Sunday, 6 November 2022

IT Revolution and the decline of Communist Parties

కమ్యూనిస్టు పార్టీల కొంప కూల్చిన  కంప్యూటర్లు! 


ఐటీ విప్లవాన్ని భారత కమ్యూనిస్టు పార్టీలు

అర్ధం చేసుకోలేక పోయాయా?


ప్రపంచవ్యాప్తంగా అణగారిన సమూహాలన్నీ సూత్రప్రాయంగా సమానత్వాన్ని  కోరుకుంటాయి. అంచేత కమ్యూనిజం అంటే నాలాంటి వాళ్ళకు  చాలా ఇష్టం. దురదృష్టావశాత్తు నాటి నుండి నేటి వరకు భారత కమ్యూనిస్టు పార్టీలకు నాయకత్వం వహించినవారెవ్వరికీ  సోషలిస్టు సమాజాన్ని నిర్మించేంతటి శక్తిసామర్ధ్యాలు లేవు. 


భారత ప్రజలు చాలాసార్లు కమ్యూనిస్టు పార్టీల్ని గట్టిగా నమ్మేరు. ప్రజలు ఆశించిన మేరకు కమ్యూనిస్టు పార్టీలు నిలబడలేక పోయాయి. 


భారత కమ్యూనిస్టు పార్టీలు సాయుధపోరాట పంథాను కొనసాగించలేకపోయాయి; పార్లమెంటరీ ప్రజాస్వామ్య పంథాలో  విజయాన్నీ సాధించలేకపోయాయి. వుభయ భ్రష్టత్వం అంటే ఇదే. 

 

    భారత కమ్యూనిస్టు పార్టి (సిపిఐ) ఒక లెఖ్ఖ ప్రకారం 1925 డిసెంబరు 26న మాల్యపురం సింగారవేలు అధ్యక్షతన జరిగిన మహాసభలో కాన్పూర్ లో పుట్టింది. ఇంకో లెఖ్ఖ ప్రకారం 1920 అక్టోబరు 17న తాష్కెంట్ లో భారత కమ్యూనిస్టు పార్టి పుట్టింది. 1920లో పుట్టిన కమ్యూనిస్టు పార్టీకి మొహమ్మద్ షఫీక్ తొలి కార్యదర్శి. 1925లో పుట్టిన కమ్యూనిస్టు పార్టీకి ఎస్ వి ఘాటే తొలి ప్రధాన కార్యదర్శి.

 

భారత కమ్యూనిస్టు ఉద్యమం  భారత జాతీయ కాంగ్రెస్ తో పోటీపడతగ్గ అనేక మంది నాయకులని సృష్టించింది. చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, ఎస్ ఏ డాంగే, షౌకత్ ఉస్మానీ, ముజఫర్ అహ్మద్, మాకినేని బసవపున్నయ్య, చారుమజుందార్, కొండపల్లి సీతారామయ్య, కేజి సత్యమూర్తి,  తరిమెల నాగిరెడ్డి, ఇఎంఎస్ నంబూద్రిపాద్ …. చెప్పుకుంటూపోతే ఈ జాబితా చాలా పెద్దది అవుతుంది.

 

రాజకీయ రంగంకన్నా కళా సాహిత్య సినిమా రంగాలలో కమ్యూనిస్టుల ప్రభావం చాలా కాలం కొనసాగింది. అభ్యుదయ రచయితల సంఘం కమ్యూనిస్టు పార్టీల  అనుబంధ విభాగమే. ఆలోచనారంగంలో, చరిత్ర పరిశోధనల్లో ఎర్రజెండాదే అగ్రపీఠం.  సామాజిక రంగంలో ఆధునిక సంస్కరణల వెనుక కమ్యూనిస్టుల ప్రోత్సాహమే ఉంది. భారత రాజ్యాంగం తొలి ప్రతిలో సాంకేతికంగా  ‘సోషలిస్టు’ అనే పదం లేకపోవచ్చుగానీ రాజ్యాంగ సారం రాజకీయ, అర్ధిక, సామాజిక సమనత్వమే. రాజ్యాంగ సభలో చేసిన చివరి ప్రసంగంలో స్వయంగా అంబేడ్కరే ఈ వివరణ ఇచ్చాడు.

 

అనేకమంది కమ్యూనిస్టు నాయకులు స్వయంగా రంగంలోనికి దిగి వీరోచిత పోరాటాలు చేశారు. కొందరు కుటుంబాలను వదిలి పోరాటమార్గం పట్టారు. అజ్ఞాత జీవితాలను గడిపారు. నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు. జైళ్ళలో వున్నారు. గొప్ప ఆస్తుల్ని పోగొట్టుకున్నారు. మరికొందరు ప్రాణ త్యాగాలకు సహితం సిధ్ధపడ్డారు.

