Proposal
for YouTube News Channel for Muslims
తెలుగు ముస్లిం సమాజం కోసం
ఒక యూట్యూబ్ న్యూస్ ఛానల్ ప్రతిపాదన
1. చారిత్రక
నేపథ్యం – సామాజిక అవసరం
ప్రింటింగ్ టెక్నాలజీతో మొదలయిన మీడియా
తరువాత ఎలక్ట్రానిక్ టెక్నాలజీకి ఎదిగింది. డిజిటల్ టెక్నాలజీలోనూ అనేక మార్పులు వచ్చాయి,
వస్తున్నాయి, వస్తాయి. ఇటీవల ప్రధాన స్రవంతి మీడియాకు దీటుగా సోషల్ మీడియా విస్తరిస్తోంది.
లీనియర్ వాచింగ్ పరిమితులు తొలిగి నాన్ లీనియర్ వాచింగ్ సౌకర్యాలు వచ్చాయి. వార్తలు
చూడాలంటే ఆసమయంలో టీవీ ముందు కూర్చోవాల్సిన పనిలేదు. వీడియో ఆన్ డిమాండ్ (VOD) సౌకర్యంతో
స్మార్ట్ ఫోన్ వాడి అరచేతిలోనే అనుక్షణం ప్రపంచాన్ని వీక్షించే వెసులుబాటు వచ్చేసింది.
మీడియాలో వస్తున్న మార్పులన్నీ కేవలం సాంకేతిక
విభాగానికి మాత్రమే పరిమితమైలేవు. మీడియా సామాజిక దృక్పథంలోనూ అనేక మార్పులు, అనేక
దశలున్నాయి.
తొలుత మీడియా సమాజాన్ని ప్రతిబింబించేది.
ప్రభుత్వానికీ ప్రజలకు మధ్య వారధిగా వుండేది. మీడియాకు అదొక ఆదర్శ దశ. క్రమంగా మీడియాకు రాజకీయాభిమానం సోకింది. తరువాత ఆ అభిమానం పూనకంగా మారింది. తనకు ఇష్టమైన
రాజకీయ పార్టి మహా గొప్పదని చెప్పడానికీ, తనకు నచ్చని పార్టి మరీ చెడ్డదని చిత్రించడానికీ
కల్పిత వార్తల్ని ప్రచారం చేసేంత వరకు మీడియా బరితెగించింది. రాజకీయ పార్టీల మీద మీడియా సంస్థల
ఇష్టాఇష్టాలు కేవలం విధానాల మీద అభిమానానికి సంబంధించినవికావు; అవి అర్థిక, వాణిజ్య
అవసరాల నుండి పుట్టినవి.
ఇప్పుడు మీడియా సంస్థల ప్రాధాన్యం సమగ్ర
సమాజం కాదు; సామాజికవర్గం. ఒక్కో మీడియా సంస్థ ఒక్కో సామాజికవర్గాన్ని ఎంచుకుని దానికి సేవలందించి తన పబ్బంగడుపుకుంటోంది. ఇవి పేయిడ్
సర్వీసెస్ కనుక ఆర్థిక స్తోమత కలిగిన సామాజికవర్గాలు
మాత్రమే మీడియా సేవలు అందుకోగలగుతున్నాయి. ఈ మార్పులన్నీ భద్రలోకానికి అనుకూలంగానూ,
అభద్రలోకానికి ప్రతికూలంగానూ వుంటున్నాయి. మీడియా తమను అస్సలు పట్టించుకోవడంలేదనీ,
ఎప్పుడయినా పట్టించుకున్నా చెడ్డవారిగా, అనాగరీకులుగా చిత్రిస్తున్నదని ఆవేదన చెందుతున్న
సామాజికవర్గాలు అనేకం వున్నాయి. వారిలో ముస్లింలు ఒకరు.
కరోనా కాలంలో వలస కార్మికుల కష్టాలు వెలుగులోనికి
వచ్చాయి. ముస్లింల స్థితి అంతకన్నా దయనీయమైనది.
ముస్లిం సమాజం మీద కట్టుకథలు, అబధ్ధాలు, వక్రీకరణలతో పెద్ద ఎత్తున నైతిక దాడి
సాగుతోంది. సంఘటనలతో ఏ మాత్రం సంబంధంలేని నకిలీ, ఫేక్ వీడియోలను ప్రసారం చేసి “కరోనా
వ్యాప్తికి ముస్లింలు కుట్ర చేశారు” అన్నంతగా దుష్ప్రచారం సాగించింది ప్రధాన స్రవంతి మీడియా. ఈ
నేపథ్యంలో తమను సరైన దృక్పథంతో చూపించే మీడియా కోసం ముస్లిం సమాజం చాలా కాలంగా పరితపిస్తోంది.
ముస్లిం ప్రమోటర్లు నిర్వహిస్తున్న మీడియా
సంస్థలు ఇప్పటికే కొన్ని వున్నాయి. అవి ప్రధానంగా ధార్మిక ప్రచారానికి పరిమితమైన మీడియా
సంస్థలు. ముస్లిం సామాజికవర్గాన్ని, దాని మనోభావాలను, ఆకాంక్షల్ని స్థానిక భాషల్లో
సానుకూల దృక్పథంతో చూపించే మీడియా ఒకటి నేటి చారిత్రక అవసరం.
