RTC Strike in
Telangana
తెలంగాణలో ఆర్టీసి సమ్మె
TSRTC నష్టాలకు కారణం యాజమాన్యం; ED లు.
కార్మికులు పోరాటం వాళ్ల మీద చేయాలి.
ఆక్యుపేషన్ రేషియో 73 శాతానికి పెరిగినా TSRTC నష్టాల్లో వుందంటే
దానికి కారణం ఎవరూ? యాజమాన్యం.
కార్మిక సంఘాలు చెపుతున్నట్టు డీయిల్ ఆదా, టైర్ల జీవితం, ఆక్యుపేషన్ రేషియో పెరిగిన మాట నిజమే అయితే నష్టాలు
ఎలా వస్తున్నాయీ?
వివిధ బలహీనవర్గాలకు ఇచ్చే రాయితీల బకాయిల్ని రాష్ట్ర ప్రభుత్వం
TSRTC కి తక్షణం చెల్లించాలి.
ఆర్టీసి సమ్మె వంకతో తమ జీతభత్యాలను మళ్ళీ పెంచుకోవడానికి ప్రభుత్వోద్యోగులు
పావులు కదుపుతున్నారు. ఇది ప్రజా వ్యతిరేకం.
TSRTC సమ్మెను అవకాశంగా
మార్చుకుని తెలంగాణలో కేసిఆర్ వ్యతిరేక రాజకీయ ఉద్యమాన్ని నిర్మించాలని కేంద్రంలోని
అధికార పార్టి ఆశిస్తోంది.
మావోయిస్టు పార్టి
TSRTC సమ్మెను బలపరచడం ఇంకొక చారిత్రక తప్పిదం.
(స్నేహ టీవీలో పబ్లిక్ డిబేట్ లో వెలిబుచ్చిన అభిప్రాయాలు)
రచన : 9 అక్టోబరు 2019
ట్రేడ్ యూనియన్లకు నేను వ్యతిరేకిని. వాళ్లు బ్యూరాక్రసీలో భాగం. ఈ విషయాన్ని నేను
గతంలో చాలాసార్లు చాలా స్పష్టంగా చెప్పి వున్నాను. మరొక్కసారి చెపుతున్నాను. సమాజంలో
కూలీలు దీనికి వంద రెట్లు కష్టాల్లో వున్నారు. వాళ్ల గురించి ఈ యూనియన్లు సమ్మేలు
చేయవెందుకూ? RTC EDలు ఒక్కొక్కరి జీతం నెలకు లక్షన్నర రూపాయలు పైమాటే.
సమాజంలో నిరుద్యోగం పెరిగిపోతున్నదని ఒకవైపు గగ్గోలు పెడుతూ ప్రభుత్వోద్యోగుల పదవి
విరమణ వయస్సు పెంచమనడం ఏ లాజిక్కూ?
ట్రేడ్ అంటే వాణిజ్యం
ట్రేడ్ యూనియన్ అంటే వాణిజ్య కూటమి
వృత్తి సంఘం అనే అర్థం వుందనీ తెలుసు. రా వి శాస్త్రీ గారు ఆల్రెడీ వాడారు.
ఈ ట్రేడ్ యూనియన్లు సంఘటిత రంగంలోనే పనిచేస్తాయి. అసంఘటిత రంగాన్ని గాలికి
వదిలేస్తాయి. కమ్యూనిస్టు పార్టీలకు సంఘటిత రంగంలోనే ఆదాయం వుంది. పోలీసుల
జీతాలను కూడ పెంచేది ఈ ట్రేడ్ యూనియన్లే.
ప్రజలకు బిపిఎల్ ద్వార లాభం జరుగుతున్నదని మీరు భావిస్తే వాళ్ళ ఆదాయం మేరకే
జీతాలు తీసుకుని తెల్ల కార్డూ మీద వాళ్లు పొందే బెనిఫిట్స్ అన్నీ పొందండి.
ప్రభుత్వం పన్నుల ద్వార వసూలు చేసేదానిలో అత్యధిక భాగం ఉద్యోగుల జీత భత్యాలకు
పోతుందని గుర్తు పెట్టుకుంటే మంచిది.
ప్రభుత్వం పన్నులు వసూలు చేయడం దేనికీ? ఉద్యోగవర్గాన్ని పోషించడం దేనికీ?
సామాన్య ప్రజల మీద సానుభూతి వున్న ప్రభుత్వ ఉద్యోగులు 10 శాతం అయినా వుంటారా?
సామాన్యులు ఎప్పుడయినా ఏ ప్రభుత్వ కార్యాలయానికైనా వెళ్ళి లంచం ఇవ్వకుండా పని చేయించుకో గలిగారా?
నేను కావాలనే మీ లాంటి వాళ్లు చదవాలనే ఇలాంటి పోస్టులు పెడతాను. ప్రభుత్వ యంత్రాంగాన్ని సమర్ధించడంతప్ప ఇప్పటి ట్రేడ్ యూనియన్లు చేసేదేమిటీ?
గారూ ! ప్రభుత్వోద్యోగులు సహితం ప్రభుత్వయంత్రాంగంలో భాగమే అని కూడా కార్ల్ మార్క్సే చెప్పాడు. బ్యూరాక్రసీని అనేక తిట్లు తిట్టాడు
.

ఆర్టిసి సమ్మె గురితప్పింది
నేను ముందుగానే కొన్ని విషయాలు చెప్పాను.
మొదటిది; వివిధ బలహీనవర్గాలకు ఇచ్చే రాయితీల బకాయిల్ని TSRTC కి
తక్షణం చెల్లించాలని రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశాను.
రెండోది; ఆర్టీసి కార్మికులు తమ యాజమాన్యానికి వ్యతిరేకంగా
పోరాడాలి అని సూచించాను. అపార మౌళిక సదుపాయాలున్నా
సంస్థ నష్టాల్లో వుందంటే వాళ్ళే కారకులు.
మూడోది; నేను చాలా కాలంగా చెపుతున్నదే; ప్రభుత్వోద్యోగుల జీత
భత్యాలను పెంచడానికి నేను స్పష్టంగా వ్యతిరేకం. వాళ్ళకు పెరగాల్సిన దానికన్నా చాలా
పెరగడమేగాక స్వభావరీత్యావాళ్ళు సాధారణ ప్రజలకు వ్యతిరేకులు. ఇంటర్మీడియట్ బోర్డు
ఆఫీసులో కుక్కను దులిపితే నాలుగు కోట్ల రూపాయలు రలుతున్న రోజులివి.
నాలుగోది; ప్రభుత్వాలు పన్నుల రూపంలో ప్రజల ముక్కు పిండి వసూలు
చేస్తున్నదంతా ఉద్యోగుల జీత భత్యాలకే వెచ్చించడం తప్పు.
ఐదవది; సమాజంలో అనేక సమూహాలు కోట్ల మంది ఇంతకన్నా దయనీయ స్థితిలో
బతుకుతున్నారు. వాళ్ల గురించి ఈ స్థాయిలో ట్రేడ్ యూనియన్లు ఎందుకు పనిచేయడం లేదూ?
ఆరవది; అధిక ఆదాయం వున్న
వారి ఆదాయన్నే నిత్యం పెంచేందుకు ప్రయత్నించడం అదేమి సామ్యవాదం. ఇతర సమూహాల
ఆదాయాలను పెంచడం కోసం ఇంతటి అంకిత భావంతో కమ్యూనిస్టులు సంఘాలు ఎప్పుడయినా పనిచేస్తున్నాయా?
ప్రజాసంఘాలు ఇప్పుడు ఆర్టీసి అనగానే బయటికి రావడం బూటకం కాదా? రెండేళ్ల
క్రితం బీఫ్ అమ్మకాలు వివాదంగా మారడంతో కొన్ని వేల మంది భయపడి ఆ
వృత్తి నుండి తొలగిపోయి రోడ్డున పడ్డారు. నగదు రహిత విధానాన్ని ప్రవేశపెట్టినపుడు
హాకర్లు రోడ్డున పడ్డారు. ఈ ట్రేడ్ యూనియన్లు వాళ్లను ఈ స్థాయిలో పట్టించుకున్నాయా? ఇలాంటి డిస్ ప్లేస్
మెంట్లు ఇటీవల కొన్ని వందలు బహుశ వేలు జరిగాయి. అప్పుడు ఎన్నడూ
లేని స్పందన ఇప్పుడు దేనికీ? ఇది సంఘటిత రంగం అనేకదా? ఇందులో నాయకుల స్వార్థం
వుంది.
కింది వాళ్ళ బతుకు తెరువు సమస్యను
పరిష్కరించకుండ పై వాళ్ళ ఆదాయాన్ని
పెంచడం కోసం కృషిచేయడం సామాజిక నేరం.
జాతియోద్యమ కాలంలో అంబేడ్కర్ కూడా ఇదే విధానాన్ని అనుసరించాడు. తమ తప్పుల్ని కాపాడుకోవడానికి మార్క్స్ నో
మరొకర్నో కోట్ చేయడం ఇంకా అపచారం. తప్పును ఎత్తిచూపితే కేసిఆర్ తో అక్రమ
సంబంధాన్ని అంటగట్టడం ఇంకా నీచం. రాష్ట్ర
కమ్యూనిస్టు అగ్రనేత కేసిఆర్ కు
ఎన్నికల్లో మద్దతు ప్రకటించి ఇంకా వారం రోజులు కాలేదు. వారికి చూపండి మార్క్స్ కోట్స్.
ఆర్టీసి సమ్మె బిజేపికి కలిసి వచ్చిన అదృష్టంగా మారుతోందని గమనించకపోతే
ఇక ఈ రాష్ట్రంలో ఆలోచనాపరులు దేనికీ?
సంఘటిత రంగ ఉద్యోగుల్ని సమర్థించే వాదనలే ఇవి. ఇందులో నాకేమీ కొత్త దనం అనిపించడంలేదు.
నేను అసంఘటిత రంగ శ్రామికుల పక్షపాతిని.
సంఘటిత రంగాన్ని ప్రమోట్ చేస్తూ జీవనోపాధి వెతుక్కునే జీవులు చాలా మంది వుంటారు. వాళ్లతో నాకు పనిలేదు.
ట్రేడ్ యూనియన్లు అసంఘటిత రంగాన్ని వదిలేసి దశాబ్దాలు గడిచిపోయాయి. కమ్యూనిస్టు
సంఘాలతోసహా ఇతర ట్రేడ్ యూనియన్లు అన్నీ సంఘటిత రంగాన్ని ఆదాయ వనరుగా
మార్చుకున్నాయి. ఇన్ని సార్లు సంఘటిత రంగంలో జీతాలు భత్యాలు పెంచుకున్నారుగా,
అసంఘటిత రంగంలో గడిచిన ఐదేళ్లలో మీరు సాధించిన అలాంటి విజయాలను చెప్పండి.
సంఘటిత రంగానికీ అసంఘటిత రంగానికీ దూరం ఎంతగా పెరిగిపోయిందంటే మొదటిది
రెండోదాన్ని 'నిమ్నకులం' అన్నట్టు చాలా చిన్న చూపు చూస్తుంది. అది నాకు సమ్మతము
కాదు.
గడిచిన 30 యేళ్లలో ట్రేడ్ యూనియన్లు అసంఘటిత రంగంలో ఎంత కూలీ పెంచారూ?
సంఘటిత రంగంలో ఎంత జీతం పెంచారూ? ఒక టేబుల్ పెట్టండి. దాని మీద ఒక
తులనాత్మక చర్చ చేద్దాము. అప్పుడు ఎవరు కళ్ళు తెరచి చూస్తున్నారో ఎవరు కళ్ళు
మూసుకున్నారో అర్థం అవుతుంది.
అసంఘటిత రంగంలో నెలకు పాతిక వేల రూపాయలు ముఫ్ఫయి వేల రూపాయలు
డిమాండ్లు చేయడం వరకూ సరే. సంఘటిత రంగంలో అంకితభావంతో పనిచేసి డిమాండ్లను
సాధించుకున్నట్టు అసంఘటిత రంగంలో నిజాయితీగా సాధించారా?
ప్రగతి భవన్ వెళ్ళాల్సింది కమ్యూనిస్టు పార్టి సెక్రటరీ. నాకేం పనీ.
పది శాతం వున్నారు అంటారు. నాకూ అభ్యంతరం లేదు.
ఇంతటి లంచగొండుల జీతాలు పెంచమని ఉద్యోగ సంఘాలు ఎందుకు పోరాటాలు చేస్తుంటాయీ? ఆర్టీసి సమ్మెకు మద్దతు పలకడానికి నిన్న అనేక సంఘాల వాళ్ళు వచ్చారు. ఆ పనిని వాళ్ళు అసంఘటిత కార్మికుల కోసం చేస్తారా? ఇదంతా ఒక కూటమి.

No comments:
Post a Comment