 

భారత కమ్యూనిస్టులకు ఒక ప్రధాన లోపం వుంది. వాళ్ళు స్వయం ప్రకాశకులుకాదు. సహజ మేధావులు కాదు. భారత సమాజంలోని విస్తారమైన వైవిధ్యానికి అనువైన స్వంత విప్లవ పంథాను రూపొందించడం వారివల్ల కాలేదు.

 

 

 

 

 

 

 

 

 

సరైన విప్లవపంథా లేకపోవడంతో వాళ్ళ పోరాటాలు, వాళ్ళ త్యాగాలు చెప్పుకోదగిన ఫలితాలను సాధించలేకపోయాయి.

 

 

 

 

 

List of Great leaders of Indian Communist parties

 

 

 

 

 

 

 

విషాదకరంగా మన  దేశంలో ఏ కమ్యూనిస్టు పార్టి కూడ మన సమాజపు వాస్తవికతకు అనుగుణమైన విప్లవపంథాను ఇప్పటి వరకు రూపొందించుకో లేకపోయింది. Revolution made easy అన్నట్టు కొన్ని భారత కమ్యూనిస్టు పార్టీలు రష్యా మార్గాన్ని నమ్ముకున్నాయి. మరికొన్ని పార్టీలు  చైనా మార్గాన్ని కొనసాగించాయి. జాతియోద్యమ కాలంలో Communist Party of Great Britain (CPGB) భారత కమ్యూనిస్టు పార్టీని నడిపించింది.

 

భారత కమ్యూనిస్టు పార్టీలు ‘ఇతరుల’ మీద ఆధారపడడానికి పది  కారణాలున్నాయి.

 

మొదటిది; భారత కమ్యూనిస్టు పార్టీలకు నాయకత్వం వహించినవారు లెనిన్, మావో, హోచిమిన్ ల వంటి  సృజనాత్మక మేధావులు కారు.  

 

రెండవది; జాతీయ కాంగ్రెస్ లో గాంధీ, నెహ్రూల్లా ఏ కమ్యూనిస్టు నాయకుడు కూడ జాతీయ నాయకుని స్థాయికి ఎదగలేదు. లెనిన్, మావో, హోచిమిన్ లు తమ దేశాల్లో జాతీయ నాయకులు.

 

మూడోది;  భారత సమాజపు సంక్లీష్టతను విశ్లేషించే స్తోమత  వాళ్ళకు లేకపోయింది.  మన సమాజం కులమతతెగలతో ముక్కలైవుంది. వీటన్నింటినీ కలిపే  బైండింగ్ వైర్ ను కనిపెట్టాల్సిన సమయంలో వీటిని విశ్లేషించడానికి కూడ కమ్యూనిస్టు పార్టీలు భయపడి వుండవచ్చు.

 

నాలుగోది; ఉత్పత్తి సంబంధాల గురించి మాట్లాడినంతగా, ఉత్పత్తి శక్తుల గురించి అధ్యయనం చేయలేదు.

 

ఐదవది; అంతర్జాతీయ నాయకుల్ని గౌరవిస్తే సరిపోయేదానికి ఏకంగా వాళ్ళ మీద పూర్తిగా ఆధారపడిపోయారు. లెనిన్ మార్గం, స్టాలిన్ మార్గం, మావో మార్గం అంటూ చర్చలు జరిపారు. “చైనా ఛైర్మన్ మన ఛైర్మన్” అనడం దీనికి పరాకాష్ట. 

 

 

 

కమ్యూనిస్టు పార్టీల కొంప ముంచిన ఐటీ విప్లవం

డానీ

IT Revolution and the decline of Communist Parties

Part - 4

 

ఆరవది; సాయుధపోరాటం, పార్లమెంట్రీ ప్రజాస్వామ్యంలలో ఏ పంథాను అనుసరించాలనే విషయంలోనూ ఎవరికీ ఒక స్పష్టత లేదు.  సాయుధపోరాట మార్గాన్ని ఎంచుకున్నవారు అక్కడా ప్రగతిని సాధించలేదు; పార్లమెంటు ప్రజాస్వామ్యం మార్గాన్ని ఎంచుకున్నవారూ ఆ రంగంలో ఒక ప్రత్యామ్నాయంగా మారలేకపోయారు. వీరికన్నా బూర్జువా పార్టీలే సంక్షేమ పథకాలతోనో, మతచిచ్చుపెట్టో, కులరాజకీయాలను నడిపో  ఓటర్లను గొప్పగా ఆకర్షిస్తున్నాయి.  

 

ఏడవది; కమ్యూనిస్టు పార్టీలు ట్రేడ్ యూనియన్లలోనో, పాక్షిక పోరాటాల్లోనో కూరుకుపోయాయి. విశాల ప్రజానీకం విముక్తి గురించి ఆలోచించే విశాల దృక్పథం వాటికి లేకుండాపోయింది.

 

ఎనిమిదవది; కమ్యూనిస్టు పార్టీల నాయకత్వం యజమాని కులాలతో నిండిపోయింది. కమ్యూనిస్టు పార్టీల విధానాలను యజమాని కులాల ఉమ్మడి భావజాలం నిర్ణయించడం మొదలెట్టెంది.

