Saturday 12 November 2022

Is the marriage system weakening like the family system?

Is the marriage system weakening like  the family system?

కుటుంబవ్యవస్థలా వివాహవ్యవస్థ కూడ బలహీన పడుతున్నదా?

 

          కుటుంబవ్యవస్త్గ 20వ శతాబ్దం ఆరంభంలో వున్నట్టు 21వ శతాబ్దం ఆరంభంలో లేదు. మన కుటుంబ వ్యవస్థ ఎంతగా బద్దలయిపోయిందో నిన్నటి కోవిడ్ కాలం డిజిటల్ డిస్ప్లే వేసి చూపింది.

పూర్వం ఒక పేటంతా ఒకే కుటుంబం వుండేది. తరువాత ఉమ్మడి కుటుంబాలు వచ్చాయి. ఐదుగురు సభ్యులుండే చిన్న కుటుంబాలు వచ్చాయి. భార్యా భర్తలు మాత్రమే వుండే కణ కుటుంబాలు (Nuclear family) వచ్చాయి. పిల్లలు లేకుండ దంపతులు మాత్రమే వుండే లివింగ్ టుగెదర్ కుటుంబాలు వచ్చాయి. కుటుంబ వ్యవస్థలో మార్పులన్నీ ఒక్క శతాబ్దం లోపలే జరిగిపోయాయి. దంపతులు కూడ విడిపోవడమేనా? ఎవ్వరూ ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇటీవలి జనాభాలెఖ్ఖల ప్రకారం భారత దేశంలో ఏడున్నర కోట్ల మంది సింగిల్ విమెన్ వున్నారు. దాదాపు అంతే సంఖ్యలో సింగిల్ మెన్ వున్నారు. వీళ్ల మధ్య స్త్రీపురుష సంబంధాలు ఎలా వుంటున్నాయన్నది ఒక చర్చనీయాంశమే

మానవ సమూహాల చలనం అడవుల నుండి గ్రామాలకుఅక్కడి నుండి పట్టణాలకూఅక్కడి నుండి నగరాలకూఅక్కడి నుండి మహానగరాలకుఅక్కడి నుండి ప్రపంచ మహానగరాలకు సాగుతున్నట్టు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోందిఇది కేవలం క్షితిజ సమాంతర చలనం (horizontal mobility)  మాత్రమేకాదు;   నిలువు చలనం (vertical mobility) కూడజీవితంలో వుధృతంగా సాగుతున్న చలనశీలత ఇప్పుడు స్త్రీపురుష సంబంధాల్ని ఎలా ప్రభావితం చేస్తున్నదన్నది ఎవరికయినా రావలసిన సందేహం

జీవన విధానంలో వస్తున్న పెను మార్పులు ‘దాంపత్యాన్ని’ ఎలా ప్రభావితం చేస్తున్నాయో గమనించడం చాలా అవసరంఅమెరికాలో పెళ్ళి చేసుకునేవారి సంఖ్య క్రమంగా తగ్గిపోతున్నది. 2021 సెన్సెస్ ప్రకారం 33 కోట్ల మందిగల అమెరిక జనాభాలో  వివాహ వయస్సుగల పురుషులు 12.9 కోట్ల మందిస్త్రీలు 13.6 కోట్ల మందివీరిలో ఎన్నడూ పెళ్ళి చేసుకోని పురుషులు 4.47 కోట్లమందిస్త్రీలు 4.18 కోటల మందిఅంటే వివాహ వయస్సు గలవారిలో 33.53 శాతం మంది అస్సలు పెళ్ళి చేసుకోలేదు.  ప్రతి ముగ్గురురిలో ఒకరు పెళ్ళిని నిరాకరిస్తున్నారువీరుగాకవిడాకులు పొందినవాళ్ళు మరో రెండున్నర కోట్ల మంది వున్నారుభారతదేశ ‘దాంపత్య’ గణాంకాలు కూడ దీనికి భిన్నంగా ఏమీ వుండవు

గత శతాబ్దంలో అయితే,  అమెరికాలో జరిగిన పరిణామాలు రెండు మూడు దశాబ్దాల తరువాత ఇండియాలో జరిగేవిఇప్పుడు అంత సమయం పట్టడంలేదుఅమెరికాలో నిన్న జరిగింది ఈరోజు మనదేశంలో  జరిగిపోతున్నదిఅంచేత వీటిని అమెరిక ప్రత్యేక అంశంగా చూడకూడదు

జంతు ప్రపంచంలో జీవుల మధ్య సంబంధాల్లో పెద్దగా వైవిధ్యం వుండదుకానీమానవ ప్రపంచంలో మనుషుల మధ్య సంబంధాలు విపరీతమైన వైవిధ్యంతో వుంటాయిజంతు ప్రపంచంలో గుంపు అనే మాట మానవ ప్రపంచంలో సమాజంగా మారిపోతుంది సమాజం అత్యంత చలనశీలమైనదిజటిలమైనదిఅంతులేని వైవిధ్య పూరితమైనది

 

20వ శతాబ్దం ఆరంభంలో వితంతు పునర్వివాహం ఒక సంఘసంస్కరణ. 21వ శతాబ్దంలో పునిస్త్రీ పునర్వివాహం కొత్త సంఘ సంస్కరణ.

Marital status of the United States population in 2021, by sex

https://www.statista.com/statistics/242030/marital-status-of-the-us-population-by-sex/

 


No comments:

Post a Comment