2. మీడియా
వ్యాపారంలో కొత్త సవాళ్ళు
ఇతర వ్యాపారాలకు మీడియా వ్యాపారానికి ఒక
ప్రధాన తేడా వుంది. ఏ పరిశ్రమలో అయినా ముడిసరుకు, శ్రమశక్తి ఖర్చు, నిర్వహణ ఖర్చులకు
కొంత లాభాన్ని కూడ చేర్చి అమ్మకపు ధరను నిర్ణయిస్తారు. మీడియాలో అలా అమ్మకపు ధరను నిర్ణయించడం
కుదరదు. డెమ్మీ (A-2) సైజులో, 12 పేజీలు దినపత్రికను రంగుల్లో ముద్రించడానికి ఒక్కో
కాపీకి 25 రూపాయలకు పైగా ఖర్చు అవుతుంది. కానీ ఒక్కో కాపీని పాఠకునికి 6 రూపాయలకు అమ్మాల్సివుంటుంది.
అందులోనూ ఏజెంట్ కమీషన్, రవాణ ఖర్చులు పోగా సంస్థకు తిరిగివచ్చేది చాలా చాలా తక్కువ.
ఒక్కో కాపీకి మీడియా సంస్థకు దాదాపు 20 రూపాయల వరకు నష్టం వస్తుంది. ఎలక్ట్రానికి మీడియా
కూడా అంతే. న్యూస్ ఛానల్స్ కు ప్రేక్షకులు దాదాపు ఏమీ చెల్లించరు. మీడియాల ఉత్పత్తి
ఖర్చులో అమ్మకపు ధర ద్వార తిరిగి వచ్చేది 20 శాతం కూడ వుండదు. 80 శాతం లోటు వస్తుంది.
ఈలోటుని వాణిజ్య ప్రకటనల ద్వార పూడ్చుకోవాల్సి వుంటుంది. ఈకోణంలోనే మీడియాను ‘సబ్సిడైజెడ్
కమ్మోడిటి’ అంటారు; అంటే దానికి మార్కెట్లో
ఇన్ పుట్ ధర కూడ రాదు. ఎవరో ఒకరు దాన్ని ఆదుకోవాలి; సబ్సిడి ఇచ్చి లోటును పూరించాలి.
3. మీడియా
దేనిని ఉత్పత్తి చేస్తుందీ?
ఉక్కు ప్యాక్టరీలో ఉక్కును, చెరకు ఫ్యాక్టరీలో
చెరకును ఉత్పత్తి చేసినట్టు మీడియా సంస్థల్లో వార్తల్ని ఉత్పత్తి చేసి మార్కెట్లో అమ్ముతారనే
అభిప్రాయం చాలామందిలో వుంటుంది. ఇది నిజంకాదు. మీడియా సంస్థల్లో వార్తలనేవి ఉప ఉత్పత్తి
(బై-ప్రాడక్ట్) మాత్రమే. మీడియా సంస్థల ప్రధాన కార్యకలాపం పాఠకులు, శ్రోతలు, ప్రేక్షకుల్ని
సమీకరించడం. అలా సమీకరించిన పాఠకులు, శ్రోతలు, ప్రేక్షకుల్ని వాణిజ్య, వ్యాపార, పారిశ్రామిక
సంస్థలు, రాజకీయ పార్టీలకు మీడియా సంస్థలు
అప్పచెపుతాయి. సూటిగా చెప్పాలంటే, వాణిజ్య, వ్యాపార, పారిశ్రామిక సంస్థలు, రాజకీయ పార్టీలకు మీడియా అనేది పాఠకులు, శ్రోతలు, ప్రేక్షకుల సప్లయర్. వాణిజ్య,
వ్యాపార, పారిశ్రామిక సంస్థలు, రాజకీయ పార్టీలు మీడియా సంస్థల్లో చూసేది ఒక్కటే; పాఠకులు, ప్రేక్షకులు,
శ్రోతలు ఎంతమంది వున్నారూ? వాళ్ళు ఏఏ సామాజికవర్గాలకు చెందినవారు? అని మాత్రమే. దానిని బట్టే వాణిజ్య ప్రకటనల ధరలు పరిమాణం వుంటాయి.
మీడియా రూపొందించుకున్న మార్కెట్ ప్రమాణాల్లో
ఏ విభాగంలోనూ, ఏ స్థాయిలోనూ ముస్లిం సామాజికవర్గం
నిలవజాలదు. అధికారిక లెఖ్ఖల ప్రకారం దేశ జనాభాలో ముస్లింలు 14.23 శాతం. ఒకప్పుడు ఇది
గణనీయమైన సంఖ్యగానే పరిగణించేవారు. కానీ, ఇప్పుడు మీడియా మార్కెట్ వ్యూహాల్లో భారత
ముస్లిం సమాజం నలిగిపోవాల్సివస్తున్నది. మైనార్టిల
మీద వ్యతిరేకతను కొనసాగిస్తే మెజారిటీ ఓటర్ల మద్దతును సులువుగా కూడగట్టవచ్చనేది మూడు
దశాబ్దాలుగా జాతీయ రాజకీయాల్లో ప్రధాన వ్యూహంగా మారింది. మీడియాకు కూడ ఈ వ్యూహం అనువుగా
వుంది.
ప్రాంతీయ మీడియాల్లోనూ ముస్లింలకు ఒక ఇబ్బంది
వుంది. ముస్లిం అస్తిత్వాల్లో ఉర్దూ కూడ ఒకటి కావడాన ప్రాంతీయ మీడియా పాఠకుల్లోనూ వారు
భాషా ప్రాతిపదికన చీలిపోయారు. ముస్లిం సమాజంలో పత్రికలు చదవడం, టీవీలు చూడడం తక్కువ
అనే ప్రచారమూ బలంగా వుంది. మీడియాను పోషించే వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు, రాజకీయ పార్టీల్లోనూ ముస్లింల ప్రాతినిథ్యం తక్కువ.