 

తొమ్మిదవది; కనీసం ప్రకటిత కార్యక్రమాన్ని అయినా ముందుకు తీసుకునిపోయే సామర్ధ్యం కమ్యూనిస్టు పార్టీల నాయకత్వాలకు లేదు. ప్రస్తుతం సిపిఐ మొదలు సిపిఐ ఎంఎల్ మావోయిస్టు పార్టీ వరకు సమస్త భారత కమ్యూనిస్టు పార్టీలు తమ ప్రకటిత కార్యక్రమాలకు కట్టుబడిలేవు.

 

పదవది; మనదేశంలో గ్రామీణ జనాభా 65 శాతం; పట్టణ జనాభా 35 శాతం. జిడిపిలో  వ్యవసాయరంగం వాటా 18 శాతం; వ్యవసాయేతర రంగం వాటా 82 శాతం. తమ విప్లవ పంథాను రూపొందించడానికి జిడిపి, జనాభాల్లో దేన్ని ప్రాధమికంగా భావించాలనేది కమ్యూనిస్టు పార్టీల్లో ఇప్పటికీ ఒక పెద్ద సంధిగ్ధం. జనాభాలో అత్యధికులు గ్రామాల్లోనే నివశిస్తున్నారు గనుక వ్యవసాయిక విప్లవం జరగాలనేది ఒక వాదన,  జిడిపిలో  పారిశ్రామిక రంగం వాటా చాలా పెద్దది కనుక నేరుగా సోషలిస్టు విప్లవం జరగాలనేది ఇంకో వాదన. దాదాపు నూరేళ్ళు గడుస్తున్నా కమ్యూనిస్టు పార్టీల భారత పంథా మాత్రం ఇప్పటికీ స్పష్టంగా తేలలేదు. మూల సమాజం (source society) అర్ధంకానప్పుడు లక్ష్య సమాజాన్ని (target society) ఎన్నటికీ సాధించలేం.

 

 

 

 

 

 

 

 

కమ్యూనిస్టు పార్టీల కొంప ముంచిన ఐటీ విప్లవం

డానీ

IT Revolution and the decline of Communist Parties

Part - 5

1947 ఆగస్టులో ప్రత్యక్ష వలస పాలన అంతమయింది. ఆరు నెలల తరువాత ఇది “బూటకపు స్వాతంత్ర్యం” అని కమ్యూనిస్టు పార్టి భావించింది.  1948 ఫిబ్రవరి నాటి కలకత్తా మహాసభల్లో సాయుధ పోరాట పంథాను ప్రకటించింది. కొత్త పంథాను స్వీకరించిన ఏడు నెలల్లోనే ఆ ఏడాది సెప్టెంబరు మధ్యలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని విరమించింది. సాయుధ పోరాట పంథాను ప్రకటించిన బిటి రణదివేను 1950లో ‘వామపక్ష దుస్సాహసవాది’గా  తిట్టిపోసి ఏకంగా పార్టీ నుండే బహిష్కరించి పార్లమెంటరీ  పంథాను చేపట్టింది. ఆ సమయంలో ఆంధ్రా కమిటికి చెందిన కొందరు నాయకులు సమర్పించిన  ‘వ్యవసాయ (ఆంధ్రా) థీసిస్’ మహత్తరమైనదని  కొందరు కమ్యూనిస్టు అభిమానులు ఇప్పటికీ నమ్ముతుంటారు. ఆంధ్రా థీసిస్ ను తరువాతి కాలంలో కొండపల్లి సీతారామయ్య ‘వ్యవసాయిక విప్లవం’గా  అభివృధ్ధి చేశారు. సామ్యవాద విప్లవానికి భారత కమ్యూనిస్టు పార్టీలు అందించిన అతిపెద్ద కాంట్రిబ్యూషన్ గా ఈ పుస్తకానికి పేరుంది.

 

కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలోని పీపుల్స్ వార్  వ్యవసాయిక విప్లవాన్ని విజయవంతం చేయడానికి (పట్టణాల నుండి) “గ్రామాలకు తరలండి” అనే పిలుపు ఇచ్చింది. గ్రామాల్లో మాల-మాదిగ-బిసి వాడల్లోనే బస చేయాలనీ, వాళ్ళు పెట్టే భోజనమే తినాలనీ ఈ  కార్యక్రమంలో ఒక ప్రధాన నియమం వుంది. (యజమాని కులాలవాళ్ళు) శ్రామిక కులాల జీవితాల్లో మమేకంకండి అనే పరోక్ష ఆదేశమూ వుంది. వాళ్ళ విముక్తే వ్యవసాయరంగ విముక్తి అనే అర్ధంవచ్చే వివరణ వుంది. ఇదొక మహత్తర ముందంజ. అయితే, కుల సమస్య మీద సరిగ్గా అక్కడికి వచ్చి కొండపల్లి ఆగిపోయారు. మిగిలినవారు అక్కడికి కూడ రాలేదు.

