Friday, 12 March 2021

The attitude of contemporary Marxists and Ambedkarites aid the state to celebrate

 Dear State! Celebrate!  

The attitude of contemporary Marxists and Ambedkarites aid the state to celebrate

మన కాలపు మార్క్సిస్టులు, అంబేడ్కరిస్టులు మారనంత వరకు

రాజ్యామా! సంబరపడు!

 

మార్క్సిస్టులు కులమతాల్నీ, అంబేడ్కరిస్టులు వర్గాన్నీ గుర్తించనంత వరకు ఈ సమాజం మారదు.

 

అంబేడ్కర్ సాంఘీక సమానత్వం గురించి మాత్రమే మాట్లాడాడన్నది మన కాలపుఅంబేడ్కరిస్టులకల్పన. అంబేడ్కర్ రాజకీయ సమానత్వం గురించీ, ఆర్థిక సమానత్వం గురించి కూడ గట్టిగా మాట్లాడాడు. ఆర్థిక సమానత్వాన్ని సాధించకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థ కూలిపోతుందన్నాడు.

 

వాస్తవాన్ని ఇప్పటి అంబేడ్కరిస్టులు తమ సౌలభ్యం కోసం దాచి పెట్టాలనుకుంటున్నారు, వీళ్ళు కులవ్యవస్థను మార్చలేరు. కులనిర్మూలన సమాజాన్ని నిర్మించలేరు. పెట్టుబడీదారీ వ్యవస్థ అఘాయిత్యాలను అడ్డుకోలేరు. ఇలాంటివాళ్ళు వర్తమాన సమాజానికి అక్కరలేదు.

 

మరోవైపు మర్క్సిస్టులూ అదే తప్పు చేస్తున్నారు. కులమతాలు గతితార్కిక భౌతికవాదం పరిధి లోనికి రావని కార్ల్ మార్క్స్ తమకు స్వయంగా చెప్పినట్టు వీళ్ళు ప్రపంచాన్ని నమ్మిస్తుంటారు. వర్గం సర్వాంతర్యామి. సమాజంలో సర్వత్రా సర్వకాలాల్లో వర్గం, వర్గ దోపిడి,  వర్గపోరాటం వుంటుందని కార్ల్ మార్క్స్ చెప్పాడు. కులం మతంలో వర్గం వుండదని మన కాలపు మార్క్సిస్టులు సెలవిస్తున్నారు. వీళ్ళు వర్గ రహిత సమాజాన్ని నిర్మించనూలేరు. కులమత దోపిడీ అణిచివేతల్ని  నిర్మూలించనూలేరు. ఇలాంటివాళ్ళు కూడ వర్తమాన సమాజానికి అక్కరలేదు.

No comments:

Post a Comment