నేను
నేనేనా?!
ఉషా
ఎస్ డానీ
రాత్రి పార్టిలో ఇద్దరమ్మాయిలు పరిచయం అయ్యారు.
మొదటమ్మాయి పేరు రేష్మి; న్యూరో సర్జన్.
రెండో అమ్మాయి పేరు ఈషా; ఏదో ఇంగ్లీషు న్యూస్ ఛానల్ లో యాంకర్ గా పని చేస్తోంది. జ్యోతిష్యం ఆమె హాబీ.
మంచి కాంబినేషన్. లోకంలో డాక్టర్లు
జ్యోతిష్కులుగా ప్రవర్తిస్తుంటారు. జ్యోతిష్కులు డాక్టర్లుగా ప్రవ్ర్తిస్తుంటారు.
లోకంలో ప్రతి వృత్తిలోనూ ఓ జబ్బు వుంటుంది. జర్నలిస్టులకూ ఓ జబ్బు వుంటుంది. రాకెట్ సైంటిస్టు ఎదురైనాసరే ఆ సైన్సు తమకు తెలుసు అన్నట్టు ఓ ప్రశ్న వేసేస్తుంటారు. తాము ఏదో ఒకటి అడిగేస్తే వాళ్ళు ఏదో ఒకటి చెప్పేస్తే తాము ఏదో ఒకటి రాసేస్తే ఆ రోజుకు ఎక్స్ క్లూసివ్ స్టోరీ అయిపోతుందని వాళ్ళ నమ్మకం.
సోల్జర్స్ అండ్ జర్నలిస్ట్స్ నెవ్వర్ రిటైర్ అనే సామెత ఒకటుంది. నేను రిటైర్ అయిపోయినా నాలో జర్నలిస్టు రిటైర్మెంట్ తీసుకోలేదు.
“బయో కెమిస్ట్రీకీ న్యూరో సర్జరీకీ సంబంధం వుందంటారా?” అంటూ ఓ దిక్కుమాలిన ప్రశ్న సంధించాను.
దేనినయినా దేనితో అయినా సంబంధాన్ని అంటగట్టేయడం జర్నలిస్టుల వృత్తి ధర్మము. మందు పార్టీలో వున్నా జర్నలిస్టు జర్నలిస్టేగా.
రేష్మీ గొంతు పెంచి ‘యస్” అంది.
ఆమె అక్కడితో ఆగలేదు. ఏకంగా నన్ను ‘గినీ పిగ్’గా మార్చేసి నామీద ఒక అనాలిసిస్ ప్రెజెంట్ చేసేసింది.
లాబ్ లో ప్రయోగాలకు గిన్నీ పిగ్ అంటే మా మనోభావాలు దెబ్బతింటాయి. సుబ్బరంగా గిన్నీ ఫిష్ అనుకోవచ్చుగా?
నేను మాట్లాడే తీరు, నన్ను నేను ప్రెజెంట్ చేసుకునే విధానం, నా నవ్వు, నా ఇష్టాఇష్టాలు అవేవీ నావి కావంది రష్మీ.
“డోపమైన్, సెరోటొనిన్, రైన్స్ వగయిరా ఎంజైములు,
హార్మోన్లు మనుషుల
ఆలోచనల్ని,
భావోద్వేగాలను నియంత్రిస్తాయి”
అంది.
“మీవి నక్సలైట్ భావాలు కదా?” అని అడిగింది.
“భలే కనిపెట్టేశారే” అని కొంచెం ఇబ్బందిగా
నవ్వాను.
“మీకో విషయం తెలుసా? మీ భావాలు మీవికావు.
అవి మావోవి” అని ఒక ప్రకటన చేసింది.
“ అవును. నేను మావో జెడాంగ్ అభిమానిని”
అన్నాను.
“ఆ మావో వేరు. నాను చెప్పే మావో వేరు.
మోనో అమినె ఆక్సిడాసె. షార్ట్ గా ఎంఏవో; మావో” అంది.
నాకు కొంచెం మైండ్ బ్లాక్ అయినట్టయింది.
నక్సలైట్లు మావో ఆలోచనా విధానం వర్ధిల్లాలి అంటుంటారు. అసలు విషయం అది కాదట. మావో అనే ఎంజైము మనలో విప్లవ భావాలను కలిగిస్తుందట.
“అన్నీ అవే చేసేస్తే మరి నేనెవర్నీ? హూ యామై? కోహం? “ అని అడిగాను రావిశాస్త్రిగారి పిపీలకంలా.
“మిమ్మల్ని మీ మెదడు నియంత్రిస్తుంది; మీ మెదడును ఈ ఎంజైమ్స్ నియంత్రిస్తాయి” అంది కూల్ గా.
ఆమె నన్ను నేను కాకుండా చేసేస్తోందని భయం వేసింది. అప్పటికి తాగిందంతా దిగిపోయింది. గ్లాసులోవున్నది
గటగటా తాగేశాను.
