Friday 19 May 2023

Notes on Communist Parties

 

రాజ్యానికీ, ప్రజలకు (State and subjects) మధ్య వైరుధ్యం వున్నట్లే, కమ్యూనిస్టు పార్టికీ కమ్యూనిస్టు అభిమానులకు మధ్య వైరుధ్యం వుంటుంది అనేదే నా వ్యాసం శీర్షిక. కమ్యూనిస్టు అభిమానుల్ని తిరిగి సమీకరించే కార్యక్రమాన్ని వారు చెప్పాల్సి వుండే కానీ పట్టించుకోలేదు.     

సమాజంలో  ఉద్యమం కూడ ప్రకటిత లక్ష్యంతో మాత్రమే జరగదుప్రతి ఉద్యమంలోనూ ప్రకటిత లక్ష్యానికి పూర్తిగా  విరుధ్ధమైన ధోరణులు కూడ వుంటాయిఉద్యమ నాయకులు తరచూ తమకే ఆచరణసాధ్యంకాని  అనేక లక్ష్యాలను ఉదారంగా ప్రకటించేస్తుంటారుకార్యకర్తలుఅభిమానులు ఉత్సాహంగా ఆస్తి త్యాగాలేగాక ప్రాణ త్యాగాలు సహితం చేయడానికి కూడ సిధ్ధపడతారుతాము తెగించి పోరాటం చేస్తున్నది నిజానికి ఒక ప్రాయోజిత కార్యక్రమం అని కొన్ని సందర్భాలలో ఉద్యమ నాయకులకు సహితం తెలియకపోవచ్చుఇటీవల జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో  ధోరణులు అన్నింటినీ  చూడవచ్చుఉద్యమంలో పాల్గొనే సామాజికవర్గాలు ఎవరికి వారు తమ మేలు కోసమే  పోరాటం సాగుతున్నదని  చాలా గట్టిగా నమ్ముతాయిఆంధ్రా ప్రాంతానికి చెందిన పెట్టుబడీదారుల మీద తమ ఆధిపత్యాన్ని నెలకొల్పడానికి తెలంగాణ ప్రాంత పెట్టుబడిదారులు స్పాన్సర్ చేసిన ఉద్యమం అది అని జ్ఞానోదయం కలగడానికి చాలా కాలం పడుతుంది

వందేళ్ళు సాగిన స్వాతంత్ర్యయోద్యమ ఫలితాన్ని భారత కమ్యూనిస్టుపార్టి 1948లో  “అధికార మార్పిడి”  అని తీర్మానించిందిస్వతంత్ర భారత ఆర్ధిక వ్యవస్థలో తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి టాటాబిర్లా తదితరులు ఆడించిన నాటకం ‘జాతియోద్యమం’ అనేది దాని అర్ధంకానీ  వందేళ్ళ పోరాటంలో భగత్ సింగ్చంద్రశేఖర ఆజాద్అష్ఫఖుల్లా ఖాన్అల్లూరి సీతారామ రాజు తదితర ఉత్తేజకర విప్లవ వీరులు అనేకులు వున్నారువీళ్ళెవరూ అధికార మార్పిడి కోసం పోరాడలేదని మనకు తెలుసువీళ్ళందరి త్యాగాల్ని కొందరు తెలివిమంతులు తమకు అనుకూలంగా వాడుకోగలిగారని మాత్రం ఒప్పుకోకతప్పదు

తెలంగాణలో రైతుకూలీ రాజ్యస్థాపన కోసం కలలుగంటూ  కమ్యూనిస్టులు వీరోచితంగా పోరాటం చేశారనేది వాస్తవంఅయితే అదే పూర్తి నిజంకాదుఅదే చారిత్రక సందర్భంలో ఇంతకన్నా పెద్ద నిజాలు చాలా వుంటాయిగోదావరికృష్ణా ఆనకట్టలవల్ల వ్యవసాయరంగంలో అబ్బిన సాంకేతిక నైపుణ్యంతో  ప్రాంత  భూస్వామ్యవర్గం తెలంగాణ ప్రాంతంలోనికి విస్తరించాలనుకోవడం ఇంకో నిజంతెలంగాణలో ఆంధ్రా సరిహద్దు జిల్లాల్లోనే కమ్యూనిస్టు పార్టి పోరాటం మొదలయిందని సులువుగానే అర్ధం అవుతుందికేవలం తెలంగాణనేకాక మొత్తం నైజాం సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయాలనేది జాతీయ కాంగ్రెస్ పార్టి లక్ష్యంఒక ముస్లిం రాజు పాలిస్తున్న దేశాన్ని ఓడించి అఖండభారత్ ఆశయ సాధనలో భాగంగా భారతదేశంలో కలపాలనేది ఆర్యసమాజ్-ఆరెస్సెస్  లక్ష్యం.   నిజాం సంస్థానాన్ని ఒక ప్రజాస్వామిక దేశంగా మార్చాలని విద్యావంతులయిన ముస్లిం ఆలోచనాపరులు ప్రజాస్వామికవాదులు భావించారుగ్రామీణ ప్రాంతాల్లో భూస్వామ్యవర్గాలు సాగించే అణిచివేతకు వ్యతిరేకంగా తిరగబడిన ముస్లింలున్నారుఇంకాలోతులకు వెళితే  పోరాట కాలంలో ఇలాంటి నిజాలు మరికొన్ని కనిపిస్తాయినిజాం సంస్థానాన్ని ఇండియన్ యూనియన్ లో విలీనం చేయాలనే భారీ కార్యక్రమం కాంగ్రెస్, ఆర్యసమాజ్ లకు వుండింది. కమ్యూనిస్టు పార్టీకన్నా వాళ్ల కార్యక్రమం పెద్దది. తెలంగాణవేరు, నిజాంవేరు అనే చిన్న చిన్న లాజిక్ లను  చిన్నపిల్లలు సహజంగానే మరచిపోతుంటారు.

