Fun Food Fantastic and Khadeer’s Writers Meet
సాహిత్య సభలకు
జనం రావడంలేదు; కొత్త తరంలో కథలు చదివే ఉత్సాహం తగ్గిపోతున్నదని భావిస్తున్న ఈ రోజుల్లో
ఖదీర్ బాబు రైటర్స్ మీట్ కు ప్రతియేటా క్రేజ్ పెరుగుతోంది. కొత్తతరాలేకాక, నిన్నటి
తరాలు, మొన్నటి తరాలు సహితం రైటర్స్ మీట్ ఆహ్వానం కోసం ఆసక్తిగా ఎదురుచూసే డిమాండ్
ను ఖదీర్ బాబు సృష్టించగలిగాడు. అందుకు తనతోపాటు కోర్ టీమ్ ను నడుపుతున్న అక్కిరాజు భట్టిప్రోలు,
ఝాన్సీ పపుదేశీ, కరుణకుమార్ తదితరుల్ని అభినందించి తీరాలి.
ఖదీర్
బాబూ ఇప్పటి వరకు మొత్తం ఎన్ని కథలు రాశాడో కఛ్ఛితంగా నాకు నెంబర్ తెలీదు. కానీ,
తను ప్రతి సంవత్సరం ‘రైటర్స్ మీట్’ పరంపరలో ఒక కొత్త కథ రాస్తుంటాడు. అది
చాలా ఆసక్తిగా వుంటుంది. అనుక్షణం ఒక సస్పెన్స్ వుంటుంది. స్వీట్ సర్ ప్రైజెస్ వుంటాయి.
హ్యాప్పి ఎండింగ్ వుంటుంది.
ఖదీర్ ఓ సాయంత్రం
హఠాత్తుగా ఫోన్ చేసి ఫలానా రోజు ఫలానా చోటికి ఇన్ని గంటలకు రావాలి అంటాడు. గ్రూపు ఫొటోకు
ఓ డ్రెస్ కోడ్ కూడ చెపుతాడు. అంతే. ఎంతమంది వస్తున్నారో ఎవరెవరు వస్తున్నారో కనీసం
ఎక్కడికి వెళుతున్నామో కూడ చెప్పడు. స్టార్టింగ్ పాయింటుకు చేరుకున్నాకే ఆ వివరాలు
తెలుస్తాయి. సీనియర్స్, అతి సీనియర్స్, జూనియర్స్, అతి జూనియర్స్ తో ఆ కూర్పు వుంటుంది.
అంతా కలిసి ఓ ఎక్స్ కర్షన్ excursionకు వెళుతున్నట్టు వుంటుంది.
Programme
paper, cue sheet విడుదల చేయరు. ఏ సమయంలో ఎవరెవరు
ఏ టాపిక్ మీద మాట్లాడుతారో శ్రోతలకు ఎలాగూ తెలీదు; వక్తలకూ తెలీదు. ప్రతీదీ surprise.
హఠాత్తుగా “ఇప్పుడు డానీగారు ‘సాహిత్య లక్షణం-లక్ష్యం’ అనే అంశం మీద 15 నుండి 20 నిముషాల
లోపు మాట్లాడుతారు. కొర్రపాటి సమన్వయకర్తగా
వుంటాడు అంటాడు. ఇలాంటి అరగంట, గంట కార్యక్రమాలు రోజుకు అరడజను వుంటాయి. ఇవి కాక ఓ
పుస్తకావిష్కరణ, ఓ ఇంగ్లీషు సినిమా ప్రివ్యూ ఈసారి యాడేడ్ వాల్యూ. కరుణ కుమార్, ఎస్
ఏండి ఇనాయతుల్లా ప్రహసనాలు గొప్ప వినోదాన్ని పంచాయి. తాళ్ళపల్లి యాకమ్మ సాహితీ ప్రయాణం గురించి వినే
అపూర్వ అవకాశం నాకు ఈ మీట్ లో దొరికింది.
వెన్యూ సెలక్షన్
లో రైటర్స్ మీట్ కోర్ టీమ్ కు గొప్ప ఈస్తటిక్ సెన్స్ వుంది. ఒకసారి నదీ తీరాన్న, ఇంకోసారి సముద్రతీరాన్న,
ఓసారి చెరువు గట్టున, మరోసారి ఓ కోటలో … ఇలా వుంటాయి. షామీర్ పేట సమీపాన రఘు మాందాటి సృష్టించిన ల్యాండ్ ఆఫ్ లవ్ (LOL) అనే ఓ రిసార్ట్స్ లో ఈసారి ‘రైటర్స్ మీట్’ జరిగింది. రూపం కళాత్మకం సారం సాహిత్యం. ఎంత గొప్ప
కాంబినేషన్.
పాతతరం నుండి
కొత్తతరం అనుభవాన్ని నేర్చుకుంటుంది. కొత్తతరం
ఆసక్తులు అభిలాషల్ని పాతతరం తెలుసుకుంటుంది. నాలాంటి వాళ్ళు అప్ డేట్ కావడానికి ఇలాంటి
మీట్స్ చాలా అవసరం. కొత్తవాళ్ళు స్నేహితులవుతారు, పాతవాళ్ళు ఇంకా దగ్గరవుతారు. రాజారామమోహన్ రావు, వాడ్రేవు చినవీరభద్రుడు,
అయోధ్య రెడ్డి, వెంకట కృష్ణ వంటి సీనియర్లతో, మారుతీ పౌరోహితం, అనిల్ డానీ వంటి కొత్తతరంతో
ఓ చోట రెండు రోజులు వుండడం గొప్ప అనుభవం. యువతరం ఏం వినాలనుకుంటుందో తెలియకపోతే తాము
ఏం చెప్పాలో పెద్దతరానికి అర్ధం కాదు. ఆ అవకాశం
నాకు మరోసారి దొరికింది.
‘రైటర్స్ మీట్’
లో ఇంకో ఆకర్షణ ఫుడ్. టీలు, స్నాక్స్, మీల్స్ అలా క్రమం తప్పకుండ వస్తూనే వుంటాయి.
2013లో కృష్ణానదీ
తీరాన చిలుమూరు గొడ్లపాక సమావేశంతో నాకు రైటర్స్
మీట్ తో అనుబంధం ఏర్పడింది. అప్పటి నుండి జరిగిన పది మీట్స్ లో నాకు ఐదుసార్లు ఆహ్వానం
అందింది. ప్రతిసారీ నా లోపాలను తెలుసుకోవడానికి ఇవి తోడ్పడ్డాయి. ఖదీర్ అండ్ టీమ్ కు
ధన్యవాదాలు.
No comments:
Post a Comment