Friday, 31 March 2023

భారత్ బచావో సమాఖ్య మీద ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF) తీర్మానం

 భారత్ బచావో సమాఖ్య మీద  ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF) తీర్మానం


కార్పొరేట్ సాంస్కృతిక జాతీయవాద నియంతృత్వం (ఫాసిజం) కు  ప్రధాన బాధితులయిన ముస్లిం సమూహాలను భారత్ బచావో అవగాహన పత్రం పట్టించుకోలేదు. పైగా, కొన్ని పేరాల్లో  ముస్లిం వ్యతిరేకతను కూడ వ్యక్తం చేసింది. 


నిర్భంధం కారణంగా సమాఖ్యలు కొన్ని సాంకేతిక జాగ్రత్తలు తీసుకోవడం వేరు; ప్రధాన బాధిత సమూహాన్ని మొత్తంగా దూరంగా పెట్టడం వేరు. 


 భారత్ బచావో సమాఖ్యకు మద్దతు ఇస్తున్న పార్టీలు, ప్రజా సంఘాలు  తప్పని సరిగా భారత వర్తమాన ముస్లిం సమాజం మీద తమ విధానాన్ని స్పష్టం చేయాల్సి వుంటుంది.  


భవిష్యత్తులో  భారత్ బచావో సమాఖ్య చేపట్టే కార్యక్రమాల్లో భావసారూప్యం వున్నవాటికి  ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF) మద్దతు పలుకుతుంది; వాటిల్లో పాల్గొంటుంది. 


ఏ. యం. ఖాన్ యజ్దానీ (డానీ)

కన్వీనర్, ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)

విజయవాడ, 29 మార్చి 2023

Thursday, 30 March 2023

*Danny Notes On BHARAT BACHAO PERSPECTIVE PAPER*

 

*Danny Notes On BHARAT BACHAO  PERSPECTIVE PAPER*

 

1.        Despite the proclaimed theme ‘Let's Defeat Fascism and Let's Achieve Secularism!!’, Bharat Bachao’s  Perspective Paper merely  tries to comment the Indian model of Fascism / Nazism in many ways but it utterly failed to propose a programme to defeat the Fascism and achieve communal harmony in present day India.

 

2.        Though the Perspective Paper described elaborately the Indian model of Fascism / Nazism in about 11 chapters; it sadly failed to find out the primary aspects and operations of Fascism / Nazism.

 

3.        It is obvious that one cannot defeat Fascism / Nazism without knowing its core aspects.   

 

4.        Fascism is the abusing of the political power by the respective elected governments to increase the economic power of the greedy corporates by dividing the opposing masses on the basis of religion and nationality.

 

5.        There is a general narrative that the elected governments lend their support to the corporates to promote crony capitalism. But the fact is other way round. The greedy corporates bring their men to the power to capture the natural and financial recourses of the nation, keeping the people as mute spectators by involving them in intra-religious / nationality clashes.

 

6.        It should be called Crony Governments.

 

7.        Every dictatorial states has used the various religions to curb the people and to serve the interests of corporates, Irrespective of latter’s principles, preaching and dictums. Not only Manu Smriti or Sanatana Hinduism, Buddhism, Zionism, Christianity, and Islam also served the interests of the dictators in various countries in various times of the history. 

 

8.        Shaheenbagh movement, the torch bearer of anti-Fascist movement in the recent times made the ‘Preamble of the Indian Constitution’ as the icon and totem of its struggle against Citizenship (Amendment) Act, 2019. The same tradition was followed by the famous farmers agitation in Delhi. We should continue the same torch.

 

9.        It is a foremost mandatory before any war or struggle to categorize the enemy and friends specifically. 

 

10.    Fortunately our enemies are extraverts they never veil their programmes and agendas. RSS during its inception itself declared Muslims, Christians and Communists as its enemies. In the recent times they added SCs also with a rider ‘Ambedkarite’ to this list. Hence the base for the anti-fascist alliance is simple and clear.

 

11.    We should have an alliance with Muslims, Christians, Communists, ‘Ambedkarite’ SCs and likeminded people, individuals and politicl parties. Who should lead the alliance is also not a complicated issue. To whom the Sanghparivar consider its biggest enemy should lead the team. It’s so simple.

 

12.    In the present day Indian society it is a general narrative that religious minority Muslim community is the biggest victim of Indian Fascists. The foremost demand of Indian Muslims is ‘Life Saving’. (Prana Rakshana)

 

13.    Frontal Organization could spread the new thoughts in the society rapidly and can create a positive environment for a change.  But they too have their own limitations.

 

14.    As the Fascism / Nazism come to the power through Parliamentary Democratic Elections, it is obvious that we have to defeat it in the field of parliamentary elections only.

 

15.    Without forming a proper and winnable alliance in the Parliamentary elections to defeat the Fascists forces, all other efforts will become futile exercises.  

 

16.    I am of the strong opinion that all other parties should come under one wide umbrella to form an alliance to defeat the NDA forces led by the BJP in the 2024 Lok Sabha elctions. Being the single largest party in the anti-NDA camp, the INC should be made the leader of the anti-Fascist great alliance.