 

కులాల మధ్యనేగాక కులాల లోపలా, మతాల మధ్యనేగాక మతలా లోపలా, తెగల మధ్యనేగాక తెగల లోపలా, లింగాల మధ్యనేగాక లింగాల లోపలా, ప్రాంతాల మధ్యనేగాక ప్రాంతాల లోపలా  వర్గపోరు వుంటుంది. వర్గం సర్వాంతర్యామి.  ఈ ఎరుక కమ్యూనిస్టు పార్టీలకు లేకపోయింది.

 

భూమి మీద పనిముట్లను తయారు చేసే ఏకైక జీవి మనిషి. ప్రకృతిలోని ఇతర జీవులకు మనుషులకు తేడా ఇదే. ఏ చారిత్రక దశలో అయినా సరే  అప్పటికి అందుబాటులోనికి వచ్చిన  యంత్రాల ఉత్పత్తి సామర్ధ్యం ఆ సమాజ ఆలోచనా స్థాయిని నిర్ణయిస్తూ వుంటుంది. ఆవిరి యంత్రాల రాకతో ఇంగ్లండ్ లో పారిశ్రామిక విప్లవం సాగకపోతే కార్ల్ మార్క్స్ మెదడులో కమ్యూనిస్టు ప్రణాళిక పుట్టేదికాదు.

 

 

 

 

 

 

 

కమ్యూనిస్టు పార్టీల కొంప ముంచిన ఐటీ విప్లవం

డానీ

IT Revolution and the decline of Communist Parties

Part - 6

యంత్రాల అభివృధ్ధిలో మూడవతరంగా వచ్చిన ఎలక్ట్రానిక్ యంత్రాలు  1980వ దశకంలో ప్రపంచ పారిశ్రామిక రంగాన్ని పునర్ నిర్వచించాయి. ఎలక్ట్రానిక్ యంత్రాలు చాలా సంక్లిష్టమైనవి; మార్మికమైనవి. వీటి పనితీరును అర్ధం చేసుకోవడం బాహ్యదహన, అంతర్దహన యంత్రాలను అర్ధం చేసుకున్నంత సులువుకాదు.  ప్రపంచ కుబేరులయిన రాక్ ఫెల్లర్, హెన్రీ  ఫోర్డ్  వంటి  చమురు, ఆటోమోబైల్ దిగ్గజాలను ఐటీ రంగ దిగ్గజాలయిన బిల్ గేట్స్ వగయిరాలు తోసిపుచ్చారు. మనదేశంలో టాటా - బిర్లాల స్థానాన్ని అంబానీ- ఆదానీలు ఆక్రమించారు.

 

పారిశ్రామిక వ్యవసాయిక  సమాజాల్లో సామ్యవాద విప్లవ సాధనకు లెనిన్ మీదో మావో మీదో ఆధారపడి బతికేసిన భారత కమ్యూనిస్టు పార్టీలకు ఎలక్ట్రానిక్స్ రంగాన్ని ఎదుర్కోవడానికి అంతర్జాతీయ మార్గదర్శి దొరకలేదు.  స్వంతంగా వ్యూహరచన చేసే సామర్ధ్యమూ వీటికి లేదు.

 

కొత్త సాంకేతిక పరిజ్ఞానం మీద ఆధిపత్యాన్ని సాధించండని శ్రామికులకు పిలుపు ఇవ్వాల్సిన కమ్యూనిస్టు పార్టీలు ఐటీ, ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల రాకతో ఇప్పటి ఉపాధులన్నింటినీ కార్మికులు కోల్పోతారు అని భయపడ్డాయి. ఇది ట్రేడ్ యూనియనిజం నుండి పుట్టుకొచ్చిన భయం. శ్రామికులు లేకుండ యజమానులు వుండరనే చిన్న లాజిక్ ను వాళ్ళు చిత్రంగా మిస్ అయ్యారు. కొత్త రంగాల్లో ఇప్పటికన్నా వున్నత స్థాయిలో ఇప్పటికన్నా ఎక్కువ సంఖ్యలో కొత్త ఉపాధులు పుట్టుకువస్తాయని వాళ్ళకు తోచలేదు. ఐటీ విప్లవాన్ని అడ్డుకోవడానికి కంప్యూటర్లు, టీవీలకు వ్యతిరేకంగా అమాయికపు వీధి పోరాటాలు, గేటు ధర్ణాలు  చేశారు. దానితో కొత్త తరాలకు కమ్యూనిస్టు పార్టీల డొల్లతనం స్పష్టంగా అర్ధం అయిపోయింది. వాళ్లకు కమ్యూనిస్టు పార్టీలు కొత్త సమాజాన్ని నిర్మించే శక్తులుగాగాక పాత వ్యవస్థల్ని కాపాడే సంస్థలుగా కనిపించాయి.

