మాతృభాష ఒక ఆర్గానిక్ అనుబంధం
Mother tongue is an organic attachment
Author, Journalist, Documentary Filmmaker, Political Commentator, Literary Critic, Humourist, and Social Worker
మాతృభాష ఒక ఆర్గానిక్ అనుబంధం
Mother tongue is an organic attachment
Notes on the
Preamble Of The Indian Constitution
భారత రాజ్యాంగ పీఠిక
1.
The
Government of India Act was introduced in the British Parliament in the month
of July 1935.
2.
It received
Royal Assent and was passed into law on 2 August 1935.
3. Provincial government was the government that was
introduced before the independence of India.
4. Provisional Government of India was established on
October 21, 1943.
5.
It
was introduced for the provinces that were under British India. There was
another part of this government that was led by the governor and the ministers
that were appointed by him. These ministers were Indians.
6.
Jawahar
Lal Nehru was the Head of the Provisional Government of India.
7.
తాత్కాలిక
ప్రభుత్వం / Provincial Government - రాజ్యాంగ సభ
8.
The
constituent assembly was elected indirectly by the members of the Provincial
legislative assembly, which existed under the British Raj.
9.
The
constituent assembly was first met on December 9, 1946, in Delhi.
10. అప్పటికి పాకిస్తాన్ ఏడ్పడలేదు. దేశానికి స్వాతంత్ర్యం కూడ
రాలేదు.
11. ఇప్పటి పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రాంతపు సభ్యులు కూడ రాజ్యాంగ
సభలో వుండేవారు.
12. మొత్తం సభ్యుల సంఖ్య
13. Pandit Jawaharlal Nehru introduced the Objective Resolution
on December 13, 1946.
14. The Objective Resolution provides the philosophy of
the constitution. The Resolution was adopted by the Constituent Assembly on 22
January 1947.
15. Objective Resolution established the concept and
guiding principles for building the Constitution and eventually took the shape
of the Preamble to the Indian Constitution.
16. అయితే ఈ క్రమం అంత సజావుగా, అంత సూటిగా ఈ ప్రక్రియ సాగలేదు.
అనేక మలుపులు ఆటుపోట్లు వున్నాయి.
17. 1946 డిసెంబరు
1947 జూన్ మధ్య కాలంలో 389 మంది సభ్యులు వుండేవారు.
18. ముస్లిం లీగ్ సహకారంతో తూర్పు బెంగాల్ నుండి ఎన్నికయిన బిఆర్
అంబేడ్కర్ 1946 డిసెంబరు 9న రాజ్యాంగ సభ సభ్యుడయ్యాడు.
19. On August 15, 1947, India became an independent
nation, and the Constituent Assembly started functioning as India's Parliament.
20. పాకిస్తాన్ విడిపోవడంతో 90 మంది సభ్యులు అటు వెళ్ళిపోయారు.
ఇక మిగిలింది 299 మంది.
21. తూర్పు బెంగాల్ విడిపోవడంతో అంబేడ్కర్ రాజ్యాంగ సభ సభ్యత్వం
పోయింది. బాంబే ప్రావిన్స్ నుండి ఎన్నికయ్యి మళ్ళీ రాజ్యాంగ సభలో ప్రవేశించారు.
22. 29 ఆగస్టు 1947న అంబేడ్కర్ రాజ్యాంగ డ్రాప్టింగ్ కమిటికి ఛైర్మన్
అయ్యారు.
23. అంతకు ముందు బిఎన్ రావు రాజ్యాంగ డ్రాప్టింగ్ కమిటికి ఛైర్మన్
గా వుండేవారు. అప్పటికే వారు భారత రాజ్యాంగానికి తొలి ప్రతి తయారు చేశారు.
24. అంతర్జాతీయ న్యాయస్థానంలో పెద్ద పదవి ఆఫర్ రావడంతో బిఎన్
రావు అక్కడికి వెళ్ళిపోయారు.
25. నెహ్రు ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ ను, బిఎన్ రావు తొలి ప్రతిని
అంబేడ్కర్ పూర్తిగా మార్చేశారు.
26. అది చారిత్రక అవసరం కూడ.
27. దేశ విభజన జరగడం, పాకిస్తాన్ సభ్యులు వెళ్ళిపోవడం చిన్న అంశాలు.
28. అంతకన్నా మించిన అంశాలున్నాయి.
29. దేశ విభజన జరగ్గానే దేశంలో పెద్ద ఎత్తున మతకల్లోలాలు చెలరేగాయి.
30. పాకిస్తాన్ విడిపోయిన కారణంగా ముస్లిం వ్యతిరేకత పెరిగింది.
31. స్వాతంత్ర్యాన్ని అధికార మార్పిడిగా పేర్కొంటూ దేశంలో సాయుధపోరాటానికి
పిలుపు ఇచ్చింది.
32. ఇవన్నీ రాజ్యాంగ సభకు పెద్ద సవాలును విసిరాయి. వాటికి సమాధానం
ఇవ్వడం అంబేడ్కర్ బాధ్యతగా మారింది.
33. రాజ్యాంగ సభలో దాదాపు
డజను ఉప సంఘాలున్నాయి. వాటిల్లో డ్రాఫ్టింగ్ కమిటి ఒకటి.
34. అంబేడ్కర్ ను రాజ్యాంగ రచయిత అనడం ఆయన్ని అవమానించడమే అవుతుంది.
35. బిఎన్ రావు కాలంలో ఒక ఉత్సాహ భరిత వాతావరణం వుంది. అంబేడ్కర్
కాలంలో ఉద్రిక్త వాతావరణం వుంది,.
36. భారత రాజ్యాంగ రచయిత, నిర్మాత, రూపశిల్పి అన్నీ అంబేడ్కరే్.
37. సభ్యుల నుండి మరింత సహకారం లభించి వుంటే భారత రాజ్యాంగం మరింత ప్రగతిశీలంగా
వుండేది.
