Friday, 4 August 2023

Manipur mayhem, a manufactured Ethnic Cleansing

 

Manipur mayhem, a manufactured Ethnic Cleansing

మణిపూర్ అల్లకల్లోలం, ఒక కుత్రిమ జాతి హననం

 

1.        మణిపూర్ లో కుకీలు నివసించే కొండప్రాంతాల్లో అత్యంత విలువైన అపార ఖనిజ నిక్షేపాలు వున్నాయి.

2.        అడవి సంపద, ఖనిజ నిక్షేపాలు మన కార్పొరేట్లకు కావాలి.

3.        మణిపూర్ తూర్పునగల అంతర్జాతీయ సరిహద్దుల్లో మైన్మార్ కు చెందిన రెండు రాష్ట్రాలుంటాయి.

4.        అలాగే ఆ ప్రాంతం వివాదాస్పద గోల్డెన్ ట్రయాంగిల్ (మైన్మార్, లావోస్, థాయిలాండ్) కు దగ్గరగా వుంది.

5.        డ్రగ్ మాఫియాలకు ఆ ప్రాంతం మీద పట్టుకావాలి.

6.        కార్పొరేట్ల సంపద పెరుగుదలతోపాటు , అంతర్జాతీయ రహదారి ఏర్పడాలంటే ముందు మణిపూర్ తూర్పు భాగంలో  గ్రౌండ్ క్లియరెన్స్ జరగాలి.

7.        కుకిలను వాళ్ల ప్రాంతాల నుండి ఖాళీ చేయించాలి.

8.        ఇదీ నేపథ్యం

9.        మెయితీల ద్వార అంతర్యుధ్ధానికి పథకరచన చేశారు.

10.     మైదాన ప్రాంతాల్లో వుండే మెయితీలకు ఎస్టి రిజర్వేషన్ కల్పిస్తే కొండ ప్రాంతాల్లో వుండే కుకీలు సహజంగానే వ్యతిరేకిస్తారు. 

11.     సంఖ్యా బలం, ప్రభుత్వ అండవున్న కారణంగా మెయితీలు రెచ్చిపోయారు. 

12.     కుకీల మీద మెయితీలు అనాగరీక దారుణ దాడులు జరిపారు.

13.     గృహదహనాలు, హత్యలు, సామూహిక అత్యాచారాలు పెద్ద ఎత్తున సాగాయి.

14.     కొన్ని వందల మంది కుకీలు చనిపోయారు.  

15.     పోలీసులతో సహా, ప్రభుత్వ యంత్రాంగం మెయితీల పక్షం వహించింది. లేదా మౌన ప్రేక్షకుల్లా వుండిపోయింది.

16.     Assam Rifels, CRPF, PAC తదితర కేంద్ర బలగాలూ భిన్నంగా లేవు.

17.     అక్కడి శాంతిభద్రతల బాధ్యతల్ని తీసుకున్నట్టు మే 4న ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తనకు సంబంధం లేదంటున్నది.

18.     ముస్లింలను వేధించడానికి ఉమ్మడి పౌరస్మృతి చట్టాన్ని తెస్తున్నట్టు ఇటీవల కేంద్రప్రభుత్వం కొన్ని సంకేతాలు వదిలింది.

19.     అటవీ భూమి మీద అనాదిగా తమకున్న ప్రత్యేక హక్కుల్ని రద్దు చేయడానికి ఉమ్మడి పౌరస్మృతి చట్టాన్ని తెస్తున్నట్టు వనవాసులు, గిరిజనులు, ఆదివాసులకు స్పష్టంగా తెలిసిపోయింది.

20.     ఉమ్మడి పౌరస్మృతి ఇక ఎంతమాత్రం ముస్లింల సమస్య కాదు. అదిప్పుడు ఆదివాసుల ఉనికి సమస్య.

21.     కుకీలు ఆ ప్రాంతాన్ని వదిలి పారిపోయి పొరుగునున్న మిజోరం, నాగాలాండ్ రాష్ట్రాల్లో తలదాచుకున్నారు.