కమ్యూనిస్టు నాయకులు రాసిన పుస్తకాలను మాత్రమే చదివితే నైజాం పతనం విలీనం కమ్యూనిస్టులవల్ల మాత్రమే జరిగిందనే అభిప్రాయం కలగడం సహజంకానీఅది పాక్షిక సత్యంకేవి రంగారెడ్డిబూర్గుల రామకృష్ణారావు ఢిల్లీ వెళ్ళి పాత్రికేయుడు షోయబుల్లా ఖాన్ ను హైదరాబాద్ లో నడిరోడ్డు మీద అతి క్రూరంగా చంపేసిన తీరును వివరించిన తరువాతే నెహ్రు ‘ఆపరేషన్ పోలోకు అనుమతి ఇచ్చాడునిజాం సంస్థానాన్ని భారత దేశంలో విలీనం చేయడమనే ఒక భారీ పథకానికి ఇంతమంది ఇన్ని రకాలుగా పనిచేశారునైజాం సంస్థానం విలీనానికి సూత్రధారులు ఆర్యసమాజ్-ఆరెస్సెస్పాత్రధారులు కాంగ్రెస్కాల్బలం కమ్యూనిస్టులు

తెలంగాణలో సాయుధపోరాటం సాగించడాన్ని ఎవరూ తప్పుపట్టలేదు. సాయుధపోరాటం అనేది జాతీయ పిలుపు అయినప్పుడు కమ్యూనిస్టులు ఒక్క తెలంగాణను  మాత్రమే ఎందుకు ఎంచుకున్నారూఅనే ప్రశ్నకు వారి దగ్గర సమంజసమైన సమాధానం లేదుపోరాటంలో ఒక దశలో మత పక్షపాతం కూడ వుందని దేవులపల్లి వేంకటేశ్వరరావు తన పుస్తకంలో నమోదు చేశారు పోరాట అగ్రనేతల్లో దేవులపల్లి ఒకరు.  

పోనీ, చనిపోయిన 3500 మంది కమ్యూనిస్టు కార్యకర్తల సామాజిక వర్గీకరణ ఎవరయినా చేశారా? పొరాటానంతర కాలంలో సామాజిక వర్గాలకు మేలు జరిగింది? సామాజికవర్గాలకు కీడు జరిగిందన్న విశ్లేషణ అయినా ఎవరయినా చేశారా? కమ్యూనిస్టులకు కులాలు మతాలు వుండవని విశ్లేషణలు చేయకుండా తప్పుకున్నారా? అంతకు ముందు అణగారిన సామాజికవర్గాలుగావున్న సమూహాలే తరువాత కూడ అణగారిన సామాజికవర్గాలుగానే కొనసాగితే దాన్ని అసలు విప్లవ పోరాటం అనవచ్చునా?

 “అభిప్రాయాలు స్వేఛ్ఛాయుతమైనవికానీ వాస్తవాలు పవిత్రమైనవి” అనేది పాత్రికేయ వృత్తికి జేపి స్కాట్ ప్రతిజ్ఞ. 1952 లోకసభ ఎన్నికల్లో నల్గొండ నియోజకవర్గంలో పిడిఎఫ్ (సిపిఐఅభ్యర్ధిగా పోటీ చేసిన రావి నారాయణ రెడ్డికి భారీగా ఓట్లు పడ్డాయిఅది వాస్తవంవాస్తవం మారదుమారకూడదుకానీవారికి అన్ని ఓట్లు ఎందుకు పడ్డాయిఅనే అంశం మీద  ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం వుంటుందిభిన్నాభిప్రాయాల్ని అవాస్తవాలు అనరాదు.   

