రోగ నిర్ధారణ జరపకుండానే నూరేళ్ళుగా గోసాయి చిట్కాలు వాడుతున్న నాటు వైద్యులు మన కమ్యూనిస్టు పార్టీలు.
నేను ఓ డాక్టర్ని కావాలనుకునే ఓ వైద్యుని దగ్గర చేరాను. అతను ill-equipped అని తెలియగానే బయటికి వచ్చేశాను. ఇప్పుడు మళ్ళీ కొత్త కోర్సు వైద్య విద్య చదువుతున్నాను.
మార్క్స్ -ఏంగిల్స్ చెప్పిన సిధ్ధాంతానికీ భారత కమ్యూనిస్టు పార్టీలు పాటించే ఆచరణకూ పొంతన లేదు.
భారత కమ్యూనిస్టు పార్టీలు ఇంతకాలం తెలియక తప్పులు చేశాయని నేను అనుకునేవాడిని. నా అభిప్రాయం తప్పు. అవి తెలిసే తప్పులు చేస్తున్నాయి.
కమ్యూనిస్టు పార్టి ఆఫ్ ఇండియా అని పేరు పెట్టడమే చారిత్రిక తప్పిదం. ఇండియన్ కమ్యూనిస్టు పార్టి అనాల్సింది.
భారత కమ్యూనిస్టు పార్టీల స్వయంకృత అపరాధాలతో కమ్యూనిజానికి ఆమోదాంశం కూడ తగ్గిపోయింది.
మీకు తెలుసోలేదో 1920లో పుట్టిన కమ్యూనిస్టు పార్టి పేరు ఇండియన్ కమ్యూనిస్టు పార్టి. 1925 డిసెంబరు 26న దాని పేరు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాగా మార్చారు. రెండింటికీ ఒక మౌలిక తేడా వుంది. ఇండియన్ కమ్యూనిస్టు పార్టి అంటే భారతీయ స్వభావంగల కమ్యూనిస్టు పార్టి అని అర్ధం. కమ్యూనిస్టు పార్టి ఆఫ్ ఇండియా అంటే అంతర్జాతీయ కమ్యూనిస్టు పార్టికి భారత బ్రాంచ్ అని అర్ధం.
వంద భారత కమ్యూనిస్టు పార్టీలు మొత్తం తమ తరువాతి కమ్యూనిస్టు పార్టీల చేత కార్మిక ద్రోహులు అనిపించుకున్నవే.
భారత దేశాన్ని కుల మత తెగ ప్రాంత భాషా లింగ
వువస్థల వర్గ సమాజంగా గుర్తించనివాళ్ళు ఈ సమాజంలో ఎలాంటి మార్పులూ తేలేరు. వాళ్లు ఏనుగును
గుర్తించలేకపోయిన నలుగురు గుడ్డివాళ్ళుగా మిగిలిపోతారు. వాళ్ళు దివ్యాంగులు కనుక వాళ్ళ
మీద కొంచెం జాలిపడుదాం!.
కమ్యూనిస్టులు మహత్తర త్యాగాలు చేశారు!
కమ్యూనిస్టు నాయకులు అంత సమర్ధులు కారు!
Ramakrishna Udata గారూ!
కమ్యూనిస్టులు త్యాగాలు చేయలేదని నేను ఎన్నడూ అనలేదు. అలా అంటే నన్ను నేను తక్కువ చేసుకున్నట్టు.
కమ్యూనిస్టులు గొప్ప త్యాగాలు చేశారు. ఆస్తి త్యాగాలు చేశారు. కుటుంబాలను త్యాగం చేశారు. చివరకు ప్రాణ త్యాగాలూ చేశారు. ఇది వాస్తవ చరిత్ర దాన్ని ఎవరూ కాదనలేరు.
నాకిప్పుడు ఉద్యోగం లేదు. ఆదాయమూ లేదు. ఢిల్లీ సదస్సుకు వెళ్ళి రావడానికి టిక్కేట్లు 11 వేలు అయ్యాయి. క్యాబ్ లు ఇతర ఖర్చులు, డ్రెస్సులు ఇంకో 4 వేలు అయ్యాయి. కష్టకాలంలో ఇది చాలా భారమే.