“ఆ మధ్య ఒకామె నన్ను మీరంటే ఆసక్తి, అభిమానము, ఇష్టము, ఆప్యాయత, ప్రేమ, భక్తి ఇలా ఇంకేవో మాటలు అంది. ఇవన్నీ ఎంజైముల ప్రభావమేనా?” అని అడిగా.
“యా” అంది రేష్మీ.
ఆ ఒకామె ఈ వయసులోనూ నన్ను ప్రేమించేస్తున్నదనే ఆనందంలో కొన్నాళ్ళుగా గాల్లో తెలుతున్నాను. రేష్మీ “యా” తో నా కుర్చీ కింద నేల కుంగిపోతున్నట్టూ, నేను వెనక్కి తూలి పడిపోతున్నట్టూ అనిపించింది.
అక్షరాలతో తలపడేటప్పుడు శత్రువు బలంగావున్న చోట దాడి చేయాలనీ; ఆయుధాలతో తలపడేటప్పుడు శత్రువు బలహీనంగావున్న చోట దాడి చేయాలని చైనా మావో చెప్పాడు.
ఈ ఈషా అనే అమ్మాయి మావోను చదివిందని నాకు గట్టి అనుమానం. సరిగ్గా నేను తూలి పడిపోతున్న సమయంలోనే నామీద దాడి మొదలెట్టింది ఆ జ్యోతిషురాలు.
“ఆర్ యూ విర్గో?” అని
నిలదీసింది.
“నో. నేను విర్గోనుకాదు” అంటూ నా పేరు చెప్పాను అమాయికంగా.
ఆమెది హర్యాణ. ఆమెకు తెలుగు రాదు. నాకు ఆమెతో మాట్లాడేంత ఇంగ్లీషురాదు.
“మీ పేరుతో పని లేదు. నేను మాట్లాడేది మిమ్మల్ని నడిపే గ్రహారాశుల గురించి. యూ ఆర్ ఏ విర్గో. దట్స్ ఇట్” అంది ఇంకోసారి.
“తుఛ్ఛ మానవుడా! నువ్వంటే నువ్వు కాదురా; నీలోని ఆత్మరా” అనేస్తుందేమోనని చాలా భయపడ్డా.
“చూడ్డానికి బాగుండడం, మొఖమాటం లేకుండా మాట్లాడడం, తీపి మాటలతో ఎదుటివారిని మానుపులేట్ చేయాలని అనుకోకపోవడం ఇవన్నీ విర్గో లక్షణాలు” అని ఇంగ్లీషులో ఒక క్లాసు పీకింది.
ఆమె చెప్పినవన్నీ బాగున్నాయి. మొత్తం మెచ్చుకోలే వుంది. ఇందులో అభ్యంతరం చెప్పాల్సిందేమీ నాకు కనిపించలేదు. కానీ, ఇన్నాళ్ళూ నా గొప్పలుగా నమ్మూతూ బతికేస్తున్న వాటి మీద కాపీ రైట్స్ మొత్తం విర్గోవి అంటే మాత్రం చాలా బాధేసింది.
నాదేశం నాది కాదంటే ఎలావుంటుందో అలా అయిపోయింది నా పరిస్థితి.
అమ్మాయిల ముందు ఏడిస్తే బాగుండదని బాధను ఇంకోసారి గ్లాసుతో దిగమింగాను. నా బాధ ఆమెకు కనిపించకుండ చాలా జాగ్రత్త పడ్డాను. ఆ విషయం పైకి చెపితే “బాధను దాచుకోవడం కూడ విర్గో లక్షణం” అంటుందని భయం వేసింది.
నా గుణగణాలు ఎంజైములవి
అని ఒకమ్మాయి,
విర్గోవి అని ఇంకో అమ్మాయి క్లయిమ్ చేసుకుంటుంటే నేనేం కానూ అనే సందేహం నన్ను చట్టుముట్టింది.
సమాధానం దొరక్క నేను కుర్చీలో నిశ్చేష్టుడిగా వుండిపోయాను.
అప్పటికి నాలుగు పెగ్గులుగా లోపలికి దిగిన ఆ బ్లాక్ లేబుల్ జానీవాకర్ గాడు ఇక వీడి శరీరంలో వుండడం పరమ వేస్టు అనుకుంటూ వెళ్ళిపోయాడు.
మొత్తం దిగిపోయింది.
నన్ను ఆ అమ్మాయిలిద్దరూ నమిలి మింగేశారు;
ఇంకేమీ మిగలేదు.
హైదరాబాద్
26-sept – 2023
Dopamine, Serotonin, Rines
Mono Amine Oxidase (MAO)
Am I Even Myself?
By Usha S. Dani
It was at a late-night party that two young women were introduced to each other.The first, Reshmi, was a neurosurgeon. The second, Isha, was an anchor for an English news channel, with astrology as her chosen hobby.
