Saturday, 1 June 2024

వాళ్లు వేరు; ఇతరులు వేరు.

వాళ్ళంతా త్యాగధనులు అని చెప్పలేం

వాళ్లళో ఏ కోశానా స్వార్ధం లేదనలేం

వాళ్లు ఎలాంటి  తప్పులు చేయలేదని కాదు 

వాళ్లకూ ఇతరులకు ఒక తేడావుంది. 

సాటి మనుషుల మేలు కోసం తాము ప్రాణ త్యాగం చేయాలని   

వాళ్ళు ఒక్కరోజైనా అనుకున్నారు; దానికి తెగించి సిధ్ధపడ్డారు. 

ఒక్కరోజు కాదు; 

జీవిత కాలంలో మనిషి  అలా ఒక్క క్షణం  అనుకున్నా చాలు. 

వాళ్లు వేరు; ఇతరులు వేరు. 

గడిచిన 50 యేళ్ళలో దేశంలోని 

సామాన్యులకు వచ్చిన సౌకర్యాలన్నింటి వెనుక 

సమాజంలో వచ్చిన మార్పులన్నింటి వెనుక 

సాంకేతికరంగాల్లో వచ్చిన విప్లవాల వెనుక 

వాళ్ల  నెత్తురు చెమటలున్నాయి. 

No comments:

Post a Comment