 

గ్లోబలైజేషన్ కాలం కనుక అంతర్జాతీయ పరిణామాలు సహితం ఈ తరహాలోనే సాగాయి. ఐటి విప్లవం  ఇచ్చిన ఉత్సాహాం ఒకవైపు కమ్యూనిస్టు పార్టీల బలహీనత మరోవైపు కలసి రావడంతో ప్రపంచ ఆర్ధిక శక్తులు రెచ్చిపోయాయి. ఐటి విప్లవం విసిరిన సవాలును ఎదుర్కోలేక కనీసం అర్ధం చేసుకోలేక ప్రపంచ వ్యాప్తంగా మహామహా కమ్యూనిస్టు పార్టీలే చతికిల పడ్డాయి. తూర్పుయూరప్ పతనం, రష్యా విఛ్ఛిన్నం జరిగింది ఈ కాలంలోనే. దానితో కమ్యూనిస్టు పార్టీల ఉజ్వల దశ ముగిసింది. గాట్ (GATT) ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)గా మారింది.

 

మనదేశంలో దేశ విభజన తరువాత సామాజిక సాంస్కృతిక రంగాల్లో  కమ్యూనిస్టు పార్టీలు ప్రభావశీలంగా వున్నంత కాలం రాజకీయాల్లో మతతత్త్వం నిద్రావస్తలో వుంది. సామాజికరంగంలో కమ్యూనిజం ప్రభావం బలంగావున్న ఆంధ్రప్రదేశ్ లో బిజెపి కాలుమోపలేని స్థితిని ఇప్పటికీ మనం చూడవచ్చు.

 

కమ్యూనిస్టు పార్టీల కొంప ముంచిన ఐటీ విప్లవం

డానీ

IT Revolution and the decline of Communist Parties

Part - 7

 

భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీలు బలహీనపడగానే దేశ మెగా కార్పొరేట్ సంస్థలు మతతత్త్వాన్ని కౌగలించుకుని ఫాసిస్టు దారిలో  సంపదను పెంచుకునేందుకు సిధ్ధం అయ్యాయి. ఈ క్రమం పంజాబ్ లో మొదలయింది. 1984 ఢిల్లీలో శిక్కుల మీద ఊచకోతతో తొలి హెచ్చరిక వెలువడింది.

 

ఆంధ్రప్రదేశ్ మీద కూడ ఈ ప్రభావం పడింది. 1985లో కారంచేడులో మాదిగల క్రూరమైన మీద దాడి జరిగింది. అప్పటి వరకు ఎంఎల్ పార్టీల్లో పెద్దన్నగావున్న పీపుల్స్ వార్ లో ముసలం పుట్టింది. కొండపల్లి సీతారామయ్య పార్టీలో ఏకఛత్రాధిపత్యం కోసం  కేజి సత్యమూర్తిని బహిష్కరించారు. 1989లో బిజెపి అధ్యక్షులు అద్వానీ శ్రీరామ్ జన్మభూమి యాత్ర జరిపారు. దేశంలో కంప్యూటర్ విప్లవాన్ని తెచ్చిన రాజీవ్ గాంధి హత్యకు గురయ్యారు. 1991లో దేశంలో ఆర్ధిక సంస్కరణలు వచ్చాయి. 1992లో బాబ్రీ మసీదును కూల్చివేశారు.  దాదాపు ఆ సమయంలోనే కొండపల్లి సీతారామయ్యను ఆయన స్థాపించిన పీపుల్స్ వార్ బహిష్కరించింది. ఇవన్నీ పైకి విడివిడి సంఘటనలుగా కనిపించవచ్చు. కానీ, ఇవి ఒకదానితో మరొకటి సంబంధమున్న సంఘటనలు.

 

కమ్యూనిస్టు పార్టి పుట్టి 60-70 ఏళ్ళు అవుతున్నా అప్పటి వరకు తమను నమ్ముకున్న ఎస్టి ఎస్సీబిసి మైనారిటీలు తదితర ఉనికి సమూహాలకూ కమ్యూనిస్టు పార్టీలు గట్టిగా ఒక నమ్మకాన్ని కలిగించలేకపోయాయి. తమ పంథానే సరిగ్గా ముందుకు సాగించలేనివాళ్ళు ఇతరులకు ఏం నమ్మకాన్ని కలిగిస్తారూ?  ఫలితంగా, ఉనికివాద సమూహాలు కమ్యూనిస్టు పార్టీలను వదిలి బయటికి పోయాయి. దానితో కమ్యూనిస్టు పార్టీలు మరింత బలహీనపడ్డాయి. దీన్ని కమ్యూనిస్టు పార్టీలు తిరగేసి చెపుతుంటాయి. ఉనికి సమూహాలు బయటికి వెళ్ళిపోవడంతో కమ్యూనిస్టు పార్టీలు బలహీన్పడ్డాయని అంటుంటాయి. నిజానికి ఉనికి సమూహాలు కమ్యూనిస్టు పార్టీలకు లాంగ్ రోప్ ఇచ్చాయి. ఆ అవకాశాన్ని కమ్యూనిస్టు పార్టీలు సద్వినియోగం చేసుకోలేకపోయాయి. 70 ఏళ్ళలో మార్పును సాధించలేక పోవడం అంటే యధాస్థితికి తోడ్పడడమేకదా!