అయినప్పటికీ నేను కమ్యూనిజాన్ని ప్రేమిస్తాను; మంచి కమ్యూనిస్టుల్ని ఇష్టపడతాను. ఈ విషయంలో I am next to none.
కమ్యూనిస్టు పార్టీలు అంతర్గతంగా బలహీనపడడం మూలంగానే బాహ్యంగా బలహీన పడ్డారు. ఇది గతితార్కిక భౌతికవాద సూత్రం కూడ.
మావోయిస్టు పార్టితో నాకు ఎలాంటి సంబంధాలు లేవు. అసలు ఆ పార్టి ఆవిర్భావమే నాకు నచ్చలేడు. నేను 1978- 90 మధ్య కాలంలో పీపుల్స్ వార్ తో వున్నాను. చాలా చురుగ్గా పనిచేశాను. దాని తప్పులు దానికీ వున్నాయి. అందుకే వదిలి వేశాను. విరసంతో 2002 వరకు వున్నాను. తరువాత దానికీ రాజీనామా చేశాను.
అయినా కమ్యూనిస్టుల్ని కమ్యూనిస్టులు విమర్శించడం కొత్తేమీకాదు. వుమ్మడి కమ్యూనిస్టు పార్టి నుండి విడిపోతున్నప్పుడు సిపియం చేసిన విమర్శలు తెలియవా? సిపియం నుండి విడిపోతున్నప్పుడు సిపియం ఎంఎల్ చేసిన విమర్శలు తెలియవా? ఆ పరంపర దేశంలో ఇప్పటికి వంద పార్టీల వరకు కొనసాగుతోంది.
దీనికి నాకు భారత కమ్యూనిస్టు పార్టీల నాయకుల్లోని మూడు లక్షణాలు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
వాళ్ళు చీలిక ఆలోచనలు కలవారు, అణగారిన శ్రేణుల్ని కలుపుకోవడంకన్నా చీలిపోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు.
కమ్యూనిస్టు పార్టిల విధానాలను పార్టి సభ్యులు కాకుండ పార్టి పోషకులు నిర్ణయిస్తారు.
వాళ్ళు ill-equipped. స్వంతంగా ఆలోచించలేరు. ఇంగ్లండ్, రష్యా, చైనా నాయకుల ఉపదేశాల మీద ఆధారపడి బతికేశారు. 1990 తరువాత అలాంటి అంతర్జాతీయ ఉపదేశాలు రావడం ఆగిపోవడంతో చేతులు ఎత్తేశారు.
పుచ్చలపల్లి సుందరయ్యగారి రాజీనామా పత్రాన్ని చదివాక నాకు మరింత జ్ఞానోదయం అయ్యింది. వారు అందులో తన రాజీనామాకు నాలుగు కారణాలు చెప్పారు.
1. సిపియం పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటి సభ్యులు భారతీయ జనసంఘ్ నాయకులతో అపవిత్ర కలయికను కొనసాగిస్తున్నారు. ఇది ప్రమాదమని హెచ్చరించినా పెడచెవిన పెడుతున్నారు.
2. పార్టి పార్లమెంటరీ కమిటీ, ట్రేడ్ యూనియన్లు పార్టికి లోబడి పనిచేయకపోగా తరచూ పార్టినే శాసిస్తున్నారు.
3. పార్టి సభ్యులు బహిరంగ పనివిధానం వైపు మొగ్గు చూపుతూ రహాస్య పనివిధానాలను తిరస్కరిస్తున్నారు.
50 యేళ్ల తరువాత కూడ ఆ రాజీనామా డాక్యుమెంట్ లోని అంశాలు విలువైనవే.
ఇందులో మొదటి అంశం నన్ను బాగా కలచి వేసింది. కాంగ్రెస్ ను గట్టిగా వ్యతిరేకించే నెపంతో జనసంఘ్ ను (నేటి బిజేపి)ని ముందుకు తెచ్చారు. ఆ ఫలితాలను ఇప్పుడు దేశం అనుభవిస్తున్నది. ముఖ్యంగా ముస్లిం సామాజికవర్గం అనుభవిస్తున్నది.
ఇదీ వాస్తవం అంటే!
