1. భారతదేశంలో 19, 20 శతాబ్దాల్లో సాంస్కృతిక పునరుజ్జీవనం, పెట్టుబడీదారీ వ్యవస్థలు ఆరంభమయ్యేనాటికి ప్రత్యక్ష
వలస పాలన కొనసాగుతూ వుండింది. అందువల్ల, మన
సాంస్కృతిక పునరుజ్జీవనం, పెట్టుబడీదారీ
వ్యవస్థ ఆవిర్భావం రెండింటిలోనూ వలస పాలన ప్రభావం పరిమితులు వున్నాయి. వలస పాలనకు వ్యతిరేకంగా సాగిన జాతియోద్యమంలో
క్రియాశీలంగా పాల్గొన్న కాంగ్రెస్, కమ్యూనిస్టు, విప్లవకారులు, తదితర స్రవంతుల మధ్య
సైధ్ధాంతిక విబేధాలున్నప్పటికీ అన్నింటిలోనూ ప్రాదేశిక జాతీయవాదం (Territorial
Nationalism) చాలా ధృఢంగా వుండింది. దీనికి
వ్యతిరేకంగా ఇంకో స్రవంతి కూడ వుండేది. అది వలస వ్యతిరేక జాతియోద్యమంలో పాల్గొనకుండ
భవిష్యత్ భారత దేశంలో సాంస్కృతిక జాతీయవాదం (Cultural Nationalism) ప్రాతిపదికగా హిందూ
మతరాజ్యాన్ని నిర్మించాలనే లక్ష్యంతో పనిచేసేది.
2. స్వాతంత్ర్యానంతరం
రాజకీయ ఆర్ధిక సామాజిక రంగాల్లో సమానత్వాన్ని సాధించాలనే భావనలు బలంగా ముందుకు
వచ్చాయి. దేశానికి ఆధునిక రాజ్యాంగాన్ని రూపొందించుకోవడానికి ఏర్పడిన రాజ్యాంగ
సభలో ప్రాదేశిక జాతీయవాదులు అత్యధికులు. వాళ్ళ
ఆమోదంతో రూపొందిన రాజ్యాంగపు మూలసూత్రాలైన
“న్యాయం, స్వేఛ్ఛ, సమానత్వం, సోదరభావాలు” సాంస్కృతిక
జాతీయవాదులకు పడవు. మనుస్మృతిని భారత రాజ్యాంగంగా మార్చాలనేది మొదటి నుండీ వాళ్ళ ఆకాంక్ష.
3. ప్రతి మనిషికీ ఒక
ఓటు; ప్రతి ఓటుకు సమాన విలువను ప్రతిపాదించడం ద్వార భారత రాజ్యాంగం పార్లమెంటరీ ప్రజాస్వామిక
రాజకీయ రంగంలో ఒక సమానత్వాన్ని సాధించింది. ఆర్ధిక, సామాజిక రంగాల్లో సమానత్వాన్ని
సాధించే బాధ్యతను ప్రభుత్వాలపై పెట్టింది.
4. ఆర్ధిక, సామాజిక
రంగాల్లో సమానత్వాన్ని సాధించడానికి దేశంలో అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు సాగాయి. అనేక
ప్రభుత్వాలు ఆర్ధిక, సామాజిక రంగాల్లో సమానత్వాన్ని సాధిస్తామంటూ ఆర్భాటంగా ఎన్నో ఉద్దేపన చర్యల్ని ప్రకటిస్తూ వచ్చాయి.
అయినప్పటికీ ఈ రెండు రంగాలలో సమానత్వం రాకపోగా వున్నవాళ్ళకూ లేని వాళ్లకు మధ్య అంతరం
పెరుగుతూ వచ్చింది. చివరకు రాజకీయరంగంలో కూడ సమానత్వం లేదని తేలిపోయింది. మన పాలకులు
పెట్టుబడీదారుల్ని ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు ముందుకు వచ్చాయి. అసలు పెట్టుబడీదారులే
ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నారనే ( crony legislature) వాస్తవం బయటపడిపోవడంతో శాసననిర్మాణ రంగం
మీదనే విశ్వాసం సన్నగిల్లింది.
5. 1990వ దశకంలో తూర్పు
యూరోపు పరిణామాలు, సోవియట్ రష్యా విఛ్ఛిన్నంతో ప్రపంచ వ్యాప్తంగా సమానత్వ
సిధ్ధాంతానికి ఆమోదాంశం తగ్గుముఖం పట్టింది.
ఇదే అదనుగా, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి వంటి సంస్థలు వరల్డ్ ట్రేడ్
ఆర్గనైజేషన్ ను ఏర్పాటు చేసి ప్రపంచాన్ని ఒక గ్లోబల్ మార్కేట్ గా మార్చేశాయి.
వాటి ప్రభావంతో దేశంలో ఆర్ధిక సంస్కరణల శకం మొదలయ్యింది. సంపన్నులను ప్రోత్సహించడం
దీని ప్రధాబ్న లక్ష్యం. అణగారిన సమూహాల భవిష్యత్తును సంపన్నుల దయాదాక్షిణ్యాలకు వదిలివేయడం
ఈ విధానంలో ప్రధాన అంశాలు.
6. ఒక వైపు ప్రాదేశిక జాతీయవాదాన్ని
చెప్పే రాజకీయ పార్టీలు బలహీనపడడం, మరో వైపు సామ్యవాద సిధ్ధాంతాలకు ఆమోదాంషం తగ్గడంతో
సాంస్కృతిక జాతీయవాదానికి ప్రాచూర్యం పెరిగింది.
7. ఈ పరిణామాల్ని కార్పొరేట్
సంస్థలు తమకు అనుకూలంగా మార్చుకున్నాయి. సాంస్కృతిక జాతీయవాదుల్ని దేశాధినేతలుగా మార్చాయి.
8.
9. Xxxx వీటి ఫలితంగా
కొన్ని, ఎన్నికల్లో మళ్ళీ మళ్ళీ గెలిచి
అధికారాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం కారణంగా మరికొన్ని ఉద్దేపన చర్యలు వచ్చాయి.
రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతియీకరణ, గరీబీ హఠావో, అఙారిన సమూహాలకు విద్యా, ఉపాధి,
శాసన వ్యవస్థల్లో రిజర్వేషన్లు ఈ క్రమంలో వచ్చాయి.
భారతదేశంలో పెట్టుబడీదారీ వ్య్వస్థ, పునర్వీకాసం
భారతదేశంలో పునరుజ్జీవనం
Renaissance in
India
No comments:
Post a Comment