 

Vijayawada

31 March 2923

Saturday, 18 March 2023

80-20 Assimilations - Muslim Crisis

 80:20 సమీకరణలు : ముస్లింల ఇరకాటం

80-20 Assimilations - Muslim Crisis

 

          తక్కువ సంఖ్యాకుల్ని అధిక సంఖ్యాకులు సులువుగా జయించగలరనేది ఒక సాధారణ అభిప్రాయం.  “30 కోట్ల మంది భారతీయులు ఒక్కసారిగా కాండ్రించి ఉమ్మి వేస్తే అందులో మీరంతా కొట్టుకుపోతారురా” అని అల్లూరి సీతారామరాజు సినిమాలో అగ్గిరాజు డైలాగ్ ఒకటి వుంటుంది.  ఉద్యమాల్లో ప్రజల్ని ఉత్తేజపరచడం కోసం తరచూ ఇలాంటి మాటలు అవసరం అవుతుంటాయి.

 

          భారత ప్రధమ స్వాతంత్ర్యపోరాటం, సిపాయిల తిరుగుబాటు సమయంలో బ్రిటీష్ ఇండియాలో విశాల ప్రజా సమీకరణ జరిగింది. ఆంగ్లేయుల్ని తరిమి కొట్టడానికి ఒక ప్రాదేశిక జాతీయవాదం వువ్వెత్తున  ముందుకు వచ్చింది. అంతటి వృధ్ధుడయిన బహదూర్ షా జాఫర్ ను అందరూ తమ సర్వ సేనాధిపతిగా స్వఛ్ఛందంగా ఎన్నికున్నారు.

 

సిపాయిల తిరుగుబాటు  శిధిలాల నుండి పుట్టిన జాతియోద్యమం దేశ ప్రజలకు 80:20 ఉత్తేజాన్నే ఇచ్చి ముందుకు సాగింది. భారతీయులు 80 శాతం ఆంగ్లేయులు 20 శాతం అనేది విభజన.  భారత ముస్లింలు సహితం ఉత్సాహంగా 80 శాతంలో చేరారు. బ్రిటీష్ వ్యతిరేక పోరాటంలో తమ వంతు బాధ్యతను  కఛ్ఛితంగా నిర్వర్తించారు. జాతీయోద్యమంలో అత్యంత కీలకం, స్వాతంత్ర్యం రావడానికి నిర్ణయాత్మకంగా పనిచేసిన క్విట్ ఇండియా ఉద్యమానికి మౌలానా అబుల్ కలామ్ అజాద్ నాయకత్వం వహించారు.

 

సాంస్కృతిక జాతీయవాదం ముందుకు రావడం  ఆ తరువాతి పరిణామం.

 

స్వాతంత్ర్యానంతరం కమ్యూనిస్టులు కొత్త సమీకరణలతో 80:20  సిధ్ధాంతాన్ని బాగా ప్రచారం చేశారు. దేశంలో కష్టజీవులు 80 శాతం అని, విశ్రాంత వర్గం కేవలం 20 శాతమేనని వీళ్ళు వర్గీకరించేవారు. 20 శాతాన్ని 80 జయించడం పెద్ద కష్టం కాదనేవారు. సహజంగానే ఈ విభజన కష్టజీవులకు బాగా నచ్చేది. వాళ్ళు పెద్ద సంఖ్యలో కమ్యూనిస్టు పార్టిలకు దగ్గరయ్యేవారు. స్వాతంత్ర్యానంతరం విశ్రాంత వర్గంలో ముస్లింల భాగం మరీ చిన్నది. వాళ్ళు 80 శాతం కష్టజీవులతోనే  వున్నారు. పారిశ్రామిక విప్లవం మూలంగా కొత్తగా పుట్టుకొచ్చిన చేతివృత్తులన్నింటిలోనూ ముస్లింలే వుండేవారు. వాళ్లు పేదవాళ్లయినప్పటికీ 80 శాతంతో వుండడంతో గొప్ప నైతిక బలంగా వుండేది.

 

1990లలోదేశంలోనేగాక, ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్టుల ఆమోదాంశం దెబ్బతిన్నది. తూర్పుయూరోపు పతనం, రష్యా విఛ్ఛిన్నం దీనికి ప్రధాన కారణం. దేశంలోనూ కమ్యూనిస్టులు చెప్పుకోదగ్గ విజయాలను నమోదు చేయలేకపోయారు.  దానితో  సామాజిక సందర్భం మారింది.

 

ఆ సమయంలో మాన్యశ్రీ  కాన్షీరామ్ ఒక సరికొత్త పధ్ధతిలో  80:20 సమీకరణల్ని పునర్ వ్యవస్థీకరించే ప్రయత్నం చేశారు. దేశంలో ఎస్టి, ఎస్సి, బిసి, మైనారిటీలు 80 శాతం అనీ, భద్రలోక్ 20 శాతమేనని ఆయన కొత్త లెఖ్ఖలు చెప్పారు. ఈ నిర్వచనం ముస్లింలకు కూడ అనువుగానే కనిపించింది. దళిత-ముస్లిం ప్రజాస్వామిక సంఘటనలు డెఫోడమ్, దరకమే వంటి సాంస్కృతిక సంస్థలు, బలహీనవర్గాల సమాఖ్యవంటి ప్రజాసంఘాలు ఏర్పడ్డాయి. ఈ ఉత్సాహం దాదాపు మూడు దశాబ్దాలు  కొనసాగింది. ఈ పరిణామాలు, కొత్త సామాజిక ఐక్యతలు సంఘ్ పరివారాన్ని కొంతకాలం  నిజంగానే కలవర పెట్టాయి.

