస్తున్నాయి కూడ. ఇదో చిత్రమైన పరిణామం.

పిట్టా వెంకటేశ్వర్లు వంటివారు అంబేడ్కర్ రాజ్యాంగం అంటే 'స్టేట్స్ అండ్ మైనారిటీస్' పుస్తకం అంటున్నారు.

ఇప్పుడున్న రాజ్యాంగంతో అంబేడ్కర్ కు సంబంధం లేదని ప్రకటించి పట్టా వెంకటేశ్వర్లు చెప్పినట్టు 'స్టేట్స్ అండ్ మైనారిటీ' పుస్తకం మీద

చర్చ సాగాలేమో!!

19h

Reply

A.m. Khan Yazdani Danny

Patta Venkateswarulu పట్టా వెంకటేశ్వర్లుగారూ! అంబేడ్కర్ విగ్రహాల్లో వారి చేతుల్లో కనిపించేది 'కాంగ్రెస్ రాజ్యాంగం' అని స్పష్టం చేసినందుకు ధన్యవాదాలు,

*అణగారిన సమూహాల ఐక్యతే ప్రత్యామ్నాయం*

 *అణగారిన సమూహాల  ఐక్యతే ప్రత్యామ్నాయం*

*డానీ*

*సమాజ, రాజకీయ విశ్లేషకులు*

ఆర్ధికరంగంలో  కార్పొరేట్ల అత్యాశ, సామాజిక,  సాంస్కృతిక రంగాల్లో  మెజారిటీ మతతత్త్వం, రాజకీయ, పరిపాలన వ్యవహారాల్లో నియంతృత్వం నేటి మన వ్యవస్థ స్వభావం. దీనిని పొడుగ్గా భారత కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్ (సిసిడి) అనుకోవచ్చు. పొట్టిగా Communal Corpocracy అనవచ్చు.  

కమ్యూనల్ కార్పోరసీ మన అంచనాలకన్నా క్రూరమైనది. దానిని ఫాసిస్టు అంటే సరిపోదు. దేశంలోని సహజ వనరులు, ఓడరేవులు, వినాశ్రయాలు, రైల్వేలు, విద్యుత్తు, చమురు, ఉక్కు తదితర మౌలిక వ్యవస్థలన్నీ గుప్పెడుమంది కార్పొరేట్ల వశమైపోతున్నాయి. ఆర్ధికవ్యవస్థలో బలపడుతున్న గుత్తాధిపత్యాన్ని గుర్తించకుండ సమాజాన్ని  నిరంతరం మత విద్వేషాలలో ముంచి వుంచుతున్నారు.   దీనికి వ్యతిరేకంగా ఎవరయినా గొంతు ఎత్తితే కలలో కూడ ఊహించని నిందలేసి క్రూరంగా శిక్షిస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం, పౌరులకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది; కానీ మాట్లాడిన తర్వాత స్వేచ్ఛకు హామీ లేదు.

ఫాసిజం అనగానే అందరికీ  వందేళ్ళ క్రితపు ఇటలీ, జర్మనీ గుర్తుకొస్తాయి. అదే ఇప్పుడు పునరావృతం అవుతున్నదని చాలామంది అంటున్నారుగానీ అది సరికాదు. మునుపెన్నడూలేని దారుణమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

అప్పటి ఫాసిజం, నాజిజంలకు స్వావలంబన (autarky)  భావన చాలా బలంగా వుంది. మన కమ్యూనల్ కార్పోరసీలో అది లోపించింది. ఈ కోణాన్ని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. మొదటి ప్రపంచ యుధ్ధం తరువాత ఇటలీ, జర్మనీ దేశాల మీద అనేక ఆంక్షలున్నాయి. వాటిని అధిగమించి ఇనుము-ఉక్కు, రసాయనాలు, ఆటోమోటివ్స్, టెక్స్ టైల్స్ జలవిద్తుత్తు రంగాల్లో ఇటలీ చాలా ముందంంజ వేసింది.  ఏరోస్పేస్, మోటార్ వెహికిల్స్,  సింథటిక్ రబ్బర్, సింథటిక్ ఫ్యూయల్, హెవీ ఇంజినీరింగ్, ప్రెసిషన్ ఆప్టిక్స్ రంగాల్లో జర్మనీ చాలా ముందడుగు వేసింది. ఇది వందేళ్ళ క్రితపు వ్యవహారం. ఇప్పటికీ ఆ రంగాల్లో ఇటలీ, జర్మనీలదే పైచేయి.  

