*Prof. Kham Khan Suan Hausing భావప్రకటన స్వేచ్చను కాపాడడానికి ఒక రౌండ్ టేబుల్ సభ పెట్టాలి*.
Prof. Kham Khan Suan Hausing
90 రోజులు గడిచిపోయాయి. ఖాండవ దహనంలా కుకీలున్న ప్రాంతాల్ని ఖాళీ చేయించేయిస్తున్నారు.
వాళ్లను అక్కడి నుండి తరిమివేస్తున్నారు. Mass displacement. వాళ్లసలు భారతీయులే కాదంటున్నారు.
ప్రభుత్వం మెయితీలది, కేంద్ర ప్రభుత్వం మెయితీల పక్షం, పోలీసులు మౌన ప్రేక్షకులుగా
వుండిపోతే అదో ఇది అనుకోవచ్చు. పోలీసులూ దహన కాండలో పాల్గొంటున్నారు. అల్లరి మూకలకు
ఆయుధాలు అందిస్తున్నారు. బహిరంగా మూక అత్యాచారాలు జరుగుతున్నాయని ప్రపంచానికంతటికీ
తెలుసు. జాతిహననం చేసి ఖాళీ చేసిన ప్రాంతాన్ని ఎవరికి అప్పగిస్తారో కూడ మనకు తెలుసు. ఇన్ని తెలిసినా మనం ఏమీ చేయలేకపోతున్నాం. ఏం చేయాలో
తెలిస్తే ఎలా చేయాలో ఆలోచించే వాళ్ళం. అసలు ఏం చేయాలో కూడ మనకు తెలియడంలేదు. అదీ అసలు
విషాదం. అంచేత, మణిపూర్ పరిణామాల్ని గురించి విన్నప్పటి నుండి చాలా అసహనంగా, అశాంతిగా
వున్నది.
మణిపూర్ కు చెందిన Kham Khan Suan Hausing హైదరాబాద్ సెంట్రల్
యూనివర్శిటీలో ప్రొఫెసర్ గా వుంటున్నారనీ ఆయనిప్పుడు పొలిటికల్ సైన్సెస్ విభాగానికి
డీన్ గా పని చేస్తున్నారని మీడియాద్వార తెలిసింది. మిత్రుడు SA David ప్రొఫెసర్ హాసింగ్
కు పరిచయం చేశాడు. ఆయన కూడ సంతోషంగా తన కార్యాలయానికి రమ్మన్నారు. ఈశాన్య రాష్ట్రాల
రాజకీయ పరిణామాల మీద ప్రొఫెసర్ హాసింగ్ స్పెషలైజ్ చేశారు. ఇప్పటి మణిపూర్ అల్లర్లలో
ప్రభుత్వ వైఫల్యాలను విమర్శిస్తూ వ్యాసాలు రాశారు. అనేక టీవీ డిబేట్లలో పాల్గొన్నారు.
వైర్ వెబ్ పత్రిక నిర్వహించే కరణ్ థాపర్ షోలో ప్రొఫెసర్ హాసింగ్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు
వైరల్ గా మారాయి. మెయితీలు కుకీలకు మధ్యజరుగుతున్న జాతి సంఘర్షణలో మెయితీ సంఘాలకు ప్రభుత్వం
సహకరిస్తున్నదని ఆయన చేసిన ఆరోపణ వివాదంగా మారింది. మణిపూర్ రాజధాని ఇంఫాల్ లోని స్థానిక
న్యాయస్థానం హాసింగ్ మీద దాఖలయిన అభియోగాలను పరిగణన లోనికి తీసుకుంది. తుది తీర్పు
వచ్చే వరకు హాసింగ్ మీడియాతో మాట్లాడరాదని ఆంక్షలు పెట్టింది. ఇంఫా కోర్టు ఆర్డరు తన
భావప్రకటన స్వేచ్చకు భంగకరంగా వుందని ప్రొఫెసర్
హాసింగ్ సుప్రీం కోర్టులో సవాలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఆయన మీడియాతో,
బయట మణిపూర్ అంశం మీద మాట్లాడే పరిస్థితి లేదు.
నన్ను చాలా ఆప్యాయంగా
రిసీవ్ చేసుకున్నారు. తన కారులో యూనివర్శిటి మెయిన్ గేటు వరకు వచ్చి దింపారు. మా సంభాషణను
బయటికి చెప్పడం కుదరదు.
ప్రొఫెసర్ హాసింగ్
తో మాట్లాడిన తరువాత అర్ధం అయిందేమంటే ఇప్పటి
పరిస్థితుల్లో ఇంఫాల్ ఎయిర్ పోర్టు వరకు వెళ్ళవచ్చు. ఎయిర్ పోర్టు నుండి బయటపడడం చాలా
రిస్క్ తో కూడిన వ్యవహారం. కేంద్ర బలగాలు, నిఘావర్గాలు, మణిపూర్ పోలీసులు, అక్కడి అధికారుల
తనిఖీల నుండి బయటపడాలి. ఒకవేళ వాళ్లను దాటినా అల్లరిమూకలు వెంటపడతాయి. మీడియా అని తెలిసినా,
క్రైస్తవ, ముస్లిం ప్రతినిధులని తెలిసినా కొత్త సమస్యలు వస్తాయి.
మణిపూర్ లో కుకీలు
మారుమూల ప్రాంతాలయిన Churachandpur, Tamenglong, Senapati, Ukhrul జిల్లాలో వుంటారు. నాగాలాండ్, మిజోరమ్. అస్సాం రాష్ట్రాల్లోని
సరిహద్దు జిల్లాల్లోనూ వాళ్ళు వుంటారు. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం తరువాత పరిస్థితి
అదుపులో రావచ్చని ఒక ఆశ. ఆ తరువాత మణిపూర్
itinerary సిధ్ధం చేసుకుంటాను.
ఈలోగా మనం చేయవసిందేమంటే prof. Kham Khan Suan
Hausing భావప్రకటన స్వేచ్చను కాపాడడానికి ఒక రౌండ్ టేబుల్
సభ పెట్టాలి.
ఆగస్టు 2, 2023
No comments:
Post a Comment