భారత్ బచావో సమాఖ్య మీద ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF) తీర్మానం
కార్పొరేట్ సాంస్కృతిక జాతీయవాద నియంతృత్వం (ఫాసిజం) కు ప్రధాన బాధితులయిన ముస్లిం సమూహాలను భారత్ బచావో అవగాహన పత్రం పట్టించుకోలేదు. పైగా, కొన్ని పేరాల్లో ముస్లిం వ్యతిరేకతను కూడ వ్యక్తం చేసింది.
నిర్భంధం కారణంగా సమాఖ్యలు కొన్ని సాంకేతిక జాగ్రత్తలు తీసుకోవడం వేరు; ప్రధాన బాధిత సమూహాన్ని మొత్తంగా దూరంగా పెట్టడం వేరు.
భారత్ బచావో సమాఖ్యకు మద్దతు ఇస్తున్న పార్టీలు, ప్రజా సంఘాలు తప్పని సరిగా భారత వర్తమాన ముస్లిం సమాజం మీద తమ విధానాన్ని స్పష్టం చేయాల్సి వుంటుంది.
భవిష్యత్తులో భారత్ బచావో సమాఖ్య చేపట్టే కార్యక్రమాల్లో భావసారూప్యం వున్నవాటికి ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF) మద్దతు పలుకుతుంది; వాటిల్లో పాల్గొంటుంది.
ఏ. యం. ఖాన్ యజ్దానీ (డానీ)
కన్వీనర్, ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)
విజయవాడ, 29 మార్చి 2023
No comments:
Post a Comment