 

కొత్తగా వస్తున్న పరిణామాలను కమ్యూనిస్టు పార్టీలకన్నా సామాన్య ప్రజలు గొప్పగా అర్ధం చేసుకున్నారు. జనాభా గ్రామాల నుండి పట్టణాలకూ, నగరాలకు, ప్రపంచ నగరాలకు కదలి వెళుతోంది. ఈ హారిజాంటల్ మొబిలిటీ వర్టికల్ మొబిలిటీని కూడ సాధించింది. తండ్రి గ్రామంలో వ్యవసాయ కూలి; కొడుకు పట్టణంలో బైక్ మెకానిక్, మనవడు అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి. మునిమనవడు అమెరిక పౌరుడు. సాలీన తలసరి ఆదాయం 62 వేల డాలర్లు. ప్రతి ఇంట్లో ఇప్పుడు ఇదే ప్రణాళిక. ప్రజా సమూహాలు స్వీయ ఇంగితంతో, ప్రాప్తకాలజ్ఞతతో సాధించుకుంటున్న సామాజిక ఆర్ధిక విప్లవం ఇది.  

 

 

 

కమ్యూనిస్టు పార్టీల కొంప ముంచిన ఐటీ విప్లవం

డానీ

IT Revolution and the decline of Communist Parties

Part - 8

ఐటి విప్లవం ప్రభావాన్ని గుర్తించే నాటికి కమ్యూనిస్టు పార్టీల పని అయిపోయింది. రెండు దశాబ్దాలు ఆలస్యంగా కమ్యూనిస్టు పత్రికా కార్యాలయాల్లో కంప్యూటర్లు వచ్చాయి. కమ్యూనిస్టు పార్టీలు స్వయంగా న్యూస్ ఛానళ్ళు పెట్టాయి. అయితే, ఆ సాంకేతికరంగంలో ఒక తరం వెనుకబడిపోవడంతో తమకన్నా ముందున్న కార్పొరేట్ల పోటీని తట్టుకోలేపోయాయి. చివరకు ఆ న్యూస్ ఛానళ్ళను ఆ కార్పొరేట్లకే అమ్ముకోకతప్పలేదు.

 

మత చిచ్చు రాజకీయాలు, కుల విబేధాల ఎత్తుగడలతో మెజారిటీ మతోన్మాద కార్పొరేట్ నియంతృత్వం తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది. యజమాని కులాలనేగాక, ఎస్టి, ఎస్సి, బిసి సమూహాలను సహితం ఈ నియంతృత్వం చాలా వేగంగా తనవైపుకు లాక్కొంటున్నది. చివరకు ముస్లిం మైనారిటీ సమూహాలనూ సహితం విభజించి ఒక వర్గాన్ని లాక్కొనే ప్రక్రియలు మొదలయ్యాయి. మతసామరస్యం ద్వార మత చిచ్చును ఆర్పాలి. కులసమానత్వం ద్వార కుల ఘర్షణల్ని ఆపాలి. అప్పుడు మాత్రమే కమ్యూనిస్టు పార్టీలు మళ్ళీ ప్రజల మద్దతు పొంది మెజారిటీ మతోన్మాద కార్పొరేట్ నియంతృత్త్వాన్ని నిలువరించ గలవు. అంతేతప్ప; “ఇంకెప్పుడూ కాంగ్రెస్ తో కలవం” వంటి తీర్మానాలు చేస్తూ కూర్చుంటే కమ్యూనిస్టు పార్టీల చలవతో మెజారిటీ మతోన్మాద కార్పొరేట్ నియంతృత్వం వర్ధిల్లుతుంటుంది.

 

హైదరాబాద్

6 నవంబరు 2022

 

కమ్యూనిస్టు పార్టీల కొంప ముంచిన ఐటీ విప్లవం

డానీ

IT Revolution and the decline of Communist Parties

Part - 1

1.     In the summer of 1982, Bhindranwale and the Akali Dal launched the Dharam Yudh Morcha

2.     Operation blue star june 1984

3.     Inder Gandhi murder & Sikh riots October 1984

4.     KARAM CHEDU JULY 1985

5.     నాగరికతల ఘర్షణ (1992)

బాబ్రీ మసీదు కూల్చివేత (1992)

శిక్కుల ఊచకోత, కారంచేడు దురంతాలు జరుగుతున్నప్పుడే కేజి సత్యమూర్తిని  పీపుల్స్ వార్ నుండి ఎందుకు బహిష్కరించినట్టు.

నూతన ఆర్ధిక సంస్కరణలు 1991

1991లో కొండపల్లి సీతారామయ్యను ఎందుకు బహిష్కరించినట్టు.

minister Manmohan Singh on July 24, 1991, it laid the roadmap of the country’s economic reforms.