ఇన్ని రకాల పరిమితుల మధ్య మీడియాను తమకు సానుకూలంగా
మార్చుకోవడం ఎలా అనేది ఈనాడు ముస్లింలు ఎదుర్కొంటున్న
ప్రధాన సవాలు.
4. ప్రింట్
మీడియా – ఎలక్ట్రానిక్ మీడియా
ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల Capital
Expenditures (CAPEX) దాదాపు సమానమే అయినప్పటికీ, ప్రింట్ మీడియా Operating
Expenses (OPEX) చాలా ఎక్కువ. ప్రింటింగ్ విభాగాన్ని ఔట్ సోర్సింగ్ చేసినప్పటికీ రొజువారీ
అయ్యే న్యూస్ ప్రింట్ ఖర్చు చాలా ఎక్కువ. పైగా, ప్రింట్ మీడియా పెరుగుదల రేటు ఇటీవలి
కాలంలో తగ్గుముఖం పట్టింది. ఎలక్ట్రానిక్ మీడియా నిర్వహణ ఖర్చు తక్కువ గాబట్టి అస్తిత్వ
సమస్యను ఎదుర్కొంటున్న సమూహాలు ముందుగా ఎలక్ట్రానిక్
మీడియాలో ప్రవేశించడం సులువు.
5. శాటిలైట్
న్యూస్ ఛానళ్ళు – సాంకేతిక పురోగతి
తెలుగులో 2007-8 మధ్య కాలంలో న్యూస్ ఛానళ్ళు
అనేకం వచ్చాయి. జాతీయ భాషగా భావించే హిందీకన్నా ప్రాంతీయ భాష అయిన తెలుగులో ఎక్కువ
ఛానళ్ళు వున్నాయి. ఇవన్నీ దాదాపు చెరో 15 కోట్ల రూపాయల పెట్టుబడితో రంగప్రవేశం చేశాయి. ఈ క్యాపెక్స్ లో భవన నిర్మాణం లేదు; టెలీపోర్టులు
లేవు. కొందరు స్వంత భవనాల్లోనూ, మరికొందరు అద్దె భవనాల్లోనూ మీడియా సంస్థల్ని నెలకొల్పారు.
కొందరు స్వంతంగా టెలీపోర్టులు పెట్టుకున్నారు. మరికొందరు అప్ లోడింగ్ ను ఔట్ సోర్సింగ్
కు ఇచ్చివేశారు. ఈ సంస్థలన్నీ బ్రేక్ ఈవెన్ రావడానికి ఇంకో 15 కోట్ల రూపాయలు చొప్పున
వెచ్చించాయి. వెరసి వాటి ప్రాజెక్టు కాస్ట్
30 కోట్ల రూపాయల వరకు వెళ్ళింది.
సంఘటన స్థలం నుండే బ్రాడ్ కాస్ట్ చేయడానికి
మొదట్లో దాదాపు కోటి రూపాయలు ఖరీదుగల ఔట్ సైడ్ బ్రాడ్ కాస్టింగ్ (OB) వ్యాన్లు వాడేవారు. తరువాత దాదాపు దానికి సగం
ధరలో Digital
Satellite News Gathering (DSNG) లు వచ్చాయి. 3G, 4Gల రాకతో స్మార్ట్ ఫోన్ల నుండే
స్పాట్ నుండి అప్ లోడింగ్ చేసే సౌకర్యం వచ్చేసింది.
ఇవి చాలా చౌక. మన దేశంలో 5G సౌకర్యం కూడ రంగప్రవేశం చేసేసింది కనుక త్వరలో అప్ లోడింగ్
వేగం, విజువల్ క్వాలిటీ కూడ పెరుగుతుంది.
6. పెద్ద
మార్కెట్ పెద్ద పెట్టుబడి గొప్ప క్వాలిటి
ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రస్తుతం ప్రధానంగా
ఐదు విభాగాలున్నాయి. వెబ్ సైట్, శాటిలైట్ న్యూస్
ఛానల్, కేబుల్ టీవీ, యూట్యూబ్ ఛానల్, ఫ్రీక్వెన్సీ
మోడ్యులేషన్ (FM) రేడియో. వీటిల్లో ఒక విచిత్రం ఏమంటే చాలా తక్కువ
పెట్టుబడితోనే వీటిని ప్రయోగాత్మకంగా నెలకొల్పవచ్చు. కేవలం ఒక స్మార్ట్ ఫోన్ తో యూట్యూబ్ ఛానల్ ఆరంభించవచ్చు.
కానీ, మార్కెట్లో నిలదొక్కుకోవడానికి అవసరమైన క్వాలిటీ కంటెంట్ ను అందించాలంటే భారీగా
పెట్టుబడులు అవసరం అవుతాయి.
శాటిలైట్ ‘న్యూస్ అండ్ కరెంట్ అఫైర్స్ టివి
ఛానల్’ ను నెలకొల్పాలంటే ఆ సంస్థకు కనీసం 20 కోట్ల రూపాయల నెట్ వర్త్ ఆసెట్స్ వుండాలి.