38. అక్కడికీ చివరి ప్రసంగంలో తన అభిప్రాయాల్ని, ఆందోళనను స్పష్తంగానే
చెప్పాడు. రాజ్యాంగం ద్వార ప్రజలకు రాజకీయ సమానత్వాన్ని మాత్రమే ఇవ్వ్గలిగాం. ప్రజలకు
సామాజిక ఆర్ధిక సమానత్వాన్ని ఇవ్వక పోతే ఈ రాజకీయ సమానత్వం కూడ నిలబడదు అనేశాడు.
39. సామాజిక ఆర్ధిక రంగాల్లో అసమానత్వానికి గురయ్యేవాళ్ళు తిరగబడి
ఈ ప్రజాస్వామిక భవనాన్ని పేల్చి పడేస్తారు అనికూడ హెచ్చరించారు.
ఒక నమ్మకంగా వున్నంత కాలం దైవ భావన బాగుంటుంది!
నిర్బంధంగా మార్చేసిన ధార్మిక ఫత్వాలను భరించలేం!
Siva Ram
Wonderful and meaningful statement sir.
22h22 hours ago
Reply
See translation
Jameel Mohammad
లా ఇక్రాహ ఫిద్దీన్
20h20 hours ago
Reply
AL Murali Krishna
17h17 hours ago
Reply
AL Murali Krishna
మతమన్నాక, కొన్ని పద్ధతులు, కొన్ని నిర్ణయాలు, కొన్ని నిర్భందాలు తప్పవు. ఇది దాని మనుగడకోసమే..
రోజుకు ఇన్నిసార్లు దేవుణ్ణి మొక్కాలి అని ముస్లిం లో లాగా మనకు లేదే..
క్రిస్టియానిటీ లో లాగా మనకు లేదే,..
కట్టుబాట్లు లేకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మన మత మనుగడ కష్టం మిత్రమా. 👍
17h17 hours ago
Reply
Sudhakar Reddy Suravaram
I don’t think it’s correct. I don’t agree but I agree that you have a right to say so
16h16 hours ago
Reply
See translation
Fazlur Rahman
పరిమితులతో కూడిన స్వేచ్చ ధర్మం ఇస్తుంది!
అనవసరమైన స్వేచ్ఛ కు కళ్లెం వేస్తుంది.
సత్ సమాజ నిర్మాణం కోసం వ్యక్తిగత స్వేచ్ఛ కొంత త్యాగం చేయక తప్పదు.
15h15 hours ago
Reply
A.m. Khan Yazdani Danny
Fazlur Rahman ఇదంతా ఎవరు చెప్పారూ? ఎక్కడ చెప్పారూ?
14h14 hours ago
Reply
Fazlur Rahman
A.m. Khan Yazdani Danny ji
ఎవరు చెప్పారు అనే విషయం కన్నా
చెప్పిన విషయం సరైనదా? కాదా? అన్న శాస్త్రీయ పరిశీలన చేయండి!
13h13 hours ago
Reply
A.m. Khan Yazdani Danny
Fazlur Rahman ఇంకొకరి ఆధిపత్యం దేనికీ?
13h13 hours ago
Reply
A.m. Khan Yazdani Danny
ధార్మిక రంగంలో
13h13 hours ago
Reply
A.m. Khan Yazdani Danny
శాస్త్రీయ పరిశీలన అంటే?
12h12 hours ago
Reply
Fazlur Rahman
A.m. Khan Yazdani Danny ji
ఇంకొకరు మాత్రమే మీకు కనిపిస్తున్నారు.
విషయం తప్పో ఒప్పో మాత్రమే కనిపిస్తోంది ఎవరు చెప్పారో అన్నది అవసరం లేని విషయం!
12h12 hours ago
Reply
A.m. Khan Yazdani Danny
Fazlur Rahman శాస్త్రీయ పరిశీలన
అనగా ఏమి?
10h10 hours ago
Reply
Fazlur Rahman
A.m. Khan Yazdani Danny ji
మీకు తెలిసి అడుగుతున్నారా? తెలియక అడుగుతున్నారా?
7h7 hours ago
Reply
A.m. Khan Yazdani Danny
ఇంకో మనిషి నా జీవితంలో జోక్యం చేసుకోవడం నాకు నచ్చదు. వాడు రోజుకు వందసార్లు నమాజ్ చేసేవాడైనా సరే.
12h12 hours ago
Reply
Fazlur Rahman
A.m. Khan Yazdani Danny ji
చట్ట పరిధిలో ఉన్నంత వరకూ ఏ వ్యక్తి (ప్రభుత్వ అధికారి) నీ.... లో జోక్యం చేసుకోడు.
చట్టాన్ని ఉల్లంఘన చేసిన మరుక్షణం మరొకరికి నీ..... జోక్యం అనివార్య మౌతుంది.
అది నీకు నచ్చినా నచ్చక పోయినా తప్పదు.
ధర్మం విషయంలో కూడా ఈ సూత్రం వర్తిస్తుంది!
7h7 hours ago
Reply
Edited
A.m. Khan Yazdani Danny
Fazlur Rahman
ముందు మతాన్ని సైన్స్ అన్నారు.
ఇప్పుడు చట్టం, పోలీసులు అంటున్నారు.
మతం పరలోక విశ్వాసానికి సంబంధించిన అంశం.
చట్టాలు -పోలీసులు ఇహ లోకానికి చెందిన అంశాలు.
ఈ మాత్రం తేడా కూడ తెలియని నిండు అజ్ఞానం.
ఆపైన కనీసపు ముఖ పరిచయం కూడ లేకపోయినా ఏకవచన ప్రయోగం!!
పైగా పోలీసుల్లా జోక్యం చేసుకుంటాం అనడం.
మీరేమయినా ధార్మిక పోలీసులా?
ఈ భూమ్మీద నాకు నచ్చని వ్యవస్థ పోలీసులు.
వాళ్ళు ప్రభుత్వ పోలీసులు అయినా, ధార్మిక పోలీసులు అయినా సరే.
పాపపుణ్యాలు అల్లాకు సంబంధించిన అంశాలు.
నేను చచ్చాక ఆ చిట్టా ఆయన తెరుస్తాడు.
పాపం పాళ్ళు ఎంతో పుణ్యాం పాళ్ళు ఎంతో తేలుస్తాడు.
