ఇరాన్ సినిమా ‘గావ్’ (1969)
ప్రపంచ
సినిమాలో ఇరాన్ సినిమా ప్రత్యేకమైనది. ప్రపంచ మంతా కమ్మర్షియల్ సినిమాల వైపు
పరుగులు తీస్తుంటే ఇరాన్ సినిమా కళాత్మక విలువల్ని నమ్ముకుంది. భావోద్వేగాల్ని
గొప్పగా చిత్రించింది.
ఇరాన్
సినిమాను పర్షియన్ సినిమా అని కూడ అంటారు. ఇరాన్ సినిమాలన్నీ పర్షియన్ భాషలో
వుంటాయి.
ఇరాన్ సినిమాలు అంతర్జాతీయ ఖ్యాతిని
సంపాదించాయి. ఇరాన్ చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అభిమానులున్నారు.
ఇటాలియన్ నియో రియలిజం సినిమాలు 1960లలో ప్రపంచ
ప్రేక్షకుల్ని గొప్పగా ఆకర్షించాయి. ఇప్పుడు ఇరాన్ సినిమాలు అలాంటి స్థానాన్ని
సాధించాయి.
ఇరాన్ సినిమాకు అంతర్జాతీయ ఖ్యాతిని అర్జించి పెట్టిన
దర్శకుల్లో ఏడుగురు ముఖ్యులు. 1. అబ్బాస్ కియరొస్టామి 2. అస్గార్ ఫర్హాదీ 3. సమీర ముఖ్మల్బాఫ్ 4. దారియుష్ మెహర్ జూయి 5. మాజిద్ మాజిదీ 6. తహ్మిన్హే మిలాని 7. బాహమన్ ఘోబాదీ
`ఇరాన్ సినిమా చరిత్రలో న్యూవేవ్ కు బాటలు
వేసిన వాడు దారియుష్ మెహర్ జూయి. దారియుష్
1969లో తీసిన గావ్ (ఆవు) ఇరాన్ సినిమాను కొత్త పుంతలు తొక్కించింది.
మానవ సంబంధాలు సరుకుగా మారిపోయే క్రమాన్ని గావ్ సినిమా చూపిస్తుంది. కార్ల్ మార్క్స్ వివరించిన ఆర్థిక పరాయికరణ,
సామాజిక పరాయికరణను ఈ సినిమా అద్దంపడుతుంది.
ఓ పల్లెటూరి రైతు మష్త్ హసన్ కు హసన్ కు మనుషుల కృతక ప్రవర్తన నచ్చదు.
అతనికి అత్యంత ఆప్తురాలు అతని పెంపుడు ఆవు. ఒకసారి హసన్ పట్టణానికి వెళ్ళినపుడు
అతని సూడి ఆవు ఈనే సమయంలో చనిపోతుంది. ఆవు కనిపించకపోవడంతో
హసన్ పిచ్చివాడైపోతాడు. తనే ఆవుగా ప్రవర్తించడం మొదలెడతాడు.
గావ్ సినిమాలో ప్రొటోగోనిస్టుగా నటించిన ఎజ్జతుల్లా ఎన్తెజామీ ఇరాన్ లో
తొలితరం మహా నటుడు. జర్మనీ థియేటర్ అండ్
సినిమా స్కూల్ లో శిక్షణ పొందిన ఎన్తెజామీ తొలి సినిమా ‘గావ్’ తోనే అంతర్జాతీయ
గుర్తింపు పొందాడు. తన అద్భుత నటనకు చికాగో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో
‘సిల్వర్ హ్యూగో’ అవార్డు అందుకున్నాడు.
No comments:
Post a Comment