లేకపోతే బ్రాడ్ కాస్టింగ్ లైసెన్స్ రాదు. బ్రాడ్ కాస్టింగ్ లైసెన్స్ లేకుండ ఒక్క నిముషం
న్యూస్ ను ప్రసారం చేసినా తీవ్రమైన నేరం అవుతుంది. బ్రాడ్ కాస్ట్ లైసెన్స్ ను ఇతర సంస్థల
నుండి లీజుకు పొందే అవకాశాలున్నాయిగానీ అది కూడ ఒక చికాకు వ్యవహారం. పైగా లైసెన్స్
కు సంబంధించి అనేక నిబంధనల్ని పాటించాల్సి వుంటుంది. లేకుంటే లైసెన్సు రద్దు అవుతుంది.
తెలుగు న్యూస్ చానల్ ‘ఎక్స్
ప్రెస్ టీవీ’కి న్యూస్ అండ్ కరెంట్ ఎఫైర్స్ విభాగం కింద ఇచ్చిన అప్ లింకింగ్, డౌన్
లింకింగ్ అనుమతిని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ (MIB) డిసెంబర్ 17న ఉపసంహరించుకుంది.
శాటిలైట్ ఛానళ్ళకు టెలీపోర్ట్ ఖర్చులు నెలకు
ఓ 10 లక్షల రూపాయలు అవుతాయి. ఆ తరువాత కూడ ఎంఎస్ ఓ లకు కారియర్ ఫీజుగా నెలకు ఇంకో
10 లక్షల రూపాయలు కట్టాల్సివుంటుంది. కేబుల్ టీవీకి టెలీపోర్ట్ ఒక్కటే వుండదుగానీ మిగిలినవన్నీ
సమానమే.
ఛానళ్ళ కంటెంట్ క్వాలిటీ మార్కెట్ విస్తృతి
మీద ఆధారపడివుంటుంది. శాటిలైట్ ఛానళ్ళు సాధారణంగా ఒక భాషా ప్రాంతంలో ప్రసారాలు సాగిస్తాయి.
కేబుల్ టీవీ సాధారణంగా ఒక నగరానికో, పట్టణానికో పరిమితమౌతాయి. శాటిలైట్ ఛానళ్ళను పెద్ద
సంస్థలు నిర్వహిస్తాయి; పైగా వాటి మార్కెట్ పెద్దది కనుక కంటెంట్ నాణ్యత స్థాయి కూడ
ఎక్కువగా వుంటుంది. కేబుల్ టీవీ ఛానళ్ళను చిన్న సంస్థలు నిర్వహిస్తాయి; వాటి మార్కెట్
కూడ చిన్నది కనుక వాటి కంటెంట్ నాణ్యత స్థాయి కూడ తక్కువగా వుంటుంది. అయితే, తగిన ఖర్చు
పెడితే కేబుల్ టీవీ ఛానళ్ళలోను గొప్ప క్వాలిటీ ఇవ్వవచ్చు. విదేశాల్లో కేబుల్ టీవీ ఛానళ్ళలోను
శాటిలైట్ ఛానళ్ళతో పోటిగా క్వాలిటీ కంటెంట్ ఇస్తున్నారు.
యూట్యూబ్ ఛానళ్ళలో మొదట వీడియో డిస్ప్లే
రిజల్యూషన్ కు పెద్దగా ప్రాధాన్యం ఇచ్చేవారుకాదు. ఇప్పుడు అక్కడా పోటీ పెరిగింది. అప్పట్లో
240P, 360P వీడియోలను కూడ అనుమతించేవారు. ఇప్పుడు డిస్ప్లే రిజల్యూషన్ SD, HD స్థాయిల్ని దాటి FHD (1920 : 1080 pixel) స్థాయికి చేరుకుంది. యూట్యూబ్ ఛానళ్ళలో ఇప్పుడు 4K -UHD (3840 : 2160
pixel) వీడియోలు కూడా వస్తున్నాయి.
7. ముస్లిం
సమాజం పరిధి – పరిమితి
శాటిలైట్ న్యూస్ ఛానల్ కు మార్కెట్ విస్తృతి ఎంత ఎక్కువగా వుంటే అంత మేలు జరుగుతుంది.
మార్కెట్ పెద్దగా వుంటే భారిగా పెట్టుబడి పెట్టడానికి
సానుకూలత ఏర్పడుతుంది. పెట్టుబడి పెరిగితే కంటేంట్ క్వాలిటీ కూడ పెరుగుతుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముస్లింలు
తెలుగు, ఉర్దూ భాషలు మాట్లాడుతారు. ఆంధ్రా ప్రాతంలో ముస్లింలందరికీ తెలుగు భాష అనర్గళంగా వచ్చు. తెలంగాణ ముస్లిం సమాజంలో
60 శాతం మీద ఉర్దూ ప్రాబల్యం ఎక్కువ; తెలుగుతో అనుబంధం కలిగిన ముస్లింలు ఓ 40 శాతం
వుంటారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ జనాభా 5 కోట్లు,
తెలంగాణ జనాభా 4 కోట్లు వెరసి రెండు తెలుగు రాష్ట్రాల జనాభా 9 కోట్లు. రెండు రాష్ట్రాల్లో సగటున ముస్లింలు
10 శాతం. అంటే 90 లక్షలు. వీరిలో ఆంధ్రప్రదేశ్ లో స్థిరపడినవారు 40 లక్షలు (8 శాతం);
తెలంగాణలో స్థిరపడినవారు 50 లక్షలు (12.5 శాతం). తెలంగాణలో స్థిరపడినవారిలో తెలుగుతో
అనుబంధం గలవారు 20 లక్షలు. అంటే తెలుగు-ముస్లిం జనాభా రెండు రాష్ట్రాల్లో కలిపి 60
లక్షలు. ఇది హైదరాబాద్ జనాభాకన్నా తక్కువ.