1857 నుండి 1947 వరకు దేశంలో వలస పాలనకు వ్యతిరేకంగా  జాతియోద్యమం సాగింది. స్వాతంత్ర్యం తరువాత ఇండియా  ప్రపంచ మాహాశక్తులైన అమెరికా, రష్యాల్లో ఏ శిబిరంలోనూ చేరలేదు. అలీన విధానాన్ని కొనసాగించింది. కానీ, గత దశాబ్దంలో విధానం మారింది.  భారత విదేశాంగ, ఆర్థిక, రక్షణ విధానాల్లో అమెరికా ప్రాబల్యం పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. మనదేశం విదేశాంగ వ్యవహారాల్లో స్వతంత్రంగా వ్యవహరించగలుగుతోందా? అనే సందేహాలు సహితం తలెత్తుతున్నాయి.

ప్రపంచ మార్కెట్లో అమ్మడానికి మనదైన బ్రాండుగల ఉత్పత్తులు ఎన్ని ఉన్నాయి? అనే ప్రశ్నకు మనం ఓ నాలుగు పేర్లు చెప్పలేకపోతున్నాం. లెఖ్ఖ ప్రకారం అయితే, అందుబాటులోవున్న అపారమైన యువ శక్తుల్ని ఉత్పాదకరంగంలో సద్వినియోగం చేయాలి. కానీ, అందుకు భిన్నంగా జరుగుతోంది. మన పాలకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి యువతరాన్ని  దుర్వినియోగం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మైనారిటీలను హింసించి ఆనందించే అవకాశాలు సహితం కల్పిస్తున్నారు.  అనైతిక పాత్రల్ని ఆరాధించేలా సినిమాలు తీసి ప్రజల మీద వదులుతున్నారు. అలా సాంస్కృతిక రంగం కలుషితం అవుతోంది.  దాని ప్రభావాలు కూడ ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలు నచ్చనివారు సహితం ఈ మృత సంస్కృతిని వ్యతిరేకించడానికి  భయపడుతున్నారు. శ్వాసతో సరిపెట్టుకోండి ఆలోచనలు చేయకండి అనే ఒక భయానక నిర్బంధ వాతావరణంలో మనం బతుకుతున్నాం. 

కమ్యూనిస్టులు మాత్రమే ఫాసిస్టులను ఓడించగలరు అని కొందరు అంటుంటారు.  అలా అనడం అతిశయోక్తి. అయితే, కమ్యూనిస్టులు లేకుండా ఫాసిస్టులను ఓడించడం కూడా సాధ్యం కాదు. ఆనాడు ఇటలీ-జర్మనీలను  నిలువరించడంలో సోవియట్ రష్యాది కీలక పాత్రేగానీ, మిత్రశక్తులు, ‘బిగ్ -ఫోర్’ కూటముల సమిష్టి కృషిని విస్మరించడం సమంజసం కాదు.  ఫాసిజం-నాజిజాల మీద సాధించిన విజయాల్లో నిర్ణయాత్మక పాత్ర ఎర్రసైన్యానిది. మేడేనాడు  ఎర్రసైన్యం బెర్లిన్ నగరంలోనికి ప్రవేశిస్తున్నదని తెలిసే అంతకు ముందురోజు రాత్రి హిట్లర్, తన భార్యతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు.

ఫాసిజాన్ని ఎదుర్కోవడానికి వామపక్షాలు, ప్రజాతంత్ర ఉద్యమ శక్తులు కలవాలని కొందరు తరచూ సూచిస్తుంటారు. అది అవసరమేగానీ, కార్పొరేట్ కమ్యూనల్ కార్పోక్రసీని ఎదుర్కోవడానికి ఈ రెండు శక్తులు ఏవిధంగానూ సరిపోవు.

