Sunday 16 September 2018

చరిత్ర పునరావృతం ఎందుకు అవుతోందీ?

చరిత్ర పునరావృతం ఎందుకు అవుతోందీ?

తారీఖులు దస్తావేజులు చరిత్ర కాదని చాలామంది అంటుంటారు. నేనూ అంటుంటాను. ఒక్కోసారి తారీఖులూ ముఖ్యమే అనిపిస్తుంటుంది.

బీఆర్ అంబేడ్కర్ 1956 డిసెంబరు 6న చనిపోయారు. 1992 డిసెంబరు 6న బాబ్రీ మసీదును కూల్చేశారు..

ఎందుకిలా?

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం 1947 జులై 4న ఆరంభం అయింది. బంగారు తెలంగాణలో నేరెళ్ల నిరసన కారుల్ని 2017లో జులై 4 రాత్రి సిరిసిల్ల పోలీసు స్టేషన్ లో చిత్రహింసలు పెట్టారు.

ఎందుకిలా?

నిజాం సంస్థానాన్ని 1948 సెప్టెంబరు 17న భారత దేశంలో విలీనం చేశారు. మానవహక్కుల నేతల హౌస్ అరెస్టు 2018 సెప్టెంబరు 17తో ముగియడంతో వాళ్లను ఈరోజు పూనా తీసుకుపోతున్నారు.

ఎందుకిలా?

No comments:

Post a Comment