రంజాన్ పండుగ సందర్భంగా లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక, మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రం, ఆల్ ఇండియా ప్రొగ్రెసివ్ ఫోరం సంయుక్తంగా ఈరోజు ఎంబి భవన్ లో నిర్వహించిన ఈదుల్ మిలాప్ సభలో ఈ రోజు ప్రసంగించాల్సి వుండే.
అనివార్య వ్యక్తిగత కారణాలవల్ల నేను సభలో ప్రసంగించకుండానే
ఇంటికి చేరుకోవాల్సి వచ్చింది.
నా ప్రసంగం కోసం సిధ్ధం చేసుకున్న నోట్స్ ఇది.
*వందేళ్ళ సామాజిక
తప్పిదం*
మనం 1925లో పుట్టాం.
వాళ్ళు మనకన్నా మూడు నెలలు ముందు పుట్టారు.
దేశాన్ని హిందూమత రాజ్యంగా మారుస్తామన్నారు.
కమ్యూనిస్టులు, ముస్లింలు, క్రైస్తవులు తమకు శత్రువులని ప్రకటించారు.
ఈ మధ్య శత్రువుల సంఖ్యను ఐదుకు పెంచారు.
ఇటీవల ఢిల్లోలో జరిగిన వరల్డ్ హిందూ కాంగ్రెస్ తమకు 5 ముప్పులున్నాయని
పేర్కొంది.
malicious-5 or M5.
Marxism, Macaulayism, Missionaries, Materialism and Muslims.
బహిరంగంగా ముస్లింలు అనడానికి కొంచెం ఇబ్బందిపడి Muslim extremism అంటున్నారు.
వాళ్ళు అధికారంలోనికి వచ్చేశారు. దేశాన్ని మతరాజ్యంగా మారుస్తున్నారు.
వాళ్లు శత్రువులుగా ప్రకటించినవారు ఎవరికివారే వుంటున్నారు.
ఎప్పుడో ఇదుల్ మిలాప్ లోనో మరో సభల్లోనో మనం వేదికల మీద కలుస్తున్నాం.
కింద మన సమూహాలు విడిగానే వుంటున్నాయి.
ఇది ఒక శతాబ్దకాలంగా మనం చేస్తున్న సామాజిక తప్పిదం.
ఇప్పుడు మనం చేయాల్సిందేమంటే సమాజపు అట్టడుగు పొరల్లోనూ భాధితుల్ని
ఏకం చేయడం.
*లేకుంటే ఓ వెయ్యేళ్ళు మనుస్మృతి రాజ్యంలో బతకాల్సి వుంటుంది*.
థ్యాంక్యూ!
*డానీ, కన్వీనర్ MTF*
No comments:
Post a Comment