 

తమ సంఖ్యాబలాన్ని పెంచుకోవడానికి సంఘపరివారం కొత్త ఎత్తుగడలు ఆరంభించారు. మొదట్లో వర్ణాలకే పరిమితమైవున్న తమ సామాజిక ఛత్రాన్ని కులాలకు కూడ విస్తరించడానికి ప్రయత్నించారు. బహుజనసమాజ్ లోని బహుజనులైన  హిందూ- బిసిలను మొదట ఆకర్షించారు. నరేంద్ర మోదీ హిందూ-బీసి  కావడమూ, వారు గుజరాత్ ముఖ్యమంత్రి కావడమూ దీనికి కలిసి వచ్చింది. ముస్లింలకు వ్యతిరేకంగా సాగిన గుజరాత్ అల్లర్లలో, బిసిలు, ఎస్సీలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చేయడంలో సంఘపరివారం సఫలమయింది. దీనివల్ల హిందూ బిసిలకు, సంఘపరివారానికి కూడ పరస్పర ప్రయోజనాలూ వున్నాయి. కాల్బలంలో దండనాయకులుగా హిందూ బిసిలను ముందుంచుతున్నారు. దీన్ని వాళ్ళూ సాంస్కృతిక గౌరవంగా భావిస్తున్నారు.  కంచ ఐలయ్య షెఫర్డ్ వంటి మేధావులు ఈ సామాజిక వలసలకు  సైధ్ధాంతిక సమర్ధనను తరచూ అందిస్తూవస్తున్నారు.   

 

కేంద్రంలో నరేంద్ర మోదీ- అమిత్ షాల పాలన మొదలయ్యాక ఒకవైపు ఎస్సీలను, మరోవైపు షియా ముస్లింలను  ఆకర్షించడానికి కొత్త పథకాలు రచించారు.  దానితో  మరో రకం 80:20 సమీకరణ ప్రతిపాదనను  ముందుకు తెచ్చారు. దేశంలో హిందువులు 80 శాతం, ముస్లింలు, కమ్యూనిస్టులు-నక్సలైట్లు,  హేతువాదులు, నాస్తికులు అంత కలిసి 20 శాతం అని వాళ్ళు ప్రచారం మొదలెట్టారు. ఆ 20 శాతం ఓట్లు తమకు అక్కరలేదని, 80 శాతంవున్న తమ ఓట్లతోనే అధికారానికి నిలబెట్టుకుంటాం అనే ధీమాను వ్యక్తం చేయడం మొదలెట్టారు.

 

దేశ సామాజిక, రాజకీయ రంగాలో కొత్తగా వస్తున్న పరిణామాల్ని గమనిస్తే మనకు రెండు అంశాలు ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి. ‘20’ శిబిరంలో వుందడానికి ఎవరూ ఇష్టపడడంలేదు. ఏదో ఒక విధంగా ‘80’ శిబిరంలో చేరాలనే తాపత్రయం అందరిలో మొదలయింది. ప్రముఖ అంబేడ్కరిస్టులుగా చెలామణి అయిన రామ్ విలాస్ పాశ్వాన్, ఉదిత్ రాజ్, తామ్ దాస్ అథవాలే  చాలా కాలం బిజెపి సేవలో తరించారు.

 

ఇంతా చేసినా సంఘీయులకు ఆశించిన 80 శాతం దకక్కడం                 లేదు. హిందూ పెత్తందారీ కులాల్లోని ఉదారవాదులు ఈ సమీకరణకు సుముఖంగా లేరు. వాళ్ళ సంఖ్య కూడ తక్కువగా ఏమీలేదు. ఇది సంఘీయుల్ని ప్రధానంగా అసహనానికి గురిచేస్తున్న అంశం. 2019 ఎన్నికల్లో మొత్తం పోలయిన  91 కోట్ల ఓట్లలో బిజెపికి పడినవి 23 కోట్ల ఓట్లే.

 

దేశ అర్ధిక వ్యవస్థ మునుపెన్నడూ లేనంత వేగంగా దూసుకుపోతున్నదనీ, మన ఆదానీ, అంబానీలు ప్రపంచ కుబేరుల్లోఒకరుగా మారారనీ, భారత దేశం విశ్వగురువుగా మారుతోందని ఎంతగా ప్రచారం చేస్తున్నా దేశంలోని హిందూ ఉదారవాద సమూహం నమ్మడం లేదు.

 

ధృఢ అంబేడ్కరిస్టులు అయిన ఎస్సీలు తమ వైపుకు రావడం లేదనే అసంతృప్తి కూడ సంఘీయుల్లో చాలా కాలంగా వుంది. ఎస్సీలకు విద్యా, ఉపాధి రంగాల్లో రాజ్యాంగబధ్ధ రిజర్వేషన్లున్నాయి. రాజకీయ రిజర్వేషన్ మాత్రం కేంద్ర ప్రభుత్వ ఇష్టాయిష్టాల మీద ఆధారపడివుంది. ఎస్సీల నిరసనను తగ్గించ గలిగితే తాము 80 శాతానికి చేరుకోవడానికి మార్గం సులువవుతుందనే ఆశ సంఘీయులకు లేకపోలేదు.  

 

అందరూ తమ శిబిరంలో చేరిపోతే ముస్లింలు, ఆదివాసులు, కొందరు ఎస్సీలు, కమ్యూనిస్టులు మాత్రమే ప్రత్యర్ధి శిబిరంలో మిగులుతారనే నమ్మకం సంఘీయుల్లో కనిపిస్తోంది.