22.     కొందరు కుకీలు అనేక ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. ప్రధానంగా వాళ్ళు బిజెపి పాలన లేని రాష్ట్రాలకు వెళుతున్నారు. వాళ్ల గమ్యంలో పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడ వున్నాయి. 

23.     దీనికి వలసలు, మాస్ డిస్ ప్లేస్ మెంట్ వంటి చిన్న పదాలు చాలవు.

24.     ఇది జాతి హననం. Ethnic Cleansing. 

25.     కొన్ని చోట్ల కుకీలు తిరగబడ్డారు; అలాంటి సందర్భాల్లో మెయితీలు కూడ చనిపోయారు.

26.     ప్రపంచం మొత్తం తమను ఒక క్రూర అనాగరిక జాతిగా భావిస్తూ వుండడం కొందరు మెయితీలకు నచ్చడంలేదు.

27.     మెయితీల్లో మానవ హృదయం వున్న వారు కొన్ని చోట్ల కుకీలను కాపాడారు, తమ ఇళ్ళల్లో ఆశ్రయం కల్పించారు.

28.     అలాగే కుకీల జనాభా ఎక్కువగా వున్న ప్రాంతాల్లో కొన్ని చోట్ల కుకీలు కూడ మెయితీలను తిరుగుబాటుదార్ల నుండి కాపాడారు.

29.     ఇప్పుడు సమస్య తక్షణ సహాయక చర్యలు, పునరావాసానికి (Releaf and rehabilitation (R&R) కు సంబంధించింది.

30.     నాగాలాండ్, మిజోరం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఇప్పటికే అనేక తక్షణ సహాయక సహాయక శిబిరాలు వెలిశాయి.

31.     కుకీలను ఎక్కడికక్కడ పునరావాసం కల్పిస్తారూ?

32.     ఇప్పుడు వారు చేరుకున్న చోట పునవాసం కల్పిస్తారా? ఇది కూడ పెద్ద సమస్యే. గృహదహనాల్లో వాళ్ల గుర్తింపు కార్డులు, విద్యకు సంబంధించిన సర్టిఫికేట్లు తగలబడిపోయాయి.

33.     The final updated NRC for Assam, published 31 August 2019, contained 31 million names out of 33 million population.

34.     It left out about 1.9 million applicants, who seem to be divided roughly equally between Bengali Hindus, Bengali Muslims and other Hindus from various parts of India

35.     In December 2022, audit by the Comptroller and Auditor General of India (CAG) revealed several irregularities in the National Register of Citizens in Assam, such as, exclusion of several indigenous people of Assam, irregularities in utilization of funds in the process and choosing software for the task. The project cost increased from Rs 288.18 crore in 2014 to Rs 1,602.66 crore by March 2022.

36.     The Government of Bangladesh has indicated that Bangladesh is prepared to take back any of its citizens residing in India if evidence is offered.[15]

37.      ఇప్పుడు కుకీలను వాళ్ల స్వగ్రామాలైన Churachandpur, Tamenglong, Senapati, Ukhrul లకు వెనక్కు తీసుకునివెళ్ళి శాశ్విత పునవాసం కల్పిస్తారా?

38.     అలా చేయకపోతే Churachandpur, Tamenglong, Senapati, Ukhrul ప్రాంతాలు కార్పొరేట్ల హస్తగతం అయిపోతాయి. ఇదేకదా వారి పథకం. అందుకే ప్రభుత్వం దానికి ఒప్పుకోదు.

39.     సహాయక కేంద్రాల దగ్గర పునరావాసం కల్పించలేము, వాళ్ల స్వగ్రామాల్లోను పునరావాసం కల్పించలేము.

40.     కార్పొరేట్లది ద్విశృంగవాదం. మనం వాళ్ల పద్మ వ్యూహంలో చిక్కుకున్నాం.   

No comments:

Post a Comment