Uniform Civil Code (UCC) : Ideals, Difficulties and Politics
ఉమ్మడి పౌరస్మృతి : ఆదర్శాలు, ఇబ్బందులు, రాజకీయాలు
KNPS
Meeting, Narasaraopet
10th
July 2023 Sunday from 2 p.m.
Danny Talking Points
Duration : 60-75 Mnts.
వేదిక
మీదున్న-
వేదిక
ముందున్న-
పెద్దలందరికీ
జై
భీమ్ !
జై
మీమ్ !
మిత్రులారా!
1.
భారత రాజకీయార్ధిక సామాజిక రంగాల్లో ప్రస్తుతం మూడు అంశాల
మీద చాలా తీవ్రంగా చర్చ జరుగుతోంది.
2.
వీటిల్లో మొదటిది ‘మణిపూర్ లో జాతి హననం’, రెండవది దేశ సంపదను
కొందరు అస్మదీయ కార్పొరేట్లకు కట్టబెట్టడం, మూడవది ఉమ్మడి పౌరస్మృతి.
3.
నిజానికి ఈ మూడు వివాదాలు విడివిడి అంశాలు కాదు; ఈ మూడింటి
మధ్యన ఒక అంతస్సంబంధం వుంది.
4.
సదస్సు నిర్వాహకులు నాకు ఇచ్చిన టాపిక్ ‘ఉమ్మడి పౌరస్మృతి
: ఆదర్శాలు, ఇబ్బందులు, రాజకీయాలు’. నేను ఆ అంశాన్ని కేంద్రంగా తీసుకుని ప్రసంగిస్తాను.
సందర్భాన్నిబట్టి అవసరమైన మేరకు మిగిలిన రెండు అంశాలతోవున్న అంతస్సంబంధాన్ని ప్రస్తావిస్తాను.
5.
సంఘపరివారానికి రాజకీయ విభాగంగా 1951లో భారతీయ జన సంఘ్ పుట్టింది.
ఎమర్జెన్సీ తరువాత అది జనతా పార్టీలో విలీనమై పనిచేసింది. అక్కడి నుండి బయటికి వచ్చి 1980 లోక్
సభ ఎన్నికల తరువాత భారతీయ జనతా పార్టీ (బిజెపి)గా అవతరించింది.
6.
బిజెపి తొలిసారిగా 1984 లోక్ సభ ఎన్నికల్లో పాల్గొంది.
7.
పంజాబ్ లో కల్లోలం, దానికి ప్రతిగా ఆపరేషన్ బ్లూస్టార్, భింద్రేన్
వాల హత్య, దానికి ప్రతిగా అప్పటి ప్రధాని ఇంరిరాగాంధి హత్య, దానికి ప్రతిగా ఢిల్లీ
పరిసరాల్లో శిక్కుల ఊచకోత అనంతరం ఆ ఎన్నికలు జరిగాయి.
8.
ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఘన విజయం లభించింది. 47 శాతం ఓట్లతో
రికార్డు స్థాయిలో 414 సీట్లు సాధించింది.
9.
మతమైనారిటీలను వేధిస్తే ఎన్నికల్లో హిందూ ఓటు బ్యాంకు ధృవీకరణ
జరుగుతుందనే ఒక కొత్త ఫార్మూలాను ఈ ఎన్నికలు ముందుకు తెచ్చాయి.
10. 1984
ఎన్నికల్లో కేవలం 2 స్థానాలను మాత్రమే పొందిన బిజెపి ఢిల్లీ అల్లర్ల ఫార్మూలాను భారత
దేశం మొత్తానికి అన్వయించి రాజకీయ లబ్దిపొందాలని వ్యూహాలు రచించింది.
11. శిక్కులు
కేవలం పంజాబ్, ఢిల్లీ పరిసరాలకు పరిమితమైన మత మైనారిటీ సమూహం. ఢిల్లీ ఫార్మూలాను దేశమంతటా
అమలు చేయాలంటే అంతకన్నా పెద్ద మత మైనారిటీ సమూహమైన ముస్లింలను లక్ష్యంగా పెట్టుకోవాలని
బిజెపికి అర్ధం అయింది.
12. 1925లో
ఆరెస్సెస్ పుట్టినప్పుడే ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టుల్ని తమకు మూడు అంతర్గత
శత్రువులని ప్రకటించింది.
13. సంఘ
లక్ష్యమూ, రాజకీయ సన్నివేశము రెండూ బిజెపికి కలిసి వచ్చాయి.
14. అప్పటి
వరకు కాంగ్రెస్ మిశ్రమ ఆర్ధిక విధానాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీలు వర్గపోరాట
సిధ్ధాంతాన్ని కొనసాగిస్తూ వుండేవి.
