*ఫాసిజాన్ని ఎదుర్కోవడానికి వున్న మార్గాల్ని అన్వేషించడానికి ఈ గ్రూపును ఆరంభించాము*.
ఫాసిజం అంటే మెజారిటీ మతతత్త్వాన్ని ఆశ్రయించి బలపడే కార్పొరేట్ నియంతృత్త్వం. ఫాసిజాన్ని ఎదుర్కోవడానికి వున్న మార్గాల్ని అన్వేషించడానికి ఈ గ్రూపును ఆరంభించాము.
మన గ్రూపులో చాలా మంది ఈ ప్రాధమిక బాధ్యతను విస్మరిస్తున్నారు. లేదా, వారికి కొత్త సూచనలు చేసే మేధో సామర్ధ్యం లేకపోవచ్చు.
ఈ గ్రూపులో కొందరు తమ తమ మతాలు ఎంత గొప్పవో చెప్పుకునే ప్రత్యత్నం చేస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాలు ఎవరూ చేయవద్దు. *ప్రతి మతం ఎలాంటి మినహాయింపు లేకుండా ఆయా సందర్భాలలో ఆయా దేశాల్లో నియంతృత్త్వాన్ని సమర్ధించినవే*.
నాస్తిక హేతువాదాల ప్రచారమూ ఈ గ్రూపు లక్ష్యం కాదు. ఏ మతం లోనివారైనాసరే సాధారణ భక్తులతో ఎవరికీ ఇబ్బంది లేదు. రాజకీయ లబ్దికోసం, అధికారంలో కొనసాగడం కోసం, మనుషుల ద్వేషాన్ని పెంచడం కోసం మతాన్ని ప్రయోగించేవారితోనే ప్రమాదం.
ఎజెండాకు సంబంధంలేని పోస్టుల్ని ఎవ్వరూ పెట్టవద్దు. అలాంటి పోస్టుల్ని కొనసాగించితే ఇతరులకు విసుగు వస్తుంది. తొలగిస్తే వాటిని పెట్టిన వారికి కోపం వస్తుంది. ఈ పరిస్థితి రానియ్యవద్దు.
*ఇందులో ఒక పోస్టు పెట్టే ముందు అది ఫాసిజాన్ని ఎదుర్కోవడానికి పనికి వస్తుందో లేదో ఒకటికి నాలుగుసార్లు చెక్ చేసుకోండి*. మంచి ఆలోచనాపరులుగా వ్యవహరించండి.
డానీ
కన్వీనర్, MTF
No comments:
Post a Comment