ఇప్పుడు ఎస్సీలను మరింతగా ఆకట్టుకోవడానికి సంఘపరివారం కొత్త ఆలోచనలు చేస్తున్నది. బిఆర్ అంబేడ్కర్ తన జీవితకాలంలో  వర్ణ-కుల నిర్మూలన మీద ఎక్కువ దృష్టి పెట్టారు. ఇప్పుడు ఆ అంశాన్ని సంఘీయులు పరిశీలిస్తున్నారు. వర్ణాలు-కులాలు పోవాలని సర్ సంఘ్ ఛాలక్ మోహన్ భాగ్వత్ ఇటీవల ప్రకటించారు. అంబేడ్కరిస్టులయిన ఎస్సీల నుండి దానికి ఏ మేరకు  సానుకూల స్పందన వస్తుందో చూడాలి.

 

కష్టకాలంలో కమ్యూనిస్టులు తమకు గట్టి అండగా వుంటారనే నమ్మకం ముస్లిం సమూహాల్లో వుంది. ఈ 80:20  ఫోబియా క్రమంగా  ఇటు కాంగ్రెస్ ను, అటు కమ్యూనిస్టుల్ని కూడ భయపెడుతోంది. ముస్లింలను దరిచేరిస్తే తమ ఉనికే గల్లంతవుతుందనే భయం వాళ్లను వెంటాడుతోంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత సిపియంలో ఈరకం ఆందోళన మరీ ఎక్కువయింది.

 

20 శాతం శిరంలో  వుండడానికి ఇప్పుడు ఏ సామాజికవర్గమూ సిధ్ధంగా లేదు. అన్ని సామాజికవర్గాలు 80 శాతం శిబిరంలోనికే ప్రవేశించాలనుకుంటున్నాయి. ముస్లిం సామాజికవర్గం ఇప్పుడు మునుపెన్నడూ లేనంత ఒంటరులు.

 

చివరికి అన్యుల శిరంలో ముస్లింలు, ఆదివాసులు మాత్రమే మిగిలిపోయే సన్నివేశం ఒకటి ఏర్పడుతోంది. ఆ ముస్లిం సమూహం నుండి  బిసి ముస్లింలను విడదీసే ప్రయత్నాలనూ సంఘ్ పరివారం ఆరంభించింది. ఆదివాసుల కోసం వనవాసి కళ్యాణ్ యోజన ఎలాగూ వుంది. ముస్లింలను ఏకాకుల్ని చేసేందుకు రంగం సిధ్ధమైంది.

 

19వ శతాబ్దంలో ఫూలే సాంఘీక ఉద్యమానికి ముస్లింలు చేయుత నిచ్చారు. సంతాల్ తిరుగుబాటు, నీలిమందు ఉద్యమం కాలంలో ఆదివాసుల పక్షాన వున్నారు. రౌండ్ టేబుల్ కాన్ఫెరెన్స్ లో అంబేడ్కర్ ప్రతిపాదించిన  ఎస్సీల రిజర్వేషన్ కు ముస్లింలు మద్దతు పలికారు. రాజ్యాంగ సభలోనికి ప్రవేశించడానికి అంబేడ్కరుకు దారి కల్పించారు. ఇలాంటి సామాజికవర్గాల ఐక్యత ఇప్పుడొకటి ఏర్పడాలి. అలా మొదలయ్యే ఐక్య సంఘటన విశాలంగా మారి మళ్ళీ 80 శాతానికి చేరుకోవాలి.  

 

18 మార్చి 2023

Tuesday, 14 March 2023

MTF stand on Bharat Bachavo

  *ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF) భారత్ బచావోతో అంశాలవారీగా కలిసి పనిచేస్తుంది*

 భారత్ బచావో జాతీయ సదస్సు ఢిల్లీలో రెండు రోజులపాటు విజయవంతంగా జరిగింది. దాదాపు వెయ్యిమంది ప్రతినిధులు పాల్గొన్నారు. సిపియం కేంద్ర కార్యాలయమైన హరికిషన్ సింగ్ సూర్జిత్ భవన్ లోని మూడు సమావేశ మందిరాలు నిండిపోయాయి. ప్రతినిధుల్లో ఆంధ్రా, తెలంగాణకు చెందిన వారు 70-80 శాతంవున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 20-30 శాతం వుంటారు.

ఉపన్యాసకుల్లో మొదటిరోజు, ప్రొఫెసర్ అపూర్వానంద చాలా గొప్పగా ఆకట్టుకున్నారు. దంతేవాడకు చెందిన హిమాంశు కుమార్ ప్రసంగం ఉద్వేగంగా సాగింది. రచయిత్రి సీమా ఆనంద్ ప్రసంగం ఆలోచించదగ్గట్టుగా వుంది.  రెండో రోజు దీపాంకర్ భట్టాచార్య, ప్రొఫెసర్ అరుణ్ కుమార్ ప్రసంగాలు బాగున్నాయి.

జాతీయ సదస్సుకు కీలకమైన ‘భారత్ బచావో అవగాహనా పత్రం’ చాలా నిరుత్సాహ పరచింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కొన్ని మార్క్సిస్టు-లెనిస్టు పార్టీలు ‘కాషాయ కార్పొరేట్ ఫాసిజం నశించాలి’ అంటూ సభలు పెట్టాయి. భారత్ బచావో విజయవాడ రాష్ట్ర సదస్సులో ఒ కమ్యూనిస్టు పార్టి ప్రతినిధి సిఏఏ వ్యతిరేక ఉద్యమానికి కమ్యూనిస్టు పార్టీలే నాయకత్వం వహించాయని చాలా గట్టిగా చెప్పారు.   అలాంటి స్పష్టత  భారత్ బచావో   అవగాహనా పత్రంలో కనీసంగానైనా కనిపించలేదు.