మన సమాజంలో  ఆదివాసీ, దళిత, బహుజన, మత అల్పసంఖ్యాక, మహిళా సమూహాలున్నాయి. వామపక్షాలు తమ ప్రధాన సామాజిక పునాదిగా భావించే శ్రామికులు, వ్యవసాయ కూలీలున్నారు. ఈ సమూహాలు అన్నింటిలోని కొంత భాగం చాలా కాలం వామపక్షాలతో వున్నాయి.  1990లలో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన విశేష మార్పుల ఫలితంగా ఉనికివాద సమూహాలు కమ్యూనిస్టు పార్టిలకు దూరమయ్యాయి. వాళ్ళు మాత్రమేగాక, శ్రామికులు, వ్యవసాయ కూలీలు  సహితం ఇటీవలి కాలంలో కమ్యూనిస్టు పార్టీల్లో తగ్గిపోయారని కొత్త గణాంకాలు చెపుతున్నాయి. ఆ సమూహాలకు వామపక్షాల మీద గత కాలపు నమ్మకం సన్నగిల్లిందనేది ఒక వాస్తవం. అలా వాళ్లు  దూరం కావడానికి ప్రధాన కారణం  కమ్యూనిస్టు పార్టిలు అనుసరించిన   విధానాలే అనవచ్చు.

కమ్యూనిస్టు పార్టీల నుండి బయటికి వెళ్ళినవారే తమ స్వీయ సమూహాల ఆత్మగౌరవ, ఉనికివాద ఉద్యమాలకు నాయకత్వం వహించారన్నది గుర్తించుకోవాల్సిన పరిణామం. అయితే, మార్క్సిస్టు శిబిరం  నుండి అలిగి  వెళ్ళిపోయిన ఆదివాసీ, దళిత, బహుజన, మత అల్పసంఖ్యాక, మహిళా సమూహాలు కూడ సమసమాజం దిశగా సాగలేకపోయారు. ఇంకొకవైపు, మానవ హక్కులు, పౌర హక్కుల కార్యకర్తలు, హేతువాదులేగాక, హిందూ సమాజంలోని మతసామరస్యవాదులున్నారు. వీరు కూడ కమ్యూనల్ కార్పోరసీని వ్యతిరేకిస్తున్నారు. వీళ్ళందరితో కూడిన అత్యంత  విశాల సంఘటన ఒకటి ఇప్పుడు ఏర్పడాలి. 

అధికారంలో వున్న పార్టి విధానాలు నచ్చకపోతే ఎన్నికల ద్వార ప్రభుత్వాన్ని మార్చే అవకాశం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో వుంది.  కానీ, అన్ని సందర్భాలలో  అలా జరుగుతుందని చెప్పలేం. కమ్యూనల్ కార్పోక్రసీ  చాలా తెలివైనది మాత్రమేకాదు; కపటి. తమను ఎదురించే శక్తులు ఎన్నికల ద్వార తమను అధికార పీఠం నుండి గెంటేయకుండా అది అన్ని జాగ్రత్తల్ని తీసుకుంటుంది. తమను వ్యతిరేకించే సమూహాలను ఏకంగా ఓటర్ల జాబితా  నుండి తప్పించేందుకు ప్రయత్నిస్తుంది. ఒక వేళ గేటు దాటినా ఈవిఎంల ద్వార ఎన్నికల ఫలితాలను నియంత్రించడానికి కూడ వెనుకాడదు. మనదేశంలో ఎన్నికల ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉండాలనే డిమాండు చాలా కాలంగా వుంది.

దేశం గొప్పగా వెలిగిపోతున్నట్టు, అభివృధ్ధి పరుగులు తీస్తున్నట్టు,  రేపోమాపో ప్రపంచ సూపర్ పవర్ గా అవతరించబోతున్నట్టు ప్రభుత్వానుకూల మీడియా  సంస్థలు దేశ పురోగతి కథనాలను విస్తృతంగా ప్రచారం చేస్తుంటాయి. దీనివల్ల ఓటర్లలో ఒక సమ్మతి ఉత్పత్తి అవుతుంది. ఆపైనా కూడ ఎక్కడయినా జనంలో అసంతృప్తి వున్నదనిపిస్తే డబ్బూ, మద్యం వంటి పాత చిట్కావైద్యాలు ఎలాగూ వుంటాయి. ఎన్నికల పంథాలో ఇంతటి పద్మ వ్యూహాల్ని దాటుకెళ్ళి గెలిచి నిలిచే అభిమన్యులు మనకెందరున్నారూ? 