(Nellie massacre, 1983). 2,191 people 

 

Fall of Communism in Eastern Europe, 1989

On November 9, 1989, thousands of jubilant Germans brought down the most visible symbol of division at the heart of Europe—the Berlin Wall.

Fall o USSR 26 December 1991

15 sovereign states that were union republics of the Soviet Union, which emerged and re-emerged from the Soviet Union ...

 

The Gulf War[b] was a 1990–1991 armed campaign waged by a 35-country military coalition in response to the Iraqi invasion of Kuwait.

 

 

 

 

 

 

 

 

 

ప్రతి చారిత్రక దశలోనూ సమాజంలో ఒక ఉత్పత్తి విధానం వుంటుంది. ఆ దశకు సంబంధించి అది సాపేక్షకంగా యధాస్థితి. ఆ విధానం మీద ఆధారపడి  ఆ కాలపు న్యాయ, రాజకీయ వ్యవస్థలు ఏర్పడుతుంటాయి. వాటి నుండి కళా సాహిత్య విద్యా రంగాలు సృజనాత్మకంగా అభివృధ్ధి చెందుతుంటాయి. ఇవన్నీ ఒకదాన్ని మరొకటి ప్రభావితం చేస్తూ చాలా చలనశీలంగా వుంటాయి. ఈ రంగాలన్నింటికీ ఉత్పత్తి విధానం మీద ఒకే అభిప్రాయం వుండదు. యధాస్థితిని కొన్ని గట్టిగా సమర్ధిస్తుంటే, మరికొన్ని గట్టిగా వ్యతిరేకిస్తుంటాయి. యధాస్థితిని సమర్ధించడం యాజమాన్య దృక్పథం. వ్యతిరేకించడం శ్రామిక దృక్పథం.

 

ఉత్పత్తి విధానంలో రెండు విభాగాలుంటాయి. మొటిది  ఉత్పత్తి శక్తులు (means of production); రెండోది ఉత్పత్తి సంబంధాలు (relations of production). ఉత్పత్తి శక్తుల్లో మళ్ళీ రెండు విభాగాలుంటాయి. వీటిల్లోని మొదటి విభాగంలో భూమి,  పనిముట్లు, పరికరాలు, యంత్రాలు వగయిరాలు వుంటాయి. రెండో విభాగంలో యజమానులు, కార్మికులు వుంటారు. వీళ్ళిద్దరూ కలిసి  ఆ యంత్రాల మీద పనిచేస్తుంటారు. ఉత్పత్తి సంబంధాల్లోలోనూ యజమానులు, కార్మికులు వుంటారు. ఉత్పత్తి ఫలితాలు, పంపకాల మీద యజమానులకు మాత్రమే ఆధిపత్యం వుంటుంది. ఇదే సమాజంలో  అసమానత్వానికి మూలం. ఇలాంటి ఏకపక్ష ఆధిపత్యాన్ని, అసమానత్వాన్నీ ధిక్కరిస్తూ కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఏంగిల్స్ 1848లో కమ్యూనిస్టు ప్రణాళికను ప్రచురించారు.

 

‘శ్రామికులకు రాజ్యాధికారం” అనేది కమ్యూనిస్టు ప్రణాళిక ప్రపంచ కష్టజీవుల ముందు పెట్టిన లక్ష్యం. ఇది స్థిరమైన లక్ష్యం. కష్టజీవులకు రాజ్యధికారాన్ని ఎలా సాధించాలనేది ఆయాదేశాల కమ్యూనిస్టు పార్టీల బాధ్యత. వాళ్లందరూ తమ దేశల్లో తమ కాలాల్లో కొనసాగుతున్న  ఉత్పత్తి విధానాలను  సూక్ష్మ పరిశీలన చేసి శ్రామిక శ్రేణుల్ని గుర్తించి వాళ్ళకు రాజ్యాధికారాన్ని సాధించే వ్యూహాలు, ఎత్తుగడలు రూపొందించుకోవాలి. లక్ష్య సాధన కోసం తగిన పధ్ధతుల్లో కృషిచేయాలి.

 

బౌధ్ధిక రంగంలో ఒక సూక్ష్మం వుంది. వ్యవసాయ కూలి పరిజ్ఞానం, భాష, ట్రాక్టర్ డ్రైవర్ పరిజ్ఞానం, భాష, ఐటీ రంగంలో  పనిచేసే సాఫ్ట్ వేర్  పరిజ్ఞానం, భాష ఒకటికావు. యంత్రాల అభివృధ్ధి సమాజ ఉత్పత్తి స్థాయినేకాక  జ్ఞాన పరిధినీ, వ్యక్తీకరణ శైలిని ప్రభావితం చేస్తుంటాయి. భౌతికవాదంలో ఇది ఒక కీలకమైన పార్శ్వం. తమ కాలపు ఉత్పత్తిశక్తుల్లో జరుగుతున్న మార్పును చాలా మంది మార్క్సిస్టులు చాలా నిర్లక్ష్యం చేస్తుంటారు.