 ఈ కీలక పత్రం 1983కు ముందు భారత సమాజంలోని వ్యవస్థల మీద వివిధ కమ్యూనిస్టు పార్టిలకున్న అవగాహనను ప్రతిబింబించింది. గత నలభై ఏళ్ళుగా భారత సమాజంలో వెలుగులోనికి వచ్చిన కొత్త వ్యవస్థల్ని అర్ధం చేసుకోవడానికి  సాగుతున్న పరిశోధనలు  సాధించిన అవగాహనని భారత్ బచావో  అవగాహన పత్రం నిరాకరించింది. అంటే, భారత్ బచావో  అవగాహన పత్రం దాదాపు నలభై యేళ్ళు నెగటివ్ విలువలో వుంది.

 “ *ఎవరు మితృలు ? ఎవరు శతృవులు ?* అని RSS వారు 1990 లలోనే వారి  అంతరంగిక సర్క్యులర్ లో రాసుకున్నారు. ముస్లింలు, క్రిష్టియన్లు, అంబేద్కర్ వాదులయిన దళితులు, వామపక్ష సంస్తలు తమ శతృవులుగా అందులో వారు రాసుకున్నారు. ఎవరయితే వారి శతృవులని రాసుకున్నారో వారందరు ఐక్యమై ఇతర బహుజనులను,  శ్రమ జీవులను ఐక్య పరచి పోరాడి సంఘ పరివార్ ఫాసిస్టు శక్తులను ఓడించాలి” అంటూ భారత్ బచావో వాట్సప్ గ్రూపులో కనీసం పదిసార్లు పోస్టులు పెట్టిన అడ్మిన్ లు ఢిల్లీలో ప్లేటు ఫిరాయించారు. దేశంలో తీవ్ర అణిచివేతకు గురవుతున్న మైనారిటీలు మా మిత్రులు అనడానికిగానీ, మైనారిటీలకు మేము అండగా వుంటాం అని గానీ ప్రకటించడానికి భయపడ్డారు.

 సంఘపరివారానికి ప్రధాన  శతృవులైనవారు తమకు చివరి మిత్రులు కూడ కారని దేశ రాజధానిలో సంజాయిషీ ఇచ్చుకోవడానికి చాలా తాపత్రయపడ్డారు.

 ప్రొఫెసర్ అపూర్వానంద దేశంలో ముస్లింలను లక్ష్యాంగా పెట్టుకుని ఎంతటి క్రూరమైన దాడులు జరుగుతున్నాయో సుదీర్ఘంగా వివరించారు. హీమాంశు కుమార్ మనసమాజానికి కుల వర్గ మత తెగ స్వభావాలున్నాయని విశ్లేషించారు. వాళ్ళిద్దరి ప్రసంగ సారాన్ని అభావం చేయడం కోసం భారత్ బచావో అవగాహన పత్రం అదనపు గంటలు పనిచేసింది.  

 అంతేగాక మైనారిటీల్లో బోలెడు హిందూత్వ వుందని నిరూపించడానికి భారత్ బచావో సిధ్ధాంతకర్తలు గట్టి కసరత్తు చేశారు.  “గుజరాత్ అల్లర్ల సందర్భంగా భారత రాష్ట్రపతి ఎవరూ? ఏపిజే కలాం కాదా? ఆయన ముస్లిం కాదా?” అని సాక్షాత్తు భారత్ బచావో వ్యవస్థాపకులు సభలోని ముస్లిం ప్రతినిధుల్ని నిలదీశారు. గోడీ మీడియా, వాట్సప్ యూనివర్శిటీ గ్రాడ్యుయేట్లను మించిన పరిజ్ఞానాన్ని వారు ఎంతో సమర్ధంగా ప్రదర్శించారు. కోర్టులో కేసులు గెలవడానికి ఎంతకైనా తెగించే రామ్ జెఠ్  మలానీ వంటి వివాదాస్పద అడ్వకేట్ కూడ ఈ స్థాయి అబధ్ధాలను ఇంత ధైర్యంగా చెప్పి వుండరు. ఇంతటి అనితరసాధ్యమైన నైపుణ్యాన్ని సాధించినందుకు భారత్ బచావో అడ్మిన్ లకు ప్రత్యేక అభినందనలు.

సత్యాన్వేషన మార్గాల గురించి కొందరు  ప్రవచనకారులు భారత్ బచావో వాట్సప్ గ్రూపులో తరచూ ఉపదేశాలు చేస్తుంటారు. ఆ సత్యాన్వేషణ మార్గాల్ని ఢిల్లీ జాతీయ వేదిక మీద వాళ్ళు డిజిటల్ డిస్ ప్లే చేసి చూపించారు.  

 ఫాసిజానికి ప్రధాన బాధితులు మత అల్పసంఖ్యాకవర్గాలనే ప్రాధమిక వాస్తవాన్ని అవగాహనా పత్రం గుర్తించ నిరాకరించింది. పైగా మీ సమస్యలు మీవి మీ యుధ్ధం మీరే చేసుకోవాలంటూ ముస్లింలకు ఒక గొప్ప హితబోధ చేశారు.  కార్పొరేట్ సాంస్కృతిక జాతీయవాద నియంతృత్వం మీద తాను పోరాడడం లేదంటూ  భారత్ బచావో సంస్థ ముందుగానే అస్త్రసన్యాసం చేసింది.  భారత్ బచావో అవగాహనా పత్రంవల్ల ముస్లిం. క్రైస్తవ, శిక్కు మత అల్ప సంఖ్యాక వర్గాలకు ఏమాత్రం ఉపయోగంలేదు.