*బిజెపితో
ఎవరి డేటింగ్ నూ చూసి సుందరయ్యగారు
రాజీనామా చేశారూ?*
బంగ్లాదేశ్
విముక్తి
యుధ్ధానికి కొంచెం ముందు జరిగిన 1971 ఎన్నికల్లో 3 శాతం ఓట్లు పెరిగి 69 సీట్లు పెరిగి 352 సీట్లతో ఇందిరా కాంగ్రెస్ ఘన విజయాన్ని సాధించి
అధికారాన్ని నిలబెట్టుకుంది.
అటల్
బిహారీ వాజ్ పాయి నాయకత్వంలోని అఖిల భారతీయ జన సంఘ్ కు
ఓట్లు తగ్గి, సీట్లు
కూడ 35 నుండి
22కు తగ్గాయి.
సిపియం
కు 25, సిపిఐకు 22 స్థానాలొచ్చాయి. కామరాజ్ నాయకత్వంలోని కాంగ్రెస్ (ఓ)కు 14 స్థానాలొచ్చాయి.
అప్పటికే
చండ్ర రాజేశ్వరరావు నాయకత్వంలోని సిపిఐ ఇందిరా కాంగ్రెస్ తో పీకలోతు ప్రేమలో
పడివుంది. ఈ నేపథ్యంలో తాము
పెరగడానికి జనసంఘ్
ముందు వున్న ఆప్షన్లు సోషలిస్టులు, కాంగ్రెస్ (ఓ), సిపియం.
సోషలిస్టు
జయప్రకాశ్ నారాయణ్ ను గురువు స్థానంలో
పెట్టి రాజకీయం నడిపారు. మురార్జి దేశాయిని నాయకుడ్ని చేశారు. పుచ్చలపల్లి సుందరయ్య నాయకత్వంలోని సిపియం పార్లమెంటు సభ్యులకు జయప్రకాశ్ నారాయణ్ ఇంట్లో భారతీయ జనసంఘ్ నాయకులు లైన్ వేయడం మొదలెట్టారు. వాళ్లంతా అక్కడ రహాస్యంగా కలుస్తుండేవారు.
సంఘ్
పరివారం రాజకీయాలు అలాగే వుంటాయి. ఓ రెండు ఎన్నికల్లో
మిత్రుల కోసం కొన్ని త్యాగాలు చేస్తారు. ఆ తరువాత తామే
సంపూర్ణ మెజారిటీని సాధించి పాత మిత్రుల్ని భూస్థాపితం చేస్తారు. సమతా పార్టి, లోక్ జనశక్తి, బిఎస్పి ఆ కోవలో దెబ్బతిన్నవే.
ఇందిరా గాంధి ప్రభుత్వం 1975 జూన్
25న దేశంలో ఎమెర్జెన్సీని ప్రకటించారు. సిపిఐ ఎమెర్జెన్సీని గట్టిగా కౌగలించుకుంది. ఎమర్జెన్సీ
సాకుతో సోషలిస్టుల హడ్డాలో జనసంఘ్, సిపియం ప్రేమ గుబాళించింది. అప్పట్లో జనసంఘ్ చేత తాళి కట్టించుకోవడం సిధ్ధాంత రీత్యా కుదరదు గాబట్టి సోషలిస్టు గెస్ట్ హౌస్ లో లివ్ ఇన్
కాపురం సాగించారు. ఎప్పటి నుండో పార్టి ఎంపీల శీలాన్ని శంకించి మందలిస్తున్న సుందరయ్యగారు ఇంత ఘాటు ప్రేమను చూడలేకపోయారు. ఎమర్జెన్సీ పెట్టిన రెండు నెలల లోపే ఏకంగా సిపియం జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి, పోలిట్ బ్యూరో సభ్యత్వానికీ ఒకేసారి రాజీనామా చేశారు. తన ఆవేదనను వెళ్ళడిస్తూ
ఓ నూట యాభై పేజీల డాక్యుమెంట్ రాశారు. దాని మీద ఎవ్వరూ మాట్లాడరు.
ఆ
తరువాత జనసంఘ్ బిజేపిగా
మారి ఎలా
ఎలా పెరిగిందనేది తన పాత మిత్రుల్ని
పశ్చిమ బెంగాల్ ఎలా
సత్కరించిందన్నది వర్తమాన
చరిత్రే.
No comments:
Post a Comment