 

 

 

 

 

కమ్యూనిస్టు పార్టీల కొంప ముంచిన ఐటీ విప్లవం

డానీ

IT Revolution and the decline of Communist Parties

Part - 2

 

యంత్రాలలో సాంకేతికాభివృధ్ధి  జరిగేకొద్దీ ఉత్పత్తి విధానంలో గుణాత్మక మార్పులు వస్తాయి. ఉత్పత్తి స్థాయిలో పురోభివృధ్ధి జరిగేకొద్దీ సమాజపు ఆలోచనల్లో మార్పు వస్తుంది. 18వ శతాబ్దంలో జేమ్స్ వాట్ట్ ఆవిరియంత్రాన్ని అభివృధ్ధి చేయడంతో ఉత్పత్తి స్థాయి మునుపెన్నడూ ఊహించనంతగా పెరిగిపోయింది. పారిశ్రామిక విప్లవానికి ఇంగ్లండ్ కేంద్రంగా మారింది. జర్మనీ, ఫ్రాన్సుల మీదుగా మార్క్స్ లండన్ చేరుకున్నాడు. ఉత్పత్తి గరిష్టస్థాయికి చేరుకున్నప్పుడు సమానత్వ భావనలు కూడ గరిష్ట స్థాయికి చేరుకుని అవి సాకారం కావడానికి సమాజం సానుకూలంగా మారుతుందని భావించాడు. ఇంగ్లండ్ లో తొలి సామ్యవాద సమాజం ఏర్పడుతుందని ఒక పరికల్పన కూడ చేశాడు. ఇంగ్లండ్ విషయంలో మార్క్స్ జోస్యం తప్పయిందని చాలామంది తరచూ చాలా తేలిగ్గా అంటుంటారు. జోస్యం తప్పుకావచ్చుగానీ అలాంటి జోస్యం చెప్పడానికి మార్క్స్ అనుసరించిన విధానంలో ఏమాత్రం తప్పులేదు.

 

కమ్యూనిస్టు ప్రణాళిక వచ్చిన 12 సంవత్సరాలకు 1860లో తొలి అంతర్దహన యంత్రం సిధ్ధం అయింది. 1876లో ఒట్టొ మిషీన్ వచ్చింది. ఆటోమోబైల్, చమురు రంగాలు ఇజృంభించాయి.  20వ శతాబ్దం ఆరంభం నాటికి ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ సామ్రాజ్యవాద యుగంలోనికి ప్రవేశించింది. అప్పుడు మార్క్స్ లేడు; లెనిన్ వున్నాడు. మార్క్స్ మూల సిధ్ధాంతాన్ని తీసుకుని సామ్రాజ్యవాద యుగానికి ఒక విరుగుడును కనిపెట్టే ప్రయత్నం విఐ లెనిన్ చేశాడు. మరోమాటల్లో చెప్పాలంటే, బాహ్యదహన యంత్రాల (external combustion) కాలపు సామ్యవాద సాధన మార్గాన్ని కార్ల్ మార్క్స్ కనిపెడితే అంతర్దహన యంత్రాల (Internal combustion engines) కాలపు సామ్యవాద సాధన మార్గాన్ని లెనిన్ కనుగొన్నాడు.

 

విజ్ఞాశాస్త్రాల రంగంలో ఇలాగే జరుగుతుంది. ఒకడు ఒక యంత్రాన్ని కనుగొంటాడు. దాన్ని మరొకడు వాణిజ్యపరంగా మారుస్తాడు. మరొకడు దానిని మించిన మరోదాన్ని కనిపెడుతుంటాడు. అలా విజ్ఞానశాస్త్రాల్లో ముందు తరం మీద ఒక గౌరవంతో  స్వీయ అభివృధ్ధి కొనసాగుతూ వుంటుంది. రాజకీయరంగంలో కూడా  ఇలాంటి సాంప్రదాయం  కొనసాగాలి. కానీ అలా జరగడంలేదు.

 

లెనిన్ సోషలిస్టు సిధ్ధాంతాన్ని మార్క్స్ నుండి స్వీకరించి, విప్లవ పంథాను మాత్రం ఆనాటి రష్యన్ సమాజపు   వాస్తవికతకు అనుగుణంగా రూపొందించుకున్నాడు. సరిగ్గా మావో కూడ సోషలిస్టు సిధ్ధాంతాన్ని మార్క్స్ నుండి స్వీకరించి, విప్లవ పంథాను మాత్రం ఆనాటి చైనా సమాజపు   వాస్తవికతకు అనుగుణంగా రూపొందించుకున్నాడు. వియత్నాంలో హోచిమిన్ కూడ తమ దేశానికి అవసరమైన స్వతంత్ర విప్లవపంథాను రూపొందించుకున్నాడు

కమ్యూనిస్టు పార్టీల కొంప ముంచిన ఐటీ విప్లవం

డానీ

IT Revolution and the decline of Communist Parties

Part - 3


No comments:

Post a Comment