 ‘We and Our Nationhood Defined’‘ పుస్తకంలో గురూజీ గోల్వాల్కర్ భారత ప్రజల్ని మత ప్రాతిపదికన  ‘మేము-వారు’ అని విభజించారు. ఆ బాటలో  “మేము 80 శాతం వాళ్లు 20 శాతం’ అంటూ  కేంద్ర హోంమంత్రి   అమిత్ షా తరచుగా ప్రకటిస్తుంటారు. తాము సహితం ముస్లింలకు దూరం అని భారత్ బచావో జాతీయ సదస్సు చెప్పకనే చెప్పింది.  ముస్లింలను దరిచేర్చుకుని అమిత్ షా ఆగ్రహానికి గురికావడంకన్నా ముస్లింలను దూరంగా పెట్టి అమిత్ షా అనుగ్రహానికి పాత్రులు కావాలనుకోవడం తెలివైన ఆలోచనే!.

భారత్ బచావో జాతీయ సదస్సు  ఆహ్వాన కమిటీలో సిపిఐ (ఎంఎల్) ప్రజాపంథా, లిబరేషన్. క్లాస్ స్ట్రగుల్, న్యూ డెమోక్రసీ, రెడ్ స్టార్, రివల్యూషనరీ ఇనీషియేటివ్ ల పేర్లు వున్నాయి. వీటితోపాటూ మరికొన్ని కమ్యూనిస్టు పార్టిలు కూడ భారత్ బచావోకు మద్దతు పలకవచ్చు; పలికి వుండవచ్చు. అమిత్ షా, భారత్ బచావోలు దూరంగా పెట్టాలనుకున్న 20 శాతం సమూహాన్ని ఈ పార్టీలు కూడ దూరంగా పెట్టాలనుకుంటున్నాయా? పరిశోధించి తెలుసుకోవాల్సిన అంశమే.

 భారత దేశాన్ని కుల మత తెగ లింగ ప్రాంత భాషా వర్గ వువస్థల సమాజంగా గుర్తించనివాళ్ళు ఈ సమాజంలో ఎలాంటి మార్పులూ తేలేరు. వాళ్లు ఏనుగును గుర్తించలేకపోయిన నలుగురు గుడ్డివాళ్ళుగా మిగిలిపోతారు. వాళ్ళు దివ్యాంగులు కనుక వాళ్ళ మీద  కొంచెం జాలిపడుదాం!.

భారత ఫాసిజానికి ప్రధానంగా బలి అయ్యేది ముస్లింలు, ఆదివాసులు అనేది  *ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)* అవగాహన. భారత్ బచావో  అవగాహన పత్రంతో ఆదివాసులకు ఏ మేరకు మేలు జరుగుతుందో ఇప్పుడే అంచనా వేయడం కష్టం. ఈ అవగాహన పత్రంతో కొనసాగే భారత్ బచావో ఉద్యమంవల్ల హిందూ సమాజంలోని అణగారిన కులాలకు ఏ మాత్రం  మేలు జరిగినా అది గొప్ప విషయమే. అలాంటి అణగారిన కులాల శ్రేయస్సు కొరకు భారత్ బచావోకు *ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)* సంఘీభావాన్ని తెలుపుతోంది. ప్రజా సమస్యల పరిష్కారం ప్రాతిపదికగా ఆయా సందర్భాల్లో  అంశాలవారిగా తప్పక కలిసిపనిచేస్తుంది.

ఏయం ఖాన్ యజ్దానీ (డానీ)

కన్వీనర్, *ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)*

Monday, 13 March 2023

Notes on Communist Parties

 రోగ నిర్ధారణ జరపకుండానే నూరేళ్ళుగా గోసాయి చిట్కాలు వాడుతున్న నాటు వైద్యులు మన కమ్యూనిస్టు పార్టీలు.

నేను ఓ డాక్టర్ని  కావాలనుకునే ఓ వైద్యుని దగ్గర చేరాను. అతను ill-equipped అని తెలియగానే బయటికి వచ్చేశాను. ఇప్పుడు మళ్ళీ కొత్త కోర్సు వైద్య విద్య చదువుతున్నాను. 

మార్క్స్ -ఏంగిల్స్ చెప్పిన సిధ్ధాంతానికీ భారత కమ్యూనిస్టు పార్టీలు పాటించే ఆచరణకూ పొంతన లేదు. 

భారత కమ్యూనిస్టు పార్టీలు ఇంతకాలం తెలియక తప్పులు చేశాయని నేను అనుకునేవాడిని. నా అభిప్రాయం తప్పు. అవి తెలిసే తప్పులు చేస్తున్నాయి.  

కమ్యూనిస్టు పార్టి ఆఫ్ ఇండియా అని పేరు పెట్టడమే చారిత్రిక తప్పిదం. ఇండియన్ కమ్యూనిస్టు పార్టి అనాల్సింది. 

భారత కమ్యూనిస్టు పార్టీల స్వయంకృత అపరాధాలతో కమ్యూనిజానికి ఆమోదాంశం కూడ తగ్గిపోయింది. 

మీకు తెలుసోలేదో 1920లో పుట్టిన కమ్యూనిస్టు పార్టి పేరు ఇండియన్ కమ్యూనిస్టు పార్టి. 1925 డిసెంబరు 26న దాని పేరు  కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాగా మార్చారు. రెండింటికీ ఒక మౌలిక తేడా వుంది.   ఇండియన్ కమ్యూనిస్టు పార్టి అంటే భారతీయ స్వభావంగల కమ్యూనిస్టు పార్టి అని అర్ధం. కమ్యూనిస్టు పార్టి ఆఫ్ ఇండియా అంటే అంతర్జాతీయ కమ్యూనిస్టు పార్టికి భారత బ్రాంచ్ అని అర్ధం. 

