Monday 6 March 2023

Bharat Bachavo Muslims

 ఫాసిజం రాజకీయ ఆర్ధిక సాంస్కృతిక రంగాల ద్వారా సమాజం మీద తన ఏజెండాను అమలుపరుస్తుంది. ఫాసిజాన్ని వ్యతిరేకించేవారు  కూడ  ఆ మూడు రంగాలలో మూడు వ్యూహలతో దాన్ని ఎదుర్కోవాలి.

ఏ.ఎం. ఖాన్ యాజ్దానీ (డానీ), ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF) 


ఫాసిజానికి అత్యంత బాధితులు మత అల్పసంఖ్యాకులు అయిన ముస్లిం, క్రైస్తవ సంఘాలనుగాని, వాళ్ళ ప్రతినిధుల్ని గానీ  ఆహ్వానించినట్టుగాని, సంప్రదించినట్టుగాని రెండు జాబితాల్లో ఎక్కడ లేదు. మనం  మరో తప్పు చేస్తున్నాం.  

ఏ.ఎం. ఖాన్ యాజ్దానీ (డానీ), ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)


దేశ రాజధాని ఢిల్లీ శివార్లలో రైతుల చారిత్రాత్మక  ఆందోళనకు మార్గాన్ని చూపించిన షాహిన్  బాగ్  నాయకుల్ని ఆహ్వానిస్తే బాగుంటుంది. 

ఏ.ఎం. ఖాన్ యాజ్దానీ (డానీ), ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF) 


'హిందూ కమ్యూనిస్టులు' అనే ఒక సమూహం ఉన్నదా? 


రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, మీడియా సంస్థల విధానాలు,  దృక్పధాలు, కార్యక్రమాలు వాటి పోషకుల మీద ఆధారపడి ఉంటాయి. \


మనది  కులసమాజం అనడానికి కమ్యూనిస్టు పార్టీలు సంఘాలకు 1980 లలో చాలా ఇబ్బందులుండేవి. 

మనది మత సమాజం  అనడానికి కమ్యూనిస్టు పార్టీలు సంఘాలకు   ఇప్పుడూ అలాంటివే  ఏవో  ఇబ్బందులున్నాయి. .

మత  సమాజాన్ని గుర్తించకుండా ఫాసిజంతో పోరాటంలో తొలి అడుగు కూడ పడదు. 

కార్పొరేట్ సాంస్కృతిక జాతీయవాద నియంతృత్వాన్ని సాంస్కృతిక రంగంలో మతసామరస్యం ద్వారా ఎదుర్కోవాలి. 

కార్పొరేట్ సాంస్కృతిక జాతీయవాద నియంతృత్వాన్ని ఆర్ధిక రంగంలో శ్రామికుల ఐక్యతతో నిలవరించాలి.

కార్పొరేట్ సాంస్కృతిక జాతీయవాద నియంతృత్వాన్ని రాజకీయ రంగంలో విపక్షాలన్నింటి ఐక్యతతో అడ్డుకట్ట వేయాలి. 

పార్లమెంటరీ రాజకీయాల్లో బిజెపిని నిలవరించాలంటే కాంగ్రెస్ కేంద్రంగా ఒక మహా ఐక్య సంఘటన ఏర్పడాలి.


No comments:

Post a Comment