*మా అమ్మమ్మ ఫాతిమున్నీసా మళ్ళీ గుర్తుకొచ్చింది*
‘ద్రవాధునిక వ్యవస్థ మీద దాడి’ పేరిట పన్నెండేళ్ల క్రితం నేను రాసిన వ్యాసం మీద ఫేస్ బుక్ లో ఇప్పుడు మరొక్కసారి చర్చ జరగడం చాలా ఆనందంగా వుంది. ఆ వ్యాసం చదివాక ఎగిరి గంతులేయాలనిపించిందని కొందరు ఫోన్ చేసి చెప్పారు. ఒకరయితే ఏకంగా పొలిటికల్ ఇస్లాం సిధ్ధాంతకర్త Abul Ala Maududi శైలి కనిపించిందన్నారు.
తెలంగాణ రైతాంగ సాయుధపోరాటం గురించి మనం చదివినదంతా పాక్షిక సత్యమే. మనం తరచూ ఫాసిజం, నాజీజాన్ని రష్యా అణిచివేసింది; కమ్యూనిస్టులు (మాత్రమే) ఓడించారు అంటుంటాం. ఈజిప్ట్, లిబియావంటి ముస్లిం దేశాలు చేసిన కృషిని మనం అస్సలు పట్టించుకోము. రష్యా సైన్యం 1945 మే నెలలో జర్మనీలో ప్రవేసించింది. అంతకు ముందే 1942 నవంబరులో ఈజిప్ట్ లోని El Alamein వద్ద ఫాసిజానికి తొలి ఓటమి ఎదురైంది. మనం ఈ కోణాల్ని మరచిపోతున్నామా; దాస్తున్నామా?? Selective memory loss in history writings.
మా అమ్మమ్మ ఫాతిమున్నీసాకు చాలా కథలు వచ్చు. సింద్ బాద్ ప్రయాణాలు, హాతింతాయి, అరేబియన్ నైట్స్ వంటి కథలు రోజుకొకటి చెప్పేది. వాటిల్లో మాయలు, మంత్రాలు, జిన్నీలు, అతీత శక్తులు వగయిరాలు వుండేవి. దాదాపు ఓ మూడేళ్ళు ప్రతిరాత్రీ ఆ కథలు విన్నాను. నేనురాసిన జప్తు, రాజుగారి కొమ్ము కథల్లో వాటి ప్రభావం వుంది. మా అమ్మీ కూడ కథలు చాలా గొప్పగా చెప్పేది.
సాహిత్యంలో మేజికల్ రియలిజం అనేది 20వ శతాబ్దపు మధ్యలో లాటిన్ అమెరికాలో పుట్టిందని కొందరు రాస్తున్నారు. ఈ రకం రచనా శైలి అరేబియన్ నైట్స్ నాటికే వుంది.
‘అల్ కెమిస్ట్’ కథ చదవగానే నాకు మా అమ్మమ్మ చెప్పిన కథ ఒకటి గుర్తు కొచ్చింది. దానితో ఆ కథ మీద ఆసక్తి పెరిగింది. దాని పెరు వగయిరాలు గుర్తులేవు. algorithms ఉపయొగించి కొన్ని గంటలు శ్రమించగా అరేబియన్ నైట్స్ లో 352 రాత్రి చెప్పిన కథ అదే అని తేలింది. Costa-Gavras movie *Hanna K* కూడ చూసి వుండడంతో ‘అల్ కెమిస్ట్’ రచన ప్రయోజనం అర్ధం అయ్యింది.
భవనగిరి చంద్రా ‘ది సండే ఇండియన్’ ఫిబ్రవరి 6-20 సంచికలో అల్ కెమిస్ట్ మీద వ్యాసం రాశాడు. ఆ వ్యాసానికి కొనసాగింపుగా అదే అంశం మీద ఇంకో వ్యాసం రాయమని ‘ది సండే ఇండియన్’ సంపాదకులు అడిగారు. అలా పుట్టింది ఈ వ్యాసం.
ఈ వ్యాసాన్ని చదివినవారు మెచ్చుకునేకొద్దీ నాకు మా అమ్మమ్మ మీద గౌరవం పెరిగింది. ఆమె ఏమీ రాయలేదుగానీ మౌఖికంగా చాలా చెప్పేది. షమా ఉర్దూ మాసపత్రికను పూర్తిగా చదవి వినిపించేది. తనకు మూలికవైద్యం మీద కూడ జ్ఞానం వుండేది. తను చనిపోయిన తరువాత తన గొప్పతనం అర్ధం అయింది. వాటిని నేను నోట్ చేసి భద్రపరచాలనే ఆలోచన అప్పట్లో రాలేదు.
మరలా ఈరోజు అందరూ నా వ్యాసాన్ని మెచ్చుకుంటుంటే మా అమ్మమ్మ గుర్తుకు వచ్చింది.
No comments:
Post a Comment