1946 జులై 4 సాయుధపోరాటం ఆరంభమయినప్పటి నుండి 1952 లోక్ సభ ఎన్నికల వరకు అనేక చారిత్రక దశలున్నాయిమొదట్లో కమ్యూనిస్టు గెరిల్లా దళాలు గడియల మీద దాడులు చేశాయికొందర్ని చంపేశాయికొందర్ని గడియల నుండి తరిమేశాయివాళ్ళ భూముల్ని  లాక్కున్నాయివాటిని పేదలకు పంచాయిరెండవ దశలో భారత సైన్యం ప్రవేశించి కమ్యూనిస్టు కార్యకర్తల్ని క్రూరంగా చంపేసిందికమ్యూనిస్టులు లాక్కున్న భూముల్ని చాలా వరకు స్వాధీనం చేసుకుంది

నవాబు గద్దె దిగినిజాం సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసిన  తరువాత సాయుధ పోరాటాన్ని కొనసాగించవచ్చాఅసలు భారత సైన్యంతో కమ్యూనిస్టులు తలపడవచ్చావంటి ఎన్నో సందేహాలు తలెత్తి పోరాట విరమణ అంశం ముందుకు వచ్చిందికొంతకాలం  అంశం మీద భారత కమ్యూనిస్టు పార్టీలో ‘రెండు పంథాల ఘర్షణ’ సాగిందిఅంతిమంగా కమ్యూనిస్టు పార్టి కేంద్ర కమిటి సాయుధపోరాట పంథాను వదిలి  పార్లమెంటరీ పంథాను చేపట్టాలని తీర్మానించింది తరువాత సిపిఐ చీలి సిపియం ఏర్పడింది. తరువాత  నక్సలైట్  ఉద్యమం ఆరంభమయ్యాక దేవులపల్లి వేంకటేశ్వర రావు తదితర అలనాటి నాయకులు  తెలంగాణ పోరాటంలో తమ అనుభవాలను రాశారు. పుచ్చలపల్లి సుందరయ్య గుణపాఠాలను నమోదు చేశారు.  వాళ్ళు తమ పుస్తకాలకు తెలంగాణ అనే శీర్షికలు పెట్టారుగానీ నిజాం అనలేదు. తెలంగాణకన్నా నిజాం పెద్దదని, నిజాం కన్నా తెలంగాణ చిన్నదని వాళ్ళకు తెలుసు.  

ప్రతిపాదిత వ్యాసంలో ఫాసిజంఅస్తిత్వసమూహాలుమైనారిటీ సమ్యస వంటి అనేక అంశాలుండగా వాటిని వదిలి రావి నారాయణ రెడ్డిని అంతగా సమర్ధించాలని ఇప్పుడు వారెందుకనుకున్నారో తెలీదుసాయుధ పోరాటాన్ని కొనసాగించితీరాలని పట్టుబట్టిన ఆంధ్రా నాయకుల్ని తెలంగాణకు చెందిన రావి నారాయణ రెడ్డి వర్గం ‘తెలంగాణ సాయుధ పోరాటంలో  కమ్యూనిస్టు పార్టికి  నాయకత్వం వహించిన వాళ్ళకు కమ్యూనిజం ఒక సరదాయేగానీ ప్రాణరక్షణ మందు కాదు అనేవారు కొండపల్లిసీతారామయ్య.  అందుకే కీలక సమయంలో కమ్యూనిస్టు పార్టి సాయుధపోరాట విరమణ ప్రకటన చేసిందనేవారు సందర్భంగా ఒక జానపద కథ చెప్పేవారు.

చైనా యువరాజుకు డ్రాగాన్ చూడాలనే ఒక కోరిక వుండేదట. డ్రాగాన్ నిజ జీవికాదు. ఒక జానపద అభూత కల్పన. పక్షిలా, మొసలిలా, కొండచిలువలా వుంటుంది. నోట్లో నుండి మంటలు చిమ్ముతుంటుంది. రాత్రిపూట  డ్రాగాన్ రాజకోటకు వచ్చి అక్కడున్న భటునితో  "మీ యువరాజు నన్ను చూడాలని ఉబలాటపడుతున్నాడు. అతని కోరిక తీరుద్దామని స్వయంగా నేనే వచ్చాను. పోయి మీ యువరాజుకు చెప్పు" అందిట. భటుడు వెళ్ళి యువరాజుని నిద్రలేపి "మీ కోసం డ్రాగాన్ వచ్చింది యువరాజా! కోటగుమ్మంలో వుంది" అన్నాడట. డ్రాగాన్ నిజంగానే వచ్చేసిందన్నమాట వినగానే యువరాజు భయపడి గుండె ఆగి చనిపోయాట్ట.  రావి నారాయణ రెడ్డి వంటివారు కమ్యూనిజం అంటే ఏదో సరదాపడ్డారు గానీ, నిజంగా కమ్యూనిజం వచ్చేస్తున్నదని తెలియగానే వాళ్ళ గుండె ఆగిపోయింది అంటూ కొండపల్లి   కథను ముగించేవారు. కమ్యూనిస్టు పార్టి అస్త్రసన్యాసం చేయడంతో గతంలో పారిపోయిన దొరలు తిరిగి గడియలకు చేరుకున్నారువాళ్ళ సంపద గతంకన్నా పెరిగిందిఅది మరింతగా పెరగడానికి ఇండియన్ యూనియన్ లో కొత్త ద్వారాలు తెరుచుకున్నాయి.  దీనికంతటికీ దోహదపడిన కమ్యూనిస్టు పార్టి మీద వాళ్ళకు పాత కక్షలు మాసిపోయి సహజంగానే కొత్త ప్రేమ పుట్టుకు వచ్చిందికమ్యూనిస్టు అభిమానుల ఓట్లతోపాటూపూర్వ-కమ్యూనిస్టు వ్యతిరేకుల ఓట్లు కూడ కమ్యూనిస్టు పార్టీ (పిడిఎఫ్అభ్యర్ధులకు పడ్డాయి.   