8.
Viability Gap Funding (VGF)
ఒక శాటిలైట్ న్యూస్ ఛానల్ కు 60 లక్షలు
జనాభా కలిగిన మార్కెట్ సరిపోదు. పైగా ఇతర సామాజికవర్గాలతో పోలిస్తే ముస్లిం సమాజానికి
టివీ చూడడం మీద ఆసక్తి తక్కువ. అంతచిన్న మార్కెట్ మీద ఆధారపడి ఒక శాటిలైట్ న్యూస్ ఛానల్
బ్రేక్ ఈవెన్ ను సాధించడం చాలా కష్టం. శాటిలైట్ న్యూస్ ఛానలేకాదు కేబుల్ టీవీ ఛానల్
నిలబడడం కూడ కష్టమే. ఖర్చుకూ, రాబడికి మధ్య లాభదాయకత లోటు (Viability
Gap) వస్తుంది. ఈలోటుని పూడ్చడానికి తప్పనిసరిగా
దాతలు, పోషకులు, వితరణశీలురు కావాలి. దానికి ముస్లిం సమాజం ఏమేరకు సిధ్ధంగా వుంది?.
9. భారత
ముస్లింల సామాజిక - రాజకీయ దృక్పథం
భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన
అవసరాన్ని ఇటీవలి కాలంలో భారత ముస్లిం సమాజం చాలా స్పష్టంగా గుర్తించింది. భారత రాజ్యాంగ
మూల సిధ్ధాంతాలయిన న్యాయం (Justice), స్వేఛ్ఛ (Liberty), సమానత్వం (Equality), సోదరభావం (Fraternity) ముస్లిం సమాజపు నినాదాలయ్యాయి. సామాజిక
వైవిధ్యం (Diversity), అందరికీ భాగస్వామ్యం (Equity),
అందరినీ కలుపుకునిపోవడం (Inclusion) అనే
విలువలు జీవన విధానంగా మార్చుకోవాల్సిన అవసరం ముందుకు వచ్చింది. ముస్లింలు ఆరంభించే
మీడియా సంస్థలకు ఈ ఏడు ఆంశాలు సామాజిక, రాజకీయ మార్గదర్శకాలుగా వుండాలి.
10.ఎస్టీ,
ఎస్సీ, బిసి, మైనారిటీ, శ్రామికుల దృక్పథం
బహుజనులు అనే మాటకు వాడుకలో విస్తృతార్ధాలు
వున్నాయి; సంకుచిత అర్ధాలు కూడ వున్నాయి. స్పష్టంగా ఎస్టీ, ఎస్సీ, బిసి, మైనారిటీలు
అని చెప్పుకోవడం అర్థవంతంగా వుంటుంది. వర్తమాన సమాజంలో ముస్లింల ఆకాంక్షలు సాటి మైనార్టీలయిన
క్రైస్తవులు, శిక్కుల ఆకాంక్షలు ఒక్కలాగే వున్నాయి.
అలాగే సమాజంలో ఎస్టీ, ఎస్సీ, బిసి లు సహితం అనేక రూపాల్లో వివక్ష అణిచివేతల్ని ఎదుర్కొంటున్నారు. వాళ్లతోపాటు
శ్రామికవర్గాన్ని, అభద్రలోకాన్ని సహితం అక్కున చేర్చుకోవాలి. ఇది సామాజిక ఐక్యతను బలపరచడమేగాక
మార్కెట్ స్తోమతను పటిష్టం చేస్తుంది. వీరందరి ఉమ్మడి ఆకాంక్షల్ని సాధించే దృక్పథాన్ని న్యూస్ ఛానళ్ళు అలవరచుకోవాలి.
శ్రామికవర్గం కోసం గతంలో సిపిఐ, సిపిఐ (యం)
రెండు ఛానళ్ళను భారీ పెట్టుబడులతో ఆరంభించాయి. గొప్ప ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులో
వున్నప్పటికీ యాజమాన్యంలో మార్కెట్ ను విస్తరించే వ్యూహం లోపించడంతో రెండు ఛానళ్ళూ
ఖాయిలాపడ్డాయి. మరో అస్తిత్వ సమూహం ఇంకోసారి అలాంటి తప్పిదానికి పాల్పడరాదు.
11. వినయంగా
ఆరంభం కావడమే మేలు
మీడియాకు ప్రధాన పోషకులైన అడ్వర్టైజర్లు
కరోనా దెబ్బకు నైరాశ్యంలో మునిగిపోయారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిపోవడంతో ఇప్పట్లో
రాజకీయ పార్టీలకు కూడ మీడియాతో పెద్దగా పనిలేదు. మార్త్కెట్ కుంగుబాటు కారణంగా రెవెన్యూ
పడిపోవడంతో పెద్దపెద్ద మీడియా కంపెనీలే సతమతమయిపోతున్నాయి. సిబ్బందిని తొలగించడం, ఖర్చులు
తగ్గించుకోవడం వంటి విధానాలను అనుసరిస్తున్నాయి.
మార్కెట్
పతనదశలో వున్నప్పుడు ఒక అణగారిన సామాజికవర్గం భారీ పెట్టుబడులతో
శాటిలైట్ న్యూస్ ఛానల్ ను ఆరంభించడం దుస్సాహసం
అవుతుంది. కేంద్ర సమాచార బ్రాడ్ కాస్టింగ్
శాఖ (MIB) కేబుల్ టీవీల మీద కూడ కొత్తగా అనేక ఆంక్షలు పెట్టింది. ఆపైన టెలీకాం రెగ్యులేటరీ
ఆధారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఇంకొన్ని నిబంధనల్ని సిఫార్సు చేసింది. ఇవి రెండూ తోడయ్యాక
కేబుల్ చానల్స్ ను నడపడం కూడ కష్టంగా మారింది. అపధ్ధర్మంగా ఇప్పటికి ఒక యూట్యూబ్ ఛానల్
ను నిర్వహించడం ఒక్కటే పరిష్కారం.