నేను పుణ్యం ఎక్కువగా చేస్తే ఆయన మెచ్చుకుంటాడు.
నేను పాపాలు ఎక్కువగా చేస్తే ఆయన శిక్షిస్తాడు.
అల్లామియా చేయాల్సిన పనులు మీరు చేయవద్దు.
మీకు మీరు అల్లాగా భావించుకుంటామంటే నాకు బాగా మండుతుంది.
దేవుడు ఒక్కడే అనే ఇస్లాం మౌలిక ధార్మిక సూత్రానికే మీ భావన పూర్తి వ్యతిరేకం.
మనదేశంలో సంఘపరివారం కార్యకర్తలు కొన్నేళ్ళుగా ధార్మిక పోలీసుల్లా వ్యవహరిస్తున్నారు.
ఇప్పుడు మీకు మీరు ధార్మిక పోలీసులు అవుదామని ఉవ్విళ్ళూరుతున్నారు.
ఇద్దరూ ఒక్కటే. మీ మధ్య తేడా ఏమీలేదు.
ఇది భారత ముస్లిం సమూహానికేకాక మొత్తం భారత సమాజపు లౌకిక ఆదర్శాలకు పెద్ద అంతర్గత ముప్పు.
1mabout a minute ago
Reply
SI Shafee
👍👌
Suraj Sayyed
మీరు భారతదేశం సంగతి మాట్లాడుతున్నారా? ఇక్కడైతే ఏ మతానికి ఆ పరిస్థితి లేదు. ఫత్వా అన్నారు కాబట్టి బహుశా మీరు ఇస్లాం ని గురించి మాట్లాడుతున్నట్టుగా ఉంది. మన దేశంలో అయితే ఇస్లాంకు కూడా ఆ పరిస్థితి లేదు. మనది సెక్యులర్ స్టేట్ అనే సంగతి బహుశా మరిచిపోయినట్టున్నారు. మరి ఈ పోస్టులో సందేశం ఏమిటో నాకైతే అర్థం కాలేదు 🤔
A.m. Khan Yazdani Danny
Suraj Sayyed మత గురువులు ఇచ్చే ధార్మిక ఆదేశాలనే ముస్లింలు ఫత్వాలంటారు.
నేను ముస్లింని కనుక ధార్మిక ఫత్వా అన్నాను. మనది సెక్యూలర్ స్టేట్ గాబట్టే ఈ పోస్టు పెట్టాల్సి వచ్చింది. సెక్యూలర్ అంటే నా ఉద్దేశ్యంలో మతసామరస్యం.
Suraj Sayyed
A.m. Khan Yazdani Danny ఒకసారి గూగుల్ చేసి చూడండి. సెక్యులర్ అంటే మతరహితంగా ఉండడం. అది కూడా ప్రభుత్వాలు మతరహితంగా ఉండడం ఇది యూరోపియన్ కాన్సెప్ట్.
A.m. Khan Yazdani Danny
Suraj Sayyed
గూగుల్ చెప్పింది ఒక అర్ధం మాత్రమే . దానికి విస్తారమైన అర్ధాలు అనేకం వుంటాయి. ప్రభుత్వం మతాతీతంగా వ్యవహరించాలనేది ఒక అర్ధం. భారత రాజ్యాంగం పీఠిక సెక్యూలర్ సమాజాన్ని నిర్మిస్తామని చెప్పుకుంది. అప్పుడు మత రహిత సమాజాన్ని నిర్మిస్తామని అర్ధమా? మత సామరస్య సమాజాన్ని నిర్మిస్తామని చెప్పడమా? పరిమిత అర్ధాలకు పరిమితం కావద్దు.
ఒక నమ్మకంగా వున్నంత కాలం దైవ భావన బాగుంటుంది!
నిర్బంధంగా మార్చేసిన ధార్మిక ఫత్వాలను భరించలేం!
"La Iqraha fi al-Deen" ( لا إكراه في الدين) లా ఇక్రాహ ఫిద్దీన్
La Iqraha phi id deen (Arabbi) - elaborate
ChatGPT
The phrase "La Iqraha fi al-Deen" (Arabic: لا إكراه في الدين) translates to "There is no compulsion in religion" in English. This phrase is found in the Quran, specifically in Surah Al-Baqarah (2:256). It is often cited to emphasize the principle of religious freedom and the importance of voluntary faith in Islam.
Context and Interpretation
1. Literal Meaning
No Compulsion in Religion: The phrase explicitly states that one cannot be forced to accept or practice a religion. Faith and belief should be matters of personal conviction and conscience.
2. Historical Context
Revelation Context: This verse was revealed in Medina, a period during which Muslims were establishing a diverse and multi-religious society. The verse underscores that people should embrace Islam by choice rather than by force.
Theological and Philosophical Implications
1. Voluntary Faith
Authentic Belief: The essence of faith in Islam is based on genuine belief and voluntary acceptance. Compulsion contradicts the sincerity required for true faith.
Spiritual Integrity: For faith to have spiritual value, it must come from an individual's free will, ensuring that the belief is heartfelt and not merely superficial compliance.
2. Religious Tolerance
Interfaith Relations: This principle supports coexistence and respect among different religious communities. It highlights that Islam recognizes and respects the right of individuals to follow their own religious paths.
Civic Harmony: By promoting religious tolerance, the verse encourages social harmony and peaceful coexistence in a pluralistic society.
3. Legal and Ethical Dimensions
Legal Framework: In Islamic jurisprudence, this verse has been used to argue against forced conversions and to uphold the rights of non-Muslims living in Muslim-majority societies.
Ethical Conduct: It sets a moral standard for Muslims, advocating for persuasion through reason and compassion rather than coercion.
Application in Contemporary Context
1. Modern Interpretations
Human Rights: The principle is often invoked in discussions about religious freedom and human rights, asserting that coercion in religious matters is fundamentally opposed to the teachings of Islam.
Diverse Societies: In multicultural and multi-religious societies, this verse is seen as a foundational text advocating for the respect of individual religious choices. (రోటి - బేటి)
2. Interfaith Dialogue
Building Bridges: The verse serves as a basis for interfaith dialogue and understanding, promoting mutual respect and cooperation among different religious groups.