ఆలోచనాపరుల్ని సమాజాన్ని మార్చాలన్నాడు కార్ల్ మార్క్స్.  ఈ పిలుపులో మూడు అంశాలున్నాయి. మొదటిది; ఇప్పటి సమాజం ఎంత క్రూరంగా వున్నదన్నది వాస్తవంగా విశ్లేషించాలి. రెండోది;  దీన్ని ఎలాంటి ఆదర్శ సమాజంగా మార్చబోతున్నామో వివరించాలి. అలాంటి ఆదర్శ సమాజాన్ని  ఎలాంటి ప్రక్రియలతో నిర్మించగలమో విడమర్చి చెప్పాలి.  దీని కోసం ఒక డిటేయిల్ ప్రాజెక్టు రిపోర్టును సిధ్ధం చేయాలి.  ఈ పనుల్ని గతంలో కమ్యూనిస్టు పార్టీలు చేయలేదని కాదు. చేశాయి. ఉత్పత్తి విధానమే మారిపోయింది కనుక గతంలో రూపొందించిన వాటికి  కాలం చెల్లిపోయింది. కమ్యూనిస్టు పార్టీల డాక్యుమెంట్లకు కూడ ఎక్స్ పైరీ డేట్ వుంటుంది. వాటిని పక్కన పడేసి కొత్త కార్యక్రమాల్ని రూపొందించుకోవాలి.

మనం చేసిన తప్పుల్ని గుర్తించకుండా మనం చెయ్యాల్సిన పనులు ఎప్పటికీ అర్థం కావు. మనం మారినట్టు ధృఢంగా సంకేతాలు ఇచ్చినప్పుడే పాత మిత్రులతోపాటు కొత్త మిత్రులూ వస్తారు. ఉత్పత్తి రంగంలో కొత్తగా వస్తున్న సాంకేతిక పరిజ్ఞానం మీద సాధికారత సాధించిన వాళ్లనే కొత్త తరాలు గౌరవిస్తాయి. కొత్త తరాలను కదిలించగలిగిన ఉద్యమాలే విజయాలను సాధించగలుగుతాయి.

అంతిమ నియమం ఏమంటే, కులం, మతం, తెగ, లింగ అసమానతలను గుర్తించకుండా, అస్తిత్వ సమూహాల భావోద్వేగాలను గౌరవించకుండా వామపక్షాలు విస్తరించలేవు; సమసమాజ స్వప్నం లేకుండా అస్తిత్వ సమూహాలు సంపూర్ణ విముక్తినీ పొందలేవు. సూక్ష్మంగా చెప్పాలంటే మార్క్స్ వెర్సెస్ అంబేడ్కర్ కాదు; మార్క్స్ ప్లస్ అంబేడ్కర్. ఈ  ప్లస్ లు ఇంకా వున్నాయి.

రాజ్యాంగం మనకు హక్కులను ఇస్తుంది. కానీ హక్కులను కాపాడేది కాగితాలుకాదు; సంఘటిత ప్రజాశక్తి. సామాజిక విభజనలు, ప్రజాస్వామ్య సంస్థల బలహీనతలతో కూడిన కాలంలో ఒక్కో అణగారిన సమూహం ఒంటరిగా పోరాడితే పరాజయం తప్పకపోవచ్చు. కానీ ఆదివాసీలు, దళితులు, బహుజనులు, మత అల్పసంఖ్యాకులు, మహిళలు, శ్రామికులు, రైతులు, ప్రజాస్వామ్యవాదులు, మానవహక్కుల కార్యకర్తలు, వామపక్షాలు  ఒక ఉమ్మడి వేదికపై కలిసినప్పుడు మాత్రమే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి పుడుతుంది. అందుకే, ఇప్పుడు అణగారిన సమూహాల ఐక్యత ఒక నినాదం కాదు; అది చారిత్రక అవసరం.

13 -06-2026