ఆదివాసుల్లో వృధ్ధులకు
అనాయాస మరణం!
పవన్ స్వాధికార్ తో నేను, అజిత 2014 ఆరంభంలో ఓ వారం రోజులు ఎలక్షన్ సర్వే టూర్ జరిపాము. ఆ ప్రయాణంలో పవన్ దిగ్భ్రాంతి కలిగించే అనేక విషయాలు చెప్పాడు. అందులో
ఒకటి ఆదివాసులు పండు వృధ్దుల్ని చంపేసే (senicide,
geronticide,) విధానం. వృధ్ధాప్యం, అనారోగ్యంతో అవసాన దశలో వున్నవారికి
అనాయాస మరణాన్ని అందించడానికి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్
సరిహద్దుల్లోని ఆదివాసి తెగలు ఒక క్రతువును నిర్వహిస్తారట. వృధ్ధుల ఒంటికి కొబ్బరి
నూనె పట్టించి, తలంటు స్నానం చేయించి కొత్తబట్తలేసి ఒక వేడుక జరుపుతారట. ఆరోజు నుండి
వాళ్ళను మూడు రోజుల పాటు కేవలం కొబ్బరి నీళ్ళ మీదే వుంచుతారట. దానితో, వృధ్దుని శరీరంలో
పోటాషియం స్థాయి పెరిగి మూత్రపిండాల పనితీరు వికటించి చనిపోతారు. (hyperkalemia, Kidney failure, renal failure).
దాదాపు ఈ అంశం మీద 2018లో వచ్చిన తమిళ సినిమా బారం (భారం). అమేజాన్ ప్రైమ్ లొ వుంది. ఆసక్తిగలవారు
చూడవచ్చు.
No comments:
Post a Comment