వంద భారత కమ్యూనిస్టు పార్టీలు మొత్తం  తమ తరువాతి కమ్యూనిస్టు పార్టీల చేత కార్మిక ద్రోహులు అనిపించుకున్నవే. 

భారత దేశాన్ని కుల మత తెగ ప్రాంత భాషా లింగ వువస్థల వర్గ సమాజంగా గుర్తించనివాళ్ళు ఈ సమాజంలో ఎలాంటి మార్పులూ తేలేరు. వాళ్లు ఏనుగును గుర్తించలేకపోయిన నలుగురు గుడ్డివాళ్ళుగా మిగిలిపోతారు. వాళ్ళు దివ్యాంగులు కనుక వాళ్ళ మీద  కొంచెం జాలిపడుదాం!. 



కమ్యూనిస్టులు మహత్తర త్యాగాలు చేశారు!

కమ్యూనిస్టు నాయకులు అంత సమర్ధులు కారు! 


Ramakrishna Udata  గారూ! 

కమ్యూనిస్టులు త్యాగాలు చేయలేదని నేను ఎన్నడూ అనలేదు. అలా అంటే నన్ను నేను తక్కువ చేసుకున్నట్టు. 


కమ్యూనిస్టులు గొప్ప త్యాగాలు చేశారు. ఆస్తి త్యాగాలు చేశారు. కుటుంబాలను త్యాగం చేశారు. చివరకు ప్రాణ త్యాగాలూ చేశారు. ఇది వాస్తవ చరిత్ర దాన్ని ఎవరూ కాదనలేరు. 


నాకిప్పుడు ఉద్యోగం లేదు. ఆదాయమూ లేదు. ఢిల్లీ సదస్సుకు వెళ్ళి రావడానికి టిక్కేట్లు 11 వేలు అయ్యాయి. క్యాబ్ లు ఇతర ఖర్చులు, డ్రెస్సులు ఇంకో 4 వేలు అయ్యాయి.  కష్టకాలంలో ఇది చాలా భారమే. 

అయినప్పటికీ నేను కమ్యూనిజాన్ని ప్రేమిస్తాను; మంచి కమ్యూనిస్టుల్ని ఇష్టపడతాను.  ఈ విషయంలో I am next  to none. 


కమ్యూనిస్టు పార్టీలు  అంతర్గతంగా బలహీనపడడం మూలంగానే బాహ్యంగా బలహీన పడ్డారు. ఇది గతితార్కిక భౌతికవాద  సూత్రం కూడ. 


మావోయిస్టు పార్టితో నాకు ఎలాంటి సంబంధాలు లేవు. అసలు ఆ పార్టి ఆవిర్భావమే నాకు నచ్చలేడు. నేను 1978- 90 మధ్య కాలంలో పీపుల్స్ వార్ తో వున్నాను. చాలా చురుగ్గా పనిచేశాను.  దాని తప్పులు దానికీ వున్నాయి. అందుకే వదిలి వేశాను. విరసంతో 2002 వరకు వున్నాను. తరువాత దానికీ రాజీనామా చేశాను. 


అయినా కమ్యూనిస్టుల్ని కమ్యూనిస్టులు విమర్శించడం కొత్తేమీకాదు. వుమ్మడి కమ్యూనిస్టు పార్టి నుండి విడిపోతున్నప్పుడు సిపియం చేసిన విమర్శలు తెలియవా?  సిపియం నుండి విడిపోతున్నప్పుడు సిపియం ఎంఎల్ చేసిన విమర్శలు తెలియవా? ఆ పరంపర దేశంలో ఇప్పటికి వంద పార్టీల వరకు కొనసాగుతోంది.  


దీనికి నాకు భారత కమ్యూనిస్టు పార్టీల నాయకుల్లోని మూడు  లక్షణాలు ప్రధాన   కారణాలుగా  కనిపిస్తున్నాయి. 


వాళ్ళు చీలిక ఆలోచనలు కలవారు, అణగారిన శ్రేణుల్ని కలుపుకోవడంకన్నా చీలిపోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు.


కమ్యూనిస్టు పార్టిల విధానాలను పార్టి సభ్యులు కాకుండ పార్టి పోషకులు నిర్ణయిస్తారు. 


వాళ్ళు ill-equipped. స్వంతంగా ఆలోచించలేరు. ఇంగ్లండ్, రష్యా, చైనా నాయకుల ఉపదేశాల మీద ఆధారపడి బతికేశారు. 1990 తరువాత అలాంటి అంతర్జాతీయ ఉపదేశాలు  రావడం ఆగిపోవడంతో చేతులు ఎత్తేశారు. 


పుచ్చలపల్లి సుందరయ్యగారి రాజీనామా పత్రాన్ని చదివాక నాకు మరింత జ్ఞానోదయం అయ్యింది. వారు అందులో తన రాజీనామాకు నాలుగు కారణాలు చెప్పారు. 


1. సిపియం పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటి సభ్యులు భారతీయ జనసంఘ్ నాయకులతో అపవిత్ర కలయికను కొనసాగిస్తున్నారు. ఇది ప్రమాదమని హెచ్చరించినా పెడచెవిన పెడుతున్నారు. 