A rather fitting combination, I mused. In this world, doctors often assume the role of astrologers, and astrologers, in turn, take it upon themselves to act as doctors. Every profession, as far as I had seen, was afflicted with some manner of ailment, and journalism was no exception. A journalist, even when face-to-face with a rocket scientist, could not resist the urge to ask an insipid question, their conviction unwavering that the mere act of posing a query, receiving a reply, and jotting it down transformed it into an exclusive story.
There is a saying—soldiers and journalists never retire. Though I had long since retired from my professional duties, the journalist within me remained steadfastly active.
And so, quite predictably, I posed a question that was, at best, absurd.
“Is there any conceivable link between biochemistry and neurosurgery?”
A journalist’s sacred duty is to forge connections between the most unrelated of things. Even amidst a drinking party, a journalist is bound by their nature.
Reshmi, raising her voice with an air of certainty, declared, “Yes!”She did not stop there. Without so much as a second’s hesitation, she turned me into a mere ‘guinea pig’ and proceeded to deliver an elaborate analysis of my being.
To be likened to a guinea pig in a laboratory was rather disconcerting. Surely, ‘guinea fish’ would be a more dignified comparison.
According to Reshmi, nothing about me—my manner of speaking, my self-presentation, my laughter, my likes and dislikes—was truly my own.
“Dopamine, serotonin, MAO… enzymes and hormones such as these control human thoughts and emotions,” she proclaimed.
Then, eyeing me keenly, she asked, “You harbour Naxalite ideologies, do you not?”
Her astuteness caught me slightly off guard. “Quite the deduction,” I responded with an uneasy chuckle.
“Would you care to know something rather astonishing?” she continued. “Your thoughts, they do not belong to you. They belong to MAO.”
I blinked, perplexed. “Indeed, I am a great admirer of Mao Zedong,” I admitted.
“Oh, I speak not of that Mao,” she clarified, her lips curving into a knowing smile. “I refer to monoamine oxidase—abbreviated as MAO.”
A fog settled over my mind.
For years, I had heard Naxalites speak of Maoist thought thriving in revolutionaries. And yet, here I was, learning that it was not ideology at all, but rather an enzyme, dictating radical tendencies within men.
The notion sent a chill through me.
“If all of this is predetermined… then what of myself? Who am I? What is my identity?” I inquired, much in the spirit of Ravishastri’s Pipilakam.
“Your brain governs you, and these enzymes govern your brain,” she replied coolly.
A creeping unease settled over me. The alcohol in my system seemed to have utterly dissipated. Instinctively, I picked up my glass and downed its remaining contents in one swift gulp.
Only a few days prior, a certain lady had professed her admiration for me—her fondness, her affection, her regard, even her love. Were all these, too, mere effects of biochemical influences?
I turned to Reshmi once more. “Tell me,” I demanded, “are even emotions such as love, devotion, and passion dictated by these enzymes?”
“Why, yes,” she said simply.
For weeks, I had been floating upon the blissful realisation that, even at this stage of my life, someone had found it in their heart to love me. But with that single ‘yes,’ Reshmi shattered my illusions, and I felt the ground beneath my chair give way, the earth tilting backward as though I might fall into an abyss.
Mao himself had once declared that when waging war with words, one must strike where the enemy is strongest, and when waging war with weapons, one must strike where the enemy is weakest.
I could not shake the feeling that this Isha woman had studied Mao well.
For just as I teetered at the edge of existential despair, she launched her own assault upon me.
“Are you a Virgo?” she demanded.
“No,” I replied instinctively, before stating my name.
She, from Haryana, spoke not a word of Telugu. And I, in turn, could not speak English fluently enough to engage in deep conversation with her.
“Your name is of no consequence. I speak of the planetary forces that shape you. You are a Virgo. That is final.”
I shuddered. Would she next proclaim, ‘Foolish man! You are not yourself, but your soul!’?
She launched into a lecture. “Being well-groomed, speaking candidly, refusing to manipulate others with sweet words—these are all hallmark traits of a Virgo.”
There was nothing in her assessment that I could dispute. Everything she listed was commendable. But the thought that all the qualities I had taken pride in my entire life belonged not to me, but to Virgo, left me wounded.
I was overcome with the same despair one might feel upon learning that one’s homeland is no longer one’s own.
It would not do to cry before these women. And so, once more, I drowned my distress in my glass. I took great care to ensure she did not perceive my sorrow, lest she remark, ‘Suppressing emotions? Ah, yet another Virgo trait!’
One woman laid claim to my nature in the name of enzymes; another, in the name of the stars. Left adrift between the two, I wondered—what, then, remained of me? Was I even myself?
I could find no answer. And so, in silence, I slumped into my chair, utterly resigned.
By then, the four pegs of Black Label whisky had fully settled into my bloodstream. And the weary Johnny Walker, finding no further purpose in my body, took his leave.
All was consumed. Nothing remained.
No comments:
Post a Comment