1948 నాటి పోలీస్ యాక్షన్
ఇండో-అమెరికన్ రచయిత అఫ్సర్
ముహమ్మద్ 1948 నాటి పోలీస్ యాక్షన్ బాధిత కుటుంబాల సంతతిని కలిసి వాళ్ళ అనుభవాలను
నమోదు చేసే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. ఈ అంశం మీద ఓ దశాబ్దంపాటు విస్తృత
పరిశోధనలు చేసి ఇప్పుడు “Remaking History -1948 Police Action and the muslims of
Hyderabad” శీర్షికతో ఒక భారీ చారిత్రక డాక్యుమెంట్ ను ప్రచురించాడు.
సెప్టెంబరు 26 రాత్రి
హైదరాబాద్ లా మకాన్ లో జూమ్ మీటింగ్ ద్వార ఈ పుస్తక పరిచయ సభ జరిగింది. ఈ పుస్తకం
రాయాల్సిన అవసరాన్నీ, తన అనుభవాల్నీ రచయిత చాలా ఉద్వేగంగా వివరించాడు.
రెండు తరాల ముందు
నుండే వాళ్లది ఖమ్మం జిల్లాలో సాంప్రదాయ ముస్లిం ప్లస్ కమ్యూనిస్టు కుటుంబం. తనకు
నాణేనికి రెండు పక్కలా తెలుసు. ఇప్పుడైతే తను తెలుగు కవిగా, కథకునిగా
ప్రముఖుడయ్యాడుగానీ, పర్షియన్ భాషా వాతావరణంలో పుట్టి పెరుగుతున్న పిల్లోడు తెలుగు
నేర్చుకోవడానికి పడ్డ కష్టాలు, ఎదుర్కొన్న అవమానాలను వివరిస్తుంటే ప్రేక్షకుల్లో కొందరి
కళ్ళైనా చెమర్చి వుంటాయి. (నాది కూడ సేమ్ టు సేమ్ స్టోరీ. నన్నెందుకో మానాన్న
చినబాల శిక్ష నేర్పమని అగ్నిహోత్రావధాన్లు అనే ఒక కఠోర మాస్టారి దగ్గర పడేశారు.
నోటితోకన్నా పేక బెత్తంతో నేర్పితేనే తెలుగు బాగా వస్తుందని వారు గాఠిగా నమ్మేవారు).
2002 గుజరాత్ అల్లర్ల
తరువాత తను ముస్లిం సమాజం మీద దృష్టి పెట్టాడు. మొహర్రం పండుగ సందర్భంగా తెలంగాణలో
వెల్లివెరిసే మతసామరస్యం మీద పరిశోధన సాగించాడు. ఆ క్రమంలో 1948 పోలీస్ యాక్షన్
బాధితులు అతనికి తారసపడ్డారు. దాచేస్తే దాగని సత్యాలను వెళ్ళడించడానికి
సిధ్ధపడ్డాడు. దాని ఫలితమే ఈ పరిశోధనా గ్రంధం. అతని పుస్తకం ఇంకా ఇండియాకు రాలేదు.
అంచేత ఇది పుస్తక సమీక్ష కాదు; రచయిత జూమ్ ప్రసంగం సందర్భంగా నాలో చెలరేగిన భావాలు మాత్రమే.
డానీ
సమాజవిశ్లేషకులు, సీనియర్
జర్నలిస్టు
https://www.sakshi.com/telugu-news/guest-columns/1948-police-action-another-perspective-1803645
No comments:
Post a Comment