“ఖుష్ బూ గుజరాత్ కీ”
ఏ రంగంలో అయినాసరే సూపర్ స్టార్ గా వెలిగినవాళ్ళు కొన్ని అన్యాయాలు,
అక్రమాలు, తొలినాటి సన్నిహితులపట్ల విశ్వాసఘాతుకాలు, కొత్త ప్రభువులపట్ల విధేయతలు కొనసాగిస్తారు.
అవన్నీ అమితాభ్ బచ్చన్ కూడ కొనసాగించాడు. వాటన్నింటిని professional obligations గా
భావించి మన్నించేయవచ్చు. కానీ గుజరాత్ నరమేధం తరువాత నెత్తురోడిన శవాల కమురు వాసన దేశమంతా
వ్యాపించి వున్నపుడు “ఖుష్ బూ గుజరాత్ కీ” అంటూ వాణిజ్య ప్రచారం సాగించిన అమితాభ్ ను క్షమించడం చాలా కష్టం.
చాలామంది
గమనించలేదుగానీ మోదీ, అంబానీ, అమితాభ్ త్రయం రాజకీయ ఆర్థిక సాంస్కృతిక రంగాల్లో ఒక
అవగాహనతో కొనసాగారు. కొనసాగుతున్నారు.
రాయాల్సిన సమయంలో ఖదీర్ బాబు మాత్రమే రాయగలిగిన పోస్ట్
ఇది. అమితాభ్ కోసం రాళ్ళెత్తిన ముస్లిం కూలీల్లో
నర్గిస్ కూడా వుంది.
No comments:
Post a Comment