Girl Child
ఆడపిల్లలు
ఆడపిల్లలు లేకపోతే మనిషి సంపూర్ణంగా బతికినట్టు కాదని మా నాన్నగారు అనేవారు.
ఎందుకోగానీ మాకు మొదట ఆడపిల్ల పుడుతుందని బలంగా అనిపించేది. ఒకే సంతానంతో సరిపెట్టాలనీ పేరు కూడా నిర్ణయించుకున్నాం. కానీ, మొదటి సంతానంగా మాకు మగపిల్లాడు పుట్టాడు. ఆడపిల్ల కోసం మరో ప్రయత్నం చేశాం. మాకు రెండో సంతానం కూడా మగపిల్లాడే. మూడో ప్రయత్నం చేసే సాహసం లేకపోయింది. అప్పటికే లోటు బడ్జెట్!
జీవితానికి సంబంధించిన ప్రతి బాధనూ, ప్రతి విషాదాన్నీ, ప్రతి పార్శ్వాన్నీ నేను అనుభవించాను. ఆడపిల్లకు తండ్రికాకపొవడం ఒక్కటే లోటు.
మా నాన్న అభిప్రాయం ప్రకారం అయితే, నా జీవితం అసంపూర్ణం.
No comments:
Post a Comment