Thursday 24 November 2022

chronological age & biological age

 chronological age & biological age

చాలా మందికి తెలియని విషయం ఏమంటే 

వయస్సుకు రెండు ప్రమాణాలుంటాయి.


మొదటిది, chronological age. ఇది మన పుట్టిన తేదీ మీద ఆధారపడి వుంటుంది.

ఇది ఎవరికీ ఎప్పుడూ తగ్గదు.

 

రెండోది  biological age. ఇది మన శరీర కణాలు  ఏమేరకు శిధిలమయ్యాయి అనే దానిమీద ఆధారపడి వుంటుంది. 

కొంచెం ప్రయత్నిస్తే మన శరీర కణాలు శిధిలమయ్యే వేగాన్ని మనం తగ్గించవచ్చు.  


నేను పుట్టినప్పుడు మా తరం ఆయుష్షు 35 సంవత్సరాలు. 

నాతో పుట్టినవాళ్ళలో చాలామంది వారంటీ పీరియడ్ అయిన 35 సంవత్సరాలకన్నా ముందే చనిపోయారు.  

మిగిలినవాళ్ళు  35 తరువాత కూడ చాలా కాలం జీవించారు. 


ప్రమాదాలు, మహమ్మారుల బారినపడితే అది వేరే సంగతి. కానీ, మనసుకూ శరీరానికీ తగినంత వ్యాయామాన్ని ఇస్తుంటే biological ageను అదుపు చేయవచ్చు. ఇది మానవ ప్రయత్నం. నిర్వహణ సామర్ధ్యం అనవచ్చు. నేను ఈ సిధ్ధాంతాన్ని నమ్ముతాను ఆచరిస్తాను. 


హాంగ్ కాంగ్, జపాన్ తదితర దేశాల్లో మహిళల సగటు ఆయుష్షు 88 సంవత్సరాలు. జనాభా రీత్యా అంత చిన్న దేశాల్లో నూరేళ్ళు దాటినవాళ్ళు లక్షమందికి పైగా వున్నారు.   ప్రపంచం వాళ్ళ నుండి నిర్వహణ నైపుణ్యాన్ని నేర్చుకోవాలి. 


నేను నా వారంటీ పీరియడ్ కు రెట్టింపుకన్నా ఎక్కువ కాలం  కొనసాగుతున్నాను. సాపేక్షకంగా ఆరోగ్యంగానే వున్నాను. 

No comments:

Post a Comment