హ్యాప్పీ
బర్త్ డే అనిల్ !
Anil Aqthar Khan Chowdary
వాడెలా చేస్తాడో
తెలీదుగానీ కుటుంబంలో ఆర్ధిక సమస్య వచ్చినప్పుడు దాన్నుండి గట్టెక్కించేస్తాడు. నిజానికి
అజితే ఇంట్లో ఆర్ధిక వ్యవహారాల్ని చక్కబెట్టేస్తుంది. ఆమె స్థాయికి మించిన సమస్య
వచ్చినపుడు మా చిన్నోడు ముందుకు వస్తాడు.
కరోనా సెకండ్ వేవ్ లో
ముందు అజితను తాకింది. తను డిశ్చార్చ్ అయ్యే నాటికి నన్నూ సోకింది. బతికే కేసు
కాదని హైదరాబాద్ డాక్టర్లు ప్రకటించేశారు. కొన్ని రోజులు నేను స్పృహలో లేను. తల్లి
కొడుకు ఏం చేశారోగానీ నన్ను బతికించేశారు. డిశ్చార్జ్ అయ్యాక “ఎంతయిందిరా?” అని
అడిగితే “ఇప్పుడు అది అవసరమా?” అని ఎదురు ప్రశ్న వేశాడు. మా కుటుంబం తట్టుకోలేనంత
పెద్ద బిల్లు అయిందని తరువాత తెలిసింది.
మేమిద్దరమే కలిసి
వున్నప్పుడు చాలా చిత్రమైన ప్రపోజల్స్ పెడుతుంటాడు.
“అసలే పరిమిత ఆదాయం. మమ్మల్నేకాక
నీ తల్లిదండ్రుల భారాన్నీ మోశావు. ఆపైన నిరంతరం ఉద్యమ జీవితాన్ని కొనసాగించావు. మాకోసం
చాలా సౌఖ్యాలనీ, అనేక ఆనందాలనీ వదులుకొని వుంటావు. బడ్జెట్ లేక గర్ల్ ఫ్రెండ్స్ ను
కూడ పక్కన పెట్టేసి వుంటావుగా. ఇప్పుడు ఆ కోరికలన్నీ
తీర్చుకో. నేను స్పాన్సర్ చేస్తాను” అంటుంటాడు.
మనలో చాలా మందికి 2BHK,
3 BHK ఫ్లాట్లే వుంటాయి. మాస్టర్ బెడ్ రూమ్,
చిల్డ్రన్స్ రూం, గెస్ట్ రూంలు వుంటాయి. అనేక ఇళ్ళలో పేరెంట్స్ రూం వుండదు. వాడు
వాడి ఫ్లాట్ లో మాస్టర్ బెడ్ రూమ్ ను పేరెంట్స్ రూం చేశాడు.
చిన్నప్పుడు మా అమ్మీ
నన్ను ప్రెజంటబుల్ గా వుంచేది. నాకు ఆదాయం రావడం మొదలయ్యాక పీటర్ ఇంగ్లండ్ నుండి
మొదలయ్యి లూయీ ఫిలిప్స్ మీదుగా అల్లెన్ సోలీ వరకు చేరాను. బాటా నుండి మొదలయ్యి
లిబర్టి మీదుగా నైక్ వరకు నడిచాను. వాడు నా మేకోవర్ ను ఇంకో మెట్టుకు తీసుకుని పోవాలనుకుంటాడు.
నన్ను పబ్బుకు తీసుకుని పోవడం వాడికో సరదా. “కమ్యూనిస్టులు సెలెక్టివ్ వరల్డ్ లో
బతుకుతుంటారు. నీకు తెలియని కొత్త ప్రపంచం వుంది. దాన్ని కూడ చూడు” అంటాడు. వాడిమాటల్లో
కొన్ని నాకు నచ్చవు. కొన్ని సందర్భాల్లో వారిస్తానుగానీ వాడు అలా నా గురించి శ్రధ్ధ
తీసుకోవడం చాలా నచ్చుతుంది.
హ్యాప్పీ బర్త్ డే
అనిల్ !
No comments:
Post a Comment