Sunday 7 March 2021

ముస్లింల సామాజిక ఎజెండ మతసామరస్యం

 ముస్లింల సామాజిక ఎజెండ మతసామరస్యం


    ముస్లిం సమాజం మీద తమకున్న అభిప్రాయాన్ని కవిత పులి తదితర దళిత ఆలోచనాపరులు చాలా స్పష్టంగా ప్రకటించారు. ‘భారత లౌకిక రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం’ ముస్లింల సమస్య మాత్రమే అన్నారు. బీఫ్ వివాదం కూడ ముస్లింల సమస్యే అన్నారు. ఆ రెండు వివాదాలకు తమ సామాజికవర్గం దూరంగా వుండాలని వారు ఒక స్పష్టమైన పిలుపిచ్చారు.

గుజరాత్ మారణకాండ నుండే ఒక సెక్షన్ లో ఈ ధోరణి ఆలోచనలున్నాయి. ముస్లింల సామాజిక వ్యవహార శైలిని విమర్శిస్తూ, ఎస్టీ, ఎస్సీ, బిసీలు గుజరాత్ మారణకాండలో పాల్గొనడాన్ని సమర్థిస్తూ ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెఫర్డ్ ద హిందూ దినపత్రికలో అప్పట్లోనే ఎడిట్ పేజి వ్యాసం రాశారు. వారు ఆ పిదప నరేంద్ర మోదీజీ ఉన్నత శిఖరాలకు చేరుకోవడాన్ని The Rise of Modi అనే వ్యాసం కూడ Outlook లో రాశారు.
భారత ముస్లిం సమాజానికి సంబంధించి మతసామరస్యం వాళ్ళ ప్రధాన కార్యక్రమం; ఎజెండ. ఆ సమాజంలో అంతర్గతంగా కొంత కుల పోకడలు కూడ వున్నప్పటికీ అది వాళ్ళకు ప్రధాన సమస్య మాత్రంకాదు.

    అభద్రలోకానికి చెందిన ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీల మధ్య సామాజిక సఖ్యతను కోరుకునేవారు ఇప్పుడు ఈ అంశం మీద విస్తారంగా చర్చ జరపాల్సిన సందర్భం ఇది.

No comments:

Post a Comment