సాయుధ పోరాటంలో అనేకమంది భూస్వాములు పారిపోయారుగడీలు బద్దలయ్యాయికొంతమంది హత్య చేయబడ్డారువారు రావి నారాయణరెడ్డిగారికి మద్దతు ఇచ్చి గెలిపిస్తారా?”  అని అడగడం పూర్తిగా అమాయికత్వం. 3500 మంది కమ్యూనిస్టు కార్యకర్తల్ని క్రూరంగా కాల్చి చంపించిన కాంగ్రెస్ నే ఎమర్జెన్సీ కాలంలో సిపిఐ గాఢంగా  ప్రేమించిందన్నది వీరు మరిచిపోయారుఇలాంటి విచిత్రాలు రాజకీయ రంగంలో అనేకం కనిపిస్తాయి.    

మనం రాజకీయార్ధిక రంగాలను పాపులర్ దృష్టితో విశ్లేషించడానికి అలవాటుపడ్డాముపెట్టుబడీదారుల సమిష్టి ప్రయోజనాలను చక్కదిద్ది పెట్టే కమిటీయే పార్లమెంటు అనేది మార్క్సియన్ అవగాహనలెనిన్ ఇంకా చాలాచాలా అన్నాడునేను వాడిన ప్రాయోజిత శాసనవ్యవస్థ (Crony Legislature) అనే పదం వీరికి అర్ధం కాలేదనుకుంటాతమ పనులు  కానించుకోవడం కోసం పాలకవర్గాలు పార్లమెంటులో అన్ని పార్టీల సహకారాన్నీ తీసుకుంటాయికాకపోతే పెద్ద పార్టీలకు భారీ నిధులు ఇస్తాయిచిన్న పార్టీలను చందాలతో సరిపెడతాయి

1984లో ఎన్ టి రామారావును తిరిగి ముఖ్యమంత్రిని చేయడం కోసం కమ్యూనిస్టులు వీధిపోరాటాలు చేశారుప్రత్యేక తెలంగాణ కోసం మలి విడత ఉద్యమం మొదలయినపుడు కమ్యూనిస్టు పార్టి ఏకంగా విశాలాంధ్ర దుకాణాన్ని మూసేసి అందులో పాల్గొన్నదికానీఇతర అస్తిత్వ సమూహాల కోసం  స్థాయిలో ఉద్యమించిన సందర్భం కనిపించదు

భారత సమాజ స్వభావాన్ని అంచనా వేయడంలోనే కమ్యూనిస్టు పార్టీల వైఫల్యం వుందనిపిస్తోంది. 1848లో ఫూలే వర్ణ సమాజం అన్నాడు; 1924 అంబేడ్కర్ కుల సమాజం అన్నాడు, 1925లో ఆరెస్సెస్ మతసమాజం అన్నదిఅదే ఏడాది కమ్యూనిస్టు పార్టి వర్గ సమాజం అన్నదిఇవిగాక మన సమాజానికి ఇంకా అనేక స్వభావాలున్నాయిఒక్కో చారిత్రక దశలో ఒక్కో స్వభావం ప్రబలంగా ముందుకు వస్తుందిఇప్పుడు మత స్వభావం ముందుకు వచ్చింది దశ 1984లోనే ఆరంభమయిందిసకాలంలో ప్రమాదాన్ని పసిగట్టడంలో మనం విఫలమయ్యాంఅలా 40 యేళ్ళు గడిపేశాం. జబ్బు ముదిరిపోయింది.

 

Telengana Movement, 1944-51 (1982) by Barry Pavier (Author)

No comments:

Post a Comment