15. భారత
రాజకీయాల్ని మతం కేంద్రంగా నడపడంలో బిజెపి గొప్ప నైపుణ్యాన్ని సాధించింది. ఆ ధాటికి
ఇతర ఆధునిక సిధ్ధాంతాలు, విధానాలు వెనుకబడిపోయాయి.
16. ముస్లింలను
వేధించడమే ఎన్నికల్లో తమ విజయరహాస్యం అని తెలుసుకున్న బిజెపి వ్యూహకర్తలు మూడు ప్రధాన
అంశాలను ముందుకు తెచ్చారు.
17. మొదటిది;
అయోధ్యలో రామమందిర నిర్మాణం, రెండవది; ఆర్టికల్ 370 రద్దు; మూడవది; ఉమ్మడి పౌరస్మృతి
అమలు.
18. ఈ
మూడూ సహజంగానే ముస్లింలను వేధించే లక్ష్యంతో రూపొందించిన విధానాలు.
19. నిర్మాణంకన్నా
నిర్మూలనకు ఎక్కువ మద్దతు దొరికే కాలం ఇది.
20. అయోధ్యలో
రామాలయాన్ని నిర్మించడంవల్ల వచ్చే ప్రయోజనంకన్నా బాబ్రీ మసీదును కూల్చడంవల్ల కలిగే
రాజకీయ ప్రయోజనం ఎక్కువ.
21. జమ్మూ
కశ్మీర్ కు స్వయంప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ 370, 35 ఏ లను రద్దు చేయడంతోపాటు రాష్ట్ర
హోదా కూడ లేకుండా చేశారు.
22. భారత
దేశంలో ఒక ముస్లిం అభ్యర్ధి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్న ఏకైక రాష్ట్రం ఇప్పుడు ఉనికిలో
లేదు.
23. ఇక
మూడవ అంశం ఉమ్మడి పౌరస్మృతి.
24. వివాహం,
విడాకులు, వారసత్వం, దత్తత, ఆస్తి హక్కు (marriage, divorce, inheritance,
adoption and property rights) లకు సంబంధించిన నియమనిబంధనల్ని పౌరస్మృతి అంటారు.
25. ఉమ్మడి
పౌరస్మృతి అనేది పశ్చిమ దేశాల ఆధునిక ఆదర్శం. భారత దేశం యూరోప్ దేశాల్లా భాషా ప్రయుక్త
దేశంకాదు. మనది అనేక జాతుల, అనేక సంస్కృతుల, అనేక భాషల, అనేక వాతావరణాల ఉపఖండం.
26. ఇక్కడ
ఉమ్మడి పౌరస్మృతిని రూపొందించడం, దానిని అందరి చేత ఆమోదింపచేయడం దాదాపు అసాధ్యం.
27. ఆ
తేనెతుట్టెను కదపడం ప్రమాదకరం అని ఈస్ట్ ఇండియా
కంపెనీ రెండవ గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్
గుర్తించాడు.
28. పౌరస్మృతి వ్యవహారాన్ని ఆయా మత సమూహాల ఇష్టాఇష్టాలకు
వదిలేశాడు.
29. ముస్లిం
సమాజం ఖురాన్ – హదీసుల్లోని నియమాలను తమ పౌరస్మృతిగా పాటించుకుంటామన్నారు. హిందూ సమాజం
మనుస్మృతిని పౌరస్మృతిగా పాటించుకుంటామన్నారు.
30. “That
in all suits regarding inheritance, marriage, caste and other religious usages
or institutions, the law of the Koran with respect to Mahometans [Muslims], and
those of the Shaster with respect to Gentoos [Hindus] shall be invariably be
adhered to” అంటూ 1772 ఆగస్టు 15న ఉత్తర్వులు జారీచేశాడు.
31. పరిపాలనా
సౌకర్యం కోసం బ్రిటీష్ విద్యావేత్త విలియం
జోన్స 1792లో ‘అల్ సిర్జియా’ పేరున ముస్లిం
పౌరస్మృతిని, 1794లో ‘the Institutes of Hindu Law or the Ordinances of Manu’ పేరున హిందూ
పౌరస్మృతిని రూపొందించాడు.
32. 1857నాటి
భారత ప్రధమ స్వాతంత్ర్య పోరాటం తరువాత ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనపోయి నేరుగా బ్రిటీష్
వలస పాలన మొదలయింది.
33. వలస
దేశంలో మరో తిరుగుబాటును నివారించడానికి తక్షణం ఒక శిక్షాస్మృతిని రూపొందించాల్సిన
అవసరం వారికి వచ్చింది.
34. లార్డ్
థామస్ బాబింగ్టన్ మెకాలే 1860లో తొలిసారిగా భారత శిక్షాస్మృతి (ఐపిసి)ని రూపొందించాడు.
ఇది ఉమ్మడి శిక్షాస్మృతి.
35. పౌరస్మృతిని
ఆ యా మత సమూహాల ‘పర్సనల్ లా’లుగా అనుమతించారు.
No comments:
Post a Comment