Sunday, 13 April 2025

 *చిన్న ఆశ్చర్యం చిన్న ఆనందం*



 

కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల *డానీ తెలుగు టివి* కోసం నేను ఇటీవలి కాలంలో సమయాన్ని కేటాయించలేకపోయాను. చాలా నిర్లక్ష్యం చేశాను. దాదాపు ఒక ఏడాది కాలంగా కొత్త వీడియోలు అప్ లోడ్ చేయలేదు. కొత్త వీడియోలు అసలు ప్లాన్ కూడ చేయలేదు. ఏవో అడపాదడపా ఒకటి అర అప్ లోడ్ చేశాను. నా మీద రికార్డింగే లేదు.

నిన్న యధాలాపంగా Channel analytics చూశాను. గత 28 రోజుల్లో  31 వేల మంది చూశారు. 236 మంది కొత్త సబ్ స్క్రైబర్స్ చేరారు. 48 గంటల్లో 4 వేల 3 వందల మంది చూశారు. 5.47 డాలర్ల రెవెన్యూ రావడం అన్నింటికన్నా ఆశ్చర్యం కలిగించింది. ఇది చాలా చిన్న మొత్తం కావచ్చు. అయినా అదో ఆనందం.

 

గతంలో తీసిన ఒక పాత వీడియోను మళ్ళీ అప్ లోడ్ చేస్తే ఒక లక్ష 10 వేల మంది చూశారు.

https://www.youtube.com/watch?v=K74HwOf4fXM. ఇది ఇంకో ఆశ్చర్యం.

 

వర్తమాన సమాజంలో అనేక సమస్యలు తీవ్రం అవుతున్నాయి.  ఆదివాసులు, ముస్లింలను దాదాపు అంతరించిపోయే జాతులుగా మార్చేస్తున్నారు. మావోయిస్టుల శాంతిచర్చలు ఇప్పుడు ప్రాణప్రదమైన అంశం. ఈ నేపథ్యంలో *డానీ తెలుగు టీవీ*ని త్వరలో క్రియాశీలంగా మారుస్తాను.

 

నా దగ్గర సినిమా తీయదగ్గంత ఎక్యూప్ మెంట్ వుంది. యూట్యూబ్ నడపాలంటే చాలా విభాగాలు  పనిచేయాలి. కాన్సెప్ట్, రీసెర్చ్, స్క్రిప్ట్, ట్రావెల్, హోస్ట్/ప్రెజెంటర్,  గెస్ట్, కెమెరా విభాగం, వాయిస్ ఓవర్, డౌన్ లోడ్స్, గ్రాఫిక్స్, ఎడిటింగ్, అప్ లోడింగ్, ప్రమోషన్, SEO అలా డజను విభాగాలుంటాయి. అన్నీ ఒక్కడ్నే చేయడం సాధ్యం కావడంలేదు. ఇక ముందు కొందరి సహకారం తీసుకోవాలనుకుంటున్నాను. ఆసక్తి వున్నవారు సంప్రదించవచ్చు. మెసేజ్ ఇవ్వండి. నా మొబైల్ – 9010757776. 

No comments:

Post a Comment