2. పార్టి పార్లమెంటరీ కమిటీ, ట్రేడ్ యూనియన్లు పార్టికి  లోబడి పనిచేయకపోగా తరచూ పార్టినే శాసిస్తున్నారు. 


3. పార్టి సభ్యులు బహిరంగ పనివిధానం వైపు మొగ్గు చూపుతూ రహాస్య పనివిధానాలను తిరస్కరిస్తున్నారు. 


50 యేళ్ల తరువాత కూడ  ఆ రాజీనామా డాక్యుమెంట్ లోని అంశాలు విలువైనవే. 


ఇందులో మొదటి అంశం నన్ను బాగా కలచి వేసింది. కాంగ్రెస్ ను గట్టిగా వ్యతిరేకించే నెపంతో జనసంఘ్ ను (నేటి బిజేపి)ని ముందుకు తెచ్చారు. ఆ ఫలితాలను ఇప్పుడు దేశం అనుభవిస్తున్నది. ముఖ్యంగా ముస్లిం సామాజికవర్గం అనుభవిస్తున్నది. 


ఇదీ వాస్తవం అంటే! 


మినహాయింపులేకుండ అన్ని మతాలు  ఏదో ఒక దేశంలో సాంస్కృతిక జాతీయవాద నియతృత్త్వాన్ని కొనసాగిస్తున్నవే.


*బిజెపితో ఎవరి డేటింగ్ నూ చూసి సుందరయ్యగారు రాజీనామా చేశారూ?*

 

బంగ్లాదేశ్  విముక్తి యుధ్ధానికి కొంచెం ముందు జరిగిన 1971 ఎన్నికల్లో 3 శాతం ఓట్లు పెరిగి 69 సీట్లు పెరిగి 352 సీట్లతో ఇందిరా కాంగ్రెస్ ఘన విజయాన్ని సాధించి అధికారాన్ని నిలబెట్టుకుంది.

 

అటల్ బిహారీ వాజ్ పాయి నాయకత్వంలోని అఖిల భారతీయ జన సంఘ్ కు ఓట్లు తగ్గి,  సీట్లు కూడ  35 నుండి 22కు తగ్గాయి.

 

సిపియం కు 25, సిపిఐకు 22 స్థానాలొచ్చాయి. కామరాజ్ నాయకత్వంలోని కాంగ్రెస్ ()కు 14 స్థానాలొచ్చాయి.

 

అప్పటికే చండ్ర రాజేశ్వరరావు నాయకత్వంలోని సిపిఐ ఇందిరా కాంగ్రెస్ తో పీకలోతు ప్రేమలో పడివుంది. నేపథ్యంలో తాము పెరగడానికి  జనసంఘ్ ముందు వున్న ఆప్షన్లు సోషలిస్టులు, కాంగ్రెస్ (), సిపియం.

సోషలిస్టు జయప్రకాశ్ నారాయణ్ ను గురువు స్థానంలో పెట్టి రాజకీయం నడిపారు. మురార్జి దేశాయిని నాయకుడ్ని చేశారు. పుచ్చలపల్లి సుందరయ్య నాయకత్వంలోని సిపియం పార్లమెంటు సభ్యులకు జయప్రకాశ్ నారాయణ్ ఇంట్లో భారతీయ జనసంఘ్ నాయకులు లైన్ వేయడం మొదలెట్టారు. వాళ్లంతా అక్కడ రహాస్యంగా కలుస్తుండేవారు.

 

సంఘ్ పరివారం రాజకీయాలు అలాగే వుంటాయి. రెండు ఎన్నికల్లో మిత్రుల కోసం కొన్ని త్యాగాలు చేస్తారు. తరువాత తామే సంపూర్ణ మెజారిటీని సాధించి పాత మిత్రుల్ని భూస్థాపితం చేస్తారు. సమతా పార్టి, లోక్ జనశక్తి, బిఎస్పి కోవలో దెబ్బతిన్నవే.

 

 ఇందిరా గాంధి ప్రభుత్వం  1975 జూన్ 25 దేశంలో ఎమెర్జెన్సీని ప్రకటించారు. సిపిఐ ఎమెర్జెన్సీని గట్టిగా కౌగలించుకుంది.  ఎమర్జెన్సీ సాకుతో సోషలిస్టుల హడ్డాలో జనసంఘ్, సిపియం ప్రేమ గుబాళించింది. అప్పట్లో జనసంఘ్ చేత తాళి కట్టించుకోవడం సిధ్ధాంత రీత్యా కుదరదు గాబట్టి సోషలిస్టు గెస్ట్ హౌస్ లో లివ్ ఇన్ కాపురం సాగించారు. ఎప్పటి నుండో పార్టి ఎంపీల శీలాన్ని శంకించి మందలిస్తున్న సుందరయ్యగారు ఇంత ఘాటు ప్రేమను చూడలేకపోయారు. ఎమర్జెన్సీ పెట్టిన రెండు నెలల లోపే ఏకంగా సిపియం జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి, పోలిట్ బ్యూరో సభ్యత్వానికీ ఒకేసారి రాజీనామా చేశారు. తన ఆవేదనను వెళ్ళడిస్తూ నూట యాభై పేజీల డాక్యుమెంట్ రాశారు. దాని మీద ఎవ్వరూ మాట్లాడరు.  

 

తరువాత జనసంఘ్  బిజేపిగా మారి  ఎలా ఎలా పెరిగిందనేది తన పాత మిత్రుల్ని పశ్చిమ బెంగాల్  ఎలా సత్కరించిందన్నది  వర్తమాన చరిత్రే.