Conclusion
The phrase "La Iqraha fi al-Deen" encapsulates a core value in Islam that emphasizes the importance of free will in matters of faith. It underscores the principle that true belief cannot be compelled, reflecting a commitment to religious tolerance, freedom, and respect for individual conscience. By advocating for voluntary faith and opposing coercion, this verse lays the groundwork for peaceful coexistence and mutual respect among diverse religious communities.
SURAH AL-BAQARAH AYAT 256 (2:256 QURAN) WITH TAFSIR
Surah Al-Baqarah >> Currently viewing Surah Baqarah Ayat 256 (2:256)
SURAH BAQARAH AYAT 256 IN ARABIC TEXT
لَآ إِكۡرَاهَ فِي ٱلدِّينِۖ قَد تَّبَيَّنَ ٱلرُّشۡدُ مِنَ ٱلۡغَيِّۚ فَمَن يَكۡفُرۡ بِٱلطَّـٰغُوتِ وَيُؤۡمِنۢ بِٱللَّهِ فَقَدِ ٱسۡتَمۡسَكَ بِٱلۡعُرۡوَةِ ٱلۡوُثۡقَىٰ لَا ٱنفِصَامَ لَهَاۗ وَٱللَّهُ سَمِيعٌ عَلِيمٌ
Laaa ikraaha fid deeni qat tabiyanar rushdu minal ghayy; famai yakfur bit Taaghooti wa yu’mim billaahi faqadis tamsaka bil’urwatil wusqaa lan fisaama lahaa; wallaahu Samee’un ‘Aleem
ENGLISH TRANSLATION
Here you can read various translations of verse 256
SAHIH INTERNATIONAL
There shall be no compulsion in [acceptance of] the religion. The right course has become clear from the wrong. So whoever disbelieves in Taghut and believes in Allah has grasped the most trustworthy handhold with no break in it. And Allah is Hearing and Knowing.
YUSUF ALI
“Let there be no compulsion in religion: Truth stands out clear from Error: whoever rejects evil and believes in Allah hath grasped the most trustworthy hand-hold, that never breaks. And Allah heareth and knoweth all things.
ABUL ALA MAUDUDI
There is no compulsion and coercion in regard to religion. The right thing has been made distinct from the wrong thing: now whoever rejects taghut and believes in Allah has taken a firm support that never gives way.
MUHSIN KHAN
There is no compulsion in religion. Verily, the Right Path has become distinct from the wrong path. Whoever disbelieves in Taghut and believes in Allah, then he has grasped the most trustworthy handhold that will never break. And Allah is All-Hearer, All-Knower.
PICKTHALL
There is no compulsion in religion. The right direction is henceforth distinct from error. And he who rejecteth false deities and believeth in Allah hath grasped a firm handhold which will never break. Allah is Hearer, Knower.
DR. GHALI
There is no compulsion in the religion; right-mindedness has already been evidently (distinct) from misguidance. So whoever disbelieves in the Taghût (i.e. false gods, idols, devils and seducers) and believes in Allah, then he has already upheld fast the most binding Grip, with no disjunction (ever); and Allah is Ever-Hearing, Ever-Knowing.
ABDEL HALEEM
There is no compulsion in religion: true guidance has become distinct from error, so whoever rejects false gods and believes in God has grasped the firmest hand-hold, one that will never break. God is all hearing and all knowing.
MUHAMMAD JUNAGARHI
دین کے بارے میں کوئی زبردستی نہیں، ہدایت ضلالت سے روشن ہوچکی ہے، اس لئے جو شخص اللہ تعالیٰ کے سوا دوسرے معبودوں کا انکار کرکے اللہ تعالیٰ پر ایمان ﻻئے اس نے مضبوط کڑے کو تھام لیا، جو کبھی نہ ٹوٹے گا اور اللہ تعالیٰ سننے واﻻ، جاننے واﻻ ہے
QURAN 2 VERSE 256 EXPLANATION
For those looking for commentary to help with the understanding of Surah Baqarah ayat 256, we’ve provided two Tafseer works below. The first is the tafseer of Abul Ala Maududi, the second is of Ibn Kathir.
ALA-MAUDUDI IBN-KATHIR
ALA-MAUDUDI
(2:256) There is no compulsion in religion.[285] The Right Way stands clearly distinguished from the wrong. Hence he who rejects the evil ones[286] and believes in Allah has indeed taken hold of the firm, unbreakable handle. And Allah (Whom he has held for support) is All-Hearing, All-Knowing.
285. Din here signifies the belief about God embodied in the above ‘Verse of the Throne’ and the entire system of life which rests upon it. The verse means that the system of Islam, embracing belief, morals and practical conduct cannot be imposed by compulsion. These are not things to which people can be yoked forcibly.
286. Literally taghut means anvone who exceeds his legitimate limits. In the Qur’anic terminology, however, it refers to the creature who exceeds the limits of his creatureliness and arrogates to himself godhead and lordship. There are three stages of man’s transgression and rebellion against God. The first stage is that one acknowledges in principle that obedience to God is right, but disregards it in practice. This is fisq (transgression). The second stage is that one not only disobeys but also rejects obedience in principle, and thus either refuses to become the subject of anyone at all or adopts someone other than God as the object of service and devotion. This is kufr (infidelity). The third stage is that one not only rebels against one’s Lord but also imposes one’s own will (in disregard of the Will of God – Ed.) on God’s world and God’s creatures. Anyone who reaches such a point is termed taghut and no one can be a true believer in God unless the authority of such a taghut (evil one) is rejected.
*భారత రాజ్యాంగానికి వెన్నెముక ‘పీఠిక’*
భారతదేశానికేకాక భారత రాజ్యాంగానికి కూడ ఒక ప్రత్యేకత వుంది. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం భారతదేశం అయితే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం కూడ భారత దేశానిదే.
గతంలో న్యాయమూర్తులు, అడ్వకేట్లు, కొందరు అకడమిషియన్లు, కొందరు సామాజిక కార్యకర్తలు తప్ప ఇతరులెవ్వరికీ రాజ్యాంగం గురించి తెలిసేది కాదు. ఆ అవసరమూ వుండేదికాదు. ఇప్పుడు అలాకాదు. సామాన్యులకు సహితం రాజ్యాంగం మీద ఎంతోకొంత అవగాహన వుంటోంది.
ఈసారి చంద్రబాబుతో జతకట్టిన మోదీజీ వెంటనే జగన్ అరెస్టుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని ఈమధ్య చాలా గట్టిగా వినిపిస్తున్నది. బిల్లులు చట్టాలు కావడానికి లోక్ సభలో మెజారిటీవుంటే సరిపోదు రాజ్యసభలోనూ మెజారిటీ మద్దతు కావాలి. బిజెపికి లోక్ సభలో మెజారిటీవున్నా రాజ్యసభలో ఇప్పటికీ మెజారిటీ లేదు. కనుక, మద్దతు కోసం వైయస్ జగన్ అరెస్టును వాయిదా వేస్తది. రాజ్యసభలో బిజెపికి మెజారిటి వచ్చిన మరుక్షణం జగన్ కు మోదీ, అమిత్ షాలు సినిమా చూపిస్తారని గ్రామాల్లో రచ్చబండ మీద మాట్లాడుకోవడాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు పాఠ్యపుస్తకాల నుండి పల్లెటూర్ల వరకు రాజ్యాంగం నిత్యావసర సరుకుగా మారింది.
బిజెపి మూడోసారి అధికారానికి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు అనే వాదనను ఇటీవలి ఎన్నికల ప్రచారంలో విపక్షాలు బలంగా ముందుకు తెచ్చాయి. అందుకు విరుధ్ధమైన వాదనలూ వినిపించాయి. రాజ్యాంగాన్ని మార్చడం అంత సులువైన వ్యవహారంకాదు. అది ఒక సుదీర్ఘ ప్రక్రియ. పార్లమెంటు వుభయ సభల్లో భారీ సంఖ్యాబలం కూడ కావాలి. రాజ్యాంగంలోని కొన్ని అధీకరణలకు సవరణలు చేయవచ్చు. అలా ఇప్పటివరకు 106 సార్లు సవరించారు. అయితే, రాజ్యాంగ పీఠికను సవరించడం అంత సులువా? అంటే కష్టమే అనుకోవాల్సి వుంటుంది.
భారత రాజ్యాంగానికి ప్రాణం, వెన్నెముక, కళ్ళు, మెదడు అన్నీ దాని పీఠికే. భారతదేశాన్ని ‘సర్వసత్తాక సామ్యవాద, మతసామరస్య, ప్రజాస్వామిక రిపబ్లిక్’ అని మన రాజ్యాంగ పీఠిక పేర్కొంటోంది. 1949 నవంబరు 26న ఆమోదించిన రాజ్యాంగ పీఠికలో ‘సర్వసత్తాక ప్రజాస్వామిక రిపబ్లిక్’ అని మాత్రమే వుందన్నది వాస్తవం. ‘సామ్యవాద, మతసామరస్య’ స్వభావాలు మొదట్లో లేవు; ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కాలంలో 1976 డిసెంబరు 18న 42వ రాజ్యాంగ సవరణ ద్వార ‘సామ్యవాద, మతసామరస్య’ స్వభావాన్ని అడ్దంగా చేర్చారనే వాదనను బిజెపి చాలా కాలంగా చేస్తోంది.
తాము ఇక్కడవున్నది రాజ్యాంగాన్ని మార్చడానికే అని చెప్పిన నాయకులూ ఆ పార్టీలో కొందరున్నారు. దీనికి విరుధ్ధమైన వాదన కూడ బలంగానే వుంది. ప్రజాస్వామ్యానికి విస్తృత అర్ధమే ‘సామ్యవాద, మతసామరస్య’ భావనలని గట్టిగా వాదిస్తున్నవారూ వున్నారు. రాజ్యాంగం ద్వార దేశ ప్రజలు ‘తమకుతాము’ ఇచ్చుకున్న హామీల్లో, న్యాయం, స్వేఛ్ఛ, సమానత్వం, సోదరభావం వున్నాయి. వీటిల్లోనూ అంతర్లీనంగా ‘సామ్యవాద, మతసామరస్య’ భావనలున్నాయి.
“న్యాయం, స్వేఛ్ఛ, సమానత్వం, సోదరభావాలు” ఏమాత్రం భారత సాంప్రదాయం కాదనీ వాటిని బయటి దేశాల నుండి అరువు తెచ్చి రాజ్యాంగంలో బలవంతంగా జొప్పించారని అప్పట్లోనే ఆరెస్సెస్ వంటి సంస్థలు గట్టిగానే విమర్శించాయి. వాటికన్నా మనుస్మృతియే మన సమాజానికి సరిగ్గా సరిపోతుందని బలంగా వాదించాయి.
“న్యాయం, స్వేఛ్ఛ, సమానత్వం, సోదరభావాలు” ఎక్కడి నుండి వచ్చాయి? వాటిని రాజ్యాంగంలో ఎవరు పెట్టారూ? అనే విషయంలోనూ భిన్నాభిప్రాయాలున్నాయి.
1789 నాటి ఫ్రెంచ్ విప్లవంలో ఈ నినాదాలు మార్మోగాయి. అయితే తాను బుధ్ధుని బోధనల నుండి ఈ నాలుగు ఆదర్శాలను స్వీకరించినట్టు గొప్ప దార్శినికులు, భారత రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షులు బిఆర్ అంబేడ్కర్ ఓ సందర్భంలో పేర్కొన్నారు. ఫ్రెంచ్ విప్లవ నినాదాలను జవహర్ లాల్ నెహ్రు సహితం విపరీతంగా అభిమానించేవారు.
రెండవ ప్రపంచ యుధ్ధం ముగిశాక, బ్రిటీష్ ఇండియాకు స్వాతంత్ర్యాన్ని ఇవ్వడానికి బ్రిటన్ ప్రభుత్వం ఆమోదించింది. బ్రిటీష్ ఇండియాను స్వతంత్ర ఇండియాగా మార్చే ప్రక్రియను సజావుగా సాగించడానికి 1946 సెప్టెంబరు 2న భారత తాత్కాలిక ప్రభుత్వం (Provisional Government of India) ఏర్పడింది. అదే రాజ్యాంగ సభగానూ పనిచేసింది.
భారత తాత్కాలిక ప్రభుత్వానికి అధినేతగా వుండిన జవహర్ లాల్ నెహ్రు 1946 డిసెంబరు 13న రాజ్యాంగ లక్ష్యాల తీర్మానాన్ని (Objectives Resolution) ప్రవేశపెట్టారు. దాన్ని 1947 జనవరి 22న రాజ్యాంగ సభ ఆమోదించింది. ఈ తీర్మానంలోనే న్యాయం, స్వేఛ్ఛా, సమానత్వం, సోదరభావాలు అనే ఆదర్శాలు చాలా వివరంగా వున్నాయి.
పౌరసత్వ సవరణ చట్టానికి (సిఏఏ) వ్యతిరేకంగా 2019 చివర్లో ఢిల్లీ శివార్లలోని షాహీన్ బాగ్ లో ఉద్యమం ఆరంభమయినప్పుడు భారత రాజ్యాంగమే ఆధునిక ‘మతగ్రంధం’గా మారిపోయింది. ఆందోళనకారులైన ముస్లిం మహిళలు ఒక చేత్తో మువ్వన్నెల జాతీయ జెండాను పట్టుకుని మరో చేతిలో భారత రాజ్యాంగాన్ని గుండెలకు హత్తుకుని, ఒళ్ళో గాంధీజీ, అంబేడ్కర్ ల ఫొటోలు పెట్టుకుని “న్యాయం, స్వేఛ్ఛా, సమానత్వం, సోదరభావం” అంటూ నినదించారు. వ్యవసాయిక చట్టాలకు వ్యతిరేకంగా ఆరంభమయిన రైతుల చారిత్రాత్మక ఆందోళన కూడ షాహీన్ బాగ్ నుండి స్పూర్తిపొంది రాజ్యాంగాన్ని గుండెలకు హత్తుకుంది.
‘భారత రాజ్యాంగ పీఠిక’ చారిత్రక ప్రాధాన్యాన్నీ, ప్రాసంగికతను గుర్తించి ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఓ పుస్తకాన్ని రాశారు. రాజ్యాంగానికి సంబంధించిన అనేక పార్శ్వాలను 18 పర్వాల్లో ఇందులో ఆవిష్కరించారు.
భారత రాజ్యాంగం మీద రాయడానికి సరైన ఛాయిస్ మాడభూషి శ్రీధర్ అయితే, ఈ పుస్తకాన్ని ప్రచురించడానికి కూడా సరైన ఛాయిస్ సాహితీ మిత్రులు విజయవాడ ‘శ్రీశ్రీ’ విశ్వేశ్వర రావు. పుస్తకాల ప్రచురణలో తనకు ఒక రోడ్ మ్యాప్ వుంది.
మేధోరంగంలో ఎప్పుడూ ఏదో ఒక అంశం ప్రధాన చర్చగా మారుతుంటుంది. అదేమిటో తెలుసుకోవడానికి ఒక షార్ట్ కట్ వుంది; విశ్వేశ్వరరావు కొత్తగా ప్రచురించిన పుస్తకాన్ని చదవడం. తను ప్రచురించే పుస్తకాలను జాగ్రత్తగా గమనిస్తే తెలుగు రాజకీయ సామాజిక రంగాల పరిణామ క్రమం అర్ధం అవుతుంది. అతని ప్రచురణలు సోషల్ బారోమీటర్స్.
(‘భారత రాజ్యాంగ పీఠిక’ పుస్తకాన్ని హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జూన్ 15 శనివారం సాయంత్రం జస్టిస్ బి సుదర్శన రెడ్డి ఆవిష్కరిస్తున్నారు)
12-06-2024
ప్రచురణ
ఆంధ్రజ్యోతి దినపత్రిక, 14-06-2924
https://www.andhrajyothy.com/2024/editorial/the-backbone-of-the-constitution-is-the-pitihika-1267899.html
AP Election Results Surpass Tsunami
*సునామీని మించిపోయిన ఏపి ఎన్నికల ఫలితాలు*
డానీ
సమాజ విశ్లేషకులు,
సీనియర్ జర్నలిస్టు
ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైయస్ జగన్ మోహన రెడ్డిని ముఖ్యమంత్రి
పదవి నుండి తొలగించేశారు. అధికార పార్టి మీద
ప్రజల్లో సహజంగానే కొంత వ్యతిరేకత వుంటుంది. కానీ ఇంతటి వ్యతిరేకత వుందని విపక్ష పార్టీలు కూడ
ఊహించి వుండవు. 2019లో వైసిపికి 151 స్థానాలిచ్చిన ప్రజలు ఐదేళ్ళు తిరగ్గానే 11 స్థానాలకు
దించేశారు. ఇది ఓటమి మాత్రమే కాదు; ఘోర పరాజయం.
జగన్ ఓటమి
మీద రెండు రకాల నేరేటివ్స్ బలంగా వినిపిస్తున్నాయి.
జగన్ తన నియంతృత్వ పోకడలవల్ల, ఫ్యాక్షనిస్టు మనస్తత్వంవల్ల, వ్యవస్థల్ని ఓవర్ యూజ్
కాదు; అబ్యూజ్ చేయడం మూలంగా ఓడిపోయారు అనేది
మొదటి నేరేటివ్. తెలుగులో దీన్ని క్రూరంగా
చెరచడం అనవచ్చు. సంక్షేమపథకాలు – ఉచితాలవల్ల ఓడిపోయారు అనేది రెండవ నేరేటివ్.
మొదటి నేరేటివ్ తో ఎవరికీ అభ్యంతరం వుండాల్సిన పనిలేదు. కానీ, రెండో నేరేటివ్ మీద కొంత
వివేకంతో నిర్ణయాలు తీసుకోవాలి.
అవకాశాలు
వున్నోళ్ళు అవకాశాలు లేనోళ్ళు కలిసి వుండే సమాజాల్లో అవకాశాలు లేనోళ్ల మీద ప్రభుత్వాలు
అదనపు ప్రేమను చూపించాల్సివుంటుంది. దీన్ని వివక్షగా చిత్రించి విమర్శించేవాళ్ళూ సమాజంలో
వుంటారు. వాళ్ళు వీటిని ‘ఉచితాలు’ అంటూ ఎద్దేవ చేస్తుంటారు. అవకాశాలు ఎక్కువగా వున్నోళ్ళు
సాధారణంగా ఇలాంటి వాదనలు చేస్తుంటారు. అవకాశాలు లేనోళ్ళను ఆదుకోవడానికి ‘సానుకూల వివక్ష’
(Positive Discrimination) ను పాటించడం అవసరం.
జగన్ ఓటమి కారణంగా భవిష్యత్తులో ‘సానుకూల వివక్ష’ అనే విధానం మాసిపోకూడదు. ఎలాగూ
చంద్రబాబు సూపర్ సిక్స్ పేరుతో మరిన్ని సంక్షేపథకాలు ప్రకటించారు. సంక్షేమం కొనసాగుతుంది.
కొనసాగాలి కూడ.
గత ఏడాది
జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసిఆర్
ఓడిపోయినపుడు, ఆయన్ని అభిమానించే ఓ పత్రికాధిపతి నాకు ఫోన్ చేశారు. “అనేక రకాల సంక్షేమ
పథకాలతో అన్నివిధాలా ఆదుకున్న కేసిఆర్ ను ప్రజలు ఓడించారు” అనే కాన్సెప్ట్ తో ఒక వ్యాసం
రాసిపంపమన్నారు. “కేసిఆర్ ఓడిపోవడానికి కారణం సంక్షేమ పథకాలు, నీటిపారుదలా ప్రాజెక్టులు కాదు; ఆయన అహంకారం, నిరంకుశత్వం, కుటుంబ
పాలన ఆయన్ను ఓడించింది” అన్నాను.
జగన్ విషయంలోనూ సరిగ్గా అదే జరిగింది. రాజశేఖర రెడ్డి
హయాంలో మంత్రివర్గంలో గొప్ప టీం వుండేది. ఆర్ధికమంత్రి
రోశయ్య, హోంమంత్రి జానా రెడ్డి, వ్యవసాయశాఖామంత్రి రఘువీరారెడ్డి, రెవెన్యూమంత్రి ధర్మాన
ప్రసాద రావు, మునిసిపల్ శాఖామంత్రి కోనేరు రంగారావు, దేవాదాయ శాఖామంత్రి జేసి దివాకర్
రెడ్డి, నీటిపారుదలాశాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఎంఎస్ సత్యనారాయణ, డి శ్రీనివాస్, సబితా ఇంద్రారెడ్డి, నేదురుమల్లి రాజ్యలక్ష్మి,
గీతారెడ్డి ఎవరికి వారు తమ శాఖల విషయాల్లో చాలా అప్ డేట్ గా వుండేవారు. డి శ్రీనివాస్,
ఎంఎస్ సత్యనారాయణ, జేసి దివాకర్ రెడ్డి, మర్రి
శశిధర్ రెడ్డి తదితరులు అప్పుడప్పుడు విలేకరుల ముందే వైయస్ మీద కొంత అసంతృప్తిని వ్యక్తం
చేస్తుండేవారు. అది వైయస్ కు కూడ తెలుసు. కానీ
అందరూ టీమ్ ధర్మాన్ని పాటించేవారు. అందుకే, విపక్షాలు మహాకూటమి కట్టినా వైయస్ టీం 2009
ఎన్నికల్లో మళ్ళీ గెలిచింది. ఆ టీమ్ వారసత్వం జగన్ కు లేదు; రాలేదు. జగన్ ఎన్నడూ బహువచనం
కాదు; ఏకవచనం.
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ప్రధాన రాష్ట్రం. ప్రభుత్వంలో వ్యవసాయ,
నీటిపారుదలా శాఖలు ప్రాణం వంటివి. వ్యవసాయశాఖామంత్రి వ్యవసాయం గురించి మాట్లాడడం, నీటిపారుదలాశాఖామంత్రి
నీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడడం గత ఐదేళ్లలో మనం వినివుండం. జగన్ కేబినేట్ లో సకలశాఖలకు ఒకరే మంత్రి;
సజ్జల రామకృష్ణారెడ్డి. ఇది ప్రజలకు ఏమాత్రం
నచ్చలేదు. తెలంగాణలో కేటిఆర్, కవిత కలిసి కేసిఆర్ ను ఓడించినట్టు ఏపిలో సజ్జల
రామకృష్ణారెడ్డి ఒంటి చేతి మీద జగన్ ను ఓడించారు.
జగన్ నిర్మూలన మీద పెట్టినంత శ్రధ్ధను నిర్మాణం మీద పెట్టలేదు.
‘వాళ్ళ ఇల్లు కూలగొట్టారు, వీళ్ల ఇళ్ళు కూలగొట్టారు’ అనే వార్తలుతప్ప ఆ ప్రాజెక్టు కట్టించారు, ఈ రోడ్డు వేయించారు అనే
వార్తలు వినిపించలేదు. చంద్రబాబును అరెస్టు చేయడం దీనికి పరాకాష్ట. అప్పట్లో జగన్ ను
అరెస్టు చేయడంవల్ల సానుభూతి పెరిగినట్టు ఇప్పుడు చంద్రబాబు మీద సానుభూతి పెరిగింది.
ఈ చిన్న లాజిక్ ను జగన్ ఎలా మరిచారో?
వైయస్ రాజశేఖర రెడ్డి తన మీద ఫ్యాక్షనిస్ట్ ముద్రపడకుండ జాగ్రత్తలు
పడేవారు. జగన్ ఫ్యాక్షనిస్టుగా గుర్తింపు పొందడానికి ఉత్సాహం చూపారు. వారు సాగించిన
ప్రతీకార చర్యలు ప్రజలకు నచ్చలేదు. ఆయన ‘నవరత్నాల’
లబ్దిదారులు సహితం జగన్ కు వ్యతిరేకంగా ఓటేశారు. కులంలేదు మతంలేదు ప్రాంతంలేదు అందరిదీ
సింగిల్ పాయింట్ ప్రోగ్రాం జగన్ ను దించేయడం. అందరిదీ అంటే అతిశయోక్తి కావచ్చుగానీ,
రాష్ట్రంలో కనీసం 60 శాతం మంది జగన్ ను కఛ్ఛితంగా ఓడించాలనుకున్నారు!.
సామ్యవాద, మతసామరస్య భావాలు కలిగిన పౌరసమాజం కూడ ఏపి ఎన్నికల్లో
సైధ్ధాంతిక గందరగోళంలో పడిపోయింది. వర్తమాన భారత సమాజంలో పౌరసమాజం ఎదుర్కొనే ప్రధాన
సమస్య గుజరాత్ ఆధిపత్య బిజేపి. మహారాష్ట్ర ఆధిపత్య ఆరెస్సెస్ కన్నా గుజరాత్ ఆధిపత్య
బిజెపి మరింత ప్రమాదకారి అని పౌరసమాజం భావిస్తోంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో వెలుగులోనికి వచ్చిన ‘ఎద్దేలు కర్ణాటక’ (మేలుకో కర్ణాటక) ఉద్యమం అక్కడ
అధికార బిజెపిని ఓడించడంలో సఫలం అయింది. దానికి కొనసాగింపుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో
పనిచేసిన ‘జాగో తెలంగాణ’ కూడ ప్రభుత్వాన్ని మార్చడంలో తనవంతు పాత్రను పోషించింది.
చంద్రబాబు అరెస్టు వెనుక కేంద్రం హస్తం కూడ వుందనే మాట బలంగా
వినిపించినపుడు ఏపి పౌర సమాజం ఆలోచనల్లో పడింది.
చంద్రబాబును సమర్ధించే ప్రధాన మీడియా, సోషల్
మీడియాలు ప్రధాని నరేంద్ర మోదీ మీద కూడ విమర్శలు మొదలెట్టాయి. కర్ణాటక, తెలంగాణ మోడల్
లో ఏపిలో అధికార వైసిపికి వ్యతిరేకంగా ప్రతిపక్ష టిడిపి పక్షం వహించాలనే ఆలోచనలు పౌరసమాజంలో
మొదలయ్యాయి. కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి జాతీయ ప్రత్యామ్నాయంగా ఎలాగూ వుంది.
చంద్రబాబు ఇండియా కూటమికి దగ్గర కావచ్చనే ఊహాగానాలు కూడ చెలరేగాయి. చంద్రబాబు వైపు సానుకూలంగా మారడానికి పౌరసమాజానికి అలా ఒక సమర్ధన దొరికింది.
అయితే, చంద్రబాబు నేరుగా బిజెపితో ఎన్నికల పొత్తు కుదుర్చుకోవడంతో
సన్నివేశం మళ్ళీ మారిపోయింది. మోదీజీ ఎన్నికల ప్రచారంలో ముస్లింల మీద విపరీతమైన ద్వేషాన్ని
వెళ్ళగక్కారు. ఎక్కువమంది పిల్లల్నికనేవారు వంటి వ్యాఖ్యలతో మొదలెట్టి టోపీవాలే, చొరబాటుదార్లు (ఘూస్ పైఠియే), మదరసా, ముల్లా, మాఫియా, ముజ్రా వరకు ఏ పదాన్నీ వదలలేదు.
ఈ స్థితిలో, అన్యమనస్కంగానే అయినా సరే, చంద్రబాబును కాదని జగన్ ను సమర్ధించక తప్పదనే ప్రతిపాదనను ముస్లీం సమాజంలోని కొందరు ముందుకు తెచ్చారు.
విధేయులనుతప్ప ముసిం సమాజంలో కొంచెం గౌరవమర్యాదలు వ్యక్తిత్వంవున్న
వారెవర్నీ జగన్ గుర్తించలేదు. పైగా, వైయస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్లను
కొనసాగించడంతప్ప కొత్తగా ముస్లింల శ్రేయస్సు కోసం చేసిందేమీలేదు. జగన్ మీద అసంతృప్తితోవున్న
ముస్లీం సమాజం ఏపి ముస్లిం ప్రముఖులు ఇచ్చిన ప్రకటనను పట్టించుకోలేదు. మరోవైపు, బిజెపితో
జతకట్టినా సరే ముస్లింల ప్రయోజనాలనూ కాపాడుతానని చంద్రబాబు ఇచ్చిన హామీ ఆ సమాజం మీద
బాగా పనిచేసింది. వాళ్ళు సహితం అటు మొగ్గారు. సునామీ వచ్చినపుడు ఏదీ ఆగదు. ఏపీ ఎన్నికలు సునామీని
మించిపోయాయి.
4 మే 2024
ప్రచురణ ః
ఆంధ్రజ్యోతి డైలీ, 6 మే 2024
https://www.andhrajyothy.com/2024/editorial/ap-election-beyond-tsunami-1264410.html
ఏపి ఎన్నికల ఫలితాల మీద నేను రాసిన వ్యాసం *సునామీని మించిపోయిన ఏపి ఎన్నికల ఫలితాలు* ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక వచ్చింది. పత్రికాధిపతులకు,
సంపాదకులకు, ఎడిట్ పేజీ ఇన్ చార్జీలకు ధన్యవాదాలు.
ఆసక్తికలవారు కింది లింకులో నా వ్యాసాన్ని చదవవచ్చు.
https://www.andhrajyothy.com/2024/editorial/ap-election-beyond-tsunami-1264410.html
ప్రధానిగానీ అమిత్ షాగానీ టోపీవాలే అన్నా, చొరబాటుదార్లు (ఘూస్ పైఠియే) అన్నా, ఎక్కువమంది పిల్లల్నికనేవారు అన్నా, మదరసా, ముల్లా, మాఫియా అన్నా’ వారు ముస్లింల గురించి మాట్లాడుతున్నారు అనుకోవాలి. ఈ మాటలు లేకుండా వారు ఏ సభలోనూ మాట్లాడడంలేరు.