యూట్యూబ్ ఛానల్ వల్ల కొన్ని ప్రయోజనాలున్నట్టే కొన్ని
పరిమితులు కూడ వున్నాయి. యూట్యూబ్ ఛానల్ ప్రయోజనాల్లో మొదటిది; భారీ ఇన్
ఫ్రాస్ట్రక్చర్ లేకుండానే మన కంటేంట్ ని తక్షణం
గాల్లోకి పంపించవచ్చు. రెండవది; లైవ్ స్ట్రీమింగ్
చేయవచ్చు. మూడవది, అప్ లింకింగ్, డౌన్ లింకింగ్ ల కోసం టెలీపోర్టు సంస్థలకు
నెలకు చెల్లించే 10 లక్షల రూపాయలు ఆదా అవుతుంది. నాలుగవది, ఎమ్మెస్వోలకు నెలనెల ఇకట్టే
లక్షల రూపాయల క్యారియర్ ఫీజు కూడ ఆదా అవుతుంది.
ఐదవది, భారత దేశంలో యూట్యూబ్ కు 45 కోట్ల మంది సబ్ స్క్రైబర్లు వున్నారు. ఇది చిన్న
మార్కెట్ ఏమీ కాదు. (వాట్సప్
53 కోట్లు, యుట్యూబ్ 45 కోట్లు, ఫేస్ బుక్ 41 కోట్లు, ఇన్స్టాగ్రామ్ 21 కోట్లు).
ఇక యూట్యూబ్ ఛానల్ పరిమితుల్లో మొదటిది;
పాతరకం కేథోడ్ రే ట్యూబ్ (CRT) టీవీల్లో మన
కంటెంట్ రాదు. ఇంటర్ నెట్ సౌకర్యం వున్న స్మార్ట్
ఫోన్లు, స్మార్ట్ టీవీలు, పిసీలు, ల్యాబ్ టాపులు అన్నింటిలోనూ యూట్యూబ్ ఛానల్ వస్తుంది. పరిమితుల్లో రెండవది; కమ్మర్షియల్ యాడ్స్ ను యూట్యూబర్లు విడుదల చేయలేరు.
ఆ యాడ్స్ వ్యవహారం అంతా యూ ట్యూబ్ చేతుల్లొ వుంటుంది. మూడవ పరిమితి; శాటిలైట్ న్యూస్
ఛానల్ టివీ, కేబుల్ న్యూస్ ఛానల్ టీవీలల్లో కమ్మర్షియల్ యాడ్ ద్వార రెవెన్యూ వస్తే,
యూట్యూబ్ ఛానల్ కు వ్యూస్ సంఖ్యను బట్టి మాత్రమే రెవెన్యూ వస్తుంది.
నాలుగవ పరిమితి; యూట్యూబ్ ఛానళ్ళలో సర్వకాలీన వినోదం, హాస్యాలకు చెందిన వీడియోలను చూసేవాళ్ళు
ఎక్కువగా వుంటారు; సమకాలీన వార్తలు, పరిణామాల వీడియోలను చూసేవాళ్ళు తక్కువగా వుంటారు;
పెద్ద అట్టహాసం లేకుండ, వినయంగా ఒక యూట్యూబ్
ఛానల్ తో ఆరంభం కావచ్చు. పరిస్థితులు అనుకూలిస్తే దాన్ని రాబోయే కాలంలో కేబుల్ టీవీగానో,
శాటిలైట్ న్యూస్ ఛానల్ గానో విస్తరించే పథకాలను
చేపట్టవచ్చు. శాటిలైట్ ఛానల్ కు అయినా, లోకల్ కేబుల్ టీవీకి అయినా, యూట్యూబ్
ఛానల్ కు అయినా ప్రొడక్షన్ ఎక్విప్ మెంట్, కెమేరాలు, స్టూడియో సెట్ అప్ లు ఒకటే. ఇవేమీ
వృధాకావు. బ్రాడ్ కాస్టింగ్ ఎక్విప్ మెంట్
ను అదనంగా సమకూర్చుకోవాల్సి వుంటుంది.
12.వీడియోల
కంటెంట్ వ్యూహం
ఛానల్ దినచర్యను చెప్పేదే Fixed Point
Chart (FPC). ప్రతి ఛానల్ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి
ఏదో ఒక బలమైన అంశాన్ని ప్రయోగిస్తుంది. కొందరి
దగ్గర డిఎస్ ఎన్ జిలు ఎక్కువగా వుంటాయి. వాళ్ళు ప్రత్యక్ష ప్రసారాలకు ఎక్కువ ప్రాధాన్యం
ఇస్తారు. కొందరి దగ్గర సీరియళ్ళుంటాయి. కొందరి దగ్గర రియాల్టీ షోలు, గేమ్ షోలు వుంటాయి.
కొందరి దగ్గర కామెడీ షోలుంటాయి. కొందరి దగ్గర
ట్రావెల్ కంటెంట్ వుంటుంది, కొందరు ఫ్యాషన్, స్టైల్, వంటల కంటెంట్ ను ఉత్పత్తి చేస్తారు.
కరోనా కాలంలో మెడికల్ కంటెంట్ కు డిమాండ్ పెరిగింది.
ఇంకొందరి దగ్గర హిట్ సినిమాలుంటాయి. వీటిని ఏరోజు ఏ సమయంలో ఎంత సేపు ప్రసారం చేయాలీ
అనేది కూడా ఒక మార్కెట్ వ్యూహమే. ఇలాంటి వ్యూహాలకు అనుగుణంగానే FPC రూపకల్పన జరుగుతుంది.
అన్ని ఛానళ్ళూ 24 X 7 పనిచేస్తాయి. అయితే
అన్ని రోజులూ ఒకేలా పని చేయవు. వీకెండ్ లో స్పెషల్ ప్రోగ్రాములు ప్రసారం చేస్తాయి.
ప్రతి రోజూ ప్రసారాలు సాగే 24 గంటల్లోనూ అనేక
వ్యూహాలుంటాయి. సాధారణంగా రాత్రి 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు రిపీట్లు వేస్తారు.
మిగిలిన 18 గంటలు కొత్తవి వేస్తారు. వాటిల్లోనూ ఓ రెండు గంటలు రిపీట్ అవుతుంటాయి. రోజుకు
ఓ 16 గంటలు మాత్రం తప్పనిసరిగా ఫ్రెష్ కంటెంట్ ఇవ్వాల్సి వుంటుంది. న్యూస్ ఛానళ్ళు
ఇందులో సగభాగం న్యూస్ బులిటిన్లు, చర్చలకు కేటాయిస్తాయి. మిగిలిన సమయాన్ని ఫీచర్చ్
తో నింపుతాయి.
యూ ట్యూబ్ లో ప్రతి వీడియో స్వతంత్రమైనదే
కనుక FPC అక్కరలేదనే అభిప్రాయం కూడ వుంది. అక్కడ కూడ FPCని పాటిస్తే మరిన్ని మంచి ఫలితాలు
వస్తాయి. యూ ట్యూబ్ లో ఓ 15 విభాగాల్లో (Categories) వీడియోలను అప్ లోడ్ చేయవచ్చు.
వాటిల్లో రాజకీయాలు, వర్తమాన విశేషాలకు సంబంధించి News & Politics అనే ఒక్క కేటగిరి
మాత్రమే వుంటుంది. People & Blogs అనే
విభాగంలోనూ సామాజిక రాజకీయ అంశాలను చొప్పించవచ్చు. మన అవసరాల కోసం వాటిని
పెట్టడమేతప్ప యూట్యూబ్ లో ఈ రెండు విభాగాలకు అంతగా ప్రోత్సాహం దొరకదు. హాస్యం, వినోదాలకు యూట్యూబ్ లో ఎక్కువ ప్రోత్సాహం
కల్పిస్తుంది.
కేవలం హాస్యం,
వినోదాలకు సంబంధించిన వీడియోలను మాత్రమే అప్ లోడ్ చేస్తుంటే రెవెన్యూ రావచ్చుగానీ లక్ష్యం
నెరవేరదు. కేవలం News & Politics, People & Blogs లకు చెందిన వీడియోలను మాత్రమే అప్ లోడ్
చేస్తుంటే లక్ష్యం నెరవేరుతుంది గానీ రెవెన్యూలో భారీ కోత పడుతుంది. అంచేత, హాస్యం, వినోదాలకు సంబంధించిన వీడియోలను అప్
లోడ్ చేస్తూ వాటిమధ్య News & Politics, People & Blogs వీడియోలను అప్
లోడ్ చేస్తే రెవెన్యూ వస్తుంది, సంస్థ లక్ష్యమూ నెరవేరుతుంది. ఇదొక శాండ్ విచ్ వ్యూహం.
ముందూ వెనుక వినోదం వుంటుంది; మధ్యలో సీరియస్
సామాజిక అంశం వుంటుంది.
13.Fixed
Point Chart (FPC)
No. |
From |
To |
Program Title |
Category |
Playlist |
Video Type |
|
|
|
|
|
|
|
1 |
7 a.m. |
|
|
Entertainment |
|
Upload |
2 |
8 a.m. |
9 a.m. |
|
News & Politics |
Current Affairs |
LIVE |
3 |
|
|
|
|
|
|
4 |
|
|
|
|
|
|
5 |
2 p.m. |
|
|
Comedy |
Comedy & Satire |
Upload |
6 |
6 p.m. |
|
|
News & Politics |
Current Affairs |
Upload |
News & Current Affairs YouTube
Channel
14. Capital
Expenditures (CAPEX)
1st March 2021
S.No. Description Amount
in INR
1.
Building Advance
3 BHK Flat
3 months @RS. 15 K / m 45, 000
2.
Office Furniture
2 Tables & 6 Chaires
@Rs. 10 K / set 20, 000
3.
Debate Table
For 1 + 4 members
L- Table with 6 chairs 40,
000
4.
Mini Studio Table
For 1 + 1
L table with 3 chairs 25, 000
5.
Studio Lighting
For 2 studios
Grid & LED panels 2,50,000
6.
Soundproofing and Acoustics
For 2 studios with Green Mat 2,50,000
7.
Make-up Tablel
Complete
unit 50,000
8.
AC Units
3 Units Split AC each 1.5 ton
Copper condenser 5 stars 1, 20, 000
9.
UPS & Inverter
Complete Unit with trolly 1,00,000
10. Editing
Tables
2 Tables
& 4 Chaires 30,000
11. Power
& Computer network
LAN
Networking 30, 000
12. Miscellaneous
Unseen expenditure 40, 000
Total
Estimation INR 10,
00, 000
News & Current Affairs YouTube
Channel
15. Operating
Expenses (OPEX) – 1
a.
Equipment Rental
1st March 2021
Description Amount
1. Camera Unit
Sony A7S II 4K
camera
with 35 mm & 50 mm lens,
with Rode
Rode VMPR Video Mic
With
E-Image Heavy duty Tripod
For 1 Month @
Rs. 2000/day 60,
000
2. Lighting
Simpex Studio
Lite LED 5
3 sets of each 5
bulbs, doom, diffuser
and light
stand
For 1 Month @ Rs.
150 /day 4,
500
3. Edit Suite
Intel i7 2700K
3.9 GHz, 16 GB Ram
64 bit operating
system with Graphic Card
For 1 Month @
Rs. 400 / day 12,
000
4. Thumbnails & Graphic Plates System
Intel 2.2 GHz, 4
GB RAM HP Laptop
For 1 Month @Rs.
200 / day 6, 000
5. Live Streaming
Black magic ATEM
Mini – Switcher
And Sony DSC RX
– 100 camera
For 1 Month @Rs.
600 / day 18,
000
Sub Total INR 1,
00, 500
News & Current Affairs YouTube
Channel
16. Operating
Expenses (OPEX) – 2
b.
Amenities
1st March 2021
Description Amount
1.
Building
Rent
Rs. 15 K / Month
15, 000
2.
Power
bill
Rs. 7,000 /
month 7, 000
3.
Internet
100 MB/ sec
2 Connections @
Rs 1250 / each 2,500
4. Local Conveyance
Rs. 300 / day for guest cabs 9, 000
5.
Sundries
Tea & sadar
for guests
Rs. 250 / day 7, 500
6. House Keeping
House keeping
& Tea making
Maid Rs. 6000
month 6, 000
7. Tour & Travel
Approximate
provision 10, 000
8. Miscellaneous
Office
consumables & others 5,
000
9. Unseen Expenditure 8,
000
Sub Total INR
70, 000
News & Current Affairs YouTube
Channel
17. Operating
Expenses (OPEX) – 3
c.
Man Power Cost
1st March 2021
Description Amount
1. Channel Editor
Rs. 12, 000/
Month 12,
000
2. Camera man - 1
Rs. 1000 / month
10, 000
3. Video Editor
Rs. 10, 000 / month 10,
000
4. Graphics incharge
Rs. 10, 000 /
month 10, 000
5. Admin & Accounts
Rs. 10, 000 /
month 10, 000
6. Cameraman- 2
Rs. 10, 000 /
month 10, 000
7. Search Engine Optimization (SEO)
Promotional
Work
Rs. 18, 000
/ month 18,
000
Sub - Total INR 80, 000
18.Contributions
& OPEX at-a- glance
S.
NO. |
OPEX |
Description |
Amount INR |
Amount INR |
|
|
|
Cr. |
Dr. |
1 |
Contributions |
150 members @ 1000 / month |
1,
50, 000 |
|
2 |
Contributions |
Danny through equipment Rental |
1,
00, 500 |
|
3 |
Opex – 1 |
Equipment Rental |
|
1,
00, 500 |
4 |
Opex – 2 |
Amenities |
|
70,
000 |
5 |
Opex – 3 |
Man Power Cost |
|
80,
000 |
|
|
|
|
|
|
|
Total INR |
2, 50, 500 |
2, 50, 500 |
|
|
Surplus INR |
nil |
|
|
|
|
|
|
19. End
Note
ఎంత పెట్టుబడికి ఎంత రెవెన్యూ వస్తుందీ? (Revenue
Expections) అనేది ఏరకం మీడియాకు అయినా ప్రాణపదమైన ప్రశ్న. మీడియాలో మరీ ముఖ్యంగా యూ ట్యూబ్ ఛానల్ విషయంలో ఈ ప్రశ్నకు సూటిగా సమాధానం
చెప్పడం కష్టం. ఎంతమంది సబ్ స్క్రైబర్స్ వున్నారనేదానికన్నా ఒక వీడియోను ఎంతమంది చూస్తున్నారన్నది
చాలా ముఖ్యం.
పది లక్షల మంది సబ్ స్క్రైబర్స్ వుంటే నెలకు
సగటున 3 లక్షల 75 వేల రూపాయల రెవెన్యూ వస్తుందని యూ ట్యూబ్ సగటులు చెపుతున్నాయి. అయితే
ఇందులో రెండు షరతులున్నాయి. మొదటిది; 10 లక్షల మంది సబ్ స్క్రైబర్లు నమోదు కావాలి.
రెండోది; వారు తరచూ మన ఛానల్ వీడియోలను చూస్తుండాలి.
మన ప్రయత్నాలు ఆ దిశగా వుండాలి.
అన్నింటికన్నా ముఖ్యంగా మనం గుర్తు పెట్టుకోవాల్సింది
ఏమంటే మనం ఈ ఛానల్ ను లాభాలు అర్జించడం కోసం వాణిజ్య పధ్ధతుల్లో నడపడానికి పెట్టడంలేదు. అవసరమైన సమాచారాన్ని స్వీయ
సామాజికవర్గానికి అందించి వాళ్ళను చైతన్యపరచడం మన లక్ష్యం. దానికోసం కొంత ఖర్చుపెట్టడానికి
సిధ్ధపడి ఈ ఛానల్ పెడుతున్నాం. ఈ అంశం మనకు నిరంతరం గుర్తుండాలి.
